సంకలనాలు
Telugu

మిస్ సైలెంట్ బ్యూటీ 'సరిత'

మోడలింగ్ ఇండస్ట్రీలో రాణిస్తోన్న వరంగల్ అమ్మాయి.. డెఫ్ మిస్ ఇండియా బెటర్ టైటిల్ తోపాటు ఎన్నో అవార్డులు,రివార్డులు..‘పదిమందికి స్ఫూర్తినివ్వడానికే దేవుడు నన్ను పుట్టించాడు ’.. సరిత

ashok patnaik
24th Aug 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

జీవితం అంటే ఓ నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎంతో మంది ప్రయాణికులు మనతో కలుస్తారు. వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. కొన్ని గుర్తుండిపోయే ప్రయాణాలు మనకు స్ఫూర్తిప్రదంగా నిలుస్తాయి. అలాంటి ఎనర్జీనిచ్చే కధల్లో ఒక కధ ఇది. ఓ ఫీమేల్ మోడల్ స్టోరి. వరంగల్ అమ్మాయి సరిత జీవిత విశేషాలు వింటే మనలో ఎక్కడో మూలనదాగి ఉన్న ఆత్మస్థైర్యం రెట్టింపవుతుంది. మనకేంటి తక్కువ.. ? అనే ధైర్యం గుండెల్లో నిండి మరింత ఆత్మవిశ్వాసం మీలో తొణికిసలాడుతుంది.

సరిత, మిస్ సైలెంట్ బ్యూటీ

సరిత, మిస్ సైలెంట్ బ్యూటీ


ఇప్పుడిప్పుడే మోడలింగ్ ఇండస్ట్రీలో తనకంటూ కొన్ని పేజీలు ఉండేలా షోస్ చేస్తోంది సరిత. స్టేజీపై ఎంతో హుందాగా.. అంతే ధైర్యంగా నిలబడుతోందీ తెలుగమ్మాయి. 'మిస్ డెఫ్ అండ్ డమ్ కాంటెస్ట్‌'లో టైటిల్ గెలుచుకున్న ఈ చక్కనమ్మను మీరెలా ఫీలవుతున్నారని అడిగితే సమాధానం చెప్పలేదు. మాట్లాడలేని, వినలేని ఈ ముద్దుగుమ్మ సొంతూరు తెలంగాణలోని వరంగల్. మాట్లాడకపోయినా మాటలకందని ఎన్నో భావాలను తను వ్యక్తపరుస్తుంది. చక్కనైన అందం అంతకు మించి ఆహార్యం సరితకే సొంతం. ఏ ఫ్యాషన్ కాంపిటీషన్స్‌కి వెళ్లినా టైటిల్ కంపల్సరీ. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది సరిత ఫ్యామిలీ.

మిస్ డెఫ్ ఇండియా కాంటెస్ట్ లో సరిత

మిస్ డెఫ్ ఇండియా కాంటెస్ట్ లో సరిత


లైఫ్ ఈజ్ ఏ జర్నీ

చిన్నప్పటినుంచి నేనెలా పెద్దయ్యానని తలుచుకుంటే అమ్మ ఎంత కష్టపడిందో అర్థం అవుతుందని తనకు తెలిసిన భాషలో చెబుతుంది సరిత. దేన్నైనా ఇంగ్లిష్‌లో రాసిచూపిస్తే అర్థం చేసుకుంటుంది. తిరిగి పేపర్‌పై రాసి సమాధానం చెబ్తుంది. నాకు తను ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా అలా జరిగిందే ! 

జీవితంలో మర్చిపోలేని గుర్తు ఏదైనా ఉంది అంటే కచ్చితంగా తాను పుట్టిన రోజే అంటుంది సరిత. తాను ప్రపంచంలోకి రావడం ఓ గొప్ప వరమని ఫీలవుతంది. అందరిలా తానుండదు. అందరిలా కాకుండా తనకొక ప్రత్యేకత ఉంది. అందరిలా ఉంటే అందులో ఏం గొప్పతనం ఉంది. మనిషన్నాక ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి కదా మనల్నే రివర్స్‌లో అడుగుతుంది. బహుశా అందరి కంటే ప్రత్యేకంగా నన్ను తయారు చేయాలని భగవంతుడు అనుకున్నాడేమో. అందుకే నాకు మాటలు రాకుండా పుట్టించాడు. దానికి కూడా నేను ధ్యాంక్స్ చెబుతానంటోంది ఈ లిటిట్ మోడల్. జీవితం అంతా మర్చిపోలేని ఓ మధుర జ్ఞాపకం అంటున్న సరిత లైఫ్ ఈజ్ ఏ జర్నీ అనే సిద్ధాంతాన్ని నమ్ముతుంది.

image


మోడలింగ్ వైపు అడుగులు

చూడ్డానికి చక్కగా కనిపిస్తున్న ఈ అమ్మాయికి మాటలు రావంటే ఎవరూ నమ్మరు . మొదటి సారి ఈ అమ్మాయిని చూసినప్పుడు నేను కూడా నమ్మలేదు. పదిసార్లు అడిగితే గానీ మాటలు రావన్న నిజాన్ని నమ్మలేకపోయాను. చిన్నప్పటినుంచి ఎంత తొందరగా పెద్దవ్వాలి, ఫేమస్ కావాలి, ఆకాశపు అంచులను చేరుకోవాలి అనే కలలు కనేదట సరిత. అందులో భాగంగానే మిస్ హైదరాబాద్ లాంటి కాంటెస్టుల్లో పాల్గొంది. అప్పుడు తెలిసింది తనలాంటి వారి కోసం మిస్ డెఫ్ అండ్ డమ్ కాంటెస్ట్ ఒకటుంటుందని. వెంటనే తెలిసిన వారి ద్వారా దానికి అప్లై చేసింది. చిన్నప్పటి నుంచి ఓటమెరుగని సరిత సహజంగానే ఆ టైటిల్‌లో ఫైనల్‌కు చేరింది. టైటిల్ సాధించింది. 

బెంగళూరు, బాంబే, గోవా, ఢిల్లీ, కోల్కతా, చెన్నై ఇలా అన్ని మెట్రో నగరాల్లో జరిగిన ఎన్నో కాంపిటీషన్స్‌లో పాల్గొంది. ఎన్నో షోలల్లో క్యాట్ వాక్ చేసింది. హైదరాబాద్‌లో రెగ్యులర్‌గా వాక్ చేస్తుంటుంది. బహుశా షో చూసే వారికి సైతం ఈమె మాట్లాడలేదని తెలియకపోవచ్చు. మోడలింగ్ నా చిన్ననాటి డ్రీమ్, దేవుడు నాకు మాటలు రాకుండా చేస్తే చేశాడు కానీ, అందంగా అయితే పుట్టించాడు. దానికి సంతోషిస్తున్నా.

కాంటెస్ట్ లో  ఏపికి రిప్రజెంట్ చేస్తూ

కాంటెస్ట్ లో ఏపికి రిప్రజెంట్ చేస్తూ


“నాలాంటి వారికి నేనే స్ఫూర్తి. జీవితంలో ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయి.” సరిత

స్టెప్పింగ్ స్టోన్స్

నేను డెఫ్ అండ్ డమ్ కావడం వల్ల సాధారణ పిల్లల్లా స్కూల్ కి వెళ్లి చదువుకోలేదు. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా. అకడమిక్ ఎడ్యుకేషన్ జీవితాన్ని మారుస్తుందంటే నేను అసలు నమ్మను. ఎందుకంటే ఐన్‌స్టీన్ ఏ డిగ్రీ పూర్తి చేశారో చెప్పగలరా ఎవరైనా ? నాకు వైకల్యం ఉందని నేను వెనకడుగు వేయలేను. వైకల్యం ఉందని స్టీఫెన్ హాకింగ్ వెనకడుగు వేశాడా ? ప్రపంచంలో గొప్పగా సాధించినవారు, లేదా తమ భావాలతో, తమ టాలెంట్‌తో ప్రపంచాన్ని మార్చగలిగిన వారందరికీ ఏదో లోపం ఉంది. బహుశా నేను కూడా అదే టైప్ కావచ్చు. నాది చిన్న లోపమే. నేను ఈ ప్రపంచాన్ని మార్చే రోజు వస్తుందని ధీమాగా రాసి మరీ చెబ్తుంది సరిత. బ్రెయిలీ‌లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన సరిత జీవితంలో ప్రతీ అనుభవం ఓ స్టెప్పింగ్ స్టోన్ అంటోంది. వరంగల్ నుంచి మిస్ డెఫ్ అండ్ డమ్ దాకా నా ప్రయాణం బహుశా చిన్నదే కావొచ్చు. కానీ నా కథ తెలిసిన వారిలో ఒకరికైనా నేను స్ఫూర్తి నివ్వగలిగితే చాలు. జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉంది. ఎంతో మందికి స్పూర్తి నిచ్చే స్థాయిలో ఉండటమంటే మామూలు విషయం కాదు.

మోడలింగ్ ఫోటో షూట్ లో సరిత

మోడలింగ్ ఫోటో షూట్ లో సరిత


స్ఫూర్తిప్రదంగా జీవించే అవకాశం నాకు దేవుడు పుట్టినప్పుడే ఇచ్చాడు. దాన్ని నూటికి నూరుపాళ్లు వినియోగించుకోవడమే నా జీవిత లక్ష్యం - సరిత

నేను అమ్మ కూచిని

అమ్మ నా మొదటి స్నేహితురాలు. నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఏం చేసినా ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఇప్పుడీ స్థాయిలో ఉన్నానంటే కారణం అమ్మే. నాకు జన్మనిచ్చి ఇంత దాన్ని చేసినందుకు అమ్మకు రుణపడి ఉన్నా. నా ప్రతీ భావాన్ని అమ్మతో చెప్పుకున్నంత కంఫర్ట్‌బుల్‌గా మరెవరితో చెప్పుకోలేను. కొన్ని సార్లు నన్ను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ అమ్మ మాత్రమే సరిగ్గా తెలుసుకుంటుంది. పెద్దలంతా.. అమ్మనాన్నలు ప్రత్యక్ష దైవాలని చెబుతారు. నా విషయంలో అమ్మ ఓ దేవత. దేవుడు నాకోసం అమ్మను పుట్టించాడేమో అనిపిస్తుంది ఒక్కో సారి. అమ్మంటే నాకు అంత ఇష్టం మరి. నాకు ఏదైనా తక్కవ అనిపించి, లేదా నేనేవిషయంలో అయినా తక్కువ అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూరాలేదు. బహుశా మా అమ్మ నన్ను దాన్ని తెలియకుండా పెంచిందేమో. ఇంతకీ అమ్మ పేరు చెప్పలేదు కదా. సమ్మక్క మా అమ్మ, నా దేవత.. లవ్ యూ మామ్ అని చెమ్మగిల్లిన కళ్లతో తన భావాన్ని వ్యక్తం చేసింది.

imageAdd to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags