సంకలనాలు
Telugu

పెట్టుబడికి ఏ స్టార్టప్‌ అనుకూలమో చెప్పేస్తారు !!

Chanukya
12th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

విభిన్నమైన, వినూత్నమైన..వృద్ధికి పుష్కలమైన అవకాశాలున్న స్టార్టప్స్‌లో రతన్ టాటా పెట్టుబడులు పెడ్తూ వస్తున్నారు. తాజాగా ఇంటెలిజనెన్స్, మార్కెట్ రీసెర్చ్ ప్లాట్‌ఫాం 'ట్రాక్షన్' (TRACXN) అనే సంస్థలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేశారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. ఇన్వెస్టర్లైన నేహా సింగ్ (సెకోయా క్యాపిటల్ మాజీ ఉద్యోగి), అభిషేక్ గోయల్ (మాజీ యాక్సెల్ పార్ట్‌నర్స్ ఉద్యోగి) ఈ స్టార్టప్‌ను 2013లో ప్రారంభించారు. ఇంటెలిజెంట్ డేటా ఎనలిటిక్స్ సహా, వివిధ రంగాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఎనలిస్టుల టీం వెంచర్ గ్లోబల్ క్యాపిటల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సహాయకారిగా ఉంటూ సేవలిందిస్తాయి. స్టార్టప్ మార్కెట్లో ఉన్న అవకాశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందులోని అవకాశాలను గుర్తించడం ట్రాక్షన్ ప్రత్యేకత.

ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులైన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ నుంచి ఈ సంస్థ ఏంజిల్ ఫండింగ్‌ను అందుకుంది. ఏప్రిల్ 2015లో సైఫ్ పార్ట్‌నర్స్‌ నుంచి 3.5 మిలియన్ డాలర్ల సిరీస్ - ఏ ఫండింగ్ కూడా పొందింది.

image


ఏడాదిలో తమ క్లైంట్ బేస్ ఏకంగా 400 శాతం పెరిగినట్టు ట్రాక్షన్ సంస్థ వెల్లడిస్తోంది. తమ క్లైంట్లలో యాండ్రిస్సెన్ హోరోవిట్జ్, సెకోయా, సాఫ్ట్ బ్యాంక్, గూగుల్ క్యాపిటల్, విఎం వేర్, జిఈ, ఎల్.జి ఉన్నట్టు చెబ్తోంది. తాజాగా ఓ బ్లాగ్‌లో వివరాలను వెల్లడించిన ట్రాక్షన్.. తమకు 6,432 మంది పెయిడ్ యూజర్స్ ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుతం తమ ప్లాట్‌ఫాం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 25 మిలియన్ కంపెనీలను ట్రాక్ చేస్తున్నట్టు వివరించారు.

"మా కంపెనీలో మేము ఆఫర్ చేస్తున్న వినూత్న సేవలను గుర్తించి రతన్ టాటా విశ్వాసం ఉంచారు. మాకు చాలా గర్వంగా ఉంది. రతన్ టాటాకు ఉన్న విస్తృతమైన అనుభవం నుంచి మేం ఎంతో కొంత నేర్చుకోవాలని ఎదురుచూస్తున్నాం. ట్రాక్షన్‌ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లడమే మా తక్షణ లక్ష్యంగా భావిస్తున్నాం'' అంటారు సంస్థ సిఈఓ, ఫౌండర్ నేహా.

రతన్ టాటా.. ఈ పేరు నమ్మకానికి ప్రతీక. ఆయన ఆలోచనలు.. రూపాంతరం చెంది ఏ స్థాయికి ఎదిగాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనమంతా అందుకు నిదర్శనం. ఆయన ఆధ్వర్యంలో ఓ స్టార్టప్‌ను నిర్మించడం ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఈ రోజున మేం 20 దేశాల్లోని 300 మంది కస్టమర్లతో కలిసి పనిచేస్తున్నాం. మా పరిధిని ఖండాంతరాలకు విస్తరించే కొద్దీ ఆయన ఆలోచనలు, అనుభవం మాకు ఎంతో ఉపయోగపడ్తుంది.

ఎలా ఉందీ రంగం ?

ఈ రోజుల్లో ఇంటర్నెట్ అనేది ఏంజిల్ ఇన్వెస్టర్లు, ప్రైవైట్ ఈక్విటీ సంస్థలు, వెంచర్ ఫండ్స్ పనిని మరింత సులువు చేసింది. అయితే ఇప్పటికీ ఖచ్చితమైన సమాచారం, డేటా పాయింట్లను పొందడం కాస్త కష్టంగానే ఉంది.

వెంచర్ క్యాపిటలిస్టులు వ్యక్తిగతంగా వివిధ సమాచారాలను క్రోడీకరించి నిర్ణయాలు తీసుకునేవారు. ఇప్పుడు వెంచర్ ఇంటెలిజెన్స్, మార్కెట్ రీసెర్చ్ ప్లాట్‌ఫార్మ్స్‌ను నమ్మే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మొగ్గదశలోనే ఉన్న స్టార్టప్స్‌ను గుర్తించేందుకు వాళ్ల సహాయం ఎంతగానో ఉపయోగడ్తుంది. దీని వల్ల భాగస్వామ్యం చేసుకోవడానికి, సంస్థల కొనుగోళ్లకు మార్గం సులువుగా మారుతుంది.

ఈ రంగంలో ఇప్పటికే సిబి ఇన్‌సైట్స్, మ్యాటర్ మార్క్, వెంచర్ స్కానర్, యునోమి, డేటా ఫాక్స్, క్రంచ్ బేస్, ఔలర్ అనే సంస్థలున్నాయి. నవంబర్ 2015లో సిబి ఇన్‌సైట్స్ సంస్థ RSTP నుంచి సీరీస్ ఏ కింద 10 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. క్రంచ్ బేస్ 6 మిలియన్ డాలర్లు, మ్యాటర్ మార్క్ 6.5 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయి.

యువర్ స్టోరీ విశ్లేషణ

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్టప్స్ పరిస్థితి మనకంటే చాలా భిన్నంగా ఉంది. వివిధ దేశాల్లో ఉన్న స్టార్టప్స్ ఆలోచనా పరిధి చాలా విస్తృతంగా ఉంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఇలాంటి వాటిపై అవగాహన పెరుగుతోంది. 2015లో ఇన్వెస్టర్లు 9 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వీటిల్లో కుమ్మరించారు. ప్రభుత్వం కూడా వీటి అవసరాన్ని గుర్తించింది. స్టార్టప్స్ కోసం కేంద్ర బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లను కేటాయించింది. 2016లో కేంద్రం 'స్టార్టప్ ఇండియా ' పేరుతో ఓ పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ట్రాక్షన్ సహా వీళ్ల పోటీదార్లకు మన దేశంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నట్టు అర్థమవుతోంది. విదేశీ సంస్థలు కూడా ఇక్కడి స్టార్టప్స్‌ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. రతన్ టాటా వెనుక ఉండి నడిపించడం వల్ల ట్రాక్షన్‌కు విలువ పెరగడంతో పాటు వివిధ మార్కెట్లకు వెళ్లేందుకు మార్గం సులభతరమవుతుంది అనడంలో సందేహం లేదు.

(Disclosure: Ratan Tata is an investor in YourStory)

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags