సంకలనాలు
Telugu

బిల్లింగ్ సేవలే టాప్ నోట్‌ప్యాడ్ భవిష్యత్తు !

చిన్న కంపెనీలకు ఫైనాన్షియల్ టూల్స్ అందించే స్టార్టప్సీడ్ ఫండింగ్‌పై గంపెడాశలుపేపర్‌లెస్ బిల్లింగ్‌తో పర్యావరణంపై అవగాహనతక్కువ ధరతోనే నాణ్యమైన సేవలు

ashok patnaik
13th Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

భాగ్యనగరంలో ఇప్పుడిప్పుడే మొదలైన స్టార్టప్ కల్చర్ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారీ దంపతులు. కంపెనీల పేమెంట్స్‌ను ఆన్‌లైన్ ద్వారా పే చేయడానికి టూల్‌ని డెవలప్ చేశారు. ఎలాంటి తలనొప్పులు లేకుండా బిల్ పేమెంట్స్ చేయాలంటే టాప్ నోట్ ప్యాడ్ వాడితే సరిపోతుందని ధీమాగా చెప్తున్నారు.

“స్టార్టప్ కంపెనీలకు పెద్ద పెద్ద ఆఫీసులు, భారీగా హంగులూ, ఆర్భాటాలు ఉండవు. అకౌంట్లు ఇతర ఫైనాన్షియల్ అవసరాలకు అధిక మొత్తంలో ఖర్చు పెట్టడం వారికి కష్టమైన పని. కానీ బిల్ పేమెంట్స్ లాంటివాటిపై పారదర్శకత కంపల్సరీ. ఇదే మా స్టార్టప్ ప్రారంభించడానికి కారణం” అని మహేష్ కుమార్ సోనీ చెప్పారు. మహేష్ టాప్ నోట్ ప్యాడ్ కు కోఫౌండర్, సిఈఓగా వ్యవహరిస్తున్నారు.

ఫౌండర్లు మహేష్ సోని,లవీన్ సోని

ఫౌండర్లు మహేష్ సోని,లవీన్ సోని


స్టార్టప్ ఫర్మ్ అయినా మరే ఇతర మల్టీనేషనల్ కంపెనీ అయినా భవిష్యత్ అవసరాల కొరకు అకౌంటింగ్ చాలా ముఖ్యమైనది. ఫ్యూచర్‌లో ఫండింగ్ రావాలన్నా లేదా బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ విషయాలన్నీ పక్కాగా ఉండాలి. ఇలాంటి ఫైనాన్స్ సొల్యూషన్స్ అందిస్తోంది టాప్ నోట్ ప్యాడ్. ఇన్ వాయిస్‌తో పాటు ఇతర బిల్లులను సులువైన పద్దతిలో చేసే టూల్ ఇది. స్టార్టప్ కంపెనీలు https://topnotepad.com/ క్లిక్ చేసి లాగిన్ అయితే తర్వాత అన్ని పనులూ నోట్ ప్యాడ్ చూసుకుంటుంది. టాప్ నోట్ ప్యాడ్ లాంటి కాన్సెప్ట్‌తో మన దేశంలో క్విక్ బుక్స్ పనిచేస్తోంది. కెనడాకు చెందిన ఫ్రెష్ బుక్స్ డాట్ కామ్ , ఆస్ట్రేలియాకు చెందిన జెరో డాట్ కామ్ ఇదే కాన్సప్ట్ పై పనిచేస్తున్నాయి. అయితే టాప్ నోట్ ప్యాడ్ చిన్న తరహా, స్టార్టప్ కంపెనీలకు పనిచేస్తుంది. మా టార్గెట్ కస్టమర్లు కూడా వారే. ఇదే మాలాంటి కాన్సప్ట్ పై పనిచేసే వారికి మాకు ఉన్న తేడా అని చెప్పుకొచ్చారాయన.

టాప్‌ నోట్‌ప్యాడ్ కాన్సెప్ట్

చిన్న మధ్యతరహా సంస్థలకు టాప్ నోట్‌ప్యాడ్ డాట్ కామ్ అనేది వెబ్ ఆధారిత సాఫ్ట్ వేర్. ఆన్‌లైన్ ఇన్ వాయిసింగ్, ఖర్చులకు సంబంధించిన ట్రాకింగ్, ఇతర ఫైనాన్స్ మేనేజ్మెంట్ పనులు దీని ద్వారా చేసుకొవచ్చు. అకౌంటింగ్‌తోపాటు బిజినెస్‌ను మేనేజ్ చేయడమే దీని ప్రధాన లక్ష్యం. అన్నింటికి ఒక పరిష్కార మార్గంగా దీన్ని మనం చూడాలని మహేష్ చెప్పుకొచ్చారు.

ఒన్ స్టాప్ సొల్యూషన్

టాప్ నోట్ ప్యాడ్‌ను ట్రై చేయడానికి 14రోజుల ఫ్రీ ట్రయల్‌ని ఇస్తున్నారు. ఆ తర్వాత వివిధ ప్లాన్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ సర్వీసు కోసం రోజుకి 3రూపాయిలు ఖర్చు చేసే తాహతు ఉంటే చాలంటున్నారు మహేష్. కస్టమర్ డాటా బేస్, కంపెనీ ఖర్చులు, ఇతర విషయాలన్నింటికి ఓ సిఆర్ఎమ్ టూల్‌గా ఇది ఉపయోగపడుతుంది. ప్రాజెక్టు, పే రోల్ మేనేజ్మెంట్ కు సంబంధించిన అకౌంటింగ్,ఇన్వెంటరీకి ఇది వన్ స్టాప్ సొల్యూషన్ అని వివరించారాయన.

టాప్ నోట్‌ప్యాడ్ టీం

లవీన్ సోని... కంపెనీకి కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. ఆరేళ్లు సాఫ్ట్‌వేర్ ప్రొగ్రామింగ్‌లో అనుభవం ఉన్న ఆమె ఈ మేనేజ్‌మెంట్‌ టూల్‌ని డెవలప్ చేశారు. PHP, HEML, SQL లాంటి టెక్నికల్ వ్యవహారాలపై పూర్తి స్థాయి పట్టుంది లవీన్ సోనీకి. లవీన్ భర్త మహేష్‌కు బిజినెస్ అనలిస్టుగా తొమ్మిదేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈ-కామర్స్, బ్యాంకింగ్ డొమైన్లపై పనిచేశారు. డాటా బేస్ కాన్సెప్టులపై పూర్తి స్థాయి అవగాహన ఉంది. ప్రస్తుతానికి వీరితో పాటు కొంతమంది ఇంటర్న్స్ కూడా టాప్ నోట్ ప్యాడ్‌లో పనిచేస్తున్నారు.

ఫ్యూచర్ ప్లాన్స్

ఈఏడాది మార్చి 27న లాంచ్ అయిన టాప్ నోట్ ప్యాడ్ ఇప్పటి వరకూ 500లకు పైగా సైనప్స్‌తో ముందుకు దూసుకు పోతోంది. ప్రస్తుతానికి ఇది పెద్ద నంబర్ కాకపోవచ్చు. ఆరు నెలలు కూడా పూర్తి కాకుండా ఈ స్థాయిలో స్టార్టప్ కంపెనీలకు మద్దతివ్వడం ఓ శుభ పరిణామే అంటున్నారు ఈ యువ జంట. అయితే మరింత భారీగా మార్కెట్లోకి వెళ్లాలనే ఆలోచనలో ఉంది. బూట్ స్ట్రాప్ కంపెనీ అయిన మా స్టార్టప్ సీడ్ ఫండింగ్ చేస్తే మరింత మెరుగైన ఫలితాలు చూపిస్తుందని మహేష్ ముగించారు.


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags