సంకలనాలు
Telugu

మార్కెట్ ని షేక్ చేసిన ‘మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్’

ashok patnaik
22nd May 2016
Add to
Shares
49
Comments
Share This
Add to
Shares
49
Comments
Share


హైదరాబాద్ మార్కెట్ లోక వచ్చిన అనతి కాలంలోనే అనూహ్యంగా ఫేమస్ అయిపోయిన మిల్క్ షేక్ బ్రాండ్ ఇది. హైదరాబాద్, బెంగళూరు హైవేలో ఒక ఔట్లెట్ తో ప్రారంభమైన మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ ఇప్పుడు హైదరాబాద్ లో 13 ఔట్ లెట్ లతో జనానికి సేవలందిస్తోంది.

“మిల్క్ షేక్స్ ఇక్కడ జనానికి యాప్ట్ కాదని మొదట్లో నాతో చాలా మంది అన్నారు,” రాహుల్ తిరుమల ప్రగడ

మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ కు రాహుల్ ఫౌండర్ సిఈఓ. కానీ ఇప్పుడు ఫ్రాంచైజీలతో సరికొత్త ఔట్ లెట్స్ రావడం చూసి శెభాష్ అంటున్నారు.

image


‘మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్’ పనితీరు

ఈ సంస్థకు ప్రస్తుతం హైదరాబాద్ లోనే 13 ఔట్ లెట్స్ ఉన్నాయి. అందులో 6 ఫ్రాంచైజీలున్నాయి. మొదటి ఔట్ లెట్ ప్రారంభించిన 4 నెలలకు మాదాపూర్ కు చెందిన వ్యాపార వేత్త నుంచి ఆఫర్ వచ్చింది. అక్కడ ఫ్రాంచైజీ పెట్టాలనేది ఆ ఆఫర్ సారాంశం. అలా సిటీలో మొదటి ఫ్రాంచైజీతో పాటు మొదటి ఔట్ లెట్ అదేకావడం విశేషం. అనంతరం సికింద్రాబాద్ లో స్టోర్ ప్రారంభించారు.

“ఇప్పుడు నెలకొక ఔట్ లెట్ ను ప్రారంభిస్తున్నాం,” రాహుల్

వచ్చే నెలలో వైజాగ్ లో రెండు, విజయవాడలో ఒక ఔట్ లెట్ లను ప్రారంభిస్తున్నామని రాహుల్ చెబుతున్నారు. అన్ని కలిపి ప్రతి రోజు 1200 నుంచి 1300 గ్లాసులను అమ్ముతున్నామని అంటున్నారు. ఒక్కో గ్లాస్ యావరేజ్ గా చూస్తే 160 రూపాయలు ఉంటుందని అన్నారాయన.

“మాకు ఆన్ లైన్లో 40శాతం ఆర్డర్లొస్తున్నాయి,” రాహుల్

స్విగ్గీ లాంటి లాజిస్టిక్ ఫుడ్ స్టార్టప్ లతో టై అప్ కావడంతో లాజిస్టిక్స్ సమస్య లేదని అంటున్నారు. సమ్మర్ లో సేల్స్ ని బాగా పెంచుకోవడంతో పాటు బ్రాండ్ ని కూడా జనంలోకి తీసుకెళ్లగలిగామని రాహుల్ చెప్పారు.

మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ టీం

ఇందులో ప్రధానంగా చెప్పుకోదగింది రాహుల్ గురించే. జెఎంటియూ లో బిటెక్ పూర్తి చేసిన రాహుల్ అనంతరం లండన్ వెళ్లిపోయారు. అక్కడ 2010 లో పిజిడిఎం చదువుతున్నప్పు వచ్చిన ఐడియా ఇది. సందర్లాండ్స్ యూనివర్సి నుంచి పీజీ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఆరు నెలల మార్కెట్ రీసెర్చ్ చేశారు. 2013 చివరి లో మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ మార్కెట్ లోకి వచ్చింది. అభిలాష్ చంద్రారెడ్డి మరో కో ఫౌండర్. బిటెక్ పూర్త చేసిన అభిలాష్ టెక్ సపోర్ట్ అందిస్తున్నారు. శ్రీనివాస్ తాటి, సుంజయ్ టంగుటూరి లు టీంలో కీలక సభ్యులు. మార్కెటింగ్ వ్యవహారాలన్నీ వీళ్లిద్దరే చూసుకుంటున్నారు. వీరితో పాటు 49మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు.

రాహుల్, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఫౌండర్

రాహుల్, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఫౌండర్


ప్రధాన సవాళ్లు, మార్కెట్ పొటెన్షియల్

మొదట్లో కస్టమర్లను తీసుకు రావడం కష్టంగా ఉండిందని రాహుల్ అన్నారు. ప్రస్తుతం ఈ సమస్యను అధిగమించామని చెప్పుకొచ్చారు.

ఫుడ్ స్టార్టప్ కు ఉండే సవాళ్లే మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ కు కూడా ఉన్నాయి. ప్రస్తుతం లాభాల్లో ఉన్న ఈ సంస్థ భవిష్యత్ లో ఇదే క్వాలిటీ తో ఉన్నంత వరకూ ఢోకా లేదు. దీన్ని సస్టేయిన్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని అధిగమించాల్సి ఉంది.

ఫుడ్ రంగంలో ఎన్ని సంస్థలొచ్చినప్పటికీ మరో సంస్థ రాడానికి అవకాశాలుంటాయి. ఇండియాలో బిలియన్ డాలర్ మార్కెట్ ఫుడ్ రంగానికి ఉంది. అందులో ఐస్ క్రీమ్ ఇతర మిల్క్ షేక్స్ వాటా 25నుంచి 30శాతం ఉంది. ఇది మెట్రోనగరాల మార్కెట్. ఇతర టూ టియర్ సిటీస్ లో కూడా ఫుడ్ స్పేస్ సక్సెస్ అయ్యే బిజినెస్సే.

భవిష్యత్ ప్రణాళికలు, ఫండింగ్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పట్టణాలకు వ్యాపించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. తర్వాత పూణే, మహారాష్ట్రలకు సేవలను విస్తరిస్తామని రాహుల్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది చివరి కల్లా మొబైల్ యాప్ ను లాంచ్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మలేషియా, సింగపూర్ లలో తమ ఫ్రాంచైజీ కోసం ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని త్వరలోనే ఫైనల్ చేయబోతున్నట్లు ఆయన వివరించారు.

ప్రస్తుతం పూర్తిస్థాయి బూట్ స్ట్రాపుడ్ కంపెనీ అయిన మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ సిరీస్ ఏ రౌండ్ లో తమతో కలసి వచ్చే వారితో ఫండింగ్ కు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అన్ని పట్టణాలకు సేవలను విస్తరించడానికి ఫండింగ్ అవసరం ఉంటుందని రాహుల్ అన్నారు.

“ప్రపంచంలోనే ది బెస్ట్ మిల్క్ షేక్ బ్రాండ్ గా మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ని మార్చాలనేది తమ లక్ష్యమని రాహుల్ ముగించారు.”
image


website

Add to
Shares
49
Comments
Share This
Add to
Shares
49
Comments
Share
Report an issue
Authors

Related Tags