సంకలనాలు
Telugu

లాజిస్టిక్స్ నందు క్రిటికల్ లాజిస్టిక్స్ వేరయా..!

SOWJANYA RAJ
1st Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఊరందరిదీ ఓ దారి- ఉలిపి కట్టెది ఓ దారి అని తేలిగ్గా తీసేయకండి. ఎందుకంటే ఉలిపికట్టెకు వచ్చిన గుర్తింపు ఊరందరికీ రాదు. అలానే అందరూ నడిచే దారిలో వెళ్లి గమ్యాన్ని చేరుకుంటే కిక్కేం ఉంటుంది? ఇంకా కష్టమైన మార్గంలో వెళ్లి లక్ష్యాన్ని అందుకుంటే ఆ మజాయే వేరు. అచ్చంగా ఇలాగే ఆలోచించాడు సుజోయ్ గుహ. 53ఏళ్ల వయసులో లాజిస్టిక్స్ రంగంలో స్టార్టప్ ప్రారంభించాడు. అదీ కూడా సున్నితమైన వస్తువుల రవాణా విభాగంలో. అనుకున్నట్టూ వ్యాపారాన్ని ఊహించని రేంజికి తీసుకుపోయాడు.. 


లాజిస్టిక్స్ రంగం అంటేనే భారీ సవాళ్లతో కూడుకున్నది. హామీ ఇచ్చిన సమయంలో వస్తువును డెలివరీ చేయగలిగితేనే భవిష్యత్. దానికోసం ఎన్నో స్పీడ్ బ్రేకర్స్ ను అధిగమించాల్సి ఉంటుంది. ఆ రంగంలో ఉండే మైనస్ పాయింట్లను తట్టుకోలేక ఎన్నో లాజిస్టిక్ కంపెనీలు చేతులెత్తేశాయి. అయితే ఈ కామర్స్ రంగం ఊపందుకున్నాక వచ్చిన గోజావాస్, డెల్లీవరీ, బ్లాక్ బక్ లాంటి లాజిస్టిక్ స్టార్టప్ లు మంచి పురోగతిని సాధిస్తున్నాయి. కాకపోతే అవన్నీ సేఫ్ జోన్లోనే గేమ్ ఆడుతున్నాయి. ఎలా అంటే.. ఈ -కామర్స్ కంపెనీల వస్తువుల్ని మాత్రమే బట్వాడా చేయడానికే పరిమితమైపోయాయి. దీనికి భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో సుజోయ్ గుహ సున్నితమైన వస్తువుల రవాణానే ప్రత్యేకతగా క్రిటికలాగ్ కు అంకురార్పణ చేశారు. చేసేది అత్యంత రిస్క్ తో కూడుకున్న వస్తువుల రవాణా కాబట్టి కంపెనీకి కూడా "క్రిటికలాగ్" అని పేరు పెట్టేశారు.

థింక్ ఢిపరెంట్ ..విన్ గేమ్

జివెల్రీ, ఫార్మా, మెడికల్ ఎమర్జెన్సీ పరికరాలు, రా మెటీరియల్స్ ఇలా ప్రతీ స్టెప్ లోనూ ప్రత్యేక కేర్ తీసుకోవాల్సిన ఉత్పత్తుల్ని "క్రిటికలాగ్" ఆర్డర్లుగా స్వీకరిస్తుంది. వీటిని రవాణా చేసే విషయంలో ఎన్నో అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. విలువ, వాతావరణ పరిస్థితులు, హ్యాండిలింగ్ ఇలా ప్రతీది ముఖ్యమే. ఇలాంటివి రవాణా చేస్తున్న వాటి యజమానికి ఎంతో టెన్షన్ ఉండటం సహజం. సరైన సమయానికి...సరైన విధంగా చేరుతాయో లేదోనని. అందుకే క్రిటికలాగ్ "ఈక్రిటికా" పేరుతో సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈక్రిటికా ప్రత్యేకత ఏమిటంటే షిప్ మెంట్ ప్రతికదలికను కస్టమర్ కు సమచారం పంపుతుంది. ఈమెయిల్, ఎస్సెమ్మెస్ లు ఆటోమేటిక్ గా అందుతాయి. ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారానూ ట్రాకింగ్ చేసుకోవచ్చు.

ఈక్రిటికా వ్యవస్థ వల్ల షిప్ మెంట్ ఎక్కడ ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలర్ట్స్ కూడా పంపుతుంది. సున్నితమైన వస్తువుల రవాణాలో ఐటీ సొల్యూషన్స్ ది కీలకపాత్ర. ఈక్రిటికా ద్వారా మేము క్రిటికల్ లాజిస్టిక్స్ ను మరింత మెరుగ్గా తీర్చిద్దాం- సుజోయ్ గుహ, సీఈవో క్రిటికలాగ్
క్రిటికలాజిక్ వ్యవస్థాపకులు<br>

క్రిటికలాజిక్ వ్యవస్థాపకులు


ముఫ్పై ఏళ్ల పాటు పలు వ్యాపారులు చేసిన సుజోయ్ ఘోష్ లాజిస్టిక్స్ రంగంలో ఉన్న అవకాశాన్ని ఇట్టే కనిపెట్టారు. పర్సనల్ , క్రిటికల్ కార్గోని ఒకే నార్మల్ కార్గోలో రవాణా చేస్తూండటాన్ని గమనించారు. అయితే అప్పటి వరకూ వినియోగదారులు వాటిని కూడా ప్రత్యేకంగా చూడటం లేదని గుర్తించారు. సంప్రదాయ లాజిస్టిక్స్ కంపెనీలు కూడా క్రిటికల్ కార్గోని ప్రత్యేకంగా చూసేందుకు ఇష్టపడటం లేదని విషయాన్ని గమనించి తన బిజినెస్ ఐడియా మార్చేసుకున్నారు. అదే "క్రిటికలాగ్" అనే స్టార్టప్.

టాప్ గేర్ లో దూసుకెళ్తున్న క్రిటికలాగ్

2013లో క్రిటికలాగ్ కు అంకురార్పణ చేసినా... వ్యాపార కార్యకలాపాలు మాత్రం 2014లో మొదలు పెట్టారు. 29 నెలల కాలంలో ఇండియా మొత్తం విస్తరించారు. కశ్మీర్ నుంచి కొచ్చిన్ వరకు 54 లొకేషన్లలో ఇప్పుడు క్రిటికలాగ్ వ్యాపార కేంద్రాలున్నాయి. 24 ఆఫీసుల్ని నిర్వహిస్తున్నారు. మొదటి ఏడాదితో పోలిస్తే రెండో సంవత్సరంలో 600 శాతం గ్రోథ్ రేట్ ను క్రిటికలాగ్ నమోదు చేసింది. సెకండ్ ఇయర్ తో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే 80 శాతం వృద్ధి నమోదయింది. వచ్చే కొన్నేళ్ల పాటు ఏడాదికి వందశాతం పైనే డెవలప్మెంట్ కనిపిస్తుందని సుజోయ్ గుహ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.

క్రిటికలాగ్ కు ఆవిర్భావానికి గ్లోబల్ లాజిస్టిక్ కంపెనీ అయిన గోండ్ రాండ్ పెట్టుబడి పెట్టింది. స్విట్జర్లాండ్ కు చెందిన ఈ సంస్థ 1902 నుంచి వేర్ హౌసింగ్, కస్టమ్స్ క్లియరింగ్, సప్లై చెయిన్ మేనేజ్ మెంట్ లో సేవలు అందిస్తోంది.

భారత్ లో ప్రస్తుతం లాజిస్టిక్ ఇండస్ట్రీ వాల్యూ 300 బిలియన్ డాలర్లుగా ఉంది. 2020 నాటికి 12.17 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనాలున్నాయి. గత ఏడాది లోకల్ లాజిస్టిక్ కంపెనీల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవాలని బీజాలు పడ్డాయి. పేటీఎం రెండు గంటల్లో మొబైల్ డెలివరీ ఆప్షన్ ప్రవేశపెట్టింది. స్నాప్ డీల్ కూడా సేమ్ డే డెలివరీ అంటున్నది. ఇతర ఈకామర్స్ కంపెనీలు కూడా- కస్టమర్ బుక్ చేసిన గంటల్లో డెలివరీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వీటి ప్రయత్నాలు సక్సెస్ కావాలంటే లాజిస్టిక్ కంపెనీలదే ప్రధానపాత్ర.

విజన్ ఉండాలే గానీ ప్రతి వ్యాపారంలోనూ పుష్కలంగా అవకాశాలు కనిపిస్తాయి. కొంచెం వైవిధ్యం చూపిస్తే క్రిటికలాగ్ లాగే రెండేళ్లు తిరగకుండానే మూడంకెలు తగ్గని వృద్ధిని నమోదు చేసే కంపెనీని తీసుకురావచ్చు. అందుకు కావాల్సింది. మనీ ఒక్కటే కాదు.. విభిన్నమైన ఆలోచన కూడా తోడవ్వాలి. 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags