సంకలనాలు
Telugu

స్థానిక డెలివరీ మార్కెట్లో పట్టుసాధిస్తున్న 'లోకలెగ్స్'

Krishnamohan Tangirala
21st Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఇంటర్ సిటీ, హైపర్ లోకల్.. స్టార్టప్ ప్రపంచంలో వీటి ట్రెండ్ ఇప్పుడు ఎక్కువగా ఉంది . 2015 ప్రధమార్ధంలో.. పూర్తి స్థాయి స్థానిక వ్యాపారంపైనే ఆధారపడిన 27 కంపెనీలకు నిధులు అందించే డీల్స్ జరిగాయంటే.. వీటి స్పీడ్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. ఈ డీల్స్ అన్నిటి విలువ కలిపి 135 మిలియన్ డాలర్లు. ఈ తరహా హైపర్ లోకల్ సర్వీసులకు డిమాండ్ పెరగడం, వీటికి పెట్టుబడిదారుల నుంచి భారీ మద్దతు లభిస్తుండడడంతో.. ఈ వ్యాపారాలు పరుగుపెడుతున్న తీరు ఆశాజనకంగానే ఉంది.

ప్రత్యేకమైన రవాణా, డెలివరీ సర్వీసుల మార్కెట్‌‌పై స్టార్టప్ కంపెనీలు కన్నేశాయి. స్విగ్గీ, గ్రోఫర్స్‌లు బీ2సీ విభాగంలో దూసుకుపోతుంటే.. బీ2బీ విభాగంలో రోడ్‌రన్నర్ సత్తా చాటుతోంది.

చెన్నై కేంద్రంగా పని చేస్తున్న లోకలెగ్స్ కూడా ఇలాంటిదే. 2015 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ వెంచర్ బీ2బీ ఆధారిత హోమ్ డెలివరీ విభాగంలో పాగా వేసింది. సాధారణ రిటైల్ షాపుల వరకే కాకుండా.. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి బడా కంపెనీలతోనూ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఉత్సాహం చూపుతోంది.

image


ఐఐటీ పూర్వ విద్యార్ధులు ప్రతీక్ అగర్వాల్, వివేక్ పొద్దర్‌ల స్వస్థలం ఛత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్. సిమెంట్ కంపెనీల నుంచి కాంట్రాక్టులు తీసుకుని.. డీలర్లకు, ఏజన్సీలకు సరఫరా చేసే వ్యాపారం నిర్వహించేవారు ప్రతీక్. రవాణా విభాగం గురించి ఈయనకు పట్టు ఉండడానికి మూలం ఇదే. చెన్నై వెళ్లి సొంత రవాణా వ్యాపారం నిర్వహించాలని భావించారు ప్రతీక్.

ఈయనకు వివేక్ కూడా జత కలిశాడు. కెనడాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న సమయంలో.. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఆహారాన్ని డెలివరీ అందించే పార్ట్‌టైం ఉద్యోగం చేశారు వివేక్. భారత్‌లో డెలివరీ విధానానికి, కెనడాలో అనుసరిస్తున్న పద్ధతులకు చాలా తేడా ఉందనే విషయం అప్పుడే తెలిసింది వివేక్‌కి. ఇండియాలో హైపర్‌లోకల్ డెలివరీ రంగంలో ప్రారంభిస్తే.. ఈ వెంచర్ సక్సెస్ అయ్యేందుకు అవకాశాలున్నాయనే విషయం అర్ధమైంది.

ఈ ఇద్దరు తెలుసుకున్న విషయాలు ఇక్కడితో అయిపోలేదు. నేరుగా కస్టమర్‌కి సర్వీసులు అందించే రిటైల్ షాప్ మాదిరిగా డెలివరీ వెంచర్‌ని ప్రారంభించారు. కానీ.. వీరిద్దరి కల మాత్రం.. టెక్నాలజీ ఆధారంగా డెలివరీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలన్నదే.

“ప్రాంతీయ వ్యాపారాల్లో బిజినెస్ టు కస్టమర్ విభాగం మెల్లగా తన ప్రభను కోల్పోతోంది. ప్రస్తుతం చెన్నైలోనే 7 కంపెనీలు ఈ తరహా సేవలను భారీ స్థాయిలో అందిస్తున్నాయి. దీనికంటే ముఖ్యంగా డెలివరీ రంగంలో టెక్నాలజీ ఆధారిత సేవలను ప్రారంభించాలన్నది మా కల. కస్టమర్లను ఆకట్టుకోవడానికి డిస్కౌంట్లు, కూపన్లతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనే ఆలోచనకు మేం వ్యతిరేకం” అని వివేక్ చెబ్తున్నారు.

ప్రస్తుతం ప్రాంతీయంగా డెలివరీ సర్వీసులు అందిస్తున్నవాటిలో 90శాతం కంపెనీలకు సాంకేతిక సహాయం అందించే కంపెనీల అవసరముందంటున్నారు లోకలెగ్స్ సహ వ్యవస్థాపకుడు వివేక్.

మొదట సొంత నిధులతోనే వెంచర్ ప్రారంభించినా.. అనతికాలంలోనే ముగ్గురు వ్యక్తుల నుంచి ఏంజల్ ఫండింగ్ సేకరించడం లోకలెగ్స్ ప్రత్యేకత. వీరు తమ అనుభవాలతో మార్గనిర్దేశం చేయడమే కాకుండా... వ్యాపార అభివృద్ధి, కస్టమర్ సర్వీసుల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపైనా సలహాలు ఇస్తున్నారు.

ప్రస్తుతం ఏడుగురు ఉత్సాహవంతులైన టీం గల లోకలెగ్స్.. చెన్నైలో 35 మంది డెలివరీ బాయ్స్‌తో సర్వీసులు నిర్వహిస్తోంది.

ప్రతీక్ అగర్వాల్, లోకలెగ్స్ సహ వ్యవస్థాపకుడు

ప్రతీక్ అగర్వాల్, లోకలెగ్స్ సహ వ్యవస్థాపకుడు


భవిష్యత్ ప్రణాళికలు

2015 చివరి నాటికి ముంబైలోనూ తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది లోకలెగ్స్. అహ్మదాబాద్, జైపూర్ వంటి.. టైర్ 2 సిటీల్లోనూ డెలివరీ సర్వీసులు అందించేందుకు రెడీ అవుతోంది లోకలెగ్స్.

మార్కెట్లోకి భారీ స్థాయిలో దూసుకుపోవడం ద్వారా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేలా వ్యూహాలు రచిస్తోందీ సంస్థ. ఫార్మా, గ్రాసరీ, ఈ కామర్స్ వ్యాపారాల్లో డెలివరీ సర్వీసుల వృద్ధికి ఎనలేని అవకాశాలు ఉన్నాయనే విషయం వీరిద్దరికీ స్పష్టంగా తెలుసు.

రియల్ టైం ట్రాకింగ్ సిస్టం వంటి సాంకేతికను.. డెలివరీ విభాగంలో ప్రవేశపెట్టాలన్నది వీరి అలోచన. దీని కారణంగా.. డెలివరీ బాయ్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు. అంతే కాదు ఎంతసేపట్లో తమ ప్రొడక్ట్ డెలివరీ కానుందనే విషయం పైనా కస్టమర్‌కు స్పష్టత ఉంటుంది.

ఒక వేళ ఎవరైనా డెలవరీ చేసే వ్యక్తి, ఒకే ప్రాంతంలో ఎక్కువ సేపు ఉండిపోయినా, తాను వెళ్లే రూట్ మారిపోయినా.. అతనికి ఒక అలర్ట్ పంపేలా సాంకేతిక వ్యవస్థను రూపుదిద్దారు. ఒకవేళ డెలివరీ బాయ్ ఫోన్‌లో.. తక్కువ బ్యాటరీ ఉన్నా ఈ సిస్టం ద్వారా హెచ్చరించే ఏర్పాట్లు ఉన్నాయి. ఉన్న వనరులను సక్రమంగా ఉపయోగించుకుంటూ.. ఏ ప్రాంతంలో డెలివరీలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు అనలటిక్స్‌ని ఉపయోగించుకుంటోంది లోకలెగ్స్.

ప్రస్తుతం ప్రధాన పెట్టుబడిదారుడిగా.. ఉండేదుకు జంగిల్ వెంచర్స్, స్మైల్ గ్రూప్‌లతో చర్చలు కూడా జరుపుతున్నారు.


వివేక్ పొద్దర్, లోకలెగ్స్ సహ వ్యవస్థాపకుడు.

వివేక్ పొద్దర్, లోకలెగ్స్ సహ వ్యవస్థాపకుడు.


అభివృద్ధి, సవాళ్లు

ఆదాయం విషయంలోనూ ఆశాజనకంగానే ఉంది లోకలెగ్స్ పరిస్థితి. ఒక్కో డెలివరీకి సగటును ₹500 ఆదాయం వస్తోందని, రోజుకు 2వందల డెలివరీలు చేయగలుగుతుండడంతో.. లక్ష రూపాయల ఆదాయం గడిస్తున్నామని చెప్పారు వివేక్. ఇప్పటివరకూ ప్రతీ వారం సగటున 76శాతం అభివృద్ధి సాధిస్తున్నారంటే.. లోకలెగ్స్ ఏ స్థాయిలో వృద్ధి చెందుతోందో అర్ధమవుతుంది.

ప్రతీ త్రైమాసికం చివరకు ఆదాయం రెట్టింపు చేయాలన్నది లోకలెగ్స్ లక్ష్యం. మే నెలలో సగటున రోజుకు 60 డెలివరీలు చేయగా.. జూన్‌లో 130, జూలైలో 300 డెలివరీలు చేయగలిగే స్థాయికి చేరుకున్నారు. 2015 చివరినాటికి రోజుకు 10వేల డెలివరీలను చేసే రేంజ్‌కి ఎదగాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పారు ప్రతీక్.

ప్రారంభంలోనే ఆదాయం గణనీయంగా ఆర్జిస్తున్నా.. ఈ స్టార్టప్ సక్సెస్ కావడం అంత సులభమేం కాదనే విషయం గుర్తుంచుకోవాలి. తమకు ఏది ప్రధానమైన వనరుగా నిలుస్తోందో.. అదే తమకు అతి పెద్ద లక్ష్యం కూడా అంటున్నారు వివేక్.

“డెలివరీ విభాగంలో అట్రిషన్ రేటు 60 నుంచి 70శాతంగా ఉంది. ఒక రోజు వచ్చిన వాళ్లు మరుసటి రోజుకు మానేసే పరిస్థితి ఎక్కువ. 150మందిని ఇంటర్వ్యూలు చేస్తే.. అందులో 40 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. వారి బ్యాక్‌గ్రౌండ్‌ను వెరిఫై చేయడం, ఎంపిక చేసిన వారికి తగిన శిక్షణ ఇవ్వడం కూడా సవాలే. వేతనాలను రోజుకో రకంగా పెంచుతుండడంతో.. ఇతర కంపెనీల నుంచి పోటీ గట్టిగానే ఎదురవుతోంది. దీంతో మేం కూడా ఇదే స్థాయిలో శాలరీలను పెంచక తప్పడం లేద”న్నారు వివేక్.

వెబ్‌సైట్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags