సంకలనాలు
Telugu

మిమ్మ‌ల్ని మీరు న‌మ్ముకోండి! ప్ర‌పంచం మీవెంట నిలుస్తుంది! స‌న్నీ చెప్పిన పాఠాలు!!

RAKESH
24th Jan 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

క‌ర‌ణ్ జిత్ కౌర్ అంటే బ‌హుశా ఎవ‌రికీ తెలియ‌దు! స‌న్నీ లియోన్ అని చెప్తే- ఠ‌క్కున స్ట్ర‌యిక్ అవుతుంది! మ‌రి క‌ర‌ణ్ జిత్ స‌న్నీగా ఎలా మారింది? పోర్న్ స్టార్ ఇమేజ్ ఆమెను ఎప్పుడైనా బాధ‌పెట్టిందా? గ‌తాన్ని త‌లుచుకొని క‌న్నీళ్లు పెట్టుకున్న సందర్భముందా? మొన్నామ‌ధ్య ఓ ఛానెల్ ఇలాంటి ప్ర‌శ్న‌లే స‌న్నీకి సంధించింది. ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తి కాస్త క‌రుకుగా, మ‌న‌సు చివుక్కుమ‌నేలా ప్ర‌శ్న‌ల వర్షం కురిపించాడు. కానీ స‌న్నీ లియోన్ వాటికి కించిత్ తొణ‌క‌లేదు, బెణ‌క‌లేదు. ప్ర‌తీ ప్ర‌శ్న‌కు సూటిగా జ‌వాబిచ్చింది. అంతేకాదు, వాటి నుంచి ఆమె మ‌న‌కూ కొన్ని జీవిత పాఠాలు నేర్పింది!

Credit – CNN-IBN

Credit – CNN-IBN


1. ఎప్పుడూ స‌హ‌నం కోల్పోవద్దు

స‌న్నీ లియోన్ కి సంధించిన ప్ర‌శ్న‌ల వ‌ర్షం చూస్తే.. ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తి అజెండా ఏంటో స్ప‌ష్టంగా తెలిసిపోతుంది. కానీ ఏ ఒక్క ప్ర‌శ్న‌కూ స‌న్నీ ఇబ్బంది ప‌డ‌లేదు. అన్నింటికీ దీటుగా, డిగ్నిఫైడ్ గా జ‌వాబిచ్చింది. పైగా త‌న‌ను ఇబ్బంది పెట్టే సంతోషాన్ని ఎవ‌రికీ ఇవ్వ‌నంటూ జర్నలిస్టు భూపేంద్ర చౌబేకి కాస్త సూటిగానే స‌మాధానం చెప్పింది.

2. మిమ్మ‌ల్ని మీరు ప్రేమించుకోండి

ఇదివ‌ర‌కు చేసిన‌, ఇప్పుడు చేస్తున్న ప‌ని విషయంలో నిజాయితీగా ఉండండి. ఫ‌లానా ప‌ని చేస్తే ఇబ్బంది త‌ప్ప‌ద‌ని అనిపించినప్పుడు అస్స‌లు దాన్ని ముట్టుకోవ‌ద్దు. అవ‌కాశ‌మిస్తే గ‌తాన్ని స‌రిదిద్దుకుంటారా అన్న ప్ర‌శ్న‌కు- నో అని సన్నీ నిర్మొహ‌మాటంగా ఇచ్చిన రిప్లై ఆలోచింపజేస్తుంది.

3. మీ కృషిని గౌర‌వించుకోండి

జీవితంలో ఏదీ ఈజీగా రాదు. మీరు గెలిచారంటే ఆ క్రెడిటంతా మీకే ఇచ్చుకోండి. ఇన్ ఫాక్ట్ స‌న్నీఅభిప్రాయం కూడా ఇదే. మంచో చెడో జీవితంలో తాను చేసిన ప‌నులే ఇవాళ త‌న‌నీ స్థాయిలో కూర్చోబెట్టాయంటారామె!

4. ప్రతీ ప‌నిలో మంచినే చూడండి

ఏం చేశావ‌న్న‌ది అన‌వ‌స‌రం. ఆ అనుభ‌వం అసాధార‌ణ‌మైనా, క‌ష్ట‌మైనా స‌రే ప‌నిలో మంచినే ఎంచు. స‌న్నీ అభిప్రాయం కూడా అదే. ఇప్పటిదాకా త‌న‌కెలాంటి హార‌ర్ స్టోరీస్ లేవ‌ని, త‌న‌నెవ‌రూ ప‌ల్లెత్తు మాట అన‌లేద‌ని!

5. త‌ప్పుల నుంచి గుణ‌పాఠాలు నేర్వండి

త‌ప్పులు చేయ‌డం మాన‌వ స‌హ‌జం. అంత మాత్రాన త‌ల‌దించుకోవాల్సిన ప‌నిలేదు. త‌ప్పులే నిన్ను ఉన్న‌తంగా తీర్చిదిద్దుతాయి. స‌న్నీ కూడా త‌ప్పులు చేసింది. కానీ వాటి నుంచి ఎంతో కొంత నేర్చుకుంది. గతంలో చేసిన త‌ప్పుల‌కు ఎప్పుడూ ప‌శ్చాత్త‌ప ప‌డ‌లేద‌న్న‌దే స‌న్నీ స‌మాధానం.

6. పాజిటివ్ గా ఆలోచించండి

ఎవ‌రో ఏదో అన్నార‌ని బాధ‌ప‌డొద్దు. లోకులు కాకులు. వాళ్ల నోరు వాళ్ల ఇష్టం. అది వాళ్ల హ‌క్కు. కానీ ఆ మాట‌ల‌ను నేనెప్పుడూ ప‌ట్టించుకోను. ఇత‌రుల్నిబాధ‌పెట్ట‌డం తన మ‌న‌స్త‌త్వం కాద‌న్న స‌న్నీ మాట‌ల్లో ఒకింత వేదాంతం క‌నిపిస్తుంది. ఆలోచిస్తే నిజ‌మే క‌దా అనిపిస్తుంది!

7. సక్సెస్ ను సెల‌బ్రేట్ చేసుకో..!

చిన్న‌దో పెద్ద‌దో! విజ‌యం సాధిస్తే పొంగిపో! సెల‌బ్రేట్ చేసుకో! పండగ చేస్కో!

8. కలలు కనండి..!

ఎంత సాధించినా, ఎంత పాపుల‌ర్ అయినా స‌రే- ఇంకా క‌ల‌లు క‌ను. వాటిని సాకారం చేసుకో. తనకూ కొన్ని క‌ల‌లు ఉన్నాయంటోంది స‌న్నీ..!

9. ప‌నిలో ఆనందం వెతుక్కో !

ప‌నిని ఎంజాయ్ చేసిన‌ప్పుడే విజ‌యం ద‌క్కుతుంది. వ‌ర్క్ హార్డ్! డూ బెట‌ర్!

10. సంతోష‌మే స‌గంబ‌లం !

ఒక్క‌టి గుర్తు పెట్టుకోండి! ఎంత క‌ష్ట‌మొచ్చినా ముఖం మీద చిరున‌వ్వు చెర‌గ‌నీయ‌కండి. సంతోషానికి మించిన బ‌లం లేదు. ఇది స‌న్నీలియోన్ చెప్పిన మాట మాత్ర‌మే కాదు- జీవిత స‌త్యం కూడా!!

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags