సంకలనాలు
Telugu

మీ వ్యాపారాన్ని శాఖోపశాఖలుగా ఎలా విస్తరించాలి ?

సీరియల్ ఆంట్రప్రెన్యూర్ ఆశోక్ సూతా సక్సెస్ టిప్స్మైండ్ ట్రీ, విప్రో విజయాల వెనుక కీలక పాత్రదేశ ఐటి రంగ వృద్ధిలో తనకంటూ ప్రత్యేక స్థానంలేటు వయస్సులోనూ కొత్త పెట్టుబడులకు ఏమాత్రం వెనక్కి తగ్గని వైనం100 మిలియన్ డాలర్ల స్థాయికి సూతా కొత్త ప్రాజెక్ట్ 'హ్యాపీ మైండ్స్' యువర్ స్టోరీ ఛీఫ్ ఎడిటర్ శ్రద్ధ శర్మకు ప్రత్యేక ఇంటర్వ్యూ

team ys telugu
9th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కొత్త ఆలోచనలకు వయసుతో పనిలేదు. మెదడులో ఉత్సాహం, గుండెల్లో ధైర్యం, ఆలోచనల్లో స్పష్టత ఉంటే సీనియర్ సిటిజన్ అయినా సక్సెస్ రుచేంటో చూడొచ్చని నిరూపిస్తున్న అశోక్ సూతా. తనని తాను ఓ లేట్ స్టేజ్ సీరియల్ ఆంట్రప్రెన్యూర్‌గా అభివర్ణించుకుంటూనే.. భవిష్యత్తులో తనకున్న లక్ష్యాలను వివరిస్తారు. దేశ ఐటి రంగం ఈ స్థాయిలో వృద్ధి చెందేందుకు కారణమైన వారెవరో తరచి చూస్తే అందులో సూతా పేరు కూడా కనిపిస్తుంది. తాజాగా ఆయన ప్రారంభించిన 'హ్యాపియస్ట్ మైండ్స్' వెంచర్ ఆగస్ట్ 2011లోనే ప్రారంభమైనా.. ఇప్పటికే వంద మిలియన్ డాలర్ల ఆదాయాన్ని చేరేస్థాయికి ఎదిగి దూసుకుపోతోంది. గతంలో ఆయన స్థాపించిన మైండ్ ట్రీ ఈ రంగంలోనే ప్రకంపనలు సృష్టించింది. అప్పట్లో ఆ సంస్థ ఐపిఓకు వచ్చినప్పుడు ఏకంగా 103 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకాస్త ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే విప్రో వెనుకా ఆయన చేసిన కృషి మనకు అర్థమవుతుంది. 1984లో కేవలం రెండు మిలియన్ డాలర్లు ఉన్న విప్రో ఐటి వ్యాపారం 500 మిలియన్ డాలర్ల స్థాయికి చేరేందుకు ఆయన వేసిన ఫౌండేషన్ కారణం అనడంలో సందేహం లేదు.

అశోక్ సూతా, హ్యాపీయస్ట్ మైండ్స్ వ్యవస్థాపకులు - సీరియల్ ఆంట్రప్రెన్యూర్

అశోక్ సూతా, హ్యాపీయస్ట్ మైండ్స్ వ్యవస్థాపకులు - సీరియల్ ఆంట్రప్రెన్యూర్


నేను ఉన్న రంగంలో మార్కెట్‌తో పాటు విస్తృత అవకాశాలున్నాయి. భారత్‌ కూడా వాటిని అందిపుచ్చుకునేందుకు సరైన స్థానంలోనే ఉంది. అయితే ఎవరు ఆ అవకాశాలను అద్బుతంగా సద్వినియోగం చేసుకుని సొమ్ము చేసుకుంటారా అనేదే ఇప్పుడు సమస్య. విప్రో ఈ రంగంలో చాలా అలస్యంగా అడుగుపెట్టిందని చాలా మందికి తెలియదు. అయినా ఒక దశలో మేం ఇన్ఫోసిస్‌ను ఢీకొన్ని రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థగా ఎదిగాం. అప్పటికీ విప్రో చాలా చిన్న కంపెనీయే. కానీ గొప్పగా ఆలోచిస్తూ, వేగంగా దూసుకుపోయి తమకు ఉన్న బలాలేంటో బేరీజు వేసుకుని చరిత్ర సృష్టించేలా దాని రూపకల్పన జరిగింది. ఆ ఆలోచనా విధమే అప్పట్లో మార్పునకు నాంది పలికింది.

కొత్త వ్యాపారాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన విధివిధానాలేంటో అశోక్ సూతా తప్ప ఇంకెవరు గొప్పగా చెప్పరు ? ఆ పంచసూత్రాలేంటో ఆయన మాటల్లోనే వినండి.

ఎత్తుకు ఎదిగేలా డిజైన్ చేయండి

ఉన్నత స్థాయికి చేరుకునేలానే మీ వ్యవస్థను డిజైన్ చేసుకోండి. లేకపోతే మీరు ఎప్పటికీ అక్కడికి చేరుకోలేరు. దానికో మంచి ఉదాహరణ హ్యాపియస్ట్ మైండ్స్. అన్ని టెక్నాలజీల్లో కాలుమోపాలనే లక్ష్యంతో పాటు ఏ స్థాయికి ఎదగాలో కూడా ముందే నిర్ణయించుకున్నాం. చాలా మంది మమ్మల్ని SMAC (సోషల్, మొబైల్, అనలిటిక్స్, క్లౌడ్)లో ఉన్నామని అనుకుంటారు. కానీ మేం SMACతో పాటు యూనిఫైడ్ కమ్యూనికేషన్, ది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాగ్నిటివ్ కంప్యూటింగ్‌లోనూ ఉన్నాం. ప్రారంభం నుంచే ప్రతీ ఒక్కరికీ నిర్దిష్టమైన లక్ష్యాలను సూచిస్తూ గ్రూపులుగా విభజించాం. దీని వల్ల వివిధ రకాలైన కస్టమర్లను చేరుకునేందుకు సులువవుతుంది. ప్రతీ టెక్నాలజీ విభాగానికీ గ్లోబల్ ప్రాక్టీస్ హెడ్, ఇండస్ట్రీ గ్రూప్ హెడ్ నియమించాం. మొదటి ఏడాదిలోనే అమెరికాలో ఏకంగా ఎనిమిది ఆఫీసులను ప్రారంభించాం. ఇలాంటి విస్తరణకు ముందుగా భారీ స్థాయిలో నిధులను కుమ్మరించాల్సిన సత్తా కూడా కావాలి. అందుకే ముందుగానే మాకు అవసరమైన దానికంటే ఎక్కువగానే నిధులను సమీకరించాం. మరో పెద్ద సంస్థను కొనుగోలు చేస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో సులువుగా ఐపిఓకు వెళ్లేందుకు మాకు అవకాశముంది.

క్యాష్ ఈజ్ కింగ్

నగదా ? లాభదాయకతా ? ఏది ముఖ్యమో బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. నాకు అదే ప్రమాణం, అదే సిద్ధాంతం. మైండ్ ట్రీ స్థాపనకు అవసరమైన నిధులను సమీకరించుకున్న తర్వాతే సుబ్రతా బాగ్చీ (మైండ్ ట్రీ ప్రస్తుత ఛైర్మన్, సహ వ్యవస్థాపకులు) నన్ను కలిసి వాళ్ల బిజినెస్ ప్లాన్ వివరించారు. వాళ్ల ప్లాన్‌కు నేను మూడే మూడు మార్పులు చేశాను, అవే ఆ తర్వాత కంపెనీ నిలదొక్కుకునేందుకు కారణమైంది. అందులో మొదటిది భూములు, మౌలిక సదుపాయాలపై నిధులు వెచ్చించకపోవడమే. డాట్ కామ్ బుడగ పేలినప్పుడు.. మేం విస్తరణకు వెళ్లేందుకు ఆ నగదే మాకు ఉపకరించింది. ఒక వేళ భూములు, బిల్డింగులపై డబ్బు వెచ్చించి ఉంటే మా ఆస్తి విలువ దారుణంగా కరిగిపోయి ఉండేది. మా దగ్గరున్న నగదు వల్లే తర్వాతి రౌండింగ్ ఫండ్‌కు వెళ్లేందుకు ఆస్కారం దక్కింది.

టైమింగ్ ముఖ్యం

మేం రెండో దశ నిధుల సమీకరణకు వెళ్లే సమయానికే మా దగ్గర బ్యాంకుల్లో కొంత నగదుతో పాటు మెరుగైన వేల్యూయేషన్ కూడా ఉండేది. అయితే ఫండింగ్ చేసే వాళ్ల నిబంధనలు కొన్ని మాకు నచ్చకపోయినప్పటికీ... నా మనసు మాత్రం ప్రొసీడ్ కావాలనే చెప్పింది. ఇక ఆలోచించకుండా ఓకె చెప్పేశాం. వారం రోజుల్లోనే సెప్టెంబర్ 11 దుర్ఘటన జరిగింది. ఆ తర్వాత కొంత కాలం పాటు పరిశ్రమకే నిధుల ప్రవాహం ఆగిపోయింది.

సరైన పరిశ్రమలోనే ఉన్నారా ?

తర్వాతి స్థాయికి వెళ్లాలంటే మనం సరైన పరిశ్రమలో, సరైన స్థానంలో ఉండాలి. ఫ్లాట్‌గా ఉన్న రంగంలో ఒక స్థాయి వరకే మీరు పోరాడగలరు. ఆ తర్వాత విస్తరణ చేయడం అంత సులువైన విషయమేమీ కాదు. మీరు సరైన రంగంలో ఉంటే అదే మీ వృద్ధికి దోహదపడ్తుంది. యువకులకు భారత్‌లో వివిధ మార్గాల్లో పుష్కలమైన అవకాశాలున్నాయి. నిరంతరం వాటిని పరిశీలిస్తూ ఉండడమే ముఖ్యం. ఎప్పుడు ఏ అవకాశం ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేం.

నా మొదటి ఉద్యోగంలో మంచి జీతమే వచ్చేది. కానీ అదో నీరసమైన అభ్యాసం. అందుకే ఎక్కువ నేర్చుకునే అవకాశమున్న రంగానికి నేను మారిపోయాను. ఎప్పుడూ డబ్బు, ఇతర సౌకర్యాల కంటే కొత్తవి నేర్చుకోవడానికి వెసులుబాటున్న వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. విప్రోలో చేరేముందు నేను శ్రీరాం రెఫ్రిజిరేషన్‌ నడిపేవాడిని. అది అప్పటికే విప్రో ఐటి కంటే ఐదు రెట్లు పెద్ద వ్యాపారం. నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోకి తీసుకువచ్చాం. కానీ ఐటి వ్యాపారానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని అప్పుడే గుర్తించా.

image


నిర్ణయం

సరైన ప్రణాళికకే నేను మొదటి ప్రాధాన్యమిస్తాను. ఏడాది ప్రారంభంలోనే నాలుగు బోర్డ్ మీటింగ్స్‌ తేదీలను ఖరారు చేసుకుంటాను. మన భవిష్యత్తుపై స్పష్టత ఉంటే సమయానికి కొదువ ఉండదు. నా మనసు చెప్పిందే వింటాను. నా గుండె ధైర్యమే నన్ను నడిపిస్తుంది.

  • మీ ప్రశ్నలను, పరిశీలనలను పెద్ద గ్రూపుతో చర్చించండి. సరైన నిర్ణయాలు వాటంతట అవే వస్తాయి. ఒక్కోసారి భిన్నమైన అభిప్రాయాలతో వాతావరణం వేడెక్కినా ఫర్వాలేదు.
  • మీరు తీసుకునే నిర్ణయం మీ బృందంలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపుతుందో లేదో అంతరాత్మను ప్రశ్నించుకోండి.
  • ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం గురించి ఐదేళ్ల తర్వాత ఏమని విశ్లేషించుకుంటారో తెలుసుకోండి.

పై మూడు ప్రశ్నలకు సరైన సమాధానం దొరికితే మీ గమ్యం సులువవుతుంది.

సాధ్యమైనంత వరకూ అన్నింటినీ సులువు చేసుకోవడమే సూతా సూత్రం. పారిశ్రామికవేత్త, నాయకుడిని అని మరవండి, అప్పుడు అన్నీ సులువుగా కనిపిస్తాయి. కొంత మంది తమకు ఆనందం ఇచ్చే వాటిపై తక్కువ వెచ్చిస్తారు. కెరీర్ వంటి విషయాల్లో అధికంగా ఇన్వెస్ట్ చేసి తిప్పలు పడ్తారు. చివరకు అసంతృప్తితో కాళం వెళ్లదీస్తారనేది ఆయన ముక్తాయింపు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags