సంకలనాలు
Telugu

యాప్‌లకు యమా క్రేజ్ తెస్తామంటున్న కలియుగ రామ లక్ష్మణులు

యాప్‌వైపు యూజర్లను ఆకర్షించడం ఎలా ?మార్కెటింగ్‌ కోసం భారీగా వెచ్చించాలని అనుకుంటున్నారా ?గ్రోత్ కోసం హాకింగ్ చేయొచ్చని తెలుసా ?కోడింగ్ లేకుండానే హాకింగ్ టూల్ అందిస్తున్న ‘యాప్ వైరాలిటీ’

ABDUL SAMAD
30th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఓ షాంపూ వాడడంతో ఓ వ్యక్తి భుజం ఇన్ఫెక్షన్‌కు గురైందంటూ... ఓ ఫోటో ఇంటర్నెట్‌లో ఎంతగా హల్‌చల్ చేసిందో చాలామందికి తెలుసు. ఆ తర్వాత తెలిసింది ఇదో స్పామ్ పోస్ట్ అని. అయితే... ఆలోపే ఈ పోస్ట్ ఓ వైరస్‌లా చాలామంది జనాల మెదళ్లలోకి ఎక్కేసింది. ఇలాంటి వైరల్ పోస్టులు ఒక ఫోబియాలా పాకేస్తాయి. విగ్రహాలు పాలు తాగుతున్నాయి లాంటి మూఢనమ్మకాలు కూడా ఇలాగే ప్రజలను పరుగులు పెట్టిస్తాయి. ఏదైనా చెడువార్తలు కూడా ఇంత స్పీడ్‌గానూ సర్క్యులేట్ అయిపోతాయి.


ఈ తరహా పోస్టుల అంతరార్ధాన్ని తేలిగ్గానే అర్ధం చేసుకోవచ్చు. ఎంత త్వరగా వీలైతే... అంత స్పీడ్‌గా ఫేమస్ అవ్వాలి, పాపులర్ కావాలి, జనాల నోళ్లలో నానాలి. దీని వెనుక జనాల మైండ్‌సెట్‌ను ట్యూన్ చేసే సైన్స్ కూడా ఉందంటారు నిపుణులు. ఇలా ఒక పోస్ట్ ఇంతగా వైరస్ మాదిరిగా పాకినపుడు.. మరి యాప్‌కి ఎందుకు ఉపయోగించకూడదు ? మరి ఏదైనా ఒక అంశాన్ని బాగా పాపులర్ చేయడానికి ఇలా వైరల్ పబ్లిసిటీ ఎందుకు చేయకూడదు ? ఇదే ఆలోచన ఓ ఇద్దరికి వచ్చింది.

రామాయణంలో మనకు రామలక్ష్మణులు మనకు దేవుళ్లుగా దర్శనమిస్తారు. వారు చెప్పే వాటిని తూచా తప్పకుండా పాటించాలని మన దేశ ప్రజలు అనుకుంటారు. వాళ్లు చెప్పిన నీతులు, సూక్తులు ఇప్పటికీ చాలానే అమల్లో ఉన్నాయి. అంటే అవి జనాల్లోకి అంతగా నాటుకుపోయాయన్న మాట. ఇప్పుడు ఈ తరంలో.. కలియుగ రామలక్ష్మణులు... కొత్త కాన్సెప్ట్‌తో బయలుదేరారు. వీరు యాప్ వైరాలిటీ అనే కంపెనీని నెలకొల్పారు. ఒక్కసారిగా పబ్లిసిటీ సంపాదించేందుకు అవసరమైన ఐడియాలను డీకోడ్ చేసే సంస్థ ఇది.

రామ్ , లక్ష్మణ్ (వ్యవస్ధాపకులు)

రామ్ , లక్ష్మణ్ (వ్యవస్ధాపకులు)


“మేము సోదరులం, బ్లాగ్స్ నిర్వహించే వాళ్లం, ఇంకా చెప్పాలంటే స్టార్టప్‌లకు మేం బానిసలయిపోయాం. 2008నుంచి మేమద్దరం కలిసి పని చేస్తున్నాం. ఇప్పుడు మేం నిర్వహిస్తున్నది మా నాలుగో స్టార్టప్. సొంత వెంచర్స్ ప్రారంభించే ముందు.. ఒరాకిల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి మల్టీ నేషనల్ కంపెనీల్లో మేం పనిచేశాం”అని చెబుతున్నారు యాప్ వైరాలిటీ సహ వ్యవస్థాపకుడు లక్ష్మణ్ పాపినేని. ఈయన సోదరుడు రామ కోటేశ్వరరావు పాపినేని... ఈ సంస్ఖకు మరో కోఫౌండర్. “మేక్ఐడియాజ్ అనే బ్లాగింగ్ నెట్వర్క్, మామ్‌గ్రాసరీ.కాం అనే ఆన్‌లైన్ గ్రాసరీ స్టోర్లు... మా మొదటి స్టార్టప్‌లు ”అంటున్నారు లక్ష్మణ్.

తమ మూడో స్టార్టప్ గివ్అవే.ఎల్‌వై ను నిర్వహిస్తుండగా... యాప్ వైరాలిటీ ఆలోచన వచ్చింది ఈ రామలక్ష్మణులకు. వ్యాపారులు ఎలాంటి కోడింగ్ అవసరం లేకుండా... తమ కస్టమర్లకు క్షణాల్లో స్వీప్‌స్టేక్స్ అందించగలిగే అవకాశం కల్పించే సర్వీస్ గివ్అవే. “ మొబైల్ యాప్స్‌ సక్సెస్‌కు కూడా... ఓ పరిష్కారం చూడాలంటే చాలామంది వ్యాపారుల నుంచి మాకు అనేక అభ్యర్ధనలు అందాయి. వాటిలోనూ ఇలా స్వీప్‌స్టేక్స్ అందించగలిగ్ అవకాశాన్ని కల్పించాల్సిందిగా... మొబైల్ యాప్స్, థర్డ్ పార్టీ యాప్స్ డెవలపర్లు కోరార”ని చెప్పారు లక్ష్మణ్.

చాలా కంపెనీలు సిద్ధాంతపరంగా ఎదిగేందుకే ప్రయత్నిస్తున్నాయనే విషయాన్ని, కొంత రీసెర్చ్ తర్వాత తెలుసుకోగలిగారు సోదరులు. అభివృద్ధి ఆటంకపరచే హ్యాకర్స్ లాంటి పరిస్థితులు ఇప్పటికే స్థిరపడ్డ కంపెనీలకూ ఎదురవుతుంటాయి. దీన్ని ఎదుర్కునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంటాయి వ్యవస్థాగత కంపెనీలు. “ఇలా గ్రోత్ హ్యాకర్ ఏర్పాట్లు చేసుకోవడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఇలాంటి అవసరాలకు ఒక టూల్‌కిట్ అవసరమనే విషయాన్ని గుర్తించాం. అభివృద్ధి సాధించడం కోసమూ హ్యాకింగ్ చేయాలని భావించాం. అది కూడా ఎలాంటి కోడింగ్ అవసరం లేకుండా ఇది అందుబాటులోకి తెచ్చేందుకు యత్నించాం”అన్నారు లక్ష్మణ్.

“తమ యాప్‌లో వైరల్ ఫీచర్స్ ఉండేలా చూసుకోవాలంటే... అందుకు తగిన కిటుకులు అప్లై చేసేందుకు చాలా సమయం, పెట్టుబడి అవసరం. అయినా సరే యాప్ వైరాలిటీతో మేం ఓ సమస్యకు పరిష్కారం చూపాలని తలచా”మని చెప్పారు లక్ష్మణ్. స్థానిక పరిస్థితులు, యూజర్లను విభాగాలుగా చేయడం, టార్గెట్ కస్టమర్లను ఐడెంటిఫై చేసేందుకు.. యాప్ వైరాలిటీ ఏ/బీ టెస్టింగ్(స్టాటిస్టికల్ హైపోథిసిస్ టెస్టింగ్), ఇన్‌డెప్త్ అలనైటిక్స్ ఉపయోగిస్తుంది. ఏ విధానమైతే ఆయా వ్యాపారాలకు సరిపోతుందో అంచనా వేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది.

ఐదుగురు సభ్యులు గల హైద్రాబాద్ సంస్థ... యాప్ డౌన్‌లోడ్స్ ద్వారా సంఖ్య గణనీయంగా పెరగడానికి తోడ్పడుతుంది. యూజర్లకు యాప్ గురించి తెలిసేందుకు, సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసేలా చేస్తుంది. డౌన్‌లోడ్స్ ద్వారా ఇతరులను ప్రభావితం చేయగల వ్యక్తులను గుర్తిస్తుంది.

ప్రస్తుతం ఇలా యాప్‌లపు పబ్లిసిటీ చేసే ఏకైక యాండ్రాయిడ్ ప్లాట్‌ఫాం యాప్ వైరాలిటీ ఒకటే. ప్రారంభంలోనే వారికి 250బీటా యాప్ సైనప్స్ లభించడం విశేషం. ఇప్పటికే హాక్‌టూల్ ద్వారా ప్రమోట్ చేసిన అనేక యాప్స్.. లైవ్‌లో ఉన్నాయి. త్వరలో ఛానల్ పార్ట్‌నర్స్ ద్వారా... సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ కిట్‌ను అందించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ను అందుకోడానికి ఇదో సాధనంగా వారు భావిస్తున్నారు.

“ప్రస్తుతం ప్రతీ యాప్‌కు ఇలాంటి వైరల్ ప్రమోషన్ అవసరం. దీన్ని ఉపయోగించిన తర్వాత ఉబెర్, డ్రాప్‌బాక్స్ సహా పలు ఇతర యాప్‌లు 60శాతం వృద్ధి నమోదు చేశాయని” లక్ష్మణ్ వివరించారు .

యాప్ వైరాలిటీలో అభివృద్ధి సాధించేందుకు వీలైన అనేక టెక్నిక్స్ ఉపయోగించారు. సరైన హాకింగ్ టూల్ ఉపయోగించేందుకు బిల్టిన్‌గా రికమెండేషన్ ఇంజన్ కూడా అమర్చారు. ఆఖరికి డెవలరపర్లు కూడా ఎలాంటి కోడింగ్ అవసరం లేకుండానే దీన్ని ఉపయోగించచ్చని చెబ్తోంది కంపెనీ.

image


మైక్రోసాఫ్ట్ యాక్సిలేటర్ ప్రోగ్రాం ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ స్టార్టప్... ఏంజల్ రౌండ్ ద్వారా నిధుల సేకరణకు సమాయత్తమవుతోంది. “నెలకు 10వేల వరకూ యాక్టివ్ యూజర్స్ ఉన్న యాప్‌లకు మా సర్వీసులు ఉచితంగానే అందిస్తాం. అంతకు మించిన తర్వాత్ తక్కువ మొత్తంలో ఛార్జ్ చేస్తాం. స్టార్టప్ ఎరీనా సింగపూర్, 2014లో భాగస్వామ్యమైన ఏకైకా భారత కంపెనీ మాదే ”అన్నారు లక్ష్మణ్.

వైరాలిటీకి అడ్డంపడే వైరస్‌‍లు

“ మా సంస్థ బీ2బీ ఆధారంగా పని చేస్తుంది. ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ కావడానికి కొంత సమయం అవసరమవుతుంది. అలాగే యాప్ డెవలపర్స్‌ను థర్డ్ పార్టీ ఎస్‌డీకే ఉపయోగించేందుకు ఒప్పించడం కూడా సవాలే. అయితే ప్రారంభంలోనే బడా కంపెనీలు కూడా మా సాఫ్ట్‌వేర్ టూల్‌ను ఉపయోగించేందుకు అంగీకరించడం సంతోషం కలిగించింది. ఇది అనుకున్నదానికంటే ముందే మార్కెట్లో పేరు సంపాదించేందుకు ఇది సహాయపడింది.”- లక్ష్మణ్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags