సంకలనాలు
Telugu

సౌరవిద్యుత్ వ్యాప్తికి 'ఇన్‌విక్టస్ సౌర్ ఊర్జా'

వ్యాపారంతోపాటే ప్రకృతికి మేలు చేసే స్టార్టప్సౌర విద్యుత్ రంగంలో కొత్త కాన్సెప్ట్బిల్ట్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుఉపయోగించుకున్న కరెంటుకు డబ్బు కడితే చాలంటున్న ఇన్‌విక్టస్

Krishnamohan Tangirala
8th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కొన్నేళ్ల క్రితం ఐదుగురు స్నేహితులు తమ సొంతూరు కోల్‌కతాలో కలిసి... పునురుత్పాదక శక్తి వనరుల రంగంలో ఓ సొంత వెంచర్ ప్రారంభించాలని భావించారు.

“ మేమే బాస్‌లుగా ఉండేందుకు ఓ కంపెనీ ప్రారంభించాలని అనుకున్నాం. ఏదైనా ప్రత్యేకంగా, విభిన్నంగా ఉండడంతోపాటు మమ్మల్ని ధనవంతులుగా చేస్తూ సమాజానికి మేలు చేసేలా మా కంపెనీ ఉండాలని అనుకున్నాం” అన్నారు అభిషేక్ ప్రతాప్ సింగ్. 

ఈయన ఇన్‌విక్టస్ సౌర్‌ఊర్జా సహవ్యవస్థాపకుడు. వివిధ భేటీల తర్వాత స్నేహితులంతా కలిసి సౌర విద్యుత్ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. ఇన్‌విక్టస్ సౌర్ ఊర్జా ప్రారంభం కోసం వీరు తమ ఉద్యోగాలను కూడా వదిలేశారు. ఈ సంస్థ కోల్‌కతాలో సోలార్ పవర్‌కు సంబంధించిన సేవలు అందిస్తోంది.

ఇన్‌విక్టస్ సౌర్ ఊర్జా వ్యవస్థాపకులు

ఇన్‌విక్టస్ సౌర్ ఊర్జా వ్యవస్థాపకులు


పర్యావరణంపై పెద్దగా అవగాహన లేని ప్రాంతం పశ్చిమ బెంగాల్ అంటారు అభిషేక్. అందుకే అక్కడ సౌర విద్యుత్ సంస్థ ఏర్పాటు చేసినట్లు చెబ్తారు. పునరుత్పాదక వనరులను ఉపయోగించుకోవడంలో పశ్చిమ బెంగాల్‌లో అంత వేగం లేదంటారు ఆయన. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోల్‌కతా, సాల్ట్ లేక్, న్యూ టౌన్‌లలో రూఫ్‌టాప్‌లపై సోలార్ ప్యానెళ్లను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు ప్రత్యేక పాలసీని రూపొందించింది. అయితే ఇది దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ వినియోగం పెంచేందుకుగానూ... కేంద్ర కొత్త, పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రమాణాలకు అనుగుణంగా లేదు.

ప్రస్తుతం ఇన్‌విక్టస్‌లో 22 మంది పని చేస్తున్నారు. ఇందులో ఇద్దరు మెంబర్లకు ఈ రంగంలో 40ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తమ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు వీరు కృషి చేస్తున్నారు. రూఫ్‌టాప్ ప్యానెళ్లకు కన్సల్టెన్సీ, ఇన్‌స్టాలేషన్ సర్వీసులు నిర్వహిస్తున్నారు. 

“మేము చిన్న,మధ్య తరహా పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలకు సేవలందిస్తున్నాం. రెన్యూవబుల్ ఎనర్జీ విషంయలో కేంద్రం కఠిన నిబంధనలు విధించడంతో... కంపెనీలు కూడా సోలార్ ప్యానెళ్ల కోసం ముందుకొస్తున్నాయి”- అభిషేక్.
image


“వేల కొద్దీ కంపెనీలు, వాణిజ్య వినియోగదారులు విద్యుత్ కోసం డీజిల్ కాప్టివ్ ప్లాంట్లపై ఆధారపడ్డారు. డీజిల్ రేట్లు ఎప్పుడూ పెరగడమే కాకుండా.. ఈ ధర నిర్ణయంపై కేంద్రం నియంత్రణ కూడా వదిలేసింది. దీంతో ఈ కాప్టివ్ పవర్ ప్లాంట్ల నిర్వహణ ఖర్చులు భరించలేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ సమస్యతోపాటు డీజిల్ ప్లాంట్ల వినియోగం కారణంగా పర్యావరణంలోకి ఎంతో కాలుష్యం చేరుతోంది”అంటున్నారు అభిషేక్.

పలు మోడళ్లలో సోలార్ సర్వీసులు అందిస్తుంది ఇన్‌విక్టస్. అందులో BOOTకూడా ఒకటి. సౌర విద్యుత్‌ను ఓ సేవగా అందించడమే లక్ష్యంగా కంపెనీలు, వాణిజ్య సంస్థలకు బిల్ట్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. మేం సోలార్ ప్లాంట్ నిర్మించడమే కాదు, దాన్ని స్వంతం చేసుకుని, నిర్వహించి, ఇన్‌స్టాల్ చేసి, రన్నింగ్‌లోకి తీసుకొస్తాం. కస్టమర్లు కేవలం ఉపయోగించుకునే విద్యుత్‍‌కు మాత్రమే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది.

image


“సౌర విద్యుత్ కోసం చాలా పెద్ద మొత్తంలో కేపిటల్ అవసరం. అందుకే ప్రజలు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. దీనికి పెట్టే పెట్టుబడిని బంగారం, షేర్ మార్కెట్‌, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులతో పోల్చుకుంటారు. రిటర్నులు రానిదానిపై పెట్టుబడి అనవసరం అని భావిస్తారు”-అభిషేక్.
image


కోల్‌కతా, సాల్ట్ లేక్, న్యూటౌన్, రాజ్‌హారత్ ప్రాంతాల్లో సోలార్ ఎనర్జీ ఉపయోగాలపై ప్రచారం చేసేందుకుగాను ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది ఇన్‌విక్టస్.

“సోషల్ మీడియా, పాంప్లెట్ల పంపకం ద్వారా ప్రజల్లో అవగాహన పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. జనాలు పట్టించుకునే విషయమైన కరెంటు బిల్లులు తగ్గుతాయని, వారు పెద్దగా లెక్క చేయని అంశమైన పర్యావరణ కాలుష్యంపైనా ప్రచారం చేస్తున్నామం”టారు అభిషేక్.

తాము ఆశించిన వేగం ఇంకా అందుకోలేదంటున్నారు ఇన్‌విక్టస్ ప్రతినిధులు. విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఐటీ కంపెనీలు, అపార్ట్‌మెంట్లు, కాలనీలతో ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తోందీ సంస్థ. 

“మేం నెట్ మీటరింగ్ విధానాన్ని ఉపయోగిస్తున్నాం. ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌కు వారి ద్వారా వచ్చిన విద్యుత్‌ను క్రెడిట్ చేస్తాం. కొన్నిసార్లు కస్టమర్ అవసరాలకు మించి సౌర విద్యుత్ ఉత్పత్తి అవ్వచ్చు. ఆ అదనపు మొత్తం మాకు చేరుతుంది. మేం వారి రూఫ్‌టాప్‌లను ఉపయోగించుకున్నందుకు ఆ మొత్తాన్ని అద్దెగా తిరిగి వారికే చెల్లిస్తాం”- అభిషేక్. దీంతోపాటే పెట్టుబడి సేకరణ కూడా సవాలే అంటోంది ఇన్‌విక్టస్. “వెంచర్ కేపిటల్ ఫండింగ్ కోసం చూస్తుంది. మేం నిర్వహించే మోడల్‌కు భవిష్యత్తులో చాలా డిమాండ్ ఉంటుందని మా ఆలోచన. బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలకూ విస్తరించే యోచన ఉంది.య అయితే దీని కోసం నిధులు పెద్ద మొత్తంలో అవసరమవుతాయి” అంటున్నారు అభిషేక్.

సోలార్ తరహా పునరుత్పాదక శక్తి వనరులపై త్వరలో మనం అందరం పెట్టుబడి చేయాల్సిన రోజులు రానున్నాయి. సోలార్ ప్యానెళ్ల తయారీకి సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ వంటి కాస్టిక్ కెమికల్స్ కావాలి. వీటి తయారీకి కరెంటు, నీరు కావాలి. అలాగే పెద్ద మొత్తంలో వ్యర్ధాలు కూడా ఏర్పడతాయి. అయితే సోలార్ ప్యానెళ్ల తయారీ, నిర్వహణకు ఇది పెద్ద అడ్డంకేం కాదు. 100శాతం పర్యావరణ హితమైన విధానం ఇంకా రూపొందించాల్సి ఉంది. అయితే ఈ రంగంపై పెట్టబడులు పెట్టడం, వ్యాపారం నిర్వహించడమంటే... లాభాల కోసం వర్తకం చేయడమే కాదు... దీర్ఘ కాలంలో అంతోఇంతో పర్యావరణానికీ సహాయం చేస్తున్నట్లే అనే విషయం మాత్రం గుర్తుంచుకోవాలి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags