సంకలనాలు
Telugu

పిల్లలకు యాప్స్‌తో చదువు నేర్పించే APPY

యాప్స్‌తో ఆల్ఫాబెట్స్కార్టూన్ క్యారక్టర్స్‌తో కౌంటింగ్పేరింటింగ్‌లో నయా పుంతలు తీసుకొచ్చిన దినేష్ 18 దేశాలకు విస్తరించిన వినూత్న విద్యావిధానం

sudha achalla
10th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ట్రెండ్ మారుతోంది. పేరెంట్స్ ఆలోచనలు మారుతున్నాయి. పిల్లలను ఆడిస్తూ చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కార్టూన్ క్యారక్టర్స్‌తో యాప్స్ రెడీ చేసి...18 దేశాల్లో సత్తా చాటుతున్నారు గ్రోల్ మీడియా హెడ్ దినేష్.

ఇప్పుడు పిల్లలు TV లో కార్టూన్లు చూడటానికి ప్రాధాన్యం ఇస్తారు. కార్టూన్స్‌లో డ్రాగన్ టేల్స్, ది మేజిక్ బయోస్కోప్‌తో మేజిక్ ఆల్ఫీ, హాతీలు చేసే విన్యాసాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. స్కూల్ బస్, 'సీసేమ్ స్ట్రీట్ , డోరా Explorer , గో, డియెగో గో ' ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. కొన్ని అద్భుతమైన విన్యాసాలతో పొద్దున నుంచి లంచ్ టైమ్ వరకు కదలకుండా ఉండే విధంగా ఆసక్తికరంగా ఉంటున్నాయి. బర్నీ సాయంతో ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకోవడం, పర్పుల్ డైనాసోర్, జాక్ Wheezieతో కలిసి ప్రాస నేర్చుకోవడం, మేజిక్ స్కూల్ బస్‌లో మిస్ ఫ్రిజిల్ ప్రేగుల ద్వారా చేసే ప్రోగ్రామ్స్ కు నేను ఇష్టపడేవాడిని అంటూ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు దినేష్.

దేశాల్లో నెంబర్ వన్

మిడిల్ ఈస్ట్ కు చెందిన దినేష్ లాల్వాని, గ్రోల్ మీడియా వ్యవస్థాపకుడు. ఆయన చిన్న పిల్లల కోసం ఎడ్యుకేషనల్ కంటెంట్‌తో పాటు యాప్ డెవలప్ చేశారు. అయితే ఇండియన్ కార్టూన్స్, కార్టూన్ పాత్రలు తక్కువగా ఉన్నాయని తెలుసుకున్న ఆయన వాటి ఆధారంగా క్యారక్టర్ చేస్తే చాలా ప్రభావం ఉంటుందని గమనించారు. దీంతో లోకల్ కంటెంట్, యాప్స్, కార్టూన్లు, పుస్తకాలు, పాటలు భారత్‌, అరేబియాలో పరిచయం చేశారు. అయితే తాము చేస్తున్న యాప్స్ పిల్లలను ఎంత వరకు ఆకట్టుకుంటాయో తెలుసుకొనేందుకు, కొడుకు సిద్ధార్ధ్‌తో వాటిని ఆడించేవారు. ఆ తర్వాత ఆ పిల్లవాడి స్పందనను చూసి మార్పుచేర్పులు చేసుకునేవారు. అంతే ఒక్క ఏడాదిలో గ్రోల్ మీడియా టీమ్ ఏడు రకాల యాప్స్ తయారు చేసింది. ప్రస్తుతం 18 దేశాలలో ఒక ప్లాట్‌ఫాం తయారు చేసుకుంది.

హాతీ తో ఆల్ఫీ

హాతీ తో ఆల్ఫీ


గ్రోల్ మీడియా Appy కిడ్స్ పేరుతో పిల్లలకు యాప్స్ రెడీ చేస్తోంది. ఆల్ఫీ, హాతి, జీ చుట్టూ జరిగే కధల ఆధారంగా యాప్స్ రెడీ చేశారు. స్టోరీలో ఆల్ఫీ క్యారక్టర్ దాదాపుగా దినేష్ కొడుకును పోలినట్టు ఉంటుంది. ఆల్ఫీ ఇండియాలో నివసించే నాలుగు ఏళ్ల బాలుడు తన స్నేహితుడు హాతీతో కలిసి మాజిక్ బయోస్కోప్ కనుగొనడం తర్వాత వారిద్దరు కలిసి చేపే సాహసాలతో సిరీస్ మొదలవుతుంది. జీ అందమైన అరబ్ బాలిక. మోడల్ ఇబ్న్ బటూటకు రోల్ మోడల్. ఇలా కొత్త ప్రదేశాలు, సంస్కృతులను అన్వేషిస్తూ కొనసాగుతుంది.

ప్రాంతీయ భాషల్లో యాప్స్‌కు రెడీ

ఇప్పుడు క్యారక్టర్ Alfie ఇంగ్లీష్, హిందీ భాషల్లో వస్తోంది. ఇంకా ఇతర ఆడియన్స్ కోసం బెంగాలీ, తమిళ వంటి ప్రాంతీయ భాషల్లో అనువదించనున్నారు. జీ ఇంగ్లీష్, అరబిక్ ఫ్రెంచ్ భాషల్లో మాట్లాడుతుంది" ఇప్పుడు మేము పిల్లలకు రంగు రంగుల, సమకాలీన పాత్రలతో ఆల్ఫీ, జీ క్యారక్టర్స్ ను ఆసక్తిగా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంకా ఆసక్తికరమైన, సాహసమైన వ్యక్తుల ద్వారా పిల్లలకు పాత్రలపై ప్రేమ పెరుగుతుంది. కొన్ని మార్గాల్లో పిల్లలకు స్పూర్తి కలిగి చదువుకోవడానికి , చదువుపై ఆసక్తి పెరగడానికి ఉపయోగపడుతుందంటారు దినేష్.


క్యారక్టర్స్ తో  ఫౌండర్ దినేష్

క్యారక్టర్స్ తో ఫౌండర్ దినేష్


ఊహించని స్పందన

ఆల్పీ, జీ క్యారక్టర్లకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. మా సక్సెస్ గురించి చెప్పుకోవడానికి ఈ సంఖ్యలే చాలంటారు దినేష్. ఐదు దేశాల్లో Appy కిడ్స్‌కు ఏడు ఆప్స్, రెండు కథల పుస్తకాలకు 375,000 కు పైగా డౌన్ లోడ్స్, 118,000కు పైగా లైక్స్ వచ్చాయి. 18 దేశాల్లో App స్టోర్‌లో నెంబర్ వన్ పొజిషన్‌లో ఆప్ కిడ్స్ ఉంది.

గెలాక్సీ కిడ్స్ టాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా జీ, శామ్‌సంగ్‌తో కలిసి పనిచేస్తున్నాము. యుఎఇ లోని దాదాపు 50 పాఠశాలల్లో యాప్‌ను వినియోగిస్తున్నారు.

పేరెంట్స్‌కు సూచనలు, సలహాలు

"Alfie ఇండియన్, మిడిల్ ఈస్ట్ మార్కెట్లలో హిట్ కాగా... జీ ఎక్కువగా మేనా రీజియన్ (మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా దేశాల్లో ) సూపర్, డూపర్ హిట్ అయిందని దినేష్ అంటున్నారు. గ్రోల్ మీడియా తల్లి దండ్రులతో దీర్ఘకాలిక సంబంధాల కోసం ఎప్పటికప్పుడు వెబ్ సైట్స్, బ్లాగ్స్ ద్వారా Appy కిడ్స్ లో అప్‌డేట్ చేస్తున్నారు. బ్లాగ్‌లో పేరంటింగ్ లో సమస్యలు, కుటుంబ అనుబంధాలు, కార్యకలాపాలు, పాఠ్యాంశాలను పిల్లలు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులుతో సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవుతున్నారు.

"మేము మా వెబ్ సైట్లో ట్వంటీ ఫస్ట్ సెంచరీలో పేరంటింగ్‌కు సంబంధించి సూచనలు సలహాలు తీసుకుంటున్నాము. అంతే కాదు లేజీ పేరంటింగ్ వల్ల పిల్లలు ఐ ప్యాడ్, వీడియో గేమ్‌లకు ఎలా బానిసలవుతున్నారో వివరించే పని చేస్తున్నారు. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు తమ వంతు పాత్ర పోషిస్తూ వారిని ఉత్సాహపరిచే విధంగా ప్రాసెస్ ఉంటుందని వివరిస్తారు దినేష్.

జీ సాహాసాలు

జీ సాహాసాలు


"మాకు ఉన్న పెద్ద సవాల్ ఏంటంటే... మా ఆలోచన, విజన్ ఉన్న వారు ఉంటే ఆ ఆలోచనలతో ముందుకు వెళ్లొచ్చని అనుకుంటున్నాము. ఇప్పుడు ఫ్లిప్ మీడియా సహకారంతో సాధించగలిగాము. ఇలా గొప్ప వ్యక్తుల పరిచయంతో ప్రజలుకు ఏమి కావాలో తెలుసుకోవడానికి కారణమవుతుందని దినేష్ చెబుతున్నారు.

నాణ్యత పై ఎక్కడా రాజీ పడడం లేదు. Appy కిడ్స్ ప్రైమ్ టైమ్ కార్టూన్లు ఎలా ఉంటున్నాయి... ఎవరైనా వ్యాఖ్యలతో ఇంటరాక్టివ్ Edutainment గురించి ఏమనుకుంటున్నారో చెప్పాలంటూ సూచిస్తున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags