సంకలనాలు
Telugu

షేక్ వెల్ బిఫోర్ షాపింగ్ అంటున్న వైజాగ్ స్టార్టప్

షేక్ మామ పేరుతో వెలుగులోకొచ్చిన మరో తెలుగు స్టార్టప్....విశాఖ, హైదరాబాద్‌లో యూజర్ బేస్..

ashok patnaik
5th Sep 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

మొబైల్ యాప్‌లో వస్తోన్న కొత్త టెక్నాలజీని వినియోగించుకుంటూ దూసుకుపోతోంది ఈ వైజాగ్ స్టార్టప్. షేక్ మామా పేరుతో మొబైల్ యాప్‌గా ఈ ఏడాది మొదట్లో జనం ముందుకొచ్చిన ఈ యాప్ ఊహించిన దానికంటే ఎక్కువ డౌన్ లోడ్స్‌ని తన ఖాతాలో వేసుకుంది. వందల సంఖ్యలో రోజుకి యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఫుడ్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన వివరాలు అందించడమే కాదు అక్కడ అందుబాటులో ఉన్న డీల్స్‌ని కూడా షేక్‌లో చూపిస్తుంది ఈ యాప్. వైజాగ్ కేంద్రంగా ప్రారంభమైనప్పటికీ హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది యూజర్లున్నారు.

image


“సాధారణ యాప్‌లా ఉంటే... యూజర్లు కూడా సాధారణంగానే చూస్తారు. కానీ ఏదైనా కొత్తదనం కనిపించినప్పుడే యాక్టివ్ యూజర్లుగా మారుతారు. మాకు ఉండే యునిక్ ఫీచర్ షేక్ చేయడమే ” అంటారు సంజు ముద్దం.

సంజు ముద్దం షేక్ మామా ఫౌండర్. సంస్థ ప్రారంభించిన రోజు నుంచి తాము పడిన కష్టానికి ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నాయని వివరించారు. తన వెబ్ డిజైనింగ్ అనుభవంతో యాప్‌ని సరికొత్త ఫీచర్స్‌తో డిజైన్ చేశానన్నారు. యూజర్ ఫ్రెండ్లీ అయిన ఈ యాప్ తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి రీచ్ కావడం ఆనందంగా ఉందని, భవిష్యత్ లో మరిన్ని వండర్స్ క్రియేట్ చేస్తామని ధీమాగా చెబ్తున్నారు.

ఫౌండర్ సంజు ముద్ధం

ఫౌండర్ సంజు ముద్ధం


వెబ్ సైట్ నుంచి యాప్‌కి అప్ గ్రేడ్

షేక్ మామ డాట్ కామ్ పేరుతో వెబ్ సైట్ ఉంది. అయితే అందులో డౌన్ లోడ్ చేయాల్సిన వివరాలు మాత్రమే ఉంటాయి. ఇటీవల వెబ్ సైట్ చూడ్డం జనం మానేసారు. మొబైల్‌లోనే ఎక్కువ మంది ఇంటర్నెట్‌ని యూజ్ చేస్తున్నారు. ఈ కారణంగానే తాము వెబ్‌సైట్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. యాప్‌తోనే జనం ముందుకు వెళ్లినట్టు వివరిస్తారు. దాదాపు పదేళ్లుగా వెబ్ సైట్ డిజైనింగ్, యాప్ డిజైనింగ్‌పై పనిచేస్తున్న సంజు.. షేక్ మామాని పూర్తిగా మొబైల్‌కే పరిమితం చేయాలని అనుకుంటున్నారు. కొన్ని రోజుల్లో తమ వెబ్‌సైట్ షట్ డౌన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబ్తున్నారు.

image


షేకింగ్ స్పెషల్

షేక్ మామ.. పేరులోనే షేక్ ఉంది. నిజంగానే ఈ యాప్ వాడాలంటే మొబైల్‌ని షేక్ చేయాల్సిందే. అదెలాగో వివరిస్తున్నారు సంస్థ కో ఫౌండర్ రామక్రిష్ణ. టెక్నికల్‌కి సంబంధించిన విషయాలు చూసుకునేది ఈయనే. డౌన్ లోడ్ చేసిన షేక్ మామ యాప్‌ని ఓపెన్ చేస్తే కొన్ని ఐకాన్స్ కనిపిస్తాయి. షేక్ చేసిన వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్ల వివరాలు వస్తాయి. మరో సారి షేక్ చేస్తే డీల్స్ వస్తాయి. ఇంకోసారి షేక్ చేస్తే ఫ్రీ గిఫ్ట్ కూపన్లు వస్తాయి. షేక్ చేసిన అందరికీ ఫ్రీ గిఫ్ట్ కూపన్లు ఇవ్వడం షేక్ మామ ప్రత్యేకత. యాప్‌లో ఆర్డర్ బుక్ చేశాక నేరుగా షాప్‌కి వెళ్లి దాన్ని చూపించాలి. మీ డీల్ ప్రకారం మీకు అందాల్సినవి అందుతాయి.

ఆన్ లైన్ బుకింగ్.. ఆఫ్ లైన్ టేకింగ్

మొబైల్ యాప్‌లో డీల్ ఇస్తారు కదా అని దీన్ని మనం ఈ కామర్స్ కంపెనీగా చూడక్కర్లేదు. ఎందుకంటే ప్రాడక్టులన్నీ ఆఫ్‌లైన్‌లోనే అందిస్తారు. ఫ్రెష్ ఫుడ్‌కి సంబంధించిన యాప్ కనుక రెస్టారెంట్ లేదా షాప్ కి వెళ్లి తీసుకోవడమే ఉత్తమం అంటారు సంజూ. ఈ కామర్స్ రావడంతో ఆఫ్ లైన్ కస్టమర్ల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. ఆఫ్ లైన్‌లో షాపులు, రెస్టారెంట్లకు కస్టమర్ ట్రాఫిక్ పెంచడమే వీళ్ల యాప్ లక్ష్యం. కస్టమర్లకు డీల్స్ వల్ల వారికి ఉపయోగం, ఇటు షాపర్లకు కస్టమర్లను రప్పించడం ద్వారా వారి వ్యాపారాన్ని పెంచొచ్చు. ఇలా రెండు రకాలుగా తమ సేవలు ఉపయుక్తంగా ఉన్నాయని అంటున్నారాయన.

షేక్ మామ టీం

సంజూ ముద్దం షేక్ మామకు ఫౌండర్. బిటెక్ పూర్తి చేసిన సంజూకి అందరిలాగానే క్యాంపస్ జాబ్ వచ్చింది. అయితే దానికి వెళ్లకుండా సొంతంగా ఏదైనా చేయాలనుకున్నారు. అలా మొదలు పెట్టిందే క్యాచ్‌వే అనే వెబ్ డెవలపింగ్ కంపెనీ. దాదాపు వెయ్యికి పైగా వెబ్ సైట్లను డెవలప్ చేశారు. భారత్ పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు చెందని ఎన్నో కంపెనీలు వెబ్ ప్రొఫెల్స్ తయారు చేశారు. దాదాపు ఆరున్నరేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు షేక్ మామా పేరుతో ఓ యునిక్ కాన్సప్ట్‌ని అభివృద్ధి చేశారు. ప్రారంభించిన రోజు నుంచే యాప్ వరల్డ్‌లో డౌన్స్‌లోడ్స్ తో షేక్ చేస్తోంది ఈ యాప్. సంజూతో పాటు రామక్రిష్ణ కో ఫౌండర్ గా ఉన్నారు. కంపెనీలో సిటిఓ బాధ్యతలు ఆయన చూస్తున్నారు. వీరితో పాటు కౌశల్ అనే కో ఫౌండర్ ఉన్నారు. ఈయనకు వ్యక్తిగత వ్యాపారం రన్ చేసిన అనుభవం ఉంది. కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్స్, లీగల్ వ్యవహారాలు చూస్తుంటారు. ఈ టీంలో మరో ఇద్దరు కీ సభ్యులున్నారు. ప్రసాద్ ముద్దం, సాయి శ్రీ. ప్రసాద్ డిజైనింగ్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. యాప్ డిజైనింగ్ తోపాటు కలర్ కాంబినేషన్ చూసుకునేది ఇతనే. అంతే కాదు డిజిటల్ మిడియాపై ఇస్తోన్న ప్రకటనల్లో కూడా కనిపిస్తూ ఉంటారు.

షేక్ మామ టీం

షేక్ మామ టీం


ఫ్యూచర్ ప్లాన్స్

షేక్ మామ విశాఖపట్నంతో హైదరాబాద్‌లో సముచిత యూజర్ బేస్‌ని సాధించింది. తర్వాతి టార్గెట్ బెంగళూరు, చెన్నైలేనని చెబ్తోంది. పూర్తిగా బూట్‌స్ట్రాప్డ్‌ కంపెనీ అయిన షేక్ మామ సరైన ఇన్వస్టర్ దొరికితే దేశ వ్యాప్తంగా ఓ స్థాయిలో షేక్ చేస్తానంటోంది. 

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags