సంకలనాలు
Telugu

భద్రత లేని 'భద్ర'లు చాలా ఉన్నాయని గమనించారా?

గెస్ట్ కాలం రచయిత - అశుతోష్, ఆప్ అధికార ప్రతినిధి

team ys telugu
11th Jul 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

భద్ర ఓ చిన్నారి కుక్కపిల్ల. కేవలం ఐదు నెలల వయసున్న ఈ డాగీ.. దేశవ్యాప్తంగా ఎంతోమందిని ఎమోషనల్ గా కదిలించింది. ఈ భద్ర కూడా నా షేరు లాంటిందే. ఎస్పీసీఏ హాస్పిటల్ లో నేను మొదటిసారి షేరును చూసినపుడు.. అది నా వంక చూసిన చూపి ఇంకా గుర్తుంది. అప్పటికే దానికి అనారోగ్యం చేసింది. ఓ చిన్న గదిలో అనేక కుక్కలతో కలిసున్న షేరు.. నన్ను చూడగానే పరిగెట్టుకుంటూ వచ్చింది. నేను దాని తలపై చెయ్యి వేసి నిమిరినప్పుడు.. ఆ కుక్క కళ్లలో నాకు ఓ అభ్యర్ధన కనిపించింది. తను పుట్టి పెరిగిన ఆ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ నుంచి తనను తీసుకెళ్లిపోమని షేరు అడుగుతున్నట్లుగా అనిపించింది. దాని ఆరోగ్యాన్ని అంతగా పట్టించుకోని వైద్యుడితో మాట్లాడాను. నేని తిరిగొచ్చేశాక కూడా.. భద్ర మాదిరిగానే షేరు కళ్లు నన్ను వెంటాడేవి. దానికి ఓ ప్రాణాంతకమైన ట్యూమర్ కూడా ఉంది.


image


షేరు కూడా భద్ర మాదిరి రంగులోనే ఉన్నా.. ఇది కొంచెం పొడుగ్గా ఉంటుంది. దాని వయసెంతో నిజానికి నాకు తెలీదు. మా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అది ఒక భాగం. నేను మొదటిసారి కలిసినపుడు తను ఆరోగ్యంగానే ఉండేది. నేను పెంచుకునే కుక్కలతో వాకింగ్ కి వెళ్లినపుడు వెంటే నడిచేది. అది దానిపైనే ఆధారపడిన కుక్క. ఎప్పుడూ తోక ఊపుతూ తన ప్రేమను చాటేది. నా దగ్గర ఉన్న పప్పీ కొన్నిసార్లు దాన్ని చూసి అరిచినా.. అది ఎప్పుడు తిరిగి అరవలేదు. మాకు కొంత దూరంలో నడుస్తూ.. వేరే కుక్కను మా జోలికి రానిచ్చేది కాదు. మిగిలిన కుక్కలను అరుస్తూ వాటిని వెంటాడినా.. నా చిన్నారి పప్పీలతో మాత్రం స్నేహపూర్వకంగానే ఉంది. ఆ సమయంలో షేరు నాకు ఓ సంరక్షణలా అనిపించేది. అది పక్కన ఉండగా వేరే కుక్కలేవీ నా పప్పీల జోలికి రాకుండా చూసుకునేది. ఎప్పుడూ ఎవరినీ షేరు కరవకపోయినా.. అపార్ట్‌మెంట్‌లో చాలామంది దాన్ని బయటకు తరిమేయని చెప్పేవారు.

ఒకసారి తలపై నిమురుతున్నపుడు దాని జుట్టు బాగా కఠినంగా ఉందని అనిపించినా.. నేను పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత షేర్ తన జుట్టు కోల్పోతోందనే విషయాన్ని గ్రహించాను. అప్పుడు వెటర్నరీ డాక్టర్ ని కలవగా.. ఇన్ఫెక్షన్ సోకిందని.. కొంద వైద్యం చేయించాల్సి ఉంటుందని చెప్పారు. కొన్ని మందులు కొని పాలలోను, ఆహారంలోను కలిపి తినిపించేవాడిని. కొన్ని రోజుల్లోనే కంటికి కనిపించే మార్పు గోచరించింది. ఓ మంచి కోట్ మాదరిగా జుట్టు పెరగడమే కాకుండా.. ఆరోగ్యంగా తయారైంది. ఒక రోజు ఉదయం షేరు మెడపై గాయాన్ని గమనించాను. దాని నిండా చీము పేరుకుకోవడంతో పాటు.. అది నొప్పితో ఏడుస్తోందని తెలిసింది. దాని గాయాలను ఫోటోలు తీసి మరోసారి వైద్యుడిని సంప్రదించాను. ఆ గాయంపై పూయాల్సిందిగా ఓ ఆయింట్మెంట్ ని ఇచ్చాడు డాక్టర్. నొప్పిగా ఉన్నా సరే.. గాయం ఉన్న ప్రాంతంలో నన్ను తాకనిచ్చేది. అప్పుడు వెటర్నరీ వైద్యుడు షేరను కుక్కలకు సంబంధించిన ఆస్పత్రి అయిన సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రుయెల్టీ టు యానిమిల్స్ లో చూపించాల్సిందిగా సూచించారు. నేను అంబులెన్స్ ను పిలవగా.. వారొచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిజానికి తను వెళ్లేందుకు ఇష్టం చూపలేదు.

భద్ర ఒక విషయంలో చాలా అదృష్టం చేసుకుంది. రెండు అంతస్తుల భవనం పై నుంచి విసిరేసినా.. పెద్దగా గాయాలు కాలేదు. ఒక కాలికి గాయం కావడంతో పాటు వెన్నుపూసకు దెబ్బ తగిలింది. మూడు వారాల్లో భద్ర పూర్తిగా కోలుకోనుంది. మానవత్వం మంట గలిసి.. ఆ బిల్డింగ్ పై నుంచి భద్రను పడేసిన తర్వాత.. పది రోజుల పాటు గాయాలతో బాధపడినప్పుడు భద్ర ఎలాంటి పరిస్థితిలో ఉందో ఎవరికీ తెలీదు. అంత నొప్పిని భరిస్తూ.. కదల్లేని పరిస్థితిలో అన్నం నీళ్లు లేకుండా మనుగడ సాగించిన రోజులను తలుచుకుంటే బాధ వేస్తుంది. అసలు ఆ సమయంలో అదెలా బతికి ఉంటుందో అని ఎవరైనా ఆలోచించారా? మనకు ఏదైనా చిన్న నొప్పి గాయం వస్తేనే.. హాస్పిటల్ పరుగులు తీస్తుంటాం. మనల్ని సంతోషంగా ఉంచేందుకు కుటుంబంలో చాలామంది ప్రయత్నిస్తారు. మరి వాటి పరిస్థితేంటి?

నేను ప్రతీ రోజు ఆహారం అందించే కుక్క మరొకటి ఉంది. ఒక రోజు హఠాత్తుగా అని నా ఫ్లాట్ కి రావడం మానేసింది. నేను కొన్ని రోజులు దానిని వెతికేందుకు ప్రయత్నించాను కానీ.. నాకెక్కడా కనిపించలేదు. ఒక రోజు నేను కార్ లో ఎక్కుతుండగా ఓ కుక్క మూలుగులు వినిపించాయి. నా కారు చుట్టూ ఆ కుక్క పరిగెడుతోంది. బైటకొచ్చి చూస్తే. . అదే. నేను దాని వంక చూసి అది నొప్పితో బాధ పడుతోందని గ్రహించాను. మొత్తం దాని శరీరాన్ని గమనించగా.. దాని తోక నుంచి రక్తం కారుతోందని అర్ధమైంది. కొంత మేర తెగడంతో ఆ రక్తం కారుతోంది. అన్ని నెలల తర్వాత నా దగ్గరకు ఎందుకు వచ్చిందా అనిపించింది. నా దగ్గర నుంచి వైద్య సాయం కోరుతోందా? లేక నా దగ్గర ఉంటే సౌకర్యంగా ఉంటుందని భావిస్తోందా అనుకున్నాడు. అది చెప్పే పరిస్థితి ఏ మాత్రం లేదు. నేను అంచనా వేసుకోవడమే.

ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. నేను ఆఫీస్ నుంచి రాత్రికి ఇంటికి వచ్చినపుడు ఓ ఆడ కుక్క దాని చిన్న పిల్లతో కలిసి నా రూమ్ డోర్ పక్కన కూర్చుంది. ఆ కుక్కని కానీ, పిల్లను కానీ అంతకు ముందు నేను చూడలేదు. సాధారణంగా నేను చాలా కుక్కలకు ఆహారం అందిస్తుంటాను. అయితే దీన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదు. దాని దగ్గరకు వెళ్లి గమనిస్తే.. చిన్న కుక్క పిల్లలో చలనం లేదని అర్ధమైంది. ముట్టుకు చూస్తే దాని పల్స్ చాలా బలహీనంగా కొట్టుకుంటోంది. చిన్నదానికి ఆహారం అందించే ప్రయత్నంలో భాగంగా పాలు పట్టించాను. చాలా ప్రయత్నం తర్వాత ఆ పప్పీ తోక ఊపింది. చిన్నపిల్లల దగ్గరకు వెళ్లే సాధారణంగా తల్లి కుక్కలు అరుస్తాయ్ కానీ.. ఇది మాత్రం నన్ను ఏమీ అనలేదు. అప్పుడు వైద్యుడికి కాల్ చేశాను. అయితే.. అప్పటికే చాలా రాత్రి కావడంతో ఉదయాన్నే రావాల్సిందిగా ఆయన చెప్పాడు

నేను ఉదయం వెళ్లి చూడగా.. చిన్నారి పప్పీ ఊపిరి పీల్చుకోవడం లేదు. తల్లి కుక్క మాత్రం పక్కనే కూర్చుంది. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే.. నా ఇంటి తలుపు దగ్గరకు దాన్ని ఎందుకు తెచ్చిందనే. దానికి నా చిరునామా ఎవరు చెప్పారు? వేరే ప్లేస్ కి వెళ్లకుండా నా దగ్గరకి ఎందుకొచ్చింది? నా దగ్గర సాయం లభిస్తుందని ఆ కుక్కకు ఎలా తెలిసింది? అది నాకు చెప్పలేదు. దాని భాషను నేను అర్ధం చేసుకోలేను. నా పెంపుడు కుక్కలయిన మోగు మరియు చోటులతో నేను మాట్లాడగలను. వాటికి ఎప్పుడు ఆకలి వేస్తుందో.. ఎప్పుడు సంతోషంగా ఉంటాయో చెప్పగలను. నన్ను అర్ధరాత్రి లేపి మల విసర్జనకు వెళ్లాని మోగు చెబుతుంది. కడపులో బాగా లేదని చెప్పగలదు కూడా. నేను ఎక్కువ సేపు బయటకు వెళ్లాల్సి వస్తే... ఇబ్బంది పడద్దని ముందే చెబుతాను. అపుడు నేను ఆలస్యంగా తిరిగొచ్చినా ఎవరినీ ఇబ్బంది పెట్టదు. కానీ బయట కుక్కలతో అంతగా కమ్యూనికేషన్ కష్టం.

ఒక రోజు మా అపార్ట్‌మెంట్‍‌లో ఓ మహిళ భయపడ్డాన్ని చూశాను. నా రెండు పెంపుడు కుక్కలు ఆమె చుట్టూ తిరుగుతున్నాయని, కరిచాయని ఆమె అంటోంది. నేను వెంటనే నవ్వు వచ్చింది. కరవడం అనేది కుక్కల సాధారణ లక్షణం. నేను మూడో తరగతి చదువుతున్నపుడు ఓ ఆడ కుక్క నన్ను కరిచింది. అయినా సరే నాకు వాటిపై ఎప్పుడూ ప్రేమ తగ్గలేదు. పైగా ఏటికేడాది అది పెరుగుతూనే ఉంది. ఇప్పుడు అవి లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. నేను అనేక చోట్ల బయట కుక్కలతో కూడా ఆడుకున్నాను. నేను పలకరించినప్పుడల్లా తోక ఊపుతూ ఉంటాయి. లూధియానా సమీపంలో ఓ పెట్రోల్ పంప్ దగ్గర కలిసిన కుక్క.. నాకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేది. నేను దానికి బిస్కెట్లు ఇచ్చానంతే. చాలా ఏళ్ల క్రితం నన్ను కరిచిన రాణి అనే కుక్క కూడా చెడ్డది కాదు. దానికి ఆకలిగా ఉన్న సమయంలో నా చేతిలో బ్రెడ్ ముక్క కనిపిస్తే లాక్కునేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో నన్ను కరవాల్సి వచ్చిందంతే. ఒక వేళ కుక్కలు కరవడం నిజమే అయితే.. షేరు ఎప్పుడూ నన్ను కానీ నా కుక్క పిల్లలను కానీ ఎందుకు ఏమీ అనలేదు? అదే కాదు నేను ఆహారం పెట్టిన వేరే కుక్కలు కూడా నన్ను ఎప్పుడూ ఏమీ అనేవి కాదు. నేను వాటి దగ్గర ఉన్నపుడు అవి సంతోషంగా ఉండడమే ఇందుకు కారణంగా చెప్పచ్చు. అవి నా మీదకు ఎగిరేవి.. అరిచేవి కూడా. అయితే అదేమీ నన్ను గాయపరించేందుకు కాదు వాటి ఆప్యాయతను అలా చెప్పేవంతే. నాతో అడుకునేందుకు ప్రయత్నించేవి. నేను ఎప్పుడూ మనిషి-జంతువు మధ్యలో ఆ తేడాని గమనించలేదు.

షేరు చివరి రోజుల్లో తను బతికిన ప్రాంతం నుంచి వెళ్లేందుకు ఇష్టపడలేదు. నేను సాయం చేద్దామని అనుకున్నా కానీ.. కానీ అలా ఆస్పత్రికి పంపించేయడంతో దాని నమ్మకం దెబ్బ తిని ప్రాణాల మీదకు తెచ్చుకుంటుందని నేను గమనించలేదు. రెండు వారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన షేరు.. ఒక రోజు శాశ్వతంగా వెళ్లిపోయింది. అది చనిపోయిందని చెప్పినపుడు నేను చాలా పశ్చాత్తాప పడ్డాను. నా ఇంటి తలుపు దగ్గర చిన్న కుక్క పిల్ల చనిపోయినపుడు కూడా చాలా బాధపడ్డాను. అర్ధరాత్రి అనే కారణంగా ఆ కుక్కపిల్లను రాత్రి సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లనందుకు ఆ తల్లి కుక్కకు నా క్షమాపణ చెప్పాను. నేను ఆహారం అందించిన చాలా కుక్కలకు భద్రమైన నివాస స్థలం అందించలేకపోయినందుకు బాధ పడుతూ ఉంాటను. సమాజం ఇంతగా అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్న మనం.. వాటి బాధను కష్టాలను పట్టించుకుంటున్నామా? ప్రపంచంలో అత్యంత ప్రేమించే జంతువులు అవేనని నేను చెప్పే మాటను నమ్మండి. ఎలాంటి నియంత్రణలు లేని ప్రేమను కుక్కలు అందిస్తాయి. మనుషుల్లాగా అవి తిరిగి ఏమీ ఆశించవు.

కుక్కలు కరిచాయని చెప్పని మనిషిని నేనిప్పటివరకూ కలవలేదు. అవి కరుస్తాయనే విషయాన్ని నేను ఖండించడం లేదు. అయితే వాటికి భయం వేసినపుడో వాటిని కొట్టినపుడో వాటిని బెదిరించినపుడో మాత్రమే అవి కరుస్తాయి. వాటికి బాగా ఆకలి కానీ దప్పిక గానీ వేసినపుడు.. ఆహారం, నీరు కోసం విపరీతంగా వెతుక్కునే సమయంలో కూడా కరుస్తాయి. సాధారణంగా గ్రామాల్లో కుక్కలకు నీరు, ఆహారం అందించడం సంప్రదాయాల్లో భాగంగా ఉంటుంది. మనిషికి జంతువులకు మధ్య ఓ సన్నిహిత అనుబంధం ఎప్పుడూ ఉంటుంది. అయితే నగరాల్లో వాటిని అనాథలు చేసేస్తున్నాం. కుక్కలకు భద్రమైన ప్రదేశం ఉండడం లేదు. ఈ భయంకరమైన పరిస్థితిలోనే అవి బతకాల్సి వస్తోంది. ఏ సమయంలో అయినా రోడ్డుపై వెళ్లే ఏదో ఓ వాహనం కింద పడి చనిపోయే పరిస్థితిలో ఉంటున్నాయి. మనం మనుషులమే అయినా వాటిని పట్టించుకోవడం మానేయడమే కాకుండా.. తిరిగి వాటినే ఆరోపిస్తున్నాం.

రచయిత - అశుతోష్, ఆప్ పార్టీ అధికార ప్రతినిధి

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags