సంకలనాలు
Telugu

ఏం తింటే ఆరోగ్యంగా ఉంటామో తెలుసుకోవాలనుందా? అయితే ఫల్ పూల్‌ని అడుగుదాం రండి!!

డైట్ కంట్రోల్ కోసం యాప్ డెవలప్ చేసిన సునీల్-ఫల్ పూల్ సాయంతో కస్టమర్ల ఆరోగ్య పరిరక్షణ -

uday kiran
9th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

లాభార్జన కోసం ఒకరు. సొంతకాళ్లపై నిలబడాలన్న తపనతో మరొకరు. బడా వ్యాపారవేత్తల స్పూర్తితో ఇంకొకరు. ఇలా వ్యాపార రంగంలో అడుగుపెట్టడం వెనుక ఒక్కొక్కరికీ ఒక్కో ఆశయం ఉంటుంది. కానీ గుజరాత్ కు చెందిన సునీల్ సూరి బిజినెస్ లోకి ఎంటరయ్యేందుకు మాత్రం బలమైన కారణముంది. సరైన డైట్ గురించి అవగాహన లేక తల్లిదండ్రుల్ని కోల్పోయాన్న ఆవేదనే ఆయనతో ఓ స్టార్టప్ కు పునాదులు వేయించింది.

image


డైట్ ప్లాన్ చెప్పే మెనూ ప్లానర్

సునీల్ సూరి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో బ్రెస్ట్, స్టమక్ క్యాన్సర్ తో తల్లి చనిపోయింది. ఆ బాధ నుంచి తేరుకోక ముందే డయాబెటిస్‌తో తండ్రి దూరమయ్యాడు. వారిద్దరి మరణం సునీల్ జీవితాన్నే మార్చేసింది. తల్లిదండ్రుల కోసం ఏ చేయలేకపోయానన్న బాధ ఆయనను వెంటాడింది. కనీసం డయాబెటిస్ ఉన్న తండ్రి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఆయన మరికొంత కాలం బతికే వారన్న వేదన తనను కలిచివేసింది. ఆహారం, ఆరోగ్యం విషయంలో జనాల్లో అవగాహన పెంచాలని. అదే తన తల్లిదండ్రులకు తానిచ్చే ఘనమైన నివాళి అని అప్పుడే డిసైడయ్యారు సునీల్.

ఫల్ పూల్ సూపర్ సక్సెస్

జనాల్లో ఆహారం, ఆరోగ్యంపై అవేర్ నెస్ పెంచేందుకు స్వదేశ్ మెనూ ప్లానర్ యాప్ డెవలప్ చేశాడు సునీల్. ఎవరైనా తమ డైట్ ప్లాన్స్ ను ఇందులో అప్ లోడ్ చేస్తే డైటీషియన్లు వాటిని చెక్ చేసి అందులో మార్పులు చేర్పులు సూచించే యాప్ ఇది. ఈ అప్లికేషన్ ను డెవలప్ చేసేందుకు సునీల్ కు రెండు నెలల సమయం పట్టింది. కానీ దురదృష్టం ఏమిటంటే ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించినా 6 నెలల వరకు దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడే ఆయనకు మరో మెరుపులాంటి ఐడియా వచ్చింది. కేవలం మెనూ ప్లానర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కష్టమని గ్రహించిన సునీల్ సూరి.. ఆన్ లైన్ లో పండ్లు, కూరగాయలు విక్రయించే ఫల్ పూల్ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఫ్రూట్స్, వెజిటెబుల్స్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఫ్రీగా మెను ప్లానర్ సేవలు అందించడం మొదలుపెట్టారు.

నిజానికి ఆన్ లైన్ లో కూరగాయలు, పళ్లు అమ్మడం అనుకున్నంత ఈజీ కాదు. ఈ రంగంలో ఇప్పటికే చాలా స్టార్టప్స్ ఉండటంతో పోటీ తీవ్రంగానే ఉంది. ఈ రంగంలో కాంపిటీషన్ తట్టుకోలేక మూతబడ్డ స్టార్టప్ లు చాలానే ఉన్నాయి. కానీ ప్రజల్లో ఆహారం, ఆరోగ్యంపై అవగాహన పెంచాలంటే ఇంతకు మించిన మార్గంలేదని భావించిన సునీల్ వాయువ్య ఢిల్లీ కేంద్రంగా 2015 జూన్ లో ఫల్ పూల్ లాంఛ్ చేశారు. తొలుత కూరగాయలు, పళ్లను అందుబాటు ధరల్లోఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. అయితే వాటి డెలివరీ విషయంలో మాత్రం కొత్త పద్దతిని ఫాలో అయ్యారు. చాలా స్టార్టప్ లు సేమ్ డే డెలివరీకి ప్రిఫరెన్స్ ఇస్తుండగా.. సునీల్ మాత్రం సాయంత్రం ఆర్డర్ తీసుకుని మరుసటి రోజు ఉదయం వాటిని డెలివరీ చేయడం మొదలుపెట్టారు.

image


“ కస్టమర్లతో పాటు కంపెనీకి లాభం చేకూరేలా ఈ వెబ్ సైట్ పనిచేస్తుంది. మా వద్ద వృథా అనేది ఉండదు. కస్టమర్ల డిమాండ్ మేరకు కిరాణా సరుకులను అందిస్తున్నాం. త్వరలో మెడిసిన్స్, ప్లాంట్స్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నాం.”- సునీల్ సూరి, ఫల్ పూల్ ఫౌండర్

పెరుగుతున్న ఆదరణ

ఆరు నెలల్లో ఫల్ పూల్ 3 వేల మంది కస్టమర్లను సంపాదించుకుంది. రోజూ 45 వరకు ఆర్డర్లు వస్తున్నాయి. రోజులు గడిచే కొద్ది కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. ఫల్ పూల్ స్టార్టప్ కోసం సూరి ఇప్పటి వరకు 7 నుంచి 8లక్షల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం రోజు 20వేల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. అడ్వర్టైజింగ్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయకుండా నోటి మాట, పాంప్లెట్ల ద్వారానే కస్టమర్లకు చేరువకాగలిగారు సునీల్ సూరి. ఫల్ పూల్ తొలుత ఎలాంటి ఆఫర్లు, డిస్కౌంట్లు ఇచ్చేది కాదు. కానీ కస్టమర్ల కోరిక మేరకు గతేడాది నవంబర్ నుంచి కొత్త డిస్కౌంట్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

“మేం ఎలాంటి డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవ్వాలనుకోలేదు. కానీ కస్టమర్ల కోరిక మేరకు ఈ మధ్యనే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఎంతో ఆలోచించి ప్రయారిటీ ఆల్గారిథమ్ ను డెవలప్ చేశాం. 22 అంశాలను పరిగణలోకి తీసుకుని కస్టమర్లకు డిస్కౌంట్ ఇస్తున్నాం. ఈ విధానం బిజినెస్ టు కస్టమర్ సెగ్మెంట్ లో విప్లవాత్మక మార్పు తెచ్చింది. ఈ విధానం లాభసాటిగా ఉండటంతో 74 శాతం మంది కస్టమర్లు మళ్లీ ఆర్డర్లు ఇస్తున్నారు”- సునీల్ సూరి
image


బడా కంపెనీలకు దీటుగా

ఆహారం అనేది మనిషి ప్రాథమిక అవసరం. అందుకే ఇండియన్ రిటైల్ మార్కెట్లో కిరాణా సరుకులదే 60శాతం వాటా. గ్రోసరీ ఇండస్ట్రీ వాల్యూ ప్రస్తుతం 383 బిలియన్ డాలర్లు కాగా.. 2020 నాటికి ఇది ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అడ్వైజరీ కంపెనీ టెక్నో పాక్ అంచనా వేస్తోంది.

ప్రస్తుతం మార్కెట్ లో బిగ్ బాస్కెట్, జూప్ నౌ, గ్రోఫర్స్, పెప్పర్ ట్యాప్ జుగ్నూలదే హవా. ఇండియాలోని టాప్ 5 ఆన్ లైన్ గ్రోసరీ స్ట స్టార్టప్స్ ఇప్పటి వరకు 173.5 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించగా.. వాటిలో 120 మిలియన్ డాలర్ల 2015లోనే సమీకరించాయి. ఇందులో బిగ్ బాస్కెట్ వాటా 85.8మిలియన్లు కాగా.. గ్రోఫర్స్ షేర్ 45.5 మిలియన్ డాలర్లు.

పోటీ పెరిగిపోవడంతో కాంపిటీషన్ ను తట్టుకునేందుకు స్టార్టప్స్ ఎంతో కష్టపడుతున్నాయి. నిధుల్లో చాలా మొత్తాన్ని అడ్వర్టైజింగ్ కే ఖర్చు పెడుతున్నాయి. కానీ సునీల్ సూరి మాత్రం తక్కువ ఖర్చుతోనే కస్టమర్ల నమ్మకాన్ని పొంది ఎలాంటి నష్టాలు లేకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పాయింట్ కు చేరుకున్న ఫల్ పూల్ త్వరలోనే లాభాల బాట పడుతుందన్న నమ్మకంతో ఉన్నారు సునీల్ సూరి.

“బిజినెస్ కోసం మేం అనుసరిస్తున్న విధానం నష్టభయమన్నది లేకుండా చేస్తోంది. కస్టమర్లు ఆర్డర్ చేసిన సరుకుల్ని మరుసటి రోజు అందజేస్తాం. అదే రోజు డెలివరీ కావాలంటే మాత్రం 40 రూపాయలు ఛార్జ్ చేస్తాం.” సునీల్ సూరి

కిరాణా స్టోర్లకు అండగా

ఫల్ పూల్ ద్వారా చిన్న, మధ్య తరహా కిరాణా స్టోర్లకు లాభం చేకూర్చాలన్నది సునీల్ సూరి ఆలోచన. దుకాణదారులు ఇచ్చే ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లుకు వెబ్ సైట్ లో చోటు కల్పించి ఫల్ పూల్ ద్వారా వారు అమ్మకాలు జరిపే అవకాశం త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు. ఈ విధానం ద్వారా కస్టమర్లు తమ ఏరియాలోని షాపుల్లో ఉన్న ఆఫర్స్ గురించి తెలుసుకునే వెసలుబాటు కూడా కలుగుతుంది.

షేర్ యువర్ రెసిపి

ఈ మధ్యకాలంలో ఫల్ పూల్ వెబ్ సైట్ లో రెసిపీ షేరింగ్ సెగ్మెంట్ ను లాంఛ్ చేసింది. ఇది కుక్స్, చెఫ్స్, గృహిణులు ఆరోగ్యకరమైన వంటల తయారీ విధానాన్ని ఇతరులతో పంచుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ రకంగా ఆహారం ద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తనవంతు సాయం చేస్తోంది.

ప్రస్తుతం ఫల్ పూల్ కార్యకలాపాలు ద్వారకాకు మాత్రమే పరిమితం కాగా భవిష్యత్తులో ఇతర ప్రాంతాలను విస్తరించాలని సునీల్ భావిస్తున్నారు.2016 నాటికి ఢిల్లీ, గుర్గావ్, నోయిడాల్లోనూ సేవల్ని ప్రారంభించాలని సునీల్ భావిస్తున్నారు. మార్పులు చేర్పులు చేసి స్వదేశీ మెనూ ప్లానర్ ను త్వరలోనే రీ లాంఛ్ చేసేందుకు సునీల్ సూరీ రెడీ అవుతున్నారు.

కాలంతో పరిగెడుతున్న జనం తమ ఆహారపు అలవాట్ల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా చిన్న వయసులోనే బీపీ, డయాబెటిస్ లాంటి రోగాల బారినపడుతున్నారు. ఇలాంటి వారికి స్వదేశీ మెనూ ప్లానర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆహారం, ఆరోగ్య పరిరక్షణపై జనానికి అవగాహన కల్పిస్తున్న సునీల్ సూరి లాంటి వారి కృషి అభినందనీయం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags