సంకలనాలు
Telugu

శివపుత్రుడు ఈ డోమ్ రాజా!

శవాలతోనే సహవాసం.. ఛితిమంటలతోనే సహజీవనంశవం కంపుని భరిస్తూ.. మనకి సాయం చేస్తూ..ఊరికి దూరంగా బతికే డోమ్ రాజాహిందూ ఆచారాలను గౌరవిస్తూ జీవనయానం

ashok patnaik
2nd May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

సాధారణంగా శవాల్ని చూస్తే మనకు భయం వేస్తుంది. శ్మశానానికి వెళ్లాలంటే అమ్మో అంటాం. కానీ శవాలను కాల్చడానికి సాయం చేసే వ్యక్తులు అక్కడుంటారు. వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవు. వారణాసిలో వారిని డోమ్ రాజాలుగా వ్యవహరిస్తారు. శతాబ్దాలుగా మన ఛితిమంటలను వారి గుండెల్లో మోస్తున్న డోమ్ రాజా ల కథే ఇది.

పవిత్ర గంగా తీరం, వారణాసి పట్టణం చివర్లో ఓ శ్మశాన వాటిక. చనిపోయిన చాలా మందికి ఇక్కడ అంత్యక్రియలు జరుగుతుంటాయి. అక్కడ కనిపిస్తారు డోమ్ రాజా. అతని పేరే సంజిత్. కానీ అతన్ని అంతా డోమ్ రాజా గానే పిలుస్తారు. దేశవ్యాప్తంగా లగ్జరీ విల్లాలు, కార్లు ఉన్న వ్యక్తి అయినా చివరకు చేరాల్సింది ఆ ఛితిపైకే. ఆజన్మ శ్రీమంతుడిగా బతికినప్పటికీ ఇక్కడున్న డోమ్ రాజానే అతని ఛితికి కాపలా కాయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ డోమ్ రాజాది శవాలతో సహవాసం, చితిమంటలతోనే సహజీవనం.

సంజిత్, వారణాసికి యమధర్మరాజు

సంజిత్, వారణాసికి యమధర్మరాజు


“ప్రేగు లోతుల్లో చీకటిని నింపుకున్న ఒక వ్యక్తి అరడజను మంది చిన్నారులు. వారితో కలసి సాధన చేయిస్తున్నారా వ్యక్తి . వాళ్ల ఒంటిపై షర్ట్ కూడా లేదు. సూర్యోదయ సమయంలో ఏమీ తోచనట్లు అలానే కూర్చున్నారు. డోమ్ రాజా చాతిభాగం పై తెల్లని చారలు కనిపిస్తాయి. చేతిభాగం బాగా కాలినట్లుంది. గాయం మానినప్పటికీ చేతిపై ఆ మచ్చ పోలేదు.” ఇది వారణాసిలో స్మశాన వాటికలో కనిపించిన దృశ్యాలు.

తన ప్యాలేస్ లో డోమ్ రాజా

తన ప్యాలేస్ లో డోమ్ రాజా


అతని దగ్గరకి వెళ్లి ఇక్కడ డోమ్ రాజా ఎవరు? అడిగితే. తానే అని సమాధానం ఇచ్చారాయన. ఆ సమయంలో అతని నుదిటిపైనుంచి చమట కారుతోంది. ప్రతిరోజూ శవాలను కాలుస్తూ ఉండే డోమ్ రాజా శవం ఛితి దగ్గర కొన్ని గంటలసేపు గడపాల్సిందే.

ఇంతకీ ఈ కాలిన గాయం ఏంటీ అని అడిగితే.. “ఓహో ఇదా,” ఆరేళ్ల క్రితం ఓ పెళ్లిలో సిలండర్ పేలింది. అప్పటి కాలిన గాయాలు తాలూకు మచ్చలివి అని డోమ్ రాజా వివరించే ప్రయత్నం చేశారు డోమ్ రాజా. ధనవంతుని బిడ్డ లైతే శరీరంపై ఎలాంటి మచ్చ పడినవ్వరు. కానీ చనిపోయిన తర్వాత శవాన్ని ఈ స్మశాన వాటికలో కాల్చేయాల్సిందే కదా! భారతీయ చరిత్రలో మొదటి డోమ్ రాజా... సత్యహరిశ్చంద్రుడు. తన జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పని వ్యక్తిగా అతను కీర్తికెక్కాడు. ఇక్కడున్న వ్యక్తి అతని వారసుడన్న మాట.

సంజిత్ వారసత్వంగా ఇలా శ్మశానంలో శవాలను కాల్చే వ్యక్తి డోమ్ రాజాగా మారిపోయారు. సాధారణంగా ఈ పని చేసేవారిపై కులప్రాతిపదికన చెరగని ముద్ర వేస్తారు. ఆ తర్వాత ఊరికి దూరంగా పెట్టి అంటరాని వారుగా వీళ్లని చూస్తారు.

ప్రతిరోజూ పని ప్రారంభించే ముందు డోమ్‌ల ప్రార్ధన

ప్రతిరోజూ పని ప్రారంభించే ముందు డోమ్‌ల ప్రార్ధన


“బజారులో నేను నీళ్లు తాగాలంటే గ్లాస్‌ని ముట్టుకోకూడదు. వారు పైనుంచి పోస్తే నేను తాగాలి. గ్రామంలో ఎవరింటికీ నేను వెళ్లకూడదు. మా ఇంటికి వాళ్లు అసలు రానేరారు. వారణాసిలో పవిత్ర దేవాలయాల్లో మాకు ప్రవేశం లేదు. విశ్వనాథుడిని దేవాలయంలో నేను ఒకసారి కూడా చూడలేదు. ఇది అన్నింటికంటే ప్రధానమైనది.” అని డోమ్ రాజా చెప్పుకొచ్చారు.

వ్యంగ్యంగా చెప్పాలంటే హిందువుల పవిత్ర జ్వాలల్ని డోమ్ రాజాలు కాపలా కాయాలి. వారణాసి ప్రాంతంలో ఛితి మంట పెట్టడానికి అగ్గిపుల్లలు ఉపయోగించరు. శతాబ్దాలుగా కాలుతున్న పవిత్ర జ్వాలల్ని ఉపయోగిస్తారు. మరణంతో మరో జన్మ ప్రారంభం అవుతుంది. ఈ జన్మలో విముక్తి మరణంతో వస్తుందనేది హిందువులు నమ్మకం. ఆ విముక్తికి పవిత్ర జ్వాలలతో ముగుస్తారన్న మాట. ఈ క్రమంలో వందల సంవత్సరాలుగా డోమ్ రాజా గుండెలను కాలుస్తున్నారు. ద్వితీయ శ్రేణి సోపానక్రమపు డోమ్‌లకు డోమ్ రాజా ప్రతినిథి. రోస్టర్ చెప్పినట్లు అందరు పనిచేయాల్సిందే. ఈ మొత్తానికి డోమ్ రాజా అధ్యక్షుడు మాత్రమే కాదు చాలా రకాలైన పనుల్లో భాగస్వామి అయి ఉంటారు. అయితే ఇది అంత సులువైన విషయం కాదంటారు సంజిత్. శవాల కంపుని భరించాల్సి ఉంటుంది. మార్చురీలో రోజుల తరబడి ఉన్నవి, పోస్టుమార్టం చేసినవి అయితే భరించలేనివనే చెప్పాలి. చెడిపోయిన శరీర ముద్దల వాసన వర్ణనాతీతం. సంజిత్ విపరీతంగా మందుతాగేది అందుకే. రోజుకి 250 ఎంఎల్ ఉన్న ఎనిమిది బాటిళ్లను తాగుతారంటే నమ్ముతారా?

మణికర్ణిక ఘాట్ దగ్గరి అంత్యక్రియలు, వారణాసి

మణికర్ణిక ఘాట్ దగ్గరి అంత్యక్రియలు, వారణాసి


ఇలాంటి విపరీతమైన కంపులో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. దీంతో తాగడం మా దిన చర్యలో భాగం. నేను ఉదయం నుంచి ఇప్పటికే రెండు బాటిళ్లు తాగానని డోమ్ రాజా చెప్పుకొచ్చారు.

వారణాసిలో రెండు శ్మశానవాటికలున్నాయి. రాజా హరిశ్చంద్ర ఘాట్ , మరొకటి పవిత్ర మణికర్ణక ఘాట్ ఈ రెండు ఘాట్‌ల వద్ద డోమ్ సమూహాలున్నాయి. ప్రతిరోజూ కల్లు డోమ్‌కి పూజచేసి వారంతా తమ ఛితి క్రియలు మొదలు పెడతారు. చితిని కూడా ఓ పద్దతి ప్రకారం చేస్తారు డోమ్ లు. ఎప్పటికప్పుడు ఓ పొడుగాటి పోల్‌ని దూర్చి శవం కాలుతుందో లేదో తెలుసుకుంటారు.

డోమ్ కావడానిక సిద్ధపడుతున్న ఐదేళ్ల చిన్నారి

డోమ్ కావడానిక సిద్ధపడుతున్న ఐదేళ్ల చిన్నారి


పేదలు చెక్కలను ఎక్కువగా కొనలేని పరిస్థితి. వీళ్లు తెచ్చిన శవం యొక్క ఛితి సగం కాలాక అక్కడున్న కుక్కలు పీక్కు తింటాయి. ఏదీ నిరుపయోగంగా పడేయరన్న మాట. గంగానదిలో కలిపిన ఛితాభస్మాన్ని అంత తేలిగ్గా వదిలేయరు. పీకలోతు నీటిలో మునిగి వెతుకులాట షురూ చేస్తారు. నదిలో విలువైన వస్తువులు దొరికే అవకాశం ఉంటుంది. బంగారు పళ్లు, రింగుల కోసం నల్లని బొగ్గుతో కూడిన నీటిని జల్లెడ పడతారు .

గతంలో ఘాట్‌లపై డోమ్‌లకు పూర్తి ఆధిపత్యం ఉంది. కొన్నేళ్ల క్రితం డోమ్‌లు దోపిడీకి పాల్పడుతున్నరనే ఆరోపణలపై ఆందోళన చెలరేగింది. దీంతో శవదహనానికి డోమ్ సహకారం కావాలంటే ..అవసరమైన డబ్బు ఇవ్వాల్సిందే. విరాళ రూపంలో ఎంతిస్తే అంత తీసుకోవాల్సి వస్తోంది. ఎక్కడో ఎవరో చేసిన తప్పిదానికి అంతా బలయ్యారని సర్జిత్ చెప్పుకొచ్చారు.

సర్జిత్ అనే డోమ్ రాజా రంజిత్ ఉన్నరోజుల్లో శ్మశాన వాటికల్లో డోమ్‌లకు తెలియకుండా చీమైనా ప్రవేశించేది కాదట. ఇదే విషయాన్ని గుర్తుచేసుకున్నారాయన. శవాలను కాల్చే మెషీన్లు తన అన్న హయాంలోనే వచ్చాయన్నారు. ప్రతి ఏడూ నాగపంచమికి డోమ్‌లు వారి భౌతిక పరాక్రమాలను చూపించడానికి అవకాశం ఉంటుంది. నాగరాజుని పూజించిన తర్వాత జనం ముందు భారీ రాళ్లను ఎత్తి ప్రదర్శన చేస్తారు. ఈ స్టోన్ లిఫ్టింగ్ చూడటానికి జనం ఎగబడతారు.

విలువైన వస్తువుల కోసం జల్లెడ పడుతున్న డోంలు

విలువైన వస్తువుల కోసం జల్లెడ పడుతున్న డోంలు


“మాకు శక్తిని ఆ హనుమంతుడే ఇస్తాడు. కానీ చేతనంతో పెళుసుగా సగం కాలిన ఫ్రేమ్ చూపిస్తూ.. గతంలో తానీ బరువులను ఎత్తేవాడినని చెప్పారు” సంజిత్.

సంజిత్‌కు పిల్లలు లేదు. దీంతో తన మేనల్లుడిని తర్వాతి డోమ్ చేయడానికి తన వారసుడిగా ట్రైనింగ్ ఇస్తున్నారు. భారీ బరువులను ఎత్తడం, మోయడంతో ట్రెయినింగ్ ప్రారంభం అవుతుంది. కానీ ఈ చిన్నారి డోమ్ మాత్రం వారణాసిలో ప్రతి పిల్లాడిలాగే స్కూల్‌కి వెళ్లాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags