సంకలనాలు
Telugu

అదిరిపోయే బిజినెస్ ఐడియాతో ఆంట్రప్రెన్యూర్‌గా మారిన డాక్టర్

 జనం మైండ్ సెట్ చుట్టూ అల్లిందే ఫాస్ డీల్ స్టార్టప్

team ys telugu
30th Dec 2016
14+ Shares
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఎంబీబీఎస్ చేస్తే స్టెత్ మాత్రమే పట్టాలని రూల్ ఉందా? బీటెక్ చేసి కంప్యూటర్ ముందే కూర్చోవాలనేది సంప్రదాయమా? అస్సలు కాదు. మెడిసిన్ చదివి టెక్ స్టార్టప్ పెట్టొచ్చు. ఇంజినీరింగ్ చేసి కోళ్ల ఫామ్ నడపొచ్చు. చదవిన దారిలోనే నడవాలనే పాతకాలం సూత్రాలను నేటి యువత చెరిపేస్తోంది. ఆ కోవలోకి వస్తారు ఫాస్ డీల్ ఫౌండర్ అభిషేక్.

డాక్టర్ల ఫ్యామిలీలో పుడితే డాక్టరే కావాలి. ఇంజినీర్ల ఇంట్లో పిల్లలు ఇంజినీర్లే అవ్వాలి. పేరెంట్స్ ఆలోచనా ధోరణిలో ఇంకా మార్పురాలేదు. అయినా సరే తల్లిదండ్రులను ఎదురించి చేయాలనుకున్నది చేసేవాళ్లు చాలాకొద్దిమంది ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో డాక్టర్ అభిషేక్ ఒకరు.

మహబూబ్‌ నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన అభిషేక్.. గాంధీ మెడికల్ కాలేజీ స్టూడెంట్. 2004 బ్యాచ్. మెడిసిస్ కంప్లీట్ చేసి ఐదేళ్లయింది. కానీ ఎందుకో వైద్య రంగంమీద అంతగా ఆసక్తిలేదు. మనసంతా వ్యాపారం మీదకి లాగుతోంది. పేరెంట్స్ ఒప్పుకోలేదు. వాళ్లను కన్విన్స్ చేయడానికి రెండేళ్లు పట్టింది. ఆ క్రమంలోనే ఒక మల్టీనేషన్ హెల్త్ ఇన్ష్యూరెన్స్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేశాడు. 60 మంది ఉద్యోగులకు బాస్‌గా అభిషేక్ కు బిజినెస్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. అలా వేసిన అడుగులు.. ఫాస్ డీల్ స్టార్టప్ ఏర్పాటు చేసేదాకా వడివడిగా నడిచాయి.

image


ఎలా వచ్చింది ఐడియా

చూస్తున్నాం.. ఈ కామర్స్ ఎలా దూసుకుపోతోందో. ఆన్ లైన్ మార్కెట్ ఆకాశంలో విహరిస్తుంటే.. లోకల్ స్టోర్స్ మాత్రం ఇంకా ఎందుకు భూమ్మీదనే తారాడుతున్నాయి. ఇంకా పాంప్లెట్, వాల్ పోస్టర్లు, టెక్స్ట్ యాడ్ చుట్టే తిరుగుతున్నాయి. ఆన్ లైన్‌ వాసనే లేకుండా శుద్ధ సంప్రదాయబద్దంగా బిజినెస్ చేస్తున్నాయి. ఇలా అయితే లోకల్ స్టోర్ పుంజుకునేదెప్పుడు? వాళ్లూ ఆన్ లైన్ తో పోటీపడేదెప్పుడు? అందుకే అసంఘటితంగా ఉన్నవాటిని ఏకంచేసి వాటికొక ప్లాట్ ఫాం తయారు చేస్తే ఎలా వుంటుంది? ఈ ఆలోచనల్లోంచి పుట్టిందే ఫాస్ డీల్ స్టార్టప్.

డీల్ ఎలా...?

డిస్కౌంట్. ఈ మూడక్షరాల పదం బిజినెస్‌ కి ఆయువుపట్టు. డీల్ ఉంటే చాలు జనం చలో అంటారు. అదే ఆఫర్ లేకుంటే.. సారీ అని మొహం చాటేస్తారు. గోల్డు నుంచి బోల్టు దాకా ఇదే వ్యాపార సూత్రం. ఈ తరహా జనం మైండ్ సెట్ చుట్టూ అల్లిందే ఫాస్ డీల్ స్టార్టప్. ఎక్కడ ఎలాంటి ఆఫర్ ఉందో తెలిపే వేదికలు చాలానే ఉండొచ్చు. కానీ చూసిన చోటినుంచే నచ్చిన డీల్ కొనుగోలు జరగడమన్నది కష్టం. అలాంటి కష్టాన్ని ఇష్టంగా మలిచింది ఫాస్ డీల్.

అంటే ఏం లేదు సింపుల్.. ఫాస్ డీల్ బ్రౌజ్ చేస్తే(యాప్/వెబ్) ఫుడ్, సెలూన్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఫిట్ నెస్, మూవీస్ ఇలా సెంగ్మెంట్ల వారీగా ఎక్కడ ఎలాంటి ఆఫర్ ఉందో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మాదాపూర్ ఏరియాలోని ఒక హోటల్లో బిర్యానీ విత్ మాక్ టెయిల్ బీభత్సమైన ఆఫర్ ఉందనుకోండి.. నచ్చితే వెంటనే కన్ఫమ్ చేసుకోవచ్చు. అన్ లైన్ లో బిల్ పే చేయగానే మొబైల్ కి కన్ఫమ్ మెసేజ్ కోడ్ వస్తుంది. సంబంధింత హోటల్ కి వెళ్లి ఆ కోడ్ చూపిస్తే చాలు.. వాళ్లు దాన్ని రిడిమ్ చేసుకుని సర్వ్ చేస్తారు. ఇలా పిజా నుంచి హెయిర్ కట్ దాకా ఆఫర్లే ఆఫర్లు.

image


మొదట 10 సంస్థలతో మొదలైన బిజినెస్ ఇప్పుడు 400 మర్చెంట్లతో దూసుకుపోతోంది. ఐఓఓస్, యాండ్రాయిడ్ యాప్ వెర్షన్ తో పాటు వెబ్ వెర్షన్ కూడా ఉంది. వందశాతం ట్రాన్సాక్షన్లతో ట్రిమిండస్ గ్రోథ్ సాధించింది. ప్రత్యేకంగా న్యూ ఇయర్ ఈవెంట్ సందర్భంగా ఈ వారం రోజుల్లో బిజినెస్ మరింత ఊపందుకుంది. నోవాటెల్, తాజ్ డెక్కన్, రాడిసన్, పార్క్ లాంటి హోటళ్లతో టై అప్ అయి.. ఈవెంట్ టికెటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్ని ప్రముఖ హోటల్స్ కు అఫీషియల్ టికెట్ పార్ట్‌ నర్ గా వ్యవహరిస్తున్నారు.

ఫాస్ డీల్‌ లో 9మంది స్టాఫ్ ఉన్నారు. డాక్టర్ అభిషేక్‌ తమ్ముడు అనిరుధ్‌ టెక్నికల్ సైడ్ చూసుకుంటాడు. అభిషేక్ ఆపరేషన్స్ నిర్వహిస్తాడు. ఇప్పటికే నగరంలో వివిధ రంగాల్లోని హోటళ్లు, వ్యాపార సంస్థలు, ఈవెంట్ ఆర్గనైజర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పుడిప్పుడే అందరి నుంచి మంచి రెస్పాండ్ వస్తోంది. భవిష్యత్‌లో ఆఫ్‌లైన్‌ స్టోర్‌ ని ఆన్‌లైన్‌ ట్రాక్ మీదికి తేవాలనదే దానిపై స్టడీ చేస్తున్నారు. దానికి సంబంధిచిన ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఐటెం రెండు గంటల్లో డెలివరీ అయ్యేలా రూపకల్పన చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ వరకే పరిమితమైన ఈ సేవలు మరో ఏడాది నాటికి మరిన్ని నగరాలకు విస్తరించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. 

14+ Shares
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags