సంకలనాలు
Telugu

సరికొత్త ఆన్ లైన్ కొరియర్...మై ప్యాకో డాట్ కామ్

బేరీజు వేసుకోండి.. నమోదు చేసుకోండి.. పార్సిల్ ను పంపండి.. వినూత్న తరహా కొరియర్ సేవలు అందిస్తున్న మై ప్యాకో

CLN RAJU
30th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మైప్యాకో డాట్ కామ్(Mypacco.com) అనేది సరికొత్త ఆన్‌లైన్ పార్శిల్ డెలివరీ సేవా సంస్థ. ఇది అందరికీ అనుకూలమైన కొరియర్ సర్వీస్‌లను కోరుకున్న ధరలో, సకాలంలో ప్రపంచవ్యాప్తంగా అందించే ఆన్ లైన్ వ్యవస్థ. దీనికి సంబంధించిన వివరాలను సహ వ్యవస్థాపకులు, సీఈవో అయినటువంటి వినయ్ భాటియా చెహ్

వినయ్ భార్తియా, మైప్యాకో సిఈఓ

వినయ్ భార్తియా, మైప్యాకో సిఈఓ


‘‘మై పార్సిల్ సంస్థ స్ఫూర్తితోనే మైప్యాకో డాట్ కామ్ ను స్థాపించాం. ప్యాకో అంటే ఇటలీ భాషలో ‘పార్సిల్’ లేదా ‘మూట’ అని అర్థం. పార్సిల్ కు సంబంధించిన అర్థం వుండాలనే ‘మై ప్యాకో’ అనే పేరు పెట్టాం’’ అన్నారు వినయ్ భాటియా. డాట్ కామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ సర్వీసులను ప్రారంభించాలనేది ఈ కంపెనీ వ్యవస్థాపకుల ఉద్దేశం. అదే సాకారం చేసుకున్నారు . భారతదేశంలో ప్రారంభించి.. దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోనూ ఆన్ లైన్ కొరియర్ సర్వీస్ ను విస్తరించిన తమ లక్ష్యం గురించి తెలిపారు వినయ్. మైప్యాకో డాట్ కామ్ కు వెన్నుదన్నుగా సమర్థవంతమైన, అనుభవం కలిగిన నిర్వాహకులు, సిబ్బంది కలిగివుండటం ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. మైప్యాకో ద్వారా కస్టమర్లు కోరికమేరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తని విధంగా డాక్యుమెంట్లను (దస్తావేజులను), ఇతర ముఖ్యమైన పార్సిల్ సర్వీసులను కూడా అత్యంత నమ్మకంతో ఒకచోటు నుంచి మరోచోటుకి చేరవేయవచ్చు. కేవలం భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ఇక్కడి నుంచి ప్రపంచంలో ఏ మూలకైనా కస్టమర్ కోరుకున్న విధంగా కొరియర్ సర్వీసుల్ని అందిస్తుంది మై ప్యాకో డాట్ కామ్ ఆన్ లైన్ వ్యవస్థ. దీనికి కస్టమర్లు చేయాల్సిందల్లా ఒక్కటే. ఇతర సర్వీసులతో పోల్చితే ఇది ఎంత అనుకూలమైనదని సరిచూసుకోవడం లేదా బేరీజు వేసుకోవడం, కస్టమర్ తమ వివరాలను నమోదు చేసుకోవడం, చివరిగా పార్సిళ్లను మై ప్యాకో డాట్ కామ్ ద్వారా సురక్షితంగా ఆయా గమ్యస్థానాలకు పంపడం.

image


మైప్యాకో టీమ్ :

మైప్యాకో డాట్ కామ్ కొరియర్, పార్సిల్ సర్వీసుల్ని పారిశ్రామికవేత్తలైన వినయ్ భాటియా, ముఖేష్ అగర్వాల్‌లు స్థాపించారు. సహ వ్యవస్థాపకులైన వినయ్ భాటియా తన వ్యాపార ప్రస్థానాన్ని 2000 ఏడాది నుంచే ప్రారంభించారు. ఈయన ఉర్దూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టాను పొందారు. ఇండియన్ ఏంజిల్ నెట్‌వర్క్ సభ్యులుగా కొనసాగుతున్నారు. అలాగే మై ప్యాకో డాట్ కామ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముఖేష్ తన పారిశ్రామిక జీవితాన్ని 1999లో ప్రారంభించారు. ఈయన కోల్ కతా ఐఐఎం లో ఎంబీఏ పూర్తిచేశారు. ముఖేష్ కూడా ప్రస్తుతం ఏంజిల్ ఇన్వెస్టర్ లో సభ్యులుగా వున్నారు.

అత్యంత వేగంగా పురోగతి చెందుతున్న ఆన్ లైన్ పార్సిల్ సర్వీస్ సంస్థ మై ప్యాకో డాట్ కామ్ లో 14 మంది సాంకేతిక నిపుణులు తమ సేవల్ని అందిస్తున్నారు.

ప్రత్యేకతలు, సేవా సౌకర్యాలు :

ఇతర కొరియర్ కంపెనీల పనితీరు, ధరలతో మైప్యాకో డాట్ కామ్ ను బేరీజు వేసుకునే అవకాశముంది.

వినియోగదారుడికి అనుకూలమైన రీతిలో పార్సిల్ సర్వీస్‌ను చేసే వెసులుబాటు వుంటుంది. అంతే కాకుండా కస్టమర్ ఇంటిదగ్గరకే వచ్చి కొరియర్ పార్సిళ్లను తీసుకుని వాళ్లు తెలిపిన అడ్రస్ ప్రకారం వాటిని గమ్యస్థానాలకు నమ్మకంగా, సురక్షితంగా చేర్చగలగటం ఈ కంపెనీ ప్రత్యేకత. కస్టమర్ తమ కొరియర్ లేదా పార్సిల్ ను బుక్ చేసి పంపినప్పట్నుంచి అది ఎక్కడుందనేది ఆన్ లైన్ ద్వారానే ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంది.

మూడు ప్రాధాన్యాంశాలు :

  • 1. ఇతర కొరియర్ కంపెనీల గురించి తెలుసుకోగలగటం:

పలు రకాల ప్రకటనలు, మార్కెటింగ్ , ప్రజా సంబంధిత అంశాలను తమ ఆన్ లైన్ కొరియర్ సర్వీస్ వ్యవస్థ ద్వారా కస్టమర్లు తెలుసుకునే అవకాశముంది. ఇతర కొరియర్ కంపెనీలు కూడా ఎలాంటి సేవల్ని అందిస్తాయనేది వినియోగదారుడు సులభంగా తెలుసుకుని అర్థం చేసుకోగలుగుతాడు.

  • 2. పారదర్శకత:

ప్రస్తుతమున్న సేవల్లో పార్శిళ్లను భద్రంగా డెలివరీ చేస్తామనే హామీని మైప్యాకో డాట్ కామ్ కంపెనీ కల్పిస్తోంది. ఒకరోజు, రెండ్రోజులు ఇలా ఒక కచ్చితమైన సమయాన్ని... చెప్పిన ప్రకారం కొరియర్ సర్వీసుల్ని అందిస్తుంది. అదీ వినియోగదారులకు అనుకూలమైన ధరలలో. ఇందులో కూడా ఇతర సేవా కంపెనీల పనితీరును చూపిస్తూనే తమ సర్వీసులు ఎంత మెరుగైనవో చెబుతోంది. అంటే ఇతర కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా పారదర్శకంగా తమ ఆన్ లైన్ సైట్ లో చూపిస్తోందని అర్థం.

  • 3. సులభతరం/ సౌలభ్యం :

మనం కూర్చున్న చోటు నుంచే ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం వుంటుంది. పైగా కాలు బయటకు పెట్టి కొరియర్ సర్వీస్ సెంటర్లు ఎక్కడున్నాయా..? అంటూ వెతుక్కుంటూ వెళ్లాళ్సిన పనిలేదు. అతి తక్కువ సమయంలో , చాలా సులభంగా, సౌకర్యవంతంగా పార్సిళ్లను కోరుకున్న చోటుకు చేరవేసే బాధ్యత తీసుకుంటుంది మైప్యాకో డాట్ కామ్. దీనికి సంబంధించిన మొబైల్ యాప్ కూడా అందుబాటులో వుండటం మరింత సౌకర్యవంతమైన సేవలు అందిస్తుందనడానికి నిదర్శనం.

మై ప్యాకో డాట్ కామ్ సూచించిన సమయం ప్రకారం కచ్చితంగా ఆయా కొరియర్ పార్శిళ్లను గమ్యాలకు చేర్చుతుంది. ఒకరోజు, రెండు రోజులు , మూడు రోజులు లేదా నాలుగైదు రోజుల్లో ఆప్రాంతం వున్న దూరం, ఆన్ లైన్ లో వినియోగదారుడు ఎంచుకున్న సేవను బట్టి కొరియర్ సర్వీసుల్ని అందిస్తుంది కంపెనీ. మొట్టమొదటగా దేశంలో మాత్రమే డెలివరీ సర్వీసుల్ని ప్రారంభించిన మైప్యాకో డాట్ కామ్ కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 200 పైగా దేశాలకు తమ కొరియర్ సేవల్ని విస్తరించడం, దిగ్విజయంగా నిర్వహిస్తూ వుండటం విశేషం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags