సంకలనాలు
Telugu

చాయ్ అమ్ముకునే నిరుపేద కుర్రాడు సీఏ అయ్యాడు! సోమ్‌నాథ్‌ సక్సెస్ స్టోరీ!!

HIMA JWALA
6th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

సరస్వతి ఉంటే లక్ష్మీ ఉండదంటారు! అయితే, ఒక్కోసారి ఆ ఈక్వేషన్ తప్పు అనిపిస్తుంది. సోమ్‌నాథ్‌ అనే కుర్రాడి విషయంలో అదే రుజువైంది! టీ అమ్ముకుని పొట్టపోసుకునే ఓ నిరుపేద కుర్రాడు చార్టెర్డ్‌ అకౌంటెంట్ అయ్యాడంటే – లక్ష్మీదేవి-సరస్వతీమాత కలిసి అతడిని దీవించినట్టే కదా! ఆ కథేంటో మీరే చదవండి!!

చార్టెర్డ్‌ అకౌంటెన్సీ! మాటలు కాదు! ఫీజులకే ఫ్యూజులు ఎగిరిపోతాయి! బుక్స్ చూస్తేనే బుర్ర తిరిగిపోతుంది! కోచింగ్ లేకుంటే కొండనెత్తిమీద ఉన్నట్టే! పరీక్ష కాదది.. అగ్నిపరీక్ష! గంటో రెండు గంటలో చదివితే పాసయ్యే వ్యవహారం కాదు. అలాంటి సీఏ కోర్సును ఒక చాయ్ బండి నడిపిస్తూ పాస్ అయ్యాడు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్న్ అండ్‌ లెర్న్‌ పథకానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా అయ్యాడు.. దీన్నిబట్టి సోమ్‌నాథ్‌ గిరామ్ గుండెలో కాన్ఫిడెన్స్ ఏ రేంజిలో ఉందో ఊహించండి.

image


ఎక్కడ చాయ్ దుకాణం.. ఎక్కడ చార్టెడ్ అకౌంటెంన్సీ! ఈ మధ్య దూరాన్ని తెలుసుకోవాంటే కొంత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి. సోలాపూర్‌ జిల్లా కర్మలా అనే చిన్న కుగ్రామం. సోమ్‌నాథ్‌ తండ్రి చిన్న వ్యవసాయదారుడు. నిరుపేద కుటుంబం. చదువుకోవాలని ఉన్నా పరిస్థితులు సహకరించలేదు. స్కూలుకు పోవాలంటే రోజూ 40 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కాలి. పెద్ద చదువులు చదవాలని ఉంది. కానీ పేదరికం అడ్డొచ్చింది. టెన్త్ తర్వాత ఎలా అన్న ప్రశ్న ఎదురైంది. కనీసం పుస్తకాలు కూడా కొనలేని దుస్థితి. టెన్త్‌ వరకు అంటే ఎలాగోలా సెకండ్‌ హాండ్ బుక్స్ తోనే బండి నడిచింది. ఇంటర్మీడియెట్ చేయాలని ఉంది. కానీ డబ్బుల్లేవు. డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ని నమ్ముకున్నాడు. కూలిపని చేశాడు. బస్తాలు మోశాడు. అలా వచ్చిన డబ్బులతో ఫీజులు కట్టుకున్నాడు. వాటితోనే పుస్తకాలు కొనుకున్నాడు. అతని పట్టుదల ముందు పేదరికం చిన్నబోయింది. ఇంటర్మీడియెట్ అవలీలగా పాసయ్యాడు.

ఈ స్టోరీ కూడా చదవండి

వ్యాపార తెలివితేటలు, ఫైనాన్షియల్ ఫిగర్స్ లాంటి వాటిమీద సోమ్‌నాథ్‌ లో ఏదో తెలియని స్పార్క్‌ ఉంది. అది కనిపెట్టిన ఓ లెక్చరర్‌- కుర్రాడికి ఒక సలహా ఇచ్చాడు. ఇక్కడ కాదుగానీ- పుణె వెళ్లి బీకామ్‌ చదువు.. నీకు మంచి ఫ్యూచర్ ఉందని అని చెప్పాడు. లెక్చరర్ చెప్పిన మాటతో సోమ్‌నాథ్‌ పెట్టేబేడా సర్దుకుని పుణె రైలెక్కాడు. రానైతే వచ్చాడు కానీ ముందు బతికేదెలా? అలా ఆలోచిస్తుంటే తట్టిందో ఐడియా! దానిపేరు టీ కొట్టు. బతకాడానికి ఏదయితే ఏంటి? టార్గెట్ ఒకటి ఫిక్సయ్యాక- ఏ దారిలో వెళ్తే ఏంటని అనుకున్నాడు. అలా సదాశివ్‌పేట్‌ ఏరియా పెరుగేట్ చౌరస్తా దగ్గర ఒక చాయ్ దుకాణం వెలసింది. పొద్దంతా టీ అమ్మడం. రాత్రిపూట చదవడం. ఖర్చులు పోను వచ్చిన డబ్బులతో బుక్స్ గట్రా కొనుకున్నాడు. వాటితోనే ఫీజులు కట్టుకున్నాడు.

అలా 2009లో బీకామ్ పూర్తయింది. 2012లో ఎంకామ్ ఫినిష్ చేశాడు. ఇక అసలు టార్గెట్ సీఏ. కానీ అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఫీజుల దగ్గర్నుంచి బుక్స్ మొదలుకొని కోచింగ్ క్లాసుల దాకా- ఖర్చు తట్టుకోలేం. చాలా ఎక్స్‌ పెన్సివ్. అయినా సంకల్పం సడలలేదు. 12 గంటలు టీ షాప్ మేనేజ్ చేస్తూ- 5 నుంచి 7 గంటల దాకా చదువు కొనసాగించాడు. పడ్డకష్టం ఫలించింది. సీఏ పరీక్షలు పాసయ్యాడు. 55 శాతం మార్కులొచ్చాయి. ఆ మాటకొస్తే తనతోపాటు చదివిని వాళ్లలో అతి తక్కువ మంది పాసయ్యారు.

ఒక సాధారణ చాయ్‌ వాలా రేయింబవళ్లు కష్టపడి ప్రతిష్టాత్మక సీఏ పాసయ్యాడంటే ఆషామాషీ కాదు. రోజుకి 17-18 గంటలు కూచుంటే గానీ చిక్కుల లెక్కలు బుర్రకెక్కవు. అంత టిపికల్ సబ్జెక్టులను అవలీలగా అర్ధం చేసుకుని విజయం సాధించిన కుర్రాడి ప్రతిభను చూసి మహారాష్ట్ర ప్రభుత్వం ముచ్చటపడింది. సోమ్‌నాథ్‌ కృషికి, పట్టుదలకు మెచ్చి- ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్న్ అండ్ లెర్న్ అనే పథకానికి అతణ్ని బ్రాండ్ అంబాసిడర్‌ని చేసింది. అంతేకాదు.. డీఎస్కే గ్రూప్‌ అనే కంపెనీ ముందుకొచ్చి తమ ఆడిట్లన్నీ చూసే బాధ్యతలు కట్టబెట్టింది.

image


అయినప్పటికీ టీ కొట్టు మూసేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే భవిష్యత్‌లో ఒక సీఎం ఫర్మ్‌ ఓపెన్ చేయాలనుకుంటున్నా. ఆ లక్ష్యం నెరవేరాలంటే ఫైనాన్షియల్‌గా ఎంతోకొంత ఆసరా కావాలి- సోమ్‌నాథ్


ఇప్పుడు చెప్పండి- టీ అమ్ముకుని పొట్టపోసుకునే ఓ కుర్రాడు పట్టుదలతో చదివి చార్టెర్డ్‌ అకౌంటెంట్ అయ్యాడంటే – సరస్వతి ఉన్నచోట లక్ష్మి ఉన్నట్టా లేనట్టా..?

ఈ స్టోరీ కూడా చదవండి
ఈ స్టోరీ కూడా చదవండి
ఈ స్టోరీ కూడా చదవండి
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags