సంకలనాలు
Telugu

మెటల్ ఇండస్ట్రీని దున్నేస్తున్న తండ్రీ కూతుళ్లు

Pavani Reddy
7th May 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


సమస్యలకు సృజనాత్మక పరిష్కారం చూపుతూ చాలా స్టార్టప్స్ పుట్టుకొస్తుంటాయి. వేరే కంపెనీల్లో పనిచేసేకన్నా సొంతంగా ఏదో చేయాలన్న ఆలోచన నుంచే అంకుర సంస్థలు మొగ్గ తొడుగుతుంటాయి. అదే కోవకు చెందుతుంది మెట్లెక్స్ రీసెర్చ్ సంస్థ. 26 ఏళ్ల సలోనీ మార్డియా - లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేశారు. కార్పొరేట్ జాబ్ వచ్చినా… వద్దనుకున్నారు. తన తండ్రికున్న నాన్ ఫెరస్ మెటల్స్ వ్యాపారంలోనే ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు. ముప్ఫై ఏళ్లుగా తన తండ్రి సునీల్ మార్డియా ఈ వ్యాపారం చేస్తున్నారు. 2013లోనే లండన్ నుంచి ఇండియా వచ్చి తండ్రి సునీల్ కలిసి మెట్లెక్స్ రీసెర్చ్ పేరుతో స్టార్టప్ ఏర్పాటు చేశారు సలోనీ.

దాచుకున్న కొద్దిపాటి సొమ్ముతోనే మెట్లెక్స్ రీసెర్చ్ స్టార్టప్ ను ఏర్పాటు చేశారు. ఇది మార్కెట్ ఎనాలసిస్ వెబ్ సైట్. ఇందులో నాన్ ఫెరస్ మెటల్స్, అలోయ్స్ మెటల్స్ గురించి పూర్తి వివరాలుంటాయి. ఇనుము తప్ప వివిధ లోహాల ధరలను ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు చెబుతుంది. లండన్ మెటల్ ఎక్సేజ్, బోంబే మెటల్ ఎక్సేంజ్ సహా లోకల్ మార్కెట్స్ లో ధరలను కస్టమర్లకు అందిస్తుంది. టెండర్లు, ఇంపోర్ట్ – ఎక్స్ పోర్ట్ డాటా, ప్రాజెక్టులు, ఇండస్ట్రీ న్యూస్, టెక్నికల్ స్పెసిఫికేషన్స్, డిమాండ్ అండ్ సప్లై, వెయిట్ క్యాలిక్యులేషన్స్ డాటాను మెట్లెక్స్ రీసెర్చ్ లో చూడవచ్చు.

భాగస్వామ్యం

మెట్లెక్స్ రీసెర్చ్ తో 25 జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ నాన్ ఫెరస్ మెటల్ కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. ఇండియన్ కాపర్ డెవలప్మెంట్ సెంటర్, మెటల్ బులెటిన్ – యూకే, బీఎంఈ, అల్యూమినియం అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియా లెడ్ అండ్ జింక్ డెవలప్మెంట్ అసోసియేషన్ వాటిలో కొన్ని. అంతేకాదు మార్కెట్లో మంచి అనుభవమున్న 20 మంది ప్రొఫెషనల్స్ ఈ వెబ్ సైట్ కు ఆర్టికల్స్ రాస్తుంటారు. ఎప్పటికప్పుడు సాయమందిస్తుంటారు. మార్కెట్లో లోటుపాట్ల గురించి ఎప్పటికప్పుడు సలహాలు , సూచనలిస్తుంటారు. త్వరలో మెట్లెక్స్ మొబైల్ యాప్ ను మార్కెట్లోకి తీసుకురానున్నారు సలోనీ. 

image


ఔట్ సోర్సింగ్ కంపెనీగా మొదలై…

వేరే లోహ కంపెనీలకు ఔట్ సోర్సింగ్ చేసేందుకు మెట్లెక్స్ రీసెర్చ్ సంస్థను ప్రారంభించారు. అయితే అది వర్కవుట్ కాలేదు. దీంతో మెటల్ ట్రేడ్ లో పండితులైన కొంతమందితో కలిసి దీన్ని ఒక సమగ్ర సమాచారం అందించే వెబ్ సైట్ గా మార్చారు. మార్కెటింగ్, బయ్యర్స్, సెల్లర్స్, కంటెంట్, కొలాబరేషన్ పై దృష్టి పెట్టి నాన్ ఫెరస్ మెటల్స్ రంగంలో సమస్యలను పరిష్కరిస్తూ దూసుకెళ్తున్నారు. తండ్రీ కూతురు కలిసి Mtlexspot.comను ప్రారంభించారు. మెట్లెక్స్ గ్రూప్ కి ఈ మార్కెట్ ప్లేస్ గా ఉపయోగపడుతోంది. దీనికి NeML, నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్సేంజ్ లిమిటెడ్ (NCDEX) పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. పెట్టుబడుల సమస్య లేదు.

ఎలా పనిచేస్తుంది?

మెటలెక్స్ స్పాట్ డాట్ కాం అమ్మకందారులు, కొనుగోళ్లదారులను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఆన్ లైన్ ఆక్షన్ నిర్వహిస్తుంది. దేశీయ తయారీదారులేకాదు అంతర్జాతీయ స్క్రాప్ డీలర్స్, స్టాకిస్టులు సైతం ఇందులో ఉంటారు.

“ఇండస్ట్రీలో చిన్న, మధ్య తరహా వ్యాపారులే లక్ష్యంగా వెబ్ సైట్ ఉంటుంది. నిజానికి పెద్ద మార్కెట్ వాళ్లే. NeMLతో ఒప్పందం చేసుకున్నాం. 50:50 నిష్పత్తిలో లాభాలను Mtlexs- NeML పంచుకుంటాయి,” సునీల్ మార్డియా, వ్యవస్థాపకుడు

నాన్ ఫెరస్ మెటల్స్ వ్యాపారంలో సునీర్ మార్డియా భాగంగా దేశ విదేశాలు తిరిగారు. చాలా పరిశోధనలు చేశారు. అంతర్జాతీయ వేదికలపై మాట్లాడారు. పెద్ద పెద్ద కంపెనీలతో డీలింగ్స్ పెట్టుకున్నారు. గ్లోబల్ మార్కెట్లు, ధరలను తేలికగా విశ్లేషించగలరు. మెట్లెక్స్ లో వెయ్యికిపైగా ఉత్పత్తులున్నాయి. 109 దేశాల నుంచి 24 వేలమంది డిజిటల్ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు ఐదు లక్షల హిట్స్ వస్తున్నాయి.

మల్టీ నోడల్ రెవెన్యూ మోడల్

మెట్లెక్స్ రీసెర్చ్ కు చాలా మార్గాల నుంచి ఆదాయం వస్తోంది. మెట్లెక్స్ స్పాట్ ఆక్షన్ ఫ్లాట్ ఫాం నుంచి NeML తో కలిసి 50 శాతం ఆదాయం వస్తోంది. యాజర్స్ నుంచి ప్రతి ఏటా చందాల రూపంలో కొంత మొత్తం సమకూరుతోంది. కమీషన్లు, లావాదేవీలు, యాడ్స్, స్పాన్సర్ షిప్స్, పార్టిసిపేషన్ ఫీ, ట్రేడ్ ఈవెంట్స్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ ఛార్జెస్ ఇలా చాలా మార్గాల నుంచి ఇన్ కం వస్తోంది. ముంబై, కోల్ కతా, ఢిల్లీ, చెన్నై, కోయంబత్తూర్, జామ్ నగర్, అహ్మదాబాద్ సహా 20 నగరాల నుంచి తమకు ఆదాయం వస్తోందని సలోనీ చెప్తున్నారు. నిజానికి ఈ వెబ్ సైట్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు తండ్రీ కూతుళ్లు సునీల్ మార్డియా, సలోనీ మార్డియా.

”ఈ కామర్స్ ను గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ మీడియంగా మార్చడంతోపాటు… ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్ గా మార్చాలనుకుంటున్నాం. ఇది వేల వేటకోట్ల రూపాయల పరిశ్రమ”- సలోనీ

ప్రస్తుతం మెట్ రీసెర్చ్ ను ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, జామ్ నగర్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ప్రైమరీ ప్రోడక్ట్స్, స్క్రాప్ ప్రోడక్ట్స్ వ్యాపారం, నాణ్యత, దేశాన్ని బట్టి మారుతుంటాయి. ఈ కంపెనీకి 3 వందల వరకు కాంట్రాక్టులు వస్తాయని అంచనా. సేల్స్, మార్కెటింగ్ రంగంలోకి మరికొందరు ప్రొఫెషనల్స్ ను తీసుకోనున్నారు. భారత్ లో మరో 10 నగరాలకు, ఐదు విదేశాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మెట్లెక్స్ కంపెనీ.

ఇండస్ట్రీ ఇలా ఉంది

హిందాల్కో, వేదాంత, నాల్కో, హిందూస్థాన్ కాపర్, హిందూస్థాన్ జింక్ లాంటి సంస్థలు దేశంలో నాన్ ఫెరోస్ మార్కెట్ లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే ఈ రంగంలో లెక్కలేనన్ని చిన్న మధ్య తరహా కంపెనీలున్నాయి. ఏసీ, ఫ్రిజ్, హీట్ ఎక్సేంజ్, ఆటోమొబైల్,విద్యుత్ , రైల్వేలు, టెలికం, మెట్రో, గృహోపకరణాలు, ఫర్నిచర్, కన్ స్ట్రక్షన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ప్లంబింగ్, డిఫెన్స్ రంగాల్లో నాన్ ఫెరోస్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ రంగాల్లో చిన్న కంపెనీలదే డామినేషన్. ఈ రంగం స్థిరంగా ఎదుగుతుందనేది నిపుణుల అంచనా.

ఈ రంగంలో సరైన సమాచారం, ఫండింగ్ లేక ఇబ్బందులున్నాయి. చిన్న కంపెనీలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. క్వాలిటీ విషయంలోనూ కొన్ని సమస్యలున్నాయి. ముడి సరుకుపైనే కంపెనీలు 70 శాతం వరకు ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపుతోంది మెట్లెక్స్ రీసెర్చ్ సంస్థ. 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags