సంకలనాలు
Telugu

ఏటా 4 లక్షల భారతీయ చిన్నారులను కాపాడుతున్న యునిసెఫ్ మిషన్

మిషన్ ఇంద్రధనుష్ ప్రారంభించిన యూనిసెఫ్చిన్నారులకు వ్యాక్సినేషన్‌పై విపరీతమైన ప్రచారంటీకాలు, వ్యాక్సినేషన్ల బాధ్యత పేరెంట్స్‌దే అంటున్న యూనిసెఫ్మిషన్ ఇంద్రధనుష్‌లో పాల్గొంటున్నవారితోనే ప్రచార వీడియోల చిత్రీకరణ

Krishnamohan Tangirala
8th Jun 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

తాజాగా ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ మిషన్ ఇంద్రధనుష్ పేరుతో కేంపయిన్ చేపట్టింది. పిల్లలకు పూర్తి స్థాయిలో వ్యాక్సీన్లు అందచేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఈ మిషన్ ద్వారా తెలియచేస్తారు.

image


ఇమ్యూనైజేషన్‌పై పేరెంట్స్‌లో అవగాహన పెంచేందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది యూనిసెఫ్. భారత ప్రభుత్వంతో కలిపి నిర్వహిస్తున్న ఈ మిషన్ ఇంద్రధనుష్ ద్వారా... వ్యాక్సీన్లు, టీకాలు తప్పనిసరిగా వేయించాలనే విషయాన్ని ప్రజల మనసుల్లో నాటాలని భావిస్తోంది యూనిసెఫ్. వ్యాక్సినేషన్ అసరంపై విపరీతంగా ప్రచారం చేయాలని... ఇక ఆలస్యం చేయకూడదని భావిస్తోంది యూనిసెఫ్. వ్యాక్సీన్ల ద్వారా నియంత్రించగల వ్యాధులన్నిటి నుంచి 2020నాటికి భారత దేశంలోని చిన్నారులందరినీ కాపాడతామంటోంది యూనిసెఫ్. భవిష్యత్ తరాల కోసం భారీ స్థాయిల ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు నిర్వహించనుంది.

ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా మన దేశంలో ఏటా 4 లక్షల మంది చిన్నారులను కాపాడబోతున్నారు. 'ఏక్ స్టార్ ఐసా భీ' పేరుతో 4 ఉత్తేజపూరిత వీడియోలను ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారు, మార్పు కోరుకునే వ్యక్తులతో వ్యాక్సినేషన్‌పై ప్రచారం చేసే వీడియోలను చిత్రీకరించారు. మన దేశంలో యూనిసెఫ్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రపంచంలో అతి పెద్ద ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కావడం విశేషం.

మొదటి వీడియోను 2015 ఏప్రిల్ 10న తొలిసారిగా ప్రదర్శించారు. ఇందులో పూరణ్‌చంద్ర కథను చిత్రీకరించారు. ఇతను ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో పనిచేసే ఒక ఆటో డ్రైవర్. ఒడిషాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆల్టర్నేట్ వ్యాక్సీన్ డెలివరీ సిస్టం(AVDS) కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్నవారిలో ఇతను కూడా ఒకరు. ప్రతీ ఉదయం పూరణ్ హెల్త్ సెంటర్ నుంచి వ్యాక్సీన్లు, ఇతర పరికరాలను తీసుకుని... తన టీకాకరణ్ ఎక్స్‌ప్రెస్‌లో వ్యాక్సీనేషన్ మిషన్ కోసం బయల్దేరతాడు.ఈ AVDS ఓ వినూత్న కార్యక్రమం. సామాజిక వర్గాల ప్రకారం ఏర్పడ్డ సంస్థలు, పూరణ్‌చంద్ర వంటి పలు సొసైటీ మెంబర్లు.. వ్యాక్సీన్ డెలివరీలో కీలకంగా ఉంటున్నారు. చేరుకోవడం అసాధ్యం అనిపిచేంతటి రిమోట్ ఏరియాలకూ వీటిని సరఫరా చేయడంలో వీరి భాగస్వామ్యం ప్రశంసించాల్సిన అంశం.

రెండో వీడియోలో ఆశా హెల్త్ వర్కర్ల కృషిని చిత్రీకరించారు. మారుమూల ప్రాంతాల్లోని చిన్నారులకు టీకాలు వేయడం కోసం... వీరు పడే అనితర కష్టాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఆశ్రిత కూడా జార్ఖండ్‌కు చెందిన అలాంటి ఆషా వాలంటీర్. అటవీ ప్రాంతాల్లోని ప్రజల ఆలోచనల్లో మార్పు తెచ్చేందుకు, వారిలో చైతన్యం పెంచేందుకు ఇలాంటి వారు చేస్తున్న కృషిని చిత్రీకరించారు. సైన్స్ గొప్పదనాన్ని, వ్యాక్సీన్ల అవసరాన్ని చెబుతూ వారిలో ఉండే భయాందోళనలు పోగొట్టి, తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేలా పేరెంట్స్‌ను ప్రోత్సహిస్తున్నారు ఈ ఆశా వర్కర్లు.

ఏఎన్ఎంలు, పంచాయితీ లీడర్లతో కలిసి... గ్రామాల్లోని ప్రతీ చిన్నారికీ వ్యాక్సీన్లు, టీకాలు అందేలా జాగ్రత్త పడుతున్నారు ఈ ఆషా వర్కర్లు. ఇందుకోసం ప్రతీ కుటుంబాన్ని, ప్రతీ ఇంటికీ తిరుగుతూ శ్రమిస్తున్నారు. జీవితాన్ని ఆరోగ్యమయం చేసే టీకాల అవసరాన్ని పేరుపేరునా చెబ్తున్నారు ఆశ్రిత వంటి ఆషా వర్కర్లు.


త్వరలో మరో రెండు వీడియోలు కడా విడుదల కానున్నాయని కథనం ప్రచురించింది పీటీఐ. ఈ వినూత్న ఆన్‌లైన్ కేంపెయిన్‌ను #babiesneedyou పేరుతో నిర్వహిస్తున్నారు.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags