సంకలనాలు
Telugu

రైతులను, కొనుగోలుదారులను ఒకేచోటికి చేర్చే సాఫ్ట్ వేర్

అందరినోటా దాణా నెట్ వర్క్ మాట

ashok patnaik
24th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


దళారీ వ్యవస్థ పెరిగిపోవడంతో పండించిన రైతులకు గిట్టుబాటు ఉండడం లేదు... అదే విధంగా వినియోగదారులు ఎక్కువ ధర పెట్టి ఉత్పత్తులను కొనుక్కోవాల్సి వస్తోంది. మిడిల్ మేనేజ్మెంట్ తగ్గించి... అటు రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన పదార్ధాలను... తక్కువ ధరలకు అందించగలుగుతున్నామని చెబుతున్నారు దాణా నెట్ వర్క్ కో- ఫౌండర్ సుజాతా రమణి. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దాణా నెట్ వర్క్ ... రెండు సమాంతర వ్యవస్థలైన సేంద్రీయ వ్యవసాయం, జీవావరణవ్యవస్థలను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ సృష్టించారు.

image


ఈ నెట్ వర్క్ ద్వారా రైతుల నుంచి సహకార, చిల్లర మరియు వినియోగదారులకు కలిపేందుకు దోహదం చేస్తుందని సుజాతా చెప్పారు. ఇది కేవలం సోషల్ వెబ్ సైటే కాదు. ఇ-వాణిజ్యానికి ఒక వేదికగా మారిపోయింది. వ్యాపార నెట్ వర్క్ లోని సభ్యులకు సమాచారం అందించడమే కాదు..ఆయా ఉత్పత్తులుకు మార్కెటింగ్ సౌకర్యం కల్గిస్తుంది.

రైతులు, కొనుగోలుదారులు ఇద్దరూ ఒకే చోట ఉండడంతో ఇద్దరికి లాభయుక్తంగా ఉండేందుకు వ్యవస్ధ దోహదపడుతుంది. ఏఏ ఉత్పత్తులు ఉన్నాయో... ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ... ఇరువర్గాల వారిని భాగస్వామ్యం చేయవచ్చు, వారి పంటలు అమ్ముకొనే అవకాశం ఏర్పడింది.

దాణా నెట్వర్క్ సాఫ్ట్‌వేర్ ముఖ్యంగా రెండు అవసరాలు తీర్చేందుకు రూపొందించారు. నిరక్షరాస్యులైన రైతులకు వారి భావం... భాషను కమ్యూనికేషన్ తెలియచేయడంతో పాటు... 3G కనెక్షన్లు ద్వారా ఉత్పత్తులను ప్రదర్శించే విధంగా తయారు చేశారు. అయితే గ్రామీణ నేపధ్యంతో వచ్చే రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని రైతులకు అర్ధమయ్యే రీతిలో ఇంగ్లీషు బాషను తక్కువగా ఉపయోగించారు. ఎవరికి చదవడం, వ్రాయడం రాకపోయిన ప్రతిదీ దృశ్య పిక్టోగ్రాఫిక్ టూల్స్ ఆధారంగా ధర నిర్ణయిం ఉంటుంది. ఇక వస్తువు పరిమాణం, క్వాలిటీ, ధర, స్టాక్, చెల్లింపులకు సంబంధించి వివరాల కోసం ఎక్కువ పదాలు కాకుండా డేటాను వాడుతున్నారు.

ఇప్పుడు దాణా నెట్వర్క్ ... కంటెంట్‌ను రానున్న కొద్ది రోజుల్లో ఆరు వివిధ భారతీయ దక్షిణ భాషలలోకి అనువాదిస్తామని... భవిష్యత్ కార్యక్రమాల గురంచి అవగాహన వచ్చిందంటున్న సుజాత "ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాదిరిగా కాకుండా, ఇంటర్నెట్ భారతదేశం లో చాలా చౌకగా ఉందని చెప్పారు. ఇప్పుడు 3G కనెక్షన్ సులభంగా అందుబాటులోకి వచ్చేసిందిని... ఫోన్లు విపరీతంగా మార్కెట్లోకి రావడంతో రైతులు, వాళ్ల పిల్లలు... ఓ చిన్న స్మార్ట్ ఫోన్ ను 5 వేల నుంచి 7 వేల మధ్యలో కొనుగోలు చేసే స్థాయిలో ఉన్నారని చెబుతున్నారు. ఈస్మార్ట్ ఫోన్లలో యాప్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని చెబుతున్నారు.

దాణా నెట్వర్క్ వ్యవస్థాపకురాలు సుజాత

దాణా నెట్వర్క్ వ్యవస్థాపకురాలు సుజాత


దాణా నెట్ వర్క్ ప్రారంభించే ముందు, సుజాతా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అందరిలా ఏదో ఉద్యోగం చేస్తూ... రోటీన్‌గా ఉండే జీవితం ఆమెకు నచ్చలేదు. డిఫరెంట్ గా ఆలోచించాలని నిర్ణయించుకున్న ఆమె హైదరాబాద్‌లో సేంద్రీయ ఉత్పత్తులు, విత్తనాల కోసం రిటైల్ స్టోర్ ప్రారంభించారు. ఫెర్టిలైజర్స్‌తో కలుషితమవుతున్న ఆహార పదార్ధాలకు ధీటుగా సేంద్రీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్న సుజాత... 2012లో లో పార్ట్‌నర్ ఆషార్ ఫర్హాన్‌తో కలిసి దానా నెట్ వర్క్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు దానా నెట్ వర్క్ దక్షిణ భారతదేశం లో 35 వ్యవసాయ సహకార సంఘాలకు తగిన సూచనలు ఇస్తొంది.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పాడైపోయే వస్తువులు... ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఇతర వస్తువులను సేకరిస్తున్నామని సుజాత చెబుతున్నారు. రాబోయే రోజుల్లో రైతులు, రైతుల గ్రూపులు సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు... ప్రస్తుతం మాకు ఉన్న వ్యవసాయ సహకార సంస్థల సంఖ్యను 150 కు పెంచుకోవడం ముఖ్య లక్ష్యమని సుజాతా చెప్పారు. దానా నెట్ వర్క్ వ్యాపారంలో గొప్ప సవాళ్లను అధిగమిస్తూ....సేంద్రీయ వ్యవసాయ ఉత్పాదకత లాభాలను వివరించే పని చేస్తుందని అన్నారు.

"ప్రతి ఒక్కరికి సేంద్రీయ ఆహారం ఉత్తమం అని తెలుసు కానీ అది ఖర్చు ఎక్కువగా ఉంటుందనే ఆలోచనతో ఎవ్వరూ కొనుగోలు చేయడం లేదు. ఇప్పటివరకు మేము మా సొంత డబ్బుతో దానా నెట్ వర్క్ ను అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం, దానా నెట్వర్క్ సేవలను... రైతులు ఉపయోగించవచ్చు. "

పర్యావరణం పరిరక్షణ , సేంద్రియ ఆహారపు అలవాట్లు చేయడానికే ముందు మా ప్రాధాన్యత.. దీని వల్ల వినియోగదారులు పర్యావరణ ప్రేమికులుగా మారతారు..అప్పుడు లాభదాయకమైన మార్కెట్ నిర్మించడం ఈజీ అవుతుందంటారు..సంస్థ నిర్వహకులు. సేంద్రీయ వ్యవసాయం ఉత్పత్తి ఊహించలేనంతగా పెరగింది. మరో వైపు అమ్మకపు పన్ను తక్కువగా ఉండడం కారణాల వల్ల రైతులు పంట వైపు దృష్టి సారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేము చేస్తున్న ఈ ప్రయత్నంతో సేంద్రీయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి. సేంద్రీయ ఉత్పత్తులు పండిస్తున్న రైతుల వివరాలను గ్రామాల్లోని మిగిలిన రైతులకు అందించేందుకు స్వచ్చంద సంస్థల సహాకారాన్ని తీసుకుంటున్నాము.

అషర్ ఫర్హాన్, దాణా నెట్వర్క్ సహ వ్యవస్థాపకులు

అషర్ ఫర్హాన్, దాణా నెట్వర్క్ సహ వ్యవస్థాపకులు


రైతులు సేంద్రీయ వ్యవసాయ యొక్క ప్రయోజనాలు గుర్తిస్తారు కాబట్టి స్థిరంగా నెలవారీ డిమాండ్‌కు తగ్గట్టుగా అందించడంపైనే మా దృష్టి అంతా ఉంటుందని సుజాత వివరిస్తున్నారు. దానా నెట్వర్క్ ను ఆదాయ వ్యవస్థలా మార్చేందుకు ఆలోచిస్తున్నామని, ఇది సాంప్రదాయకంగా సేంద్రీయ ఆహార ఉత్పత్తుల తయారు ఖర్చులు తగ్గించడం ద్వారా దృష్టి సారిస్తున్నారు. సంస్థ అభివృద్ధి కార్యకలాపాలు పూర్తిగా పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్నవి... అయితే ఆర్గానిక్ ఫుడ్స్ ను ఆన్ లైన్ నెట్ వర్క్ ద్వారా ప్రోత్సహించడం వల్ల రైతులకు, వినియోగదారులకు మధ్య (మిడిల్ మాన్) మధ్యవర్తిని కట్ చేయగలిగాము .అయితే రవాణా అంశాలపై గందరగోళం ఉంది... దీనికి పరిష్కారం వెతకడం ద్వారా వినియోగదారుల్లో సేంద్రీయ వ్యవసాయానికి మంచి మద్దతు దొరకుతుంది.

మొత్తానికి దాణా నెట్ వర్క్ ఒక మంచి మార్గం అనుకుంటున్నానని.. సేంద్రీయ ఉత్పత్తులపై అవగాహన పెరిగినట్లయితే.... ఫ్యూచర్ ట్రేడింగ్ బాగా ఉంటుంది. మేము నెట్ వర్క్ పరిణామాలు గమనిస్తూనే, భవిష్యత్తు ప్రాజెక్టులు అనుసరిస్తామని ధీమాతో చెబుతున్నారు సుజాత..

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags