సంకలనాలు
Telugu

చిన్నరూంలో మొదలైన వ్యాపారం.. ఇప్పుడు మిలియన్ డాలర్ల రేంజికి చేరింది

 

GOPAL
6th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


9/11. అమెరికాపై అల్‌ఖైదా దాడి జరిపిన రోజు. ఆ రోజును ప్రపంచం ఇప్పుడప్పుడే మర్చిపోలేదు. అలాంటి అటాక్ జరిగిన సమయంలో ఆనంద్ బాబు పెరియసామీ, అతని టీం.. కాలిఫోర్నియా డిజిటల్ కార్పొరేషన్ లో ప్రపంచ సూపర్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్‌ను తయారీ పనిలో తలమునకలై ఉన్నారు. అది కూడా అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎనర్జీ కోసం.


సూపర్ కంప్యూటర్ డెవలప్మెంట్, తర్వాత గ్లస్టర్.. ఇప్పుడు మినియో. ఆనంద్ బాబుదొక సుదీర్ఘ వ్యాపార ప్రయాణం. అతణ్ని కదిలిస్తే ఆంట్రప్రెన్యూరియల్ జర్నీలో స్కిన్ కంటే స్కార్సే ఎక్కువగా ఉన్నాయంటాడు.

ఆనంద్ బాబు (ఏబీ) పెరియసామీ

ఆనంద్ బాబు (ఏబీ) పెరియసామీ


తొలి చూపు ప్రేమ..

‘‘కంప్యూటర్ పరికరాలతో నన్ను ఓ రూమ్‌లో వదిలేస్తే ఓపెన్ సోర్స్‌లో హ్యాంకింగ్ చేసుకుంటూ బతికేస్తా అంటాడు ఆనంద్. అలా అని తానే తెలివిగలవాడిని అని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకునే రకం కూడా కాదు. అమ్మ సపోర్టేగనుక లేకపోతే ఉంటే అట్లీస్ట్ ఇంజినీరింగ్ కూడా చేసి ఉండేవాడిని కాదేమో అంటాడు.

కంప్యూటర్లంటే పిచ్చి..

ఆనంద్‌కు కంప్యూటర్లంటే పిచ్చి. కావాల్సిందల్లా ఒక సిస్టమ్ ..దానికో ఇంటర్నెట్ ఫెసిలిటీ. వాటితోనే బతికేస్తాడు. 1999 నుంచి హ్యాకింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఢిల్లీలో నెక్ట్స్‌జెన్ లో పనిచేస్తున్న సమయంలో ఇంటర్నెట్ ఫెసిలిటీ కొద్దిమంది ఉద్యోగులకు మాత్రమే ఉండేది. సాయంత్రం సర్వీసులు ప్రారంభమైన తర్వాత పోర్టు నంబర్స్‌ను కంట్రోల్ చేసేవారు. కానీ ఏబీ మాత్రం మోడమ్ సౌండ్ ఆధారంగా వాటిని గుర్తించి, పోర్టును స్కాన్ చేసి తన సిస్టమ్‌కు ఇంటర్నెట్‌ కనెక్ట్ చేసుకునేవారు. ఆ తర్వాత చాలామంది అతని దగ్గరికి వచ్చి బాబ్బాబు హెల్ప్ చేయవా బతిమాలుకునేవారు. అప్పుడనిపించేది ఆనంద్ బాబుకు.. ఈ ఐటీ డిపార్ట్‌మెంటేదో నాకే ఇస్తే.. వాళ్లకంటే బ్రహ్మాండంగా చేసేవాడిని కదా అని. అనుకున్నట్టే ఐటీ డిపార్ట్‌మెంట్ బాధ్యతలను పూర్తిగా ఆనంద్ కే అప్పగించారు.

ఆనంద్ బాబు రిచ్ కిడ్డేం కాదు. జీవితం గడవాలంటే ఉద్యోగం చేయక తప్పదు. ఆ సమయంలో సీడీసీలో అవకాశం వచ్చింది. పార్ట్‌టైమ్‌గా చేరాలని అనుకున్నారు. అయితే సీటీఓ పోస్ట్ ఆఫర్ చేయడంతో ఫుల్‌టైమ్‌ చేయక తప్పలేదు. ఆ సంస్థలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులకు ఫ్రీ సాఫ్ట్‌వేర్‌పై హాకింగ్‌పై అంతగా పట్టులేదు. దీంతో వారి బాధ్యతలను కూడా ఆనంద్ బాబే చూడాల్సి వచ్చింది.

అలా పెద్ద పెద్ద క్లయింట్లు ఆ కంపెనీకి వచ్చి చేరాయి. అదే సమయంలో అనుకోని పరిణామం. సీడీసీలో ఫ్రీ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ డివిజన్లను క్లోజ్ చేసి, ప్రొప్రైటరీ బిజినెస్‌ను ప్రారంభించాలని సంస్థ సీఈఓ నిర్ణయం తీసుకున్నాడు. బాస్ నిర్ణయంతో ఆనంద్ సహా ఆ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వారంతా రోడ్డుపై పడ్డారు. జీవితం మళ్లీ మొదటికొచ్చింది. ఉద్యోగ వేట స్టార్టయింది. అయితే ఈసారి ఆనంద్ తన ఒక్కడి స్వార్ధమే చూసుకోలేదు. మొత్తం టీమ్‌కు కూడా ఉద్యోగాలు ఇప్పించాలని అనుకున్నాడు.

ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్లొచ్చారు. కానీ ఏ సంస్థ కూడా ఫ్రీ సాఫ్ట్‌వేర్‌పై పనిచేయడం లేదు. ఆనంద్ బాబుకి మాత్రం హక్యింగ్, ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ అంటేనే ఆసక్తి. వచ్చిన ఐడియాలు ఎవరితోనూ పంచుకోకుండా వాటిని నిర్దాక్షిణ్యంగా అణచివేయడం సుతరాము నచ్చదంటాడు. అయితే టీం అందరికీ ఉద్యోగాలు ఇప్పించాలనుకున్నాడు కానీ.. చివరికి ఒక కలిగ్ మాత్రమే తనతో మిగిలాడు. అతని పేరు హితేశ్. ఇద్దరిదీ ఒకే ఐడియాలజీ కావడంతో ఒక సంస్థను ప్రారంభించాలనే నిర్ణయానికొచ్చారు.

ఐడియా పేరు గ్లస్టర్. ఆఫీసు, ఫర్నిచర్ హడావిడేం లేదు. జస్ట్ ఒక చిన్నరూం అంతే. స్టోరేజ్ సాఫ్ట్‌వేర్‌ను ఒకదాన్ని రూపొందించారు. ఎంబేడెడ్ సిస్టమ్స్ పోర్టింగ్‌తో సహా అన్ని రకాల పనులు చేశారు. అలా చేస్తూనే ఖాళీ సమయంలో స్టోరేజ్ వర్క్ కంప్లీట్ చేశారు. అదే సమయంలో క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్‌కు ఆదరణ పెరుగుతున్నది. అయితే యాదృచ్చికమేంటంటే అదే సమయంలో అమెరికాలో హౌసింగ్ బుడగ ఢామ్మని పేలిపోయింది. దీంతో మార్కెట్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వేరే కంపెనీలు ప్రొప్రైటరీ హార్డ్‌వేర్ అప్లియెన్సెస్‌ను తయారు చేస్తూ దూసుకుపోతుంటే.. గ్లస్టర్ టీమ్ మాత్రం జీరో సైజ్ దగ్గరే ఉండిపోయింది.

ఆ సమయంలో మార్కెట్ అంతా ఈఎంసీ సర్టిఫికేషన్ గురించే మాట్లాడుకుంటోంది. కానీ గ్లస్టర్ విధానం మాత్రం చాలా సింపుల్‌. సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఫ్రీగా వాడుకోవడం అంతే. అందరికీ ఉచితం. ఓపెన్ సోర్స్ పద్ధతిలో దీన్ని డెవలప్ చేశారు. అది నచ్చిన నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్.. గ్లస్టర్‌లో పెట్టుబడులు పెట్టింది. 2010 నాటికి ఇండస్ట్రీలో పేరొచ్చింది. రెడ్‌హాట్ స్టోరేజ్‌గా పిలవడం మొదలుపెట్టింది.

సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్‌. పాత కాడిలాక్ కారు. అలా మొదలైన ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు. అవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సి అంశాలు కాదుకానీ.. ఫ్రీ వాల్యూస్‌పై ఎథికల్ హ్యాకింగ్ చేశామా లేదా అన్నదే ముఖ్యం అంటాడు ఆనంద్. కొన్నిసార్లు గంటల తరబడి హ్యాకింగ్ చేస్తూ సర్వర్ రూమ్‌లోనే ఉండిపోయిన రోజులను అతను గుర్తుచేసుకుంటున్నాడు.

image


కొన్ని పరిస్థితుల వల్ల రెడ్‌హ్యాట్‌కు గ్లూస్టర్‌ను అమ్మేశాడు. తర్వాత మూడేళ్లపాటు ఇంటిపట్టునే ఉండిపోయాడు. థియరిటికల్ మేథమెటిక్స్ నేర్చుకుంటూ టైమ్ పాస్ చేశాడు. ఫిజిక్స్‌ తో కుస్తీ పట్టాడు. ప్రాజెక్ట్ బయోనిక్స్ చేయాలనుకున్నాడు. కానీ ఎందుకో మనసు గ్లూస్టర్ మీదికి లాగింది. అప్పుడనిపించింది మరో స్టార్టప్ ప్రారంభించకపోయినా, రెడ్‌హ్యాట్‌లో ఉండి ఉంటే, కనీసం రిటెన్షన్ బోనస్ అయినా వచ్చి ఉండేది కదా అని. ఆ ఆలోచనల నుంచి బయటపడాలంటే అర్జెంటుగా ఏదో ఒక స్టార్టప్ పెట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మినియో అనే సంస్థను ప్రారంభించాడు. భార్య సహకారం కూడా తోడయింది. 

భార్య గరిమా, పిల్లలతో ఆనంద్ బాబు

భార్య గరిమా, పిల్లలతో ఆనంద్ బాబు


బయోనిక్స్ ఆలోచనపై పనిచేయాలని అనుకున్నప్పుడు ఆనంద్‌కు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలంటే మనీ, టైం, రీసెర్చ్ చాలా అవసరమని గుర్తించాడు. అందుకే మరో ప్రాజెక్ట్‌పై దృష్టి సారించాడు. ఓపెన్ సోర్స్‌లో అమెజాన్ ఎస్3ని ఆల్టర్నేట్ గా డెవలప్ చేశాడు. అమెజాన్‌తో పోలిస్తే మినియో ఫ్రీయే. ఈజీగా డౌన్‌లోడ్ చేసుకునేలా ఉంటుంది.

‘‘వస్తువులను సృష్టించడమే ఎంటర్‌ప్రెన్యూర్ ఉద్దేశం. కానీ వాస్తవ ప్రపంచంలో వ్యవస్థాపకుడి జీవితంలో అదో చిన్న విషయం. ప్రజలను మేనేజ్ చేస్తూ, మనతోపాటు వారిని కూడా విజయం వైపు తీసుకెళ్లడమే ఆంట్రప్రెన్యూర్‌షిప్’’ అని ఆనంద్ వివరించారు.

యాక్సిడెంటల్‌గా గ్లస్టర్ నుంచి మొదలైన ఆనంద్ బాబు ఆంటర్‌ప్రెన్యూర్ జీవితం.. 9/11 దాడి, హౌసింగ్ సంక్షోభం సమయంలోనూ నిలబడగలిగింది. వరల్డ్ సెకండ్ సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ నుంచి గ్లస్టర్ తర్వాత మినియో.. ఆ తర్వాత ఆమెజాన్ ఎస్3 ఇలా ఎన్నో ఓపెన్ సోర్స్ ఫ్రీ సాఫ్ట్‌వేర్లను అభివృద్ధి చేసి కోడింగ్‌లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పర్చుకున్నారు ఆనంద్ బాబు.

అనుకోకుండానే అద్భుతాలు సృష్టించిన ఆనంద్ బాబు మరిన్ని విజయాలు సాధించాలని యువర్‌స్టోరీ ఆకాంక్షిస్తోంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags