సంకలనాలు
Telugu

జస్ట్ రూ.8వేలతో మొదలైన వ్యాపారం నేడు రూ. 500 కోట్లకు చేరింది..!

అమిత్ ఆంట్రప్రెన్యూరియల్ జర్నీ ఎలా సాగిందో చదవండి..

team ys telugu
16th Dec 2016
Add to
Shares
7
Comments
Share This
Add to
Shares
7
Comments
Share

19 ఏళ్ల వయసప్పుడు ఎవరైనా పై చదువులు చదవాలనే చూస్తారు. కానీ ఆ కుర్రాడు మాత్రం బిజినెస్ మీద దృష్టి పెట్టాడు. అదికూడా కేవలం రూ. 8వేల మూలధనంతో. డీబీఎం మార్కెటింగ్‌తో పేరుతో 1999లో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ మొదలుపెట్టాడు. అయితే వ్యాపారం అనుకున్నంత ఈజీగా సాగలేదు. నల్లేరు మీద నడక అనుకున్నదంతా రివర్సయింది. ఖరీదైన పెన్నులు పంపిణి చేసే వ్యాపారాన్ని అక్కడెక్కడో నిలపాలని కలగన్నాడు. కానీ కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి మీదపడ్డాయి. చేతిలో సరిపడా డబ్బు లేదు. ఎక్కే ఆఫీస్ దిగే ఆఫీస్.. ఇలా ఎన్నో సవాళ్లు. అయినా సరే.. మనసులో తెలియని ఎక్సయిట్‌మెంట్ అస్సలు డిజప్పాయింట్ చేసేది కాదు. ఏదో సాధించాలన్న ఫైర్ నిరంతరం మండేది.

కష్టాలు చుట్టుముట్టినప్పుడల్లా పార్కర్ పెన్స్ రీజనల్ మేనేజర్‌ రోహిత్‌ మథుర్ గుర్తొచ్చేవాడు. ప్రతీసారీ అమిత్‌ కు స్ఫూర్తిగా నిలిచింది అతనే. ఇన్‌స్టిట్యూషనల్ సేల్స్ ఎలా చేయాలి..? కార్పొరేట్ క్లయింట్ల దగ్గర ఎలా ప్రజెంట్ చేయాలి..? వంటి అనేక విషయాలపై రోహిత్ మెళకువలు, క్రియేటివ్ థాట్స్ చెప్పేవాడు.

ఖరీదైన పెన్నులను డిస్ట్రిబ్యూట్ చేయడమంటే మాటలు కాదు. క్లయింట్లను ఒప్పించడం తలకు మించిన భారం. అలాంటి టైంలో కలిశాడు రోహిత్. ఒకవేళ అతను పరిచయం కాకుంటే అమిత్ లైఫ్ వేరేలా ఉండేదేమో బహుశ. అమిత్‌ను అతను సక్సెస్ ఫుల్ సేల్స్ మేన్‌ గా తీర్చిదిద్దాడు. ఒక ఏడాదిలోనే కోట్ల విలువైన పెన్నులు.. అది కూడా ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్మడం ఎలాగో నేర్పించాడు.

image


ఇంతవరకు బానే ఉంది కానీ ఎటొచ్చీ వర్కింగ్ కేపిటల్ దగ్గరే సమస్యంతా. గత్యంతరం లేని పరిస్థితుల్లో సప్లయర్ నుంచి 30-35 రోజుల క్రెడిట్ తీసుకునేవాడు. క్లయింట్ల దగ్గర్నుంచి కలెక్షన్ రాగానే పంపిణిదారులకు మనీ రిటర్న్ చేసేవాడు.

అలా ఒక్కో ఛాలెంజ్‌ని అధిగమించిన అమిత్ డీబీఎం మార్కెటింగ్ కంపెనీని స్థాపించాడు. శ్యాంసంగ్, ఫిలిప్స్, హెచ్‌పీ, లెనొవొ, వర్ల్ పూల్, హవెల్స్ తో పాటు పలు రకాల ప్రాడక్టులకు పంపిణిదారుడయ్యాడు. ఐటీ కన్స్యూమర్ గూడ్స్ తో పాటు జ్యూసర్లు, మిక్సర్లు.. మల్టీ గ్రూమింగ్ కిట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు.

మొదటి సంవత్సరం నేను వన్ మేన్ ఆర్మీ. ఆఫీస్ బోయ్ నేనే. అడ్మిన్ పర్సనూ నేనే. డెలివరీ బోయ్‌నీ నేనే. అకౌంట్స్ నుంచి సేల్స్ వరకు అన్నీ ఒక్కడినే చూసుకునేవాడిని. ఒక ఏడాది తర్వాత ఒక సేల్స్ మేన్‌, ఒక ఆఫీస్ అసిస్టెంట్‌ని పెట్టుకున్నాను. మొదటి సంవత్సరం అమ్మకాల టార్గెట్ 35 లక్షలు అనుకున్నాను. కానీ 50లక్షలు దాటింది. అది నా మొదటి మైల్ స్టోన్. మొదటి ఏడాది ఎంత అమ్మకాలు జరిగాయో- ఇప్పుడు రోజువారీ వసూళ్లు అంతకంటే డబుల్ ఉన్నాయి- అమిత్
image


డీల్ క్యా హై! వాట్ ఎన్ ఐడియా

ఒక్క ఆఫ్ లైన్ డిస్ట్రిబ్యూషనే అయితే ఎలా.. అందుకే అమిత్ దృష్టి ఆన్ లైన్ మీద పడింది. 2011లో డీల్ క్యా హై అనే సరికొత్త కాన్సెప్టుతో ముందుకొచ్చాడు. ఇంతకు ముందు రిటైల్ నెట్ వర్కుతో బిజినెస్ రన్ చేసిన కంపెనీ ఇప్పడు ఆన్ లైన్ పోర్టల్ తోనూ దూసుకుపోతోంది.

అన్ని బ్రాండ్లను ఒకే గొడుగు కిందకి తచ్చే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాం అంటాడు అమిత్. క్రెడిబిలిటీతో పాటు అథెంటిసిటీ కూడా సంపాదించాం అని చెప్తున్నాడు. అలా అమెజాన్ ఇండియాతో కలిసి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధల్లిన వ్యాపారం 2014కల్లా గూర్గావ్ లో డీల్ క్యా హై హెడ్ క్వార్టర్ స్థాపించేదాకా వెళ్లింది.

ప్రస్తుతం వ్యాపారం మంచి పీక్ లో ఉంది. నెలకు నలభై యాభై కోట్ల సేల్స్ జరుగుతున్నాయి. ఒక్కసారి ఆన్ లైన్లో ఆర్డర్ వచ్చిందంటే వేర్ హౌజ్ లో ఇన్వెంటరీ స్లిప్ రెయిజ్ అవుతుంది. వెనువెంటనే ఆర్డర్ ప్యాక్ అవుతుంది. డెలివరీకి బయలుదేరుతుంది. దూరాన్ని బట్టి ప్రియారిటీ చూసుకుంటారు. ఔట్ స్టేషన్ ఆర్డర్లయితే లాజిస్టిక్ కంపెనీలతో డీల్ చేస్తారు.

డీల్ క్యా హై సేల్స్ మొత్తం అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, ఇతర వాటితో కలిపి 90 శాతం ఈ కామర్స్ ప్లాట్ ఫాం ద్వారానే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి 8 బ్రాండ్లతో టై అప్ అయ్యారు. దాంతోపాటు బ్లూ డార్ట్, ఫెడెక్స్, ఫస్ట్ ఫ్లయిట్ వంటి పలు లాజిస్టిక్ కంపెనీలను కూడా డెలివరీ కోసం మాట్లాడుకున్నారు.

image


ఎలా వీలైతే అలా నలుచెరగులా వ్యాపారాన్ని విస్తరించాలన్నదే అమిత్ ముందున్న టార్గెట్. ఏదో ఒక ఇన్నోవేషన్ ఉంటే కానీ అవధులు పెరగవనేది అతని వ్యాపార సూత్రం. ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఆఫీసులు, గిడ్డంగులు ఉన్నాయి. మొత్తం 48 మందిదాకా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

గత ఆర్ధిక సంవత్సరానికి డీల్ క్యా హై చేసిన టర్నోవర్ రూ. 125 కోట్లు. ఈసారి రూ. 500 కోట్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు. అంతకాకపోయినా అట్లీస్ట్ 350 కోట్ల వ్యాపారమైనా అవుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇదే ఊపుతో 2020 నాటికి రూ. 2వేల కోట్ల టర్నోవర్ సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. టైం టు టైం కొత్తకొత్త ప్రాడక్టులు జనానికి పరిచయం చేస్తూ వ్యాపారాన్ని ఆకాశమార్గం పట్టించాలనేది అమిత్ ముందున్న లక్ష్యం.

ఒకప్పుడు భారతీ టెలిటెక్ (ఎయిర్ టెల్ గ్రూప్‌) కంపెనీ అకౌంట్ కోసం.. కనీసం పాతికసార్లు కాళ్లరిగేలా తిరిగిన అమిత్ ఇప్పుడు మల్టీనేషన్ బ్రాండ్ వస్తువులకు తిరుగులేని డిస్ట్రిబ్యూటర్. ఇది గుర్తుకొస్తే చాలు అమిత్ ఛాతీ ఉప్పొంగుతుంది. 

Add to
Shares
7
Comments
Share This
Add to
Shares
7
Comments
Share
Report an issue
Authors

Related Tags