సంకలనాలు
Telugu

1000 సీసీ బైకుని స్వహస్తాలతో తయారుచేసిన కుర్రాడు

8 ఏళ్లు కష్టపడి బండి తయారుచేసిన రిద్దీష్

team ys telugu
25th Jan 2017
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

ఆర్జీవీ అన్నట్టు టాలెంటు ఎవడి సొత్తూ కాదు. బుర్రలో గుజ్జు, రక్తంలో కసి ఉంటే చాలు. మనిషి నైపుణ్య ప్రవాహానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరు. మీరు చదవబోయే యువకుడి కథ అలాంటిదే.

1000సీసీ బైక్ నడపమంటే ఏ యువకుడు కాదంటాడు చెప్పండి. ఓ పదిలక్షలిస్తే అరగంటలో షో రూపం నుంచి సరాసరి బండిమీద గాళ్ ఫ్రెండ్ సమేతంగా కనిపిస్తాడు. హై ఎండ్ బైక్స్ అంటే యూత్ లో అంత క్రేజ్. అంతెందుకు క్రికెటర్ ధోనీనే తీసుకోండి. మ్యాచ్ లేదంటే చాలు .. బైకేసుకుని బయటపడతాడు

ఎలా తయారు చేశారు? ఏ మెటీరియల్ వాడారు? ఏ టెక్నాలజీ ఆధారంగా బిగించారు? ఇవన్నీ నథింగ్. తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మైలేజ్ ఎంత? రేటెంత? ఫీచర్స్ ఏంటి? బేసిగ్గా ఇండియన్ కుర్రాళ్లు ఇంతకంటే టూ వీలర్ గురించి పట్టించుకోరు.

రిద్దీష్ పట్టించుకున్నాడు. కానీ చేతిలో ఆటోమోబైల్ డిగ్రీ లేదు. మనసు బండి మీద లగ్నం చేశాడు. కానీ జేబులో సరిపడా డబ్బులేదు. రిద్దీష్ కు ఆలోచన వచ్చింది..? కానీ చేతిలో టెక్నాలజీ లేదు. బుర్రే అతని టెక్నాలజీ. చేతులే అతని పనిముట్లు.

ఆలోచనతోనే ఆగిపోతే ప్రపంచంలో ఏ ఐడియా కూడా ఆవిష్కరణగా మారదు. అందుకే రిద్దీష్ బండి అంతేంటో చూడాలనుకున్నాడు.

image


రిద్దీష్ కు మొదట్నుంచీ ఇలాంటి బైక్ అంటే ఇష్టం. ఒక్కసారైనా దాన్ని నడపాలని, వీలైతే సొంతంగా కొనుక్కోవాలని. కానీ మధ్యతరగతి జీవితం. ఎలా? అందుకే అలాంటి వాహనాలను స్టడీ చేయడం మొదలుపెట్టాడు. ఏఏ ఫీచర్స్ ఉంటాయి? ఎలా నడుస్తుంది? క్లచ్ నుంచి ఇంజిన్ దాకా.. ఆమూలాగ్రం చదివాడు. ఎలాంటి ఇంజినీరింగ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా రంగంలోకి దిగాడు.

2005లో బైక్ తయారుచేయడం మొదలు పెట్టాడు. ఒక్కో బోల్ట్ బిగిస్తూ, ఒక్కో పార్ట్ జతచేస్తూపోయాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎన్నో ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఆర్ధికంగా అడ్డంకులు ఎదురయ్యాయి. స్పేర్ పార్ట్స్ దొరికేవి కాదు. ఎందుకంటే అవి కంపెనీవాళ్లు తయారు చేసినవి. ఇతని మనసలో డిజైనింగ్ వేరేలా వుండేది. అయినా విసుగుచెందలేదు. విరామం ప్రకటించలేదు. కసితో, పట్టుదలతో, సుమారు ఎనిమిదేళ్లు.. అహోరాత్రులు బండికోసం శ్రమించాడు. 2007లో మొదలుపెట్టిన వెహికిల్ 2015లో పూర్తయింది. శ్రమకు తగ్గ ఫలితం కళ్లముందు కదలాడింది. కళ్లలో చెప్పలేనంత ఆనందం. ఇండియాలోనే 1000 సీసీ బైకుని స్వహస్తాలతో తయారు చేసిన తొలి కుర్రాడిగా చరిత్ర తిరగరాశాడు. అందుకోసం అయిన ఖర్చు 8 లక్షలు.

కంపెనీ తయారుచేసిన బండికి ఏమాత్రం తీసిపోదు. అన్ని ఫీచర్లు సేమ్ టు సేమ్. టైర్లు, హైడ్రాలిక్ సిస్టమ్ మినహా అన్ని పార్టులు చేత్తో బిగించినవే. రీమ్ మొత్తానికి ఇన్వర్టెడ్ డిస్క్ బ్రేక్ పెట్టాడు. ఫ్రంట్ టైరుకు బంపర్ ఫిట్ చేశాడు. సిక్స్ స్పీడ్ ట్రాన్స్ మిషన్ పెట్టాడు. అంటే ఆరు గేర్లుంటాయి. క్లచ్ హైడ్రాలిక్ మోడ్ లో డిజైన్ చేశాడు. అన్ని బండ్లకు క్లచ్ వైర్ రూపంలో వుంటే.. దీనికి ఆయిల్ రూపంలో ఉంటుంది. 1000 కెపాసిటీ గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ బిగించాడు. కారు తరహాలో డిజైన్ చేశాడు. అంటే ఫోర్ వీలర్ ఇంజిన్ టూ వీలర్ కు పెట్టాడన్నమాట. ఇంత పవర్ ఫుల్ ఇంజిన్ పెట్టాడు కదాని.. దీన్ని నడపడం కష్టం అనుకుంటే పొరపాటే. ఇదొక సాఫ్ట్ డ్రివెన్ బైక్. రోడ్డెక్కిందంటే నడిపినట్టే ఉండదు. స్పీడ్ గంటకు 170కిలోమీటర్లు. ఎత్తు 8 అడుగల 9 అంగుళాలు. బరువు 450 కిలోలు. బండికి రిడ్ అని పేరు పెట్టాడు.

సాధారణంగా ఏదైనా కంపెనీ ఇలాంటి ఒక బైక్ తయారుచేస్తోందంటే.. దాని రీసెర్చ్ కోసమే కోట్లు ఖర్చుపెడుతుంది. ఆ తర్వాత మాన్యుఫాక్చరింగ్, అడ్వర్టయిజ్ మెంట్, ట్రాన్స్ పోర్ట్, టాక్స్, వగైరా వగైరా తర్వాత మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అప్పుడు దాని రేటు ఎంతలేదన్నా మినిమం 12 నుంచి 15 లక్షలు ఉంటుంది.

రాజ్ కోట్ రోడ్ల మీద గుండెలు అదిరే బీటింగ్ తో 1000సీసీ బైక్ వెళ్తుంటే అందరి కళ్లూ దాని వైపే. ఆగిచూడని అమ్మాయిలేదు. మరలి చూడని మగాడు లేడు. ప్లీజ్ ఒకసారి నడుపుతాను బండి ఇవ్వవా అని బతిమాలుతారు. సెల్ఫీలు, ఫోటోలు.. అబ్బో రిద్దీష్ చిన్నపాటి సెలబ్రిటీ. ఏ కంపెనీది.. ఎక్కడ కొన్నావు.. ఇలా ఒకటే ప్రశ్నల వర్షం. రాజ్ కోట్ మొత్తం ఈ బండికి ఫ్యాన్స్ ఉన్నారు.

 ఒకసారి జాన్ అబ్రహం షూటింగ్ కోసం రాజ్ కోట్ వస్తే.. ఎవరో చెప్పారట ఇదీ సంగతి అని. మనోడు ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా.. రిద్దీష్ ను కలుసుకని అతని బైక్ మీద ఎక్కాడు. తెగ ముచ్చటపడ్డాడు. కలిసి ఫోటో దిగాడు. 2015 మార్చిలో రిద్దీష్ పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో నమోదైంది. అప్పటి సీఎం చేతుల మీదుగా ట్రెండ్ సెట్టర్ అవార్డు కూడా తీసుకున్నాడు. కేంద్రం మేకిన్ ఇండియా అనక ముందే రిద్దీష్ ఆ మాట నిజం చేసి చూపించాడు. ఎంతైనా ఈ మిడిల్ క్లాస్ ఇండియన్ కుర్రాడు గ్రేట్ కదా.. 

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags