సంకలనాలు
Telugu

అంధుల తలరాత మారుస్తున్న ఎన్‌ఆర్‌ఐ

ABDUL SAMAD
24th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ఒకప్పుడు అంగవైకల్యాన్ని శాపంగా భావించేవారు. విధిరాతను తిట్టుకుంటూ కుమిలిపోయేవారు. కానీ కాలం మారింది. ఆలోచనలు మారాయి. సంకల్పం ముందు వైకల్యం చిన్నబోతోంది. పట్టు లేకపోతేనేం- పట్టుదల ముందు అదొక సమస్యే కాదు. ఆత్మవిశ్వాసం ఉండాలే గానీ ఈ ప్రపంచాన్నే జయించొచ్చు అని నిరూపిస్తున్నారు ఎంతోమంది వికలాంగులు. ముఖ్యంగా చూపులేని వారే అద్భుతాల్ని చేసి చూపిస్తున్నారు. సానుభూతి చూపించొద్దు.. శక్తి సామర్ధ్యాలను నమ్మండని అంటున్న అంధుల విజయగాథే ఇది.

image


ఆరోజు ఏమైందంటే..?!

రెండేళ్ల క్రితం సంగతి ఇది. ఒకరోజు సుభాషిశ్ తన భార్యతో కలిసి అంధుల కోసం ఏర్పాటు చేసిన జాబ్ ఫెయిర్ కి వెళ్లాడు. అక్కడ సీన్ చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు . ఒకరకంగా బాధ కూడా కలిగింది. వందలాది మంది అంధులు. చేతిలో రెజ్యూమెలు. గంటల తరబడి క్యూలో ఉన్నారు. వారిలో ఎంతమందికి ఉద్యోగం వస్తుందో గ్యారెంటీ లేదు. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో తెలియదు. చాలాసేపు అక్కడే నిల్చుండిపోయారు. ఆ రోజు సుభాషిశ్ జీవితాన్నే మార్చింది.

ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదనే..

కాళ్లూ చేతులు చూపు సరిగా ఉన్నవారు ఉద్యోగం కోసం ఎక్కడికంటే అక్కడికి వెళ్తారు. వస్తారు. వాళ్లకు తోడు అవసరం లేదు. ఎటొచ్చీ చూపులేని వారికే కష్టం. కచ్చితంగా వెంట ఒకరుండాలి. ఎక్కడికంటే అక్కడికి రావాలి. జాబ్ దొరికేంత వరకు వెంట తిరగాలి. ఇదంతా ఒకెత్తయితే, అంధులకు ఉద్యోగం ఇవ్వడానికి సంస్థలు అంత ఈజీగా ముందుకు రావు. అలాగని అంతా బాగుండి, పెద్ద చదువు చదివిని వారిని పిలిచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా ఏం లేదు. ఎక్కడికి వెళ్లినా నీ అనుభవం ఎంత? అనే ప్రశ్నే మొదట వస్తుంది. ఫ్రెషర్ ని సాధారణంగా ఎవరూ ప్రిఫర్ చేయరు. మరి, ఎవరో ఒకరు ఉద్యోగం ఇస్తేనే కదా -అనుభవం అంటూ వచ్చేది? ఇలాంటి పరిస్థితే ఎవరికీ రాకూడదన్న సుభాష్ ఆలోచన నుంచి వచ్చిందే స్టార్ ఫిష్ స్టార్టప్.

image


జీవితానికి పరమార్ధం కల్పించడమే లక్ష్యం

చూపులేకపోతేనేం. కావాల్సింది టాలెంట్. అదుంటే చాలు. అలాంటి వారికి చేయూత నివ్వాలని భావించాడు సుభాష్. స్టార్ఫిష్ కాన్సెప్ట్ కూడా అదే. చూపు లేని వారికి ఉద్యోగ అనుభవం కల్పించడమే సంస్థ ఉద్దేశం. ఇలాంటి వారు ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షల మంది ఉంటారు. వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. అదే అమెరికాలో అయితే అంధులకు సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. అది ప్రభుత్వమే కల్పిస్తుంది. అందులో 80 శాతం మంది ప్రయోజనాలు పొందుతారు. అదే మనదేశంలో అయితే ఉద్యోగం దొరకదు కానీ జాలి, సానుభూతి పుష్కలంగా దొరుకుతుంది. వాస్తవానికి అంధుల్లో ఎంతోమంది టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వారందరికీ ఉద్యోగ అనుభవం లేకపోవడం, సరైన మార్గనిర్దేశం లేకపోవడం- తదితర కారణాల వల్ల సమాజంలో ఎందుకూ కొరగానివారిగా మారిపోతున్నారు. అలాంటివారి జీవితానికి అర్థం పరమార్ధం కల్పించడమే స్టార్ ఫిష్ లక్ష్యం. అంధులకు మంచి అవకాశాలు ఇచ్చి ముందుకు నడుపుతాం అంటున్నారు సుభాష్.

ట్రెండ్ మారింది గురూ !

ఇప్పడున్న సమాచార సాంకేతిక ప్రపంచంలో పెద్ద చేప చిన్నచేపను తినడం అనేది పాత మాట. ఫాస్ట్ ఫిష్ స్లోగా ఉండే ఫిష్ ని తినేస్తుందనేది లేటెస్ట్ ట్రెండ్. ఇదే సుభాష్ నమ్మిన సూత్రం. స్టార్ ఫిష్ స్టార్టప్ ప్లాట్ ఫాం వెనుక ఎలాంటి లాభాపేక్ష లేదు. ఎవరికి ఏ ఏరియాలో టాలెంట్ ఉందో, ఎవరి సామర్ధ్యం ఏంటో, వాళ్ల ఆసక్తిని, ఉత్సాహాన్ని అంచనా వేస్తారు. అవసరమనుకుంటే ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే విషయాలను బాగా ఆకళింపు చేసుకునేలా తయారు చేస్తారు.ఇదంతా చేయడానికి పెద్దగా టైం పట్టదు. జస్ట్.. కొన్నివారాల్లోనే అంతా పూర్తవుతుంది.

‘‘చేపను పట్టడం నేర్చుకోవాలి, అంతేకానీ దానికి తిండిపెట్టడం ఎలా అని కాదంటాడు సుభాష్. వ్యాపారానికి ఎలాంటి ఆర్థిక సహాయం అందకపోతే అంతర్జాతీయంగా ఆహ్వానాలు పంపుతామంటున్నారు. స్టార్టప్ల ప్రారంభంలో మేం చరిత్ర సృష్టించాం’’ అంటారు సుభాష్.

సుభాష్ టీం శెభాష్

సుభాష్ టీంని గమనిస్తే ఒకింత ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే సుభాష్ తప్ప మిగతావారంతా అంధులే. కాకపోతే అందరూ బాగా చదువుకున్నవారు. మాస్టర్స్ డిగ్రీలు, పీహెచ్‌డీలు, ఎంబీయేలు చేసినవారు ఉన్నారు. వారంతా బిజినెస్ కల్చర్‌తో ముందుకెళుతున్నారు. తమకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొత్త అవకాశాలకు దారులు వేస్తున్నారు. ఇదంతా కేవలం వారివారి దృక్పథాలపై ఆధారపడి ఉంటుంది.

స్టార్ ఫిష్ చేసిందదే..

కొత్త అవకాశాలు వెతుక్కోవాలి. కొత్తదారి కనుక్కోవాలి. మార్పు అనేది ఎప్పటికప్పుడు కోరుకోవాలి. లేకపోతే జీవితం బోర్‌గా ఉంటుంది. అవసరమైతే అవకాశాలను సృష్టించాలి. లేకుంటే అవకాశాలే తలుపు తట్టేలా చేసుకోవాలి. స్టార్ ఫిష్ చేసిందదే. ఈ ఐదేళ్లలో కొన్నివేలమంది జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకువచ్చింది. అంధులు ఈ లోకాన్ని కళ్లతో చూడలేకపోవచ్చు. అలాంటి ఆనందం పొందలేకపోవచ్చు. కానీ ఆత్మ సంతృప్తి అనే పదం ముందు అవన్నీ దిగదుడుపే అంటారు సుభాష్.

అపజయాలే విజయ సోపానాలుగా..!

సక్సెస్ కు షార్ట్ కట్ లేదు. కష్టపడందే ఏదీ దక్కదు. స్టార్ఫిష్ ప్రాజెక్టు అందుకు అతీతం కాదు. ప్రారంభంలో ఎన్నో కష్టాలు. అంతమాత్రం చేత కుంగిపోలేదు. అపజయాలనే విజయ సోపానాలుగా మార్చుకున్నారు. స్టార్ఫిష్ ఇప్పటివరకూ 9 దేశాల్లో 100 మంది కి పైగా అంధులను నిపుణులుగా తయారుచేసింది. ఎనిమిది దేశాల్లో వివిధ విభాగాలకు చెందిన 45 స్టార్టప్ కంపెనీలను స్థాపించారు. స్టార్టప్లద్వారా లక్ష డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ఒక్కరూపాయి కూడా జనం నుంచి సేకరించలేదు. రోజు 18 గంటల పాటు కష్టపడుతున్నారు. సుభాష్ రోజంతా కష్టపడడానికి కారణం- స్టారప్‌లో ఉన్నవారంతా అంధులే.

‘‘ మేం ఏం చేస్తున్నామో చూడండి. మీరూ కొత్తగా ఆలోచించండి. లీడర్ గా ఎదగండి. చిన్న బిజినెస్ అయినా సరే. రేపు అది పెద్దగా మారుతుంది. సమాజం విలువ పెంచే వాల్యూ యాడెడ్ లీడర్ గా ప్రతి ఒక్కరూ ఎదగాలి”- సుభాష్. ’’
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags