సంకలనాలు
Telugu

చేతివృత్తుల వారికి చేతినిండాపని చూపించే దస్తకార్

-మూడు దశాబ్దాలుగా భారతీయ హస్తకళకు జీవం పోస్తున్న లైలా త్యాబ్జీ-‘దస్తకార్’ సంస్థతో ఎంతోమంది హస్తకళాకారులకు చేయూత-గ్రామీణ భారత చేతివృత్తులను విశ్వవ్యాప్తం చేసేందుకు నిరంతర కృషి-ఉపాధినిచ్చే కళాత్మక వ్యాపారంతో భరోసా, ఆత్మ సంతృప్తి: లైలా

22nd Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మడిసన్నాక కూసింత కళాపోసనుండాల అనే డైలాగ్ మనందరికీ చిరపరిచితం. ఇప్పుడు అలాంటి వ్యాపార పాఠాలనే చెబుతున్నారు ప్రముఖ హస్తకళాకారిణి లైలా త్యాబ్జీ. గ్రామీణ భారతానికి పునర్వైభవం తెచ్చేందుకు ఆమె ఎంచుకున్న వ్యాపార మార్గం హస్తకళలు. ‘దస్తకార్’ సంస్థ స్థాపన ద్వారా ఈ కళను పోషిస్తూ ఎంతోమంది చేతివృత్తుల వారికి చేయూతనివ్వడమే కాకుండా.. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఆత్మసంతృప్తిని పొందుతున్నానంటున్నారు లైలా.

లైలా త్యాబ్జీ , దస్తకార్ చైర్ పర్సన్ )

లైలా త్యాబ్జీ , దస్తకార్ చైర్ పర్సన్ )


“భారతదేశంలోని మెట్రో నగరాల్లో, విదేశాల్లో వుండే ఏ కళాకారుడు, వృత్తినిపుణుడైనా సరే.. చాలా సులభంగా .. కళా నైపుణ్యం గురించి, గ్రామీణ చేనేత వృత్తి నిపుణులను తక్కువచేసేలా మాట్లాడుతుంటారు. మనమంతా భారతీయ హస్తకళల ప్రాభవాన్ని, చారిత్రాత్మక శకాన్ని కోల్పోయాం. ఇవాళ్టి హస్త కళాకారులు గ్రామాల్లో జీవనం సాగించలేని స్థితిలో వున్నారనే ప్రాథమికమైన విషయాన్ని కూడా పట్టించుకోండం లేదు. పనికోసమే జీవితాలను ధారపోసే వారి గురించి పూర్తిగా మరిచిపోయాం.”

లైలా త్యాబ్జీ, మూడు దశాబ్ధాల దస్తకార్ (హస్తకళల)కు నిలువెత్తు సాక్ష్యం. చేతివృత్తులు, హస్తకళాకారులు, వారి జీవితాల లోతుల్ని చాలా దగ్గరగా పరిశీలించారు లైలా. వారి అంతరంగాల్ని అధ్యయనం చేశారామె. ఆ ప్రఖ్యాత హస్తకళాకారిణిని యువర్ స్టోరీ కలిసింది. ఆమెను ఇంటర్వ్యూ చేసి పలు ఆసక్తికరమైన విషయాలను రాబట్టింది.

గ్రామీణ భారతంలో 70 లక్షల మందికిపైగా హస్తకళాకారులున్నారు. దేశానికి వెన్నెముకగా వుంటూ గ్రామీణ ఆర్థిక స్థితి బలోపేతానికి పరోక్షంగా వీరే ఆధారం. ఆర్థిక భద్రత విషయంలో మహిళలు ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటూనే వున్నారు. సామాజిక, ఆర్థిక స్వేచ్ఛకోసం గ్రామీణ మహిళలు హస్తకళలపైనే ఆధారపడుతున్నారు. వాటికి గిరాకీ వుంది. కానీ మార్కెట్ చేసే విషయంలోనే ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే 1981 లో ‘దస్తకార్’ (Dastkar)ను స్థాపించాం. దీనివల్ల చేనేత, హస్తకళాకారులకు ఎంతోకొంత సాయం చేయాలనేది ప్రధాన ఉద్దేశం. మరీ ముఖ్యంగా మహిళలు తమ సంప్రదాయబద్ధమైన హస్తకళా నైపుణ్యంతో స్వయం ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఈ పనిని ఆదాయ వనరుగా మార్చడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించగలుగుతారు అంటారు లైలా త్యాబ్జీ. 

దస్తకార్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా హస్తకళల వైభవాన్ని చాటుతూనే వున్నారు. వృత్తి నిపుణులు, హస్తకళ పరిశ్రమను మరింత చైతన్యవంతం చేయాలనుకునే మహిళలకు లైలా త్యాబ్జీ సుపరిచితురాలే. సంప్రదాయ విలువలను కాపాడేలా వస్త్రాలను, వస్తువులను రూపొందించాలనే ఆమె ఆరాటాన్ని తన ఆహార్యం, జీవన విధానం ద్వారానే తెలుసుకోవచ్చు. ఎప్పుడూ చీరకట్టుతో నిండుదనంగా, భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా కనబడతారు లైలా త్యాబ్జీ.

బెంగళూరు  ‘నేచర్ బజార్’ లో దస్తకార్ కళాకారులు పనిచేస్తున్న దృశ్యం )

బెంగళూరు ‘నేచర్ బజార్’ లో దస్తకార్ కళాకారులు పనిచేస్తున్న దృశ్యం )


“నా జీవితాన్నే మార్చేసిన ఒక అనుభవం”

కాలేజీ రోజుల నుంచే లైలా త్యాబ్జీకి హస్తకళలు, తయారీ రంగంపై మంచి అభిరుచి ఏర్పడింది. జపాన్ లో ఫైన్ ఆర్ట్స్ చదువుల్ని పూర్తి చేసిన తర్వాత ఆమె ఢిల్లీకి తిరిగొచ్చారు. అప్పట్లో స్వేచ్ఛగా పనిచేసే డిజైనర్లు ఆయా రంగంలో ముందుకు వెళ్లడం సులభంగా వుండేది కాదు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎన్నో లక్షల అవకాశాలు, వనరులు వుండేవి. ఇంటీరియర్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్ , స్టేజ్ డిజైన్ పరిశ్రమలు బాగా పురోగతి సాధించాయి. కానీ.. ఆమె మాత్రం సంప్రదాయ భారతీయ హస్త కళలకోసం పనిచేయడంపైనే మక్కువ పెంచుకున్నారు. దాంట్లోనే ఎంతో సంతృప్తి వుందని భావించేవారు. గుజరాత్‌లోని కచ్‌లో పనిచేయడం ఆమె జీవితాన్నే మార్చేసింది. అక్కడ గ్రామీణ హస్తకళాకారులను కలిసి వారి సమస్యలను అర్థం చేసుకున్నారు లైలా. 

''హస్తకళలపై ఆధారపడి జీవితాలను ముందుకు నడిపే ఈ గ్రామీణ కళాకారులు తయారు చేసే ఉత్పత్తులను సరిగ్గా ఎవరూ మార్కెట్.. వీళ్లెలా పనిచేయగలరు..? వీళ్ల అద్భుతమైన ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి మనం ఎంతో వెన్నుదన్నుగా సాయం చేయాల్సిన అవసరముంది. అందుకే ‘దస్తకార్’ ను ఏర్పాటు చేసి నైపుణ్యవంతులను ఒక్కొచోటుకు చేర్చాలని నిర్ణయించుకున్నాను''


ప్రభుత్వ నిర్వహించే పాత్ర కంటే సమస్యలే పెద్దవి

హస్తకళా రంగంలో నిపుణులకు సాయంగా ప్రభుత్వ పాత్ర గురించి మాట్లాడాల్సి వస్తే... “నాకు కూడా ఎన్నో పెద్ద సమస్యలున్నాయి. అవి ప్రభుత్వ చొరవచూపి పరిష్కరించే వాటికంటే కూడా చాలా పెద్దవి. రెండు కోట్ల 30 లక్షలమంది అనధికారిక హస్తకళాకారులు దేశవ్యాప్తంగా వున్నారు. వేరే ఏ ఇతర దేశంలో కూడా ఇంతమంది చేతివృత్తుల వారులేరు. మనం వీరిపైన పెట్టుబడి పెట్టాల్సిన అవసరముంది.” అంటూ ప్రభుత్వం చేయాల్సినదానికంటే.. ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ రంగాన్ని ఆదుకోవాల్సిన పనిని గుర్తుచేశారు లైలా. వాణిజ్యపరంగా ఫ్యాబ్ ఇండియా లాంటి సంస్థల విక్రయాలకు పూర్తి మద్దతిస్తున్నానంటున్నారు లైలా త్యాబ్జీ. ఎందుకంటే.... గ్రామీణ ప్రజలు తాము తయారు చేసిన హస్తకళలు, వస్త్రాలు ఇతర వస్తువులను అమ్ముకునేది ఎలాగో తెలీదు. వారికి తెలిసింది అందరూ మెచ్చేలా పనిచేయడం. పైగా సొంతంగా వ్యాపారం చేసేలా వాళ్లకు దుకాణాలు వుండవు. కానీ.. అలాంటి ఉత్పత్తులను ఫ్యాబ్ ఇండియా మార్కెటింగ్ చేస్తుండటం ప్రశంసనీయమంటున్నారామె.

కళాకారుల మధ్య వివక్ష ఉండదు

గ్రామాల్లో కళాకారుల వృత్తి పని అనేది కుటుంబమంతా కలిసి చేసే పని. కొన్ని ప్రత్యేకమైన పనుల్ని మగవాళ్లు చేస్తారు. కొన్నింటిని మాత్రమే ఆడవాళ్లు చేయగలరు. అలాగని ఇది ఏ ఒక్కరో చేయాలనే లింగభేదం, పక్షపాతమున్న పరిశ్రమ కాదు. హస్తకళా రంగాల్లో పనిచేసేవారి విషయంలో... ఆడవారికి కూడా విచక్షణ, సూక్ష్మ బుద్ది వుంటాయి. వాళ్లకేదో ఎయిరోనాటికల్ ఇంజినీర్లు, యుద్ధం చేసే పైలెట్లకు వుండాల్సినంత తెలివితేటలు అవసరం లేదు.

66 ఆరేళ్ల యువతిని నేను

లైలా త్యాబ్జీ తనకు ప్రతిరోజూ ప్రేరణనిచ్చే విషయాలగురించి కూడా పంచుకున్నారు. ''నాకు 66 ఏళ్లు. అయినా ఎప్పుడూ అలిసిపోలేదు. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి పనిలో మునిగిపోయేందుకు బయల్దేరుతాను. అదే నాకు రెండింతలు సంతృప్తినిస్తోంది''.

image


దస్తకార్ (Dastkar) నేచర్ బజార్ ద్వారా లైలా చిన్న సలహాను ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలు, డిజైనర్లకు అందిస్తోంది. “ నువ్వు వ్యాపారవేత్తగా ఎదగాలని నిర్ణయించుకుంటే లేదా నీ వృత్తిని నువ్వు ఎన్నుకోవాలనుకుంటే.. హస్తకళారంగం ఎంతో మంచిది. ఇది ప్రత్యేకమైన అవకాశం .. ఎక్కడా పోటీగా ఎక్కువమంది వ్యాపారవేత్తలు వుండే అవకాశం లేదు. పైగా నీకు ఈ పనివల్ల రెండింతలు సంతృప్తి కూడా లభిస్తుంది. అవసరమైన వాళ్లకు ఉపాధిని కల్పిస్తున్నామనే భావన కలుగుతుంది.” అంటూ ‘దస్తకార్’ ద్వారా హస్తకళాకారులకు కలిగే లాభాలను తెలిపారు లైలా త్యాబ్జీ. ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఇలాంటి రంగాన్ని ఎన్నుకోవాలని కూడా సూచిస్తున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags