సంకలనాలు
Telugu

ఫస్ట్ స్టార్టప్ ఫట్… సెకండ్ స్టార్టప్ హిట్ …

Pavani Reddy
20th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ఫ్లిప్ కార్డ్, జోమాటో లాంటి స్టార్టప్స్ విజయగాథలు విన్నాను… నేనూ (ప్రదీప్ గోయల్) ఒక స్టార్టప్ పెడితే బడా పారిశ్రామికవేత్తగా మారిపోతాననుకున్నాను. కానీ 90 శాతం స్టార్టప్స్ విఫలమవుతాయని అప్పట్లో నాకెవరూ చెప్పలేదు. స్టార్టప్ పెట్టి ఏడాదికే దివాలా తీశాను. నన్నెవరో మోసం చేశారనిపించింది. కానీ తప్పునాదేనని తర్వాత తెలుసుకున్నాను. నేను నాణేనికి ఒకవైపు మాత్రమే చూశాను. అసలు నాకెందుకు అలా జరిగింది. మీరే చదవండి అర్థమవుతుంది.

బ్యాక్ గ్రౌండ్

అది 2013 ఏప్రిల్ … అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను. కానీ జాబ్ పై ధ్యాసలేదు… అసలే స్టార్టప్స్ సీజన్ ఏదైనా సొంతంగా చేయాలన్న ఆలోచన బుర్రను తొలిచేసింది. జీవితం బోర్ కొట్టింది. దీంతోపాటు ఇండియాలో కొంచెం పని కూడా ఉంది… ఇంటిని చక్కబెట్టుకోవాలన్న సాకు చెప్పి వచ్చేశా. ఇంటి సమస్య పరిష్కారంకాలేదని … మరికొంచెం టైంకావాలని అమెరికా బాస్ ను ఒప్పించాను. సొంత వ్యాపారం చేయాలనుకున్నాను… కానీ అంత ధైర్యం లేదు. చాలా మంది స్నేహితులతో చర్చించాను. ఎట్టకేలకు ఒక ఫ్రెండ్ తో కలిసి స్టార్టప్ పెట్టాను. ఐదు లక్షల పెట్టుబడితో గుర్గావ్ లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించాం.

ఇండియన్ స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చాలనుకున్నాం. భారత్ లో స్కూల్స్ అంటే వేల కోట్ల వ్యాపారం. అందులోకి దిగితే సక్సెస్ పక్కా అనుకున్నాం. స్కూల్స్ కోసం ఈఆర్పీ సాఫ్ట్ వేర్ తయారు చేయాలనుకున్నాం. స్కూల్ ఫీజు నుంచి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చేవరకు అన్ని విషయాలూ ఈఆర్పీలో ఉంటాయి.

 హైరింగ్ ఫెయిల్

ఒక ప్రకటన ఇస్తే చాలు ఉద్యోగులు వచ్చేస్తారనుకున్నాను. మంచి టీం, ఆఫీసును ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలనుకున్నాం. నాతోపాటు వ్యాపారం చేస్తున్న వ్యక్తికి ఉద్యోగ నియామక ప్రక్రియలో పదేళ్లకుపైగా అనుభవముంది. అయితే ఉద్యోగ ప్రకటన ఇచ్చినా… తెలిసినవారి ద్వారా ప్రయత్నించినా కంపెనీలో చేరడానికి ఎవరూ ముందుకు రాలేదు. వేరే కంపెనీకైతే చాలామందిని నియమించేవాణ్ణి … మరి మన స్టార్టప్ లో ఎందుకు జాయిన్ కావడంలేదో అంటూ నా పార్ట్ నర్ ఆశ్చర్యపోయారు. మా ఇద్దరికీ కార్పొరేట్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. కంపెనీ పాలసీని ఒకచోట రాసుకున్నాం. ఆదాయం బట్టి జీతంతో పాటు… ఉద్యోగులకు ప్రోత్సాహకాలూ ఇస్తామన్నాం. వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యాం.

గుర్గావ్ లో ఆఫీసు ఏర్పాటు

ఎట్టకేలకు ఒక ఉద్యోగిని నియమించుకోగలిగాం. జీతంతోపాటు… ఇన్సెంటివ్స్ ఇస్తామని హామీనిచ్చాం. మరో ఇద్దరు చేరారు. ఇక డబ్బు సంపాదనే తరువాయి అనుకుని… మేం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాం. ప్రోడక్ట్ ను వీలైనంత తొందరగా స్కూల్స్ కు అమ్మాలనుకున్నాం. ఇంతలోనే మరో సమస్య వచ్చిపడింది. సరిగా పనిచేయకపోవడంతో ఒక సాఫ్ట్ వేర్ డెవలపర్ ను ఉద్యోగం నుంచి తీసేశాం. జస్ట్ నలుగురంటే నలుగురితో ఈఆర్పీ సాఫ్ట్ వేర్ ప్రోడక్ట్ బయటకు తీశాం. అది హాట్ కేకులా అమ్ముడవుతుందనుకున్నాం. కాంపిటీటర్స్ కకావికలమైపోతారని భ్రమపడ్డాం. అయితే చివరికి మేమే సంతృప్తి చెందలేదు. మరింత బెటర్ గా సాఫ్ట్ వేర్ డిజైన్ చేయాలనుకుని కష్టపడ్డాం. ఎట్టకేలకుర అవుట్ పుట్ బయటకువచ్చింది. బాగా తెలిసిన ఒక స్కూల్ ప్రిన్సిపల్ ను కలిశాం. డెమో ఇచ్చాం. సరే… స్కూల్ కరస్పాండెంట్, ఛైర్మన్ తో మాట్లాడి చెప్తానని ఆమె అన్నారు. ఓకే అని చెప్పి… ఆమెకు మెటీరియల్ పంపాం. సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేస్తామన్నాం.

ఆర్నెల్లు ఖర్చు రూ.9 లక్షల 56 వేలు

అప్పటి వరకు రూపాయి ఆదాయం లేదు… ఖర్చు మాత్రం తడిసి మోపెడైపోయింది. గుర్గావ్ లో అద్దెలు పేలిపోతున్నాయని… ఖర్చు ఎక్కువవుతుందనుకుని ఆఫీసును చండీగఢ్ కు మార్చేశాం. నేను కూడా చండీగఢ్ వెళ్లిపోయాను… నా పార్టనర్ గుర్గావ్ లో తన రూం నుంచే పనిచేస్తాడు. సరిపోతుందనుకున్నాం.

నిర్ణయం మేలే చేసింది

1. ఇంట్లో ఉండి పనిచేయడం వల్ల సీనియర్ డెవలపర్ ఎక్కువ సమయం కేటాయించగలిగారు. ఆయన చండీగఢ్, గుర్గావ్ మధ్య చక్కర్లు కొట్టాల్సిన పని తప్పింది.

2. రెంట్ బాగా తగ్గింది

3. జీవన వ్యయం కూడా తగ్గింది.

మరోషాక్

అంతా బాగానే ఉంది కదా అనుకునే టైంలో మరో షాక్ తగిలింది. మా డిజైనర్ ల్యాప్ టాప్ తో ఉడాయించాడు. ఎట్టకేలకు ఎక్కడున్నాడో పట్టుకుని… మా ల్యాప్ టాప్ ను తిరిగి తెచ్చుకోగలిగాం. అయితే ఉన్న ఒకే ఒక్క డిజైనర్ వెళ్లిపోయాడు. ఇక లాభం లేదనుకుని… వెబ్ డిజైనింగ్ నేనే నేర్చుకున్నాను. ఒక నెలలో డిజైన్ మొత్తం మార్చేశాం. అద్భుతమైన ప్రోడక్ట్ వచ్చింది.ఇక దాన్ని స్కూల్స్ కు అమ్మాలని బయలుదేరాం. నేను, నా పార్టనర్ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసినా… సేల్స్ లో ఎలాంటి అనుభవం లేదు.

సినిమా కష్టాలు

స్కూల్స్ కు మా ప్రోడక్ట్ అమ్మాలనుకున్నాం. అయితే స్కూల్ ప్రిన్సిపాల్స్ అపాయింట్ మెంట్ గగనమయ్యింది. పది పన్నెండు స్కూల్స్ కు వెళ్లినా మేం తయారుచేసిన సాఫ్ట్ వేర్ ఎవరూ తీసుకోలేదు. గేటుదాటి లోపలికి వెళ్లడమే పెద్ద సమస్యగా మారింది. అసలు ప్రిన్సిపాల్స్ కు నిర్ణయం తీసుకునే పవర్ లేదని గుర్తించాం. నిర్ణయాలు తీసుకునే కరస్పాండెంట్, ఛైర్మన్ స్కూల్స్ లో ఉండరు. మూడు నెలలు స్కూల్స్ చుట్టూ షూస్ అరిగేలా తిరిగినా ఎలాంటి ఫలితం దక్కలేదు.

అహ్మదాబాద్ నుంచి ఒకరిని ఉద్యోగంలోకి తీసుకున్నాం. మా ప్రోడక్ట్ కు అదనపు హంగులు అద్దాం. పోటీదారులకన్నా ఎక్కువ ఫీచర్స్, తక్కువ ధర నిర్ణయించినా అమ్ముడుపోలేదు. అయితే చివరికి కొంతమంది కస్టమర్స్ వచ్చారు. కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తే మన ప్రోడక్ట్ కొనేందుకు పెద్ద స్కూల్స్ ముందుకొస్తున్నాయని మా పార్టనర్ చెప్పారు. అయితే ఇప్పటికే చాలా ఫీచర్స్ ఉన్నాయని… సేల్స్ ప్రక్రియలోనే లోపం ఉందంటూ వాదించాను. పెద్ద స్కూల్స్ మాట పక్కనపెట్టి … చిన్న, మధ్య తరహా స్కూల్స్ పై దృష్టిపెట్టమని సలహానిచ్చాను. పార్టనర్ తో విబేధాలు తీవ్రమయ్యాయి.

మా దగ్గర డబ్బు అయిపోతోంది… దీంతో మరింత డబ్బు పెట్టాలని డిసైడయ్యాం. పెద్ద కంపెనీలో సేల్స్ పర్సన్ ను నియమించుకున్నాం. నెలరోజులు మా దగ్గర ఆయన పనిచేసినా… ఒక్క స్కూల్స్ కు కూడా ప్రోడక్ట్ అమ్మలేకపోయారు. బ్రాండ్ నేమ్ వల్లే ఆయనకు పేరొచ్చింది తప్ప… విషయం లేదని నాకు తెలిసింది.

మరింత డబ్బు అవసరమయ్యింది

నా పార్ట్ నర్ పెద్ద స్కూల్స్ పై దృష్టి పెట్టారు. పెద్ద స్కూల్స్ అయితే ఎక్కువ అడ్వాన్స్ ఇస్తాయని… బడా రాయకీయ నాయకులతో సంబంధాలు ఏర్పడతాయనేది అతని ఉద్దేశం. బడాబాబులతో సంబంధాలు ఏర్పడితే ఎదగొచ్చనేది ఆయన ఉద్దేశం. ఈ క్రమంలో మరింత డబ్బు అవసరమయ్యింది.

ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి

1 నేనెప్పుడూ ఖర్చులు తగ్గించడంపైనే దృష్టి పెట్టాను

2. పెద్ద స్కూల్స్ గురించి మరిచిపోయి … చిన్న స్కూల్స్ పై దృష్టి పెట్టాలనుకున్నా..

3. సిటీశివారు ప్రాంతాల్లోని స్కూల్స్ ను టార్గెట్ చేస్తే వర్కవుట్ అవుతుందని భావించా..

4. సేల్స్ మ్యాన్ తొలగించి … ఆ బాధ్యత మనమే చూసుకుందామని చెప్పాను …

అయితే మా ప్లాన్ వర్కవుట్ కాలేదు. 11 నెలలు పూర్తయ్యింది… ఖర్చు 15 లక్షల 42వేలు అయ్యింది. మా ప్రోడక్ట్ ను ఎవరూ కొనలేదు. చాలా కష్టపడ్డాం… నా సహ వ్యవస్థాపకుడు వేరే ఉద్యోగం చేసుకుని వెళ్లిపోయాడు. స్కూల్స్ వేట ఇక సాధ్యం కాలేదు.

అయితే నేనేం నేర్చుకున్నాను :

1. వ్యాపారానికి ముందే కస్టమర్ ను చూసుకోవాలి

2.పోటీదారుల గురించి ముందుగానే తెలుసుకోవాలి. కస్టమర్ల గురించి తెలుసుకోవాలి.

3.డబ్బులు ఎక్కడ ఖర్చుపెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో తెలుసుకోవాలి

మేం ఉద్యోగుల జీతాలు, మౌలిక సదుపాయాలపై మేం ఎక్కువ ఖర్చు చేశాం. వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్ట్ ను అవలంభించినట్లయితే… 80 శాతం ఖర్చులు ఆదా ఆయ్యేవి. డిజైనింగ్ కోసం కన్సల్టెన్సీని సంప్రదించినట్లయితే మరికొంత డబ్బు మిగిలేది. సేల్స్ రంగంపై మేం దృష్టిపెట్టకపోవడం ప్రధాన లోపం. దాన్ని దిద్దుకోవాలి. ఆఫ్ లైన్ కస్టమర్లు ఎక్కువగా ఉన్నట్లయితే… బ్రోచర్లు, ప్రిండెట్ మెటీరియల్ ద్వారా పబ్లిసిటీ చేసుకోవాలి.

సహ వ్యవస్థాపకులకు టెక్నికల్ వ్యవహారాలపై అవగాహన లేకపోతే… అలాంటివారికి ప్లాన్ ఇంప్లిమెంటేషన్ పై దృష్టిపెట్టాలి. కాలక్రమంలో టెక్నికల్ వ్యవహారాలపై పట్టు సాధించాలి.

సొంతంగా సేల్స్ :

సేల్స్ పై ఎలాంటి అవగాహన లేకపోయినా… సొంతంగా ప్రోడక్ట్ సేల్స్ చేపట్టడం ఉత్తమం. నా సహవ్యవస్థాపకునికి సేల్స్ విషయంలో అవగాహన ఉన్నా… విజయవంతం కాలేకపోయాం. కారణం కస్టమర్లను సరిగా అంచనా వేయలేకపోవడం. వారి సాధకబాధకాలను అవగాహన చేసుకోలేకపోవడం

మనస్సాక్షితో ముందుకెళ్లాలి

కొంచెం కష్టమైనా మనసు చెప్పిన మాట వినాలి. సేల్స్, నియమాకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫర్ లెటర్ ఇచ్చే ముందే ఉద్యోగి గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏదైనా బిజినెస్ లో ఎంటరయ్యేముందు… ఆ వ్యాపారం గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి.

నేర్చుకోవడం ఆపేయొద్దు: ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అన్ని విషయాలూ తమకు తెలుసన్న అహంకారం పనికిరాదు. నేర్చుకోవడం ఆపేస్తే … బిజినెస్ లో ఫెయిలవ్వడం ఖాయం.

కొంచెం ఆలస్యంగా నేర్చుకున్న విషయం ఏంటంటే.. స్టార్టప్ పెట్టిన వెంటనే డబ్బు వస్తుందనే భ్రమల్లో ఉండొద్దు. అలా అనుకుంటే… ఎదగడం కష్టం. కస్టమర్లు సంతోషంగా ఉంటే… డబ్బు అదే వస్తుంది . వ్యాపారంలో ఔదార్యం కూడా అవసరమే.

రెండో స్టార్టప్ 

ఇది నా తొలి స్టార్టప్ జర్నీ. చాలా మందికి ఇలాంటి అనుభవమే ఎదురయ్యి ఉండొచ్చు. తొలి స్టార్టప్ ఫెయిల్ అవ్వడంతో మరో స్టార్టప్ మొదలుపెట్టాను. ఇప్పుడు బాగా కలిసివస్తోంది. ఈ స్టార్టప్ లో కొంత విజయం సాధించాను. కస్టాల్లో ఉన్న స్టార్టప్స్ ను ఆదుకుంటున్నాను.   

ఇదీ సంగతి.. ఇక ఉంటాను..

ఇట్లు..

ప్రదీప్ గోయల్  

                       

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags