సంకలనాలు
Telugu

పుస్త‌క ప్రియుల కోసం బుక్స్‌ను అద్దెకు ఇస్తున్న ఇండియా రీడ్స్‌

భార‌త్‌లో పుస్త‌కాల‌ను అద్దెకు అంద‌జేస్తున్న ఇండియా రీడ్స్‌దేశ‌వ్యాప్తంగా 500 న‌గ‌రాల్లో సేవ‌లు, మ‌రిన్ని ప‌ట్ట‌ణాల‌కు విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక‌లుఈ-బుక్ రెంట‌ల్ సెలూన్‌ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు12 వేల‌కుపైగా క‌స్ట‌మ‌ర్లు.. నెల‌కు రూ. 30 ల‌క్ష‌ల‌కుపైగా ఆదాయం

GOPAL
17th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ.. మంచి పుస్త‌కం కొనుక్కో.. తెలుగులో ఓ మంచి కొటేష‌న్‌. పుస్త‌క ప‌ఠ‌నమంత మంచి హాబీ ఇంకోటీ లేదు. పుస్త‌కం క‌న్నా మంచి మిత్రుడు మ‌రొక‌రు ఉండ‌రంటారు. మంచి పుస్త‌కాల‌ను కొనుగోలు చేసి, చ‌దివి ఇంట్లోని లైబ్ర‌రీలో పెట్టుకుంటున్న‌ప్ప‌టికీ అన్నీ బుక్స్‌ను కొనుక్కోవ‌డం సాధ్యం కాదు. అందుకే బుక్‌ను ఇలా చ‌ద‌వి అలా ఇచ్చేస్తారు. అది అకాడ‌మీ బుక్ అయినా, సాధార‌ణ సాహిత్య పుస్త‌క‌మైనా.. కొంత‌కాలానికే అవ‌స‌రం ప‌డుతుంది. ఒకే బుక్‌ను ప‌దే ప‌దే ఎవ‌రూ చ‌ద‌వ‌రు (కొన్ని పుస్త‌కాల‌ను మిన‌హాయించి). 

దీంతో పుస్త‌క ప్రియుల‌ను అభిరుచిని, ఆలోచ‌న‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఐదుగురు యువ‌కులు ప్ర‌ణిల్ భ‌ఫ్నా, గుంజ‌న్ వేద‌, శ్రావ‌ణ్ ఛ‌జెర్‌, మ‌హేంద్ర మెహ‌తా, శ్రేయాన్స్ మెహ‌తా స‌రికొత్త కాన్సెప్ట్‌ను రీడ్ అండ్ రిట‌ర్న్ ప్రాసెస్‌ను తెర‌మీద‌కు తెచ్చారు. రెంట‌ల్ సొల్యూష‌న్ ప్లాట్‌ఫామ్ ఇండియా రీడ్స్‌ను ప్రారంభించారు. 500కు పైగా న‌గ‌రాల్లో కాలేజీ టెక్ట్స్‌బుక్స్‌, కాంపిటిటీవ్ ఎగ్జామ్స్‌, ఫిక్ష‌న్‌, నాన్ ఫిక్ష‌న్‌, సెల్ఫ్ హెల్ప్‌, టెక్నాల‌జీ, మేనేజ్‌మెంట్‌వంటి రంగాల్లో 3.5 ల‌క్ష‌ల పుస్త‌కాల‌ను అందుబాటులో ఉంచింది ఇండియా రీడ‌ర్స్‌.

పుస్త‌కాల లైబ్ర‌రీ

పుస్త‌కాల లైబ్ర‌రీ


సాధార‌ణ వ్య‌క్తుల‌తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మ‌హీంద్రా రైస్‌, యాక్సిస్ బ్యాంక్‌, జెన్‌పాక్ట్‌లాంటి కార్పొరేట్‌సంస్థ‌ల‌కు కార్పొరేట్ రీడింగ్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఏర్ప‌ర్చింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఇండియా రీడ‌ర్స్‌కు 15 వేల‌ మందికి పైగా క‌స్ట‌మ‌ర్లున్నారు. 

" ప్ర‌తినెలా 12 వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. మంత్లీ రెవెన్యూ రూ. 30 ల‌క్ష‌ల‌కు పైనే ఉంది. దేశ‌వ్యాప్తంగా ఈ - లైబ్ర‌రీని ఉప‌యోగించుకునేందుకు వీలుగా మేం టెక్నాల‌జీని ఉప‌యోగించాం. జ‌న‌ర‌ల్ రీడింగ్ కోసం కార్పొరేట్ సెక్టార్‌ను, అకాడ‌మీ మార్కెట్ కోసం స్టూడెంట్స్‌ను టార్గెట్ చేశాం " అంటారు ఇండియా రీడ్స్ కో ఫౌండ‌ర్ .

దేశ‌వ్యాప్తంగా చిన్న ప‌ట్ట‌ణాలు, గ్రామాల‌కు కూడా త‌మ వ్యాపారాన్ని విస్త‌రించాల‌ని సంస్థ భావిస్తోంది. అలాగే కార్పొరేట్ సైడ్ మ‌రింత మంది క్ల‌యింట్స్‌ను ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. బీ2బీ క్ల‌యింట్స్ ద్వారానే రెవెన్యూ ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ బిజినెస్ టు క‌స్ట‌మ‌ర్స్ ద్వారా కూడా డ‌బ్బులు సంపాదించాల‌నే లక్ష్యంతో ఉంది . 90 వేల మంది కార్పొరేట్ పార్ట్‌న‌ర్‌షిప్ యూజ‌ర్లుండ‌గా, 60 వేల మంది సాధార‌ణ రీడ‌ర్లు.

ఐదేళ్ల క్రితం ఆరంభం

పుస్త‌క ప్రియుల‌కు కేంద్ర‌స్థాన‌మైన నేష‌న‌ల్ క్యాపిట‌ల్ రీజియ‌న్ (ఎన్‌సీఆర్‌)లోని నోయిడాలో ఇండియా రీడ్స్ స్టార్ట‌ప్ కంపెనీ 2010లో ఆరంభ‌మైంది. ప్ర‌ణీల్‌, శ్రావ‌ణ్‌, మ‌హేంద్ర ఐఐటీ ముంబై పూర్వ విద్యార్థులు కాగా, శ్రేయాన్స్ మ‌ణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు.

"విలువ క‌ట్ట‌డం ఏ స్టార్ట‌ప్‌కైనా క‌ష్ట‌మైన ప‌నే. ఒక‌టి మార్కెట్‌లో న‌మూనాను ప‌రీక్షించ‌డం, రెండోది విలువ క‌ట్ట‌డం. విలువ క‌ట్ట‌డానికి వ‌స్తే ప‌రిస్థితులు వేగంగా మారిపోతుంటాయి. మేం సంస్థ‌ను ప్రారంభించాల‌నుకున్న‌ప్పుడు ఎన్నో స‌వాళ్లు. వాట‌న్నింటిని ప‌రిష్క‌రించి, అంద‌రి ఆమోదంతో ప్రారంభించాం. ఇప్పుడు మార్కెట్‌తోపాటు, స్టార్ట‌ప్ టాలెంట్‌ను సొంతం చ‌ేసుకోవ‌డం కోసం ప్ర‌య‌త్నిస్తున్నాం " అని ప్ర‌ణీల్ వివ‌రిస్తారు.

ఉద్యోగుల‌ను ఎంపిక‌చేసుకునేందుకు ఈ నోయిడా బేస్డ్‌ స్టార్ట‌ప్ కంపెనీ ముఖ్యంగా బ్యాచ్‌మేట్స్‌, కాలేజీ పూర్వ విద్యార్థుల రిఫ‌రెన్స్‌ల మీదే ఆధార‌ప‌డుతోంది. కొత్త‌వారిని ఆక‌ట్టుకునేందుకు ఇండియా రీడ్స్ కాలేజీ వాతావ‌ర‌ణాన్ని ఆఫీస్‌లో నెల‌కొల్పింది. నైపుణ్యం క‌లిగిన యువ‌కుల కోసం ఏంజెల్‌ లిస్ట్‌లాంటి పోర్ట‌ల్స్‌పై కూడా ఆధార‌ప‌డుతోంది. "ఈ-టైల్ రంగంలో మేం ఇప్ప‌టికీ అభివృద్ధి చెందుతున్న ద‌శ‌లోనే ఉన్నాం. కానీ కార్పొరేట్ల ద్వారా స్థిర‌మైన‌, లాభ‌దాయ‌క‌మైన ఆదాయం వ‌స్తోందని ప్ర‌ణీల్ వివ‌రించారు. ఎడ్యుకేష‌న్ మార్కెట్‌ను చేరుకునేందుకు కోటా లాంటి ఇన్‌స్టిట్యూట్‌ల‌తో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం ఏర్ప‌ర్చుకున్న‌ది ఇండియా రీడ్స్ సంస్థ‌. అలాగే కార్పొరేట్స్ జ‌న‌ర‌ల్ రీడింగ్ కోసం ఓ పూల్‌ను కూడా క్రియేట్ చేసింది.

image


గ‌ట్టి పోటీ..

కాపీకితాబ్‌, డోర్‌స్టెప్‌బుక్స్‌, లైబ్ర‌రీవాలా లాంటి సార్ట‌ప్‌ల‌తో ఇండియారీడ్స్ ప‌టీప‌డుతోంది. భార‌తలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న షేరింగ్ ఎకాన‌మీ విష‌యంలో వ్య‌వ‌స్థ‌ాపకులు బుల్లిష్‌గానే ఉన్నారు. "దేశ షేరింగ్ ఎకాన‌మీ నిల‌క‌డ‌గా, అందుకునేందుకు వీలుగానే ఉంటుంద‌ని మా న‌మ్మ‌కం" అని అంటారు ప్ర‌ణీల్‌. ఇండియా రీడ్స్ ఇప్పుడు మొబైల్ అప్లికేష‌న్ యాప్‌ను కూడా అభివృద్ధి చేయ‌డంపై దృష్టిసారించింది. అలాగే ఈ-బుక్స్ సెలూన్‌ను కూడా ప్రారంభించాల‌నుకుంటున్న‌ది. అలాగే ఇత‌ర న‌గ‌రాల్లో కూడా విస్త‌రించేందుకు మ‌రిన్ని నిధుల‌ను స‌మీక‌రించుకోవాల‌ని భావిస్తున్న‌ది.

విస్తృత‌మైన మార్కెట్‌..

దేశంలో అన్ని రంగాల్లో షేరింగ్ ఎకాన‌మీని పంచుకునే ప్ర‌క్రియ రోజు రోజుకు పెరుగుతున్న‌ది. క్యాబ్స్ నుంచి అప్పెర‌ల్స్, ఫ‌ర్నిచ‌ర్‌ వ‌ర‌కు అన్ని అద్దెకు ల‌భిస్తున్నాయి. ప్రైజ్‌వాట‌ర్ కూప‌ర్ అంచ‌నా ప్ర‌కారం ప్ర‌పంచ షేర్డ్ ఎకాన‌మీ 15 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. 2025క‌ల్లా అది 335 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరొచ్చ‌ని అంచ‌నా. ఏడాది కాలంగా ఈ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పంచుకునేందుకు పోటీ ఎక్కువైంది. రెంట్‌మాజో, జూమ్‌కార్‌, ఎటాషీ, స్మార్ట్‌ముంబైక‌ర్‌లాంటి స్టార్ట‌ప్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. అలాగే పెట్టుబ‌డిదారులు కూడా పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. జూమ్‌కార్‌లో స్కీయోయియా క్యాపిట‌ల్ 8 మిలియ‌న్ డాల‌ర్ల‌ను పెట్టుబ‌డిగా పెడితే, ఎటాషీ ఐడియా లెవ‌ల్‌లోనే రూ. 5 కోట్ల పెట్టుబ‌డుల‌ను సమీక‌రించ‌గ‌లిగింది.

ప్ర‌పంచ దేశాల‌తో పోలిస్తే భార‌త్‌లో షేరింగ్ ఎకాన‌మీ అంత లాభ‌దాయ‌కంగా లేదు. భార‌తీయులు షేరింగ్ కంటే పెట్టుబ‌డులు పెట్టేందుకే ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో షేరింగ్ ఎకాన‌మీ కాన్సెప్ట్‌లో ఉన్న బిజినెస్ మోడ‌ల్స్‌ను బ్రేక్ చేయ‌డంలో స్టార్ట‌ప్‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నాయి. ఏదేమైనా ఇండియారీడ్స్ మ‌రింత స‌క్సెస్ కావాల‌ని ఆశిద్దాం..

వెబ్‌సైట్‌: http://www.indiareads.com

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags