సంకలనాలు
Telugu

సూఫీ సంగీత ప్రపంచంలో సిక్కు యువతి ప్రభంజనం

సంగీతానికి కులం, మతం, భాష అడ్డుకావు..చిన్ననాటి నుంచే సంగీతంతో సోనమ్‌కు అనుబంధం..ఆర్ట్ డైరక్టర్‌గా కెరీర్ ప్రారంభం..బీబీసీ, స్టార్ వాల్డ్ ఛానెళ్లలో కార్యక్రమాలు..మానవత్వానికి ప్రతీక సూఫీయిజం..మతాల అడ్డుగోడలు..సాంస్కృతిక సంకెళ్లు తెంచుకొని..ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు

r k
21st Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఆ గానానికి క్రూర మృగాలు సైతం మైమరిచిపోతాయి. ఆయన అత్యద్భుతమైన పాట వింటే సూర్యుడు కూడా అస్తమించడం మర్చిపోతాడు. మేఘాలు వర్షిస్తాయి. దీపాలు దేదీప్యమానంగా వెలుగుతాయి. అది.. ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్యాంసుడు తాన్‌సేన్ అతులిత గాన మాధురీ మహిమ. సంగీతానికి అంతటి శక్తి ఉంది.

సంగీతానికి భాష లేదు. ఎల్లలులేవు.. సరిహద్దులు అస్సలే లేవు. ఆత్మజ్యోతిని వెలిగిస్తుంది. ఆ అత్యున్నత శక్తిని రగిల్చేందుకు సంగీతమనే మంత్రంతో సూఫీ గోస్పల్ ప్రాజెక్ట్‌ను సృష్టించింది సోనమ్ కల్రా. వేర్వేరు మధురమైన గళంతో సంగీతమనే సాధనాలను ఉపయోగించి ఓ భాషగా మార్చే ప్రయత్నం చేసానంటుంది సోనమ్.

image


చిన్ననాటి నుంచే సంగీతం సోనమ్ జీవితంలో ఓ భాగమైపోయింది. అమ్మ తన ల్యాప్ ట్యాప్‌లో బేగమ్ అక్తర్ గానాన్ని వింటూ తన్మయత్వంలో మునిగిపోవడం, ఆపై ఆమె ప్రశాంత వదనం సోనమ్‌కు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం.

సోనమ్ జీవితంలో చాలా చిన్నతనంలో సంగీతంతో సంబంధమేర్పడింది. అయితే చిన్నప్పటి నుంచే సంగీతాన్ని నేర్చుకున్నప్పటికీ... సంగీతంతో నిజమైన ప్రయాణం మాత్రం ఆ తర్వాతే మొదలైంది. ఇండియా బంగ్లాదేశ్ యుద్ధంలో పని చేసిన జనరల్ అరోరా మనమరాలుగా.. ఢిల్లీకి చెందిన సోనమ్ చిన్నప్పటి నుంచి విశాల భావాలు, సాంస్కృతిక అభిరుచి ఉన్న వాతావరణంలో పెరిగింది. ఇంట్లో ఉన్న ముగ్గురు అమ్మాయిలకు కుటుంబసభ్యుల నుంచి మంచి ప్రోత్సాహం ఉండేది. ఏ విషయంలోనైనా అబ్బాయిలకన్నా మేమేం తక్కువకాదన్నట్టు ఉండేవారు సోనమ్, ఆమె చెల్లెళ్లు. నీతి , నిజాయితీ, నిబద్ధతలతో ఉన్నంత కాలం దేన్నైనా సాధించవచ్చన్న నమ్మకం వాళ్లది. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి సోనమ్ గ్రాఫిక్ డిజైన్ కోర్సులో డిగ్రీ చేసింది.

ఆర్ట్ డైరక్టర్, కాపీ రైటర్, యాక్టర్, మరియు మ్యుజీషియన్

దాదాపు ఆరు నెలల పాటు అడ్వర్టైజింగ్ రంగంలో ఆర్డ్ డైరక్టర్‌గా పని చేసింది సోనమ్. చెప్పుకోదగ్గ ప్రాజెక్టులకు దర్శకత్వం వహించే అవకాశం రాకపోవడంతో కాపీ రైటింగ్ వైపు దృష్టి సారించింది. కొన్నాళ్లపాటు అటు ఆర్డ్ డైరక్టర్ గాను, ఇటు కాపీ రైటర్‌గానూ పని చేసింది. రెండు రంగాల్లో ఏది ఎంచుకుంటావని అడిగితే మాత్రం తన ఆలోచనా ప్రక్రియకు దగ్గరగా ఉండే కాపీ రైటింగ్‌నే ఎంచుకుంటానంటుంది.

సంగీతం నేర్చుకున్నప్పటికీ అడ్వర్టైజింగ్ రంగాన్ని విడిచిపెట్టలేదు. కానీ దేనిపైనా సరిగ్గా దృష్టి పెట్టలేకపోయేది. దీంతో 2000వ సంవత్సరంలో అడ్వర్టైజింగ్ రంగాన్ని పూర్తిగా పక్కనపెట్టి సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది. నేర్చుకోవడం కాస్త ఆలస్యం అయినా మంచి పట్టు సంపాదించింది. ఈ విషయంలో సంగీతంపై ప్రేమను రగల్చిన ఆమె తల్లికి కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే. తాను ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో దగ్గర సోదరుల వద్ద ఏడాది పాటు శిష్యరికం చేసింది.

అయితే ఆమె సీరియస్ గా సంగీతంపై దృష్టి పెట్టింది మాత్రం ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసులు శుభ ముద్గల్, పండిట్ సారథి చటర్జీల వద్ద నేర్చుకున్నప్పుడే. ఇందుకు దాదాపు ఏడాది సమయం తీసుకున్నా తన స్వరం దెబ్బతినకుండా జాగ్రత్త పడింది సోనమ్. అదే తన జీవితానికి మార్గం చూపిందన్నది ఆమె విశ్వాసం. ఆ సమయంలో బీబీసీ, స్టార్ వాల్డ్ ఛానెళ్లకు చెందిన రెండు ట్రావెల్ షోలకు యాంకరింగ్ చేసింది. బీబీసీ కోసం కార్ల టెస్ట్ డ్రైవ్ ప్రోగ్రామ్ కూడా చేసింది. 2010 కామన్ వెల్త్ క్రీడలకు ప్రత్యక్షంగా కామెంటరీ కూడా చెప్పింది. డిస్కవరీ ఛానెల్ కు ఇండిగో ఎయిర్ లైన్స్ కు వాయిస్ ఓవర్ ఇచ్చింది.

భారతీయ సంప్రదాయ సంగీతంతో విదేశీ సంగీతాల్లోనూ ప్రావీణ్యత సంపాదించుకుంది. సోనమ్ జాతీయ అవార్డు పొందిన నటి కూడా. వినోదిని స్టేజ్ షోలో విభిన్న పాత్రలు పోషించినందుకు మహీంద్రా ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డ్స్ విజేతగా కూడా సోనమ్ ఎంపికయ్యింది.

సుఫీ గోస్ఫల్ ప్రాజెక్టు పుట్టుక

ఢిల్లీ .. నిజాముద్దీన్‌లో 2011లో సుఫీ మతగురువు ఇన్యత్ ఖాన్ పుట్టిన రోజు వేడుకల్లో గోస్ఫెల్ పాడేందుకు వెళ్లినప్పుడే ఈ సుఫీ గోస్పెల్ ప్రాజెక్టు ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఓ సిక్కు యువతి ఇస్లాం ప్రపంచంలో అడుగుపెట్టి సుఫీ గీతాలను పాడటం.. ఇదొక్కటి చాలు సంగీతం యొక్క శక్తి ఎలాంటిదో చెప్పడానికి. సోనమ్ మాటల్లో చెప్పాలంటే అదే సంగీత ప్రపంచంలో ఆమె తొలి సంతకం.

" అన్ని విశ్వాసాల సమాహార సౌందర్యాన్ని ప్రతిబింబించే సరికొత్త స్వరాన్ని సృష్టించాలనుకున్నాను. అది మానవత్వానికి ప్రతీకగా ఉండాలి. అదే సూఫీయిజం. అన్ని విశ్వాసాలను ఒక్క చోట చేర్చాలన్న ఆలోచనే నాకు చాలా గొప్పగా అనిపించేది. ఈ అడ్డుగోడలు సృష్టించినది మనమే.. వాటిని బద్దలుకొట్టగలిగేదీ మనమే అనే సత్యం నాకు తెలిసొచ్చింది "

కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరిగిపోతే అది జీవితం ఎందుకవుతుంది. సోనమ్ జీవితంలోనూ అలాంటి పరిస్థితే ఎదురయ్యింది. తన జీవితానికి స్ఫూర్తిగా నిలిచిన తన తల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె ఢిల్లీలో భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని బోధించే షాదజ్ అనే సంస్థను నడుపుతుండే వారు. ఆమె మరణం తర్వాత షాదజ్ బాధ్యతలు సోనమ్ పై పడ్డాయి. దీంతో అక్కడ గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో కొన్ని ప్రదర్శనలు కూడా ఇచ్చింది.

ఆ ప్రదర్శనల తర్వాత కేవలం ఒక ప్రాంతానికి చెందిన ప్రేక్షకులకే తన స్వరం పరిమితం కాకూడదని నిర్ణయించుకుంది. మిగిలిన ప్రపంచం ముందు కూడా ఆ స్వర మాధుర్యాన్ని పంచాలన్న ఆమె కుటుంబసభ్యుల, స్నేహితుల ప్రోత్సాహం మేరకు ఇండియా హ్యాబిట్ సెంటర్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసింది సోనమ్. ఢిల్లీ నుంచి ది కెనడీ సెంటర్‌లో ప్రదర్శన నిర్వహించాలని తలచింది. కేవలం 140 మంది కెపాసిటీ ఉన్న ఓ ఆడిటోరియంలో తనకు ఏ రోజు ఖాళీ ఉందో అడిగింది. కానీ చివరకు వాళ్లు 450 మంది కెపాసిటీ ఉండే పెద్ద ఆడిటోరియం ను కేటాయించారు.

image


సంగీతమే తనకు కళ్లు తెరిపించిందని సదా నమ్ముతుంది. అంతే కాదు తనలో అంతర్లీనంగా ఇంకా ఏదో విలువైనది ఉందని భావించేది. మరింత ఆలోచిస్తే సదా నీతోనే అనే కబీర్ సూక్తి సమాధానంగా వచ్చేది అంటుంది సోనమ్.

" జీవితంలో సాధన చేసే కొద్దీ నీ స్వర మాధుర్యం మరింత పెరుగుతుందని ఓ సారి నా గురువుల్లో ఒకరు చెప్పారు. నీ పాట ముమ్మాటికి సత్యం. నువ్వుంటేనే నీ పాట పది మందికి చేరుతుంది. మా అమ్మ తన చివరి రోజుల్లో నా ప్రదర్శనలు చూడగలగడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. పది మందిలో నేను పాడాలనుకోవడం మినహా పెద్దగా ఇంకేం కోరుకోలేదు మా అమ్మ ' అంటారు సోనమ్.

మతాల అడ్డుగోడలు..సాంస్కృతిక సంకెళ్లు తెంచుకొని..

ప్రార్థన, సూక్తులు, సంగీతం ఈ మూడింటిని ఒక్క చోట చేర్చిన సూఫీ గోస్పెల్ ప్రొజెక్ట్ .. విశ్వాసం, భాష అనే అడ్డుగోడల్ని ఛేదించింది. లౌకికత్వం, సమానత్వం అన్న సందేశాన్ని సంగీతం ద్వారానే లోకానికి చాటింది.

నాతో పని చేసే కీ బోర్డు ప్లేయర్, గిటారిస్టులిద్దరు క్రిష్టియన్లు, సారంగి, తబలా వాయించే వాళ్లు ముస్లింలు, ఇక వేణు గాన విధ్వాంసుడు , డ్రమ్స్ వాయించే వ్యక్తులిద్దరూ హిందువులు. విశ్వాసం, సంగీతం దగ్గరకొచ్చేసరికి మతం అనేది సంబంధించిన విషయమే కాదు అంటుంది సోనమ్.

ఈ సుఫీ గోస్పెల్ ప్రొజెక్టు అనేక చోట్ల ప్రదర్శనలిచ్చింది. అందులో చిన్న చిన్న ఇళ్ల దగ్గర నుంచి రాజస్థాన్‌లో జరిగిన అంతర్జాతీయ సూఫీ మ్యూజిక్ ఫెస్టివల్ వరకు ఎన్నో ఉన్నాయి. అమెరికా అంబాసిడర్ నాన్సీ పావెల్ ఇండియా వచ్చిన సందర్భంలో నిర్వహించిన స్వాగత సంబరాల్లో ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిన గ్యాలరీల్లోనూ పాడారు. కెనడాలోని ఇండియన్ కాన్సులేట్ టొరంటొలో ప్రదర్శన ఇవ్వమని ఆహ్వానించింది. ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ , బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫెస్టివల్స్ ఆమె స్వర మాధుర్యంతో ప్రతిధ్వనించింది.

సోనమ్ పేరు దేశమంతా మారు మోగిపోవడం మొదలయ్యింది. ఒకానొక సందర్భంలో MTV కోక్ స్టూడియోలో ప్రపంచ ప్రఖ్యాత సంగీత విద్వాంసులైన సర్ బాబ్ గెల్డోఫ్ తోనూ, ముజఫర్ అలీ, అబిదా పర్వీన్లతోనూ కలసి అత్యద్భుతమైన ప్రదర్శనలిచ్చింది.

గత ఏడాది తానొక్కతే... లండన్, శ్రీలంక , సింగపూర్, పాకిస్తాన్ సహా పది దేశాల్లో ప్రదర్శనలిచ్చింది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని ఆరు దేశాల్లో విజయవంతగా తన ప్రదర్శనలు ముగించి ఇటీవలే ఇండియా వచ్చింది. 

image


ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సాంస్కృతిక రాజధాని ఢిల్లోలో అత్యంత శక్తిమంతమైన ప్రభావశీలుర జాబితాలో మొదటి 50 మందిలో ఒకరిగా సోనమ్ గుర్తింపు సాధించింది. భవిష్యత్తును సొంతం చేసుకున్న మహిళగా కీర్తిస్తూ ట్రాన్స్‌ఫార్మర్స్ జాబితాలో చేర్చింది ప్రముఖ మ్యాగజైన్ ఎల్లీ. అంతే కాదు సోనమ్ గాన మాధుర్యాని పరవశం పొంది అనేక అవార్డులు,రివార్డులు ఆమె కీర్తి కిరీటంలో చేరిపోయాయి.

"నా చుట్టూ ఉన్న జీవితమే నాకు స్ఫూర్తినిచ్చింది. ఎలా జీవించాలో నేర్పిన నా తల్లిదండ్రులు, గొప్ప గురువులు కూడా నాకు స్ఫూర్తి ప్రదాతలే. నేను ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను. నీ జీవితంలో నువ్వు ఏది నమ్ముతావో అది నిజం. రిస్క్ తీసుకో...అలాగని ఎవ్వరినీ అనుకరించకు. నువ్వు ఎంత బాగా చెయ్యగలవో అంత బాగా చెయ్ " నా జీవిత యానంలో దాన్నే నమ్మాను. అనుకున్న గమ్యానికి చేరుకున్నాను.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags