సంకలనాలు
Telugu

గంటకు రూ.90 ఇస్తే ఏటీఎం క్యూలో మీ బదులు వాళ్లు నిల్చుంటారు..!

 "బుక్ మై ఛోటు" బంపర్ ఆఫర్ ..!!

team ys telugu
23rd Nov 2016
Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share

నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రకటన నల్లబాబులకు నిద్రపట్టకుండా చేసింది. ఆ రాత్రి నుంచి వాళ్లకు అన్ని రాత్రులూ కాళరాత్రులే. తేలుకుట్టిన దొంగల్లా కిక్కురుమనకుండా నలుపును తెలుపు చేసుకోవడం ఎలా అనే దానిపై దృష్టి సారించారు. బయటకు రావడం లేదుగానీ- వీలైనన్ని దారులు వెతుకుతున్నారు. ఇది కొట్టిపారేయలేని వాస్తవం. 

అంతెందుకు సాక్షాత్తూ బ్యాంకు మేనేజర్లే కమిషన్లకు కక్కుర్తిపడి బ్యాక్ డోర్ నుంచి వందల కట్టలను బయటకు వదిలారు. ఈ విషయం ఆర్బీఐ దృష్టికి కూడా వచ్చింది. ఇలా అయితే లాభం లేదని బడాబాబులంతా బీదాబిక్కీ జనం మీద పడ్డారు. వాళ్ల జన్ ధన్ ఖాతాల్లో లక్షల రూపాయలు డిపాజిట్లు చేయించారు. ఇవిగాక రోజుకూలీ కింద కొందరిని మాట్లాడుకుని వాళ్లను బ్యాంకుల చుట్టూ తిప్పి 500, 1000 నోట్ల మార్పిడి చేయించారు.

అయినా గానీ ఇండియాలో సాధ్యం కానిదేముంది చెప్పండి. కరెక్టే.. దారులు తెలియాలేగానీ అందులోకి చొచ్చుకుపోవడం ఎంతసేపు..? చిటికెలో పని. దీపం ఉండగానే ఇల్లుచక్కబెట్టుకునే సూత్రాన్ని మనసావాచా నమ్మిన వ్యక్తులున్న సమాజం మనది. అవకాశాలు వెతకడమే కాదు.. అవకాశాలు సృష్టించడం కూడా తెలిసిన ఘనులున్నారు. అఫ్ కోర్స్.. ఇందులో లీగల్ ఉంది.. ఇల్లీగల్ కూడా ఉందనుకోండి. అది వేరే విషయం.

ఉదాహరణకు పేటీఎంనే చూడండి. ప్రధాని ప్రకటన ఇలా వచ్చిందో లేదో.. అలా దాని గల్లాపెట్టె నిండిపోయింది. డిజిటల్ పేమెంట్స్ బీభత్సంగా పెరిగాయి. ఆ రూట్లోనే అనేక ఆన్ లైన్ పేమెంట్ సంస్థలు కళకళలాడుతున్నాయి.

image


సరే, ఇది కాసేపు పక్కన పెడితే మనం కాసేపు "బుక్ మై ఛోటు" అనే స్టార్టప్ గురించి మాట్లాడుకుందాం. ఇదేంటి కొత్తగా, వింతగా ఉందని ఆశ్చర్యపోతున్నారా? అవును. మీరు విన్నది నిజమే. ఢిల్లీ బేస్డ్ స్టార్టప్ ఇది. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఏదైనా సాధ్యమే. మీరొక చోటుని అంటే కుర్రాడిని మాట్లాడుకుంటే చాలు.. గంటకు 90 రూపాయల చొప్పున ఏటీఎం ముందుగానీ బ్యాంకుముందుగానీ మీ వంతు వచ్చేదాకా క్యూలో నిలబడతాడు. ఆ లోపు ఆఫీసులో పనిచూసుకోవచ్చు. మీటింగ్ కి అటెండయి రావొచ్చు. పెళ్లో ఫంక్షనో ఉన్నా వెళ్లిరావొచ్చు. మనవంతు రాగానే ఒక ఫోన్ వస్తుంది. టైముకు టైమ్ సేవ్. పనికి పనికి కంప్లీట్. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.

కొన్ని టెక్ స్టార్టప్స్ ఏం చేస్తున్నాయంటే.. మీకు దగ్గర్లో ఏ ఏటీఎం ఉంది.. అందులో క్యాష్ ఉందా లేదా.. అనే వివరాలను చెప్తుంది. ఏరియా పిన్ కోడ్ కొడితే చాలు.. చుట్టుపక్కల బ్యాంకుల వివరాలు, ఏటీఎంల డిటెయిల్స్ ఇస్తుంది. కానీ "బుక్ మై ఛోటు" అయితే సగటు భారతీయుడి బాధలను అర్ధం చేసుకుని ఏకంగా రియల్ సొల్యూషనే అందిస్తోంది. జస్ట్.. వచ్చి ఒక కుర్రాడిని మాట్లాడుకుని వెళ్తే చాలు.

"బుక్ మై ఛోటు"పూర్తిగా వెబ్ బేస్డ్ స్టార్టప్. సైట్ లోకి వెళ్లి పేరు, మొబైల్ నెంబర్, ఏరియా, ఈమెయిల్ ఫిల్ చేయాలి. కాసేపటికి మన రిక్వెస్ట్ కన్ఫమ్ అవుతుంది. గంటకు 90 రూపాయల చార్జ్ చేస్తారు. రెండు గంటలకు 170. ఎనిమిది గంటలు ఎంగేజ్ చేయాలంటే 550 ఖర్చవుతుంది. రాత్రి 8 దాటితే గంటకు 200 వసూలు చేస్తారు. ఇందులో ఉన్న చోటూలంతా బాలకార్మికుల టైప్ కాదు. అందరూ 18 ఏళ్లకు పైబడినవారే.

వాస్తవానికి "బుక్ మై ఛోటు"స్టార్టప్ ఉద్దేశం వేరే. ఆన్ డిమాండ్ హెల్పర్ల కోసం ఏర్పాటు చేశారు దాన్ని. హౌస్ షిఫ్ట్ చేయాలన్నా.. దగ్గర్లోని గ్రాసరీ షాప్ నుంచి సామాన్లు తేవాలన్నా.. ప్రీ పార్టీ, పోస్ట్ పార్టీ అరెంజ్ మెంట్లకు, సీనియర్ సిటిజన్లకు హెల్ప్ చేయడానికి.. చోటుని బుక్ చేసుకుంటారు. అలాగని వాళ్లచేత టాయిలెట్ కడిగిస్తామంటే కుదరదు. బట్టలు ఉతకమనొద్దు. ఆ రెండింటికి ఒప్పుకోరు. అదంతా ముందే మాట్లాడుకోవాలి. 

ఛోటు అన్న పేరే ఎందుకు పెట్టారంటే.. జనం కామన్ గా పిలుచుకునే పేరు చోటు. మిడిల్ క్లాస్ కుటుంబాల్లో ఆ పేరు సాధారణంగా వినిపస్తుంది. ఎవరైనా కుర్రాడి పేరు తెలియకుంటే అరె ఛోటు అని అభిమానంతోనే పిలుస్తాం. మనదగ్గర ఓ బాబూ అంటాం. ఆ ఉద్దేశంతోనే చోటు అనే పేరు కాయిన్ చేశారు. అలాంటి ఆన్ డిమాండ్ హెల్పర్ స్టార్టప్ ఇప్పుడున్న కరెంట్ కరెన్సీ సిచ్యువేషన్ కూడా వాడుకుని క్యాష్ చేసుకుంటోంది. ప్రస్తుతానికి మూడు హర్యానా, యూపీ, ఢిల్లీలో దీని ఆపరేషన్స్ నడుస్తున్నాయి.

రేజర్ పే 

ఇలాంటివే మరికొన్ని స్టార్టప్స్ కరెన్సీ కష్టాలను తగ్గిస్తున్నాయి. అందులో రేజర్ పే ఒకటి. ఇది ఆన్ లైన్ పేమెంట్ ప్లాట్ ఫామ్. ఇటీవలే ఈ-కాడ్ అనే కొత్త ఇన్నోవేటివ్ పేమెంట్ గేట్ వే ప్రవేశ పెట్టింది. ఈ కామర్స్ కంపెనీలన్నీ దాని ద్వారా డెలివరీ పేమెంట్స్ తీసుకుంటున్నాయి. పాత నోట్లు రద్దయిన నేపథ్యంలో ఈ కామర్స్ కంపెనీలకు ఈ కాడ్ పెద్ద రిలీఫ్ ఇచ్చింది.

క్యాష్ నో క్యాష్.కామ్

క్వికర్, నాస్కామ్ సపోర్టుతో ఏర్పాటైంది క్యాష్ నో క్యాష్.కామ్. ఇటీవలే బెంగళూరులో లాంఛ్ అయిన ఈ వెబ్ సైట్.. మీరుండే ఏరియాలో బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వివరాలు, అందులో క్యాష్ ఉందా లేదా అని డిటెయిల్స్ ఇస్తుంది. మీరు సైట్లోకి ఎంటరై జస్ట్ పిన్ కోడ్ టైప్ చేస్తే చాలు.. ఎక్కడ క్యాష్ ఉందీ, ఎక్కడ లేదూ, వెయిటింగ్ ఎక్కడ లాంటి వివరాలన్నీ చెప్తుంది. దాన్నిబట్టి మనం ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవచ్చు. అనవసరపు ప్రయాసలు ఉండవన్నమాట.

వీటితోపాటు ఇంకా వాల్ నట్, సీఎంఎస్ ఏటీఎం ఫౌండర్, ఏటీఎం సెర్చ్ లాంటి యాప్స్ ఏటీఎంల గురించి సమాచారం అందిస్తున్నాయి. అయితే ఇవి ఎంత వరకు పక్కా ఇన్ఫమేషన్ ఇస్తున్నాయనేది ప్రాక్టికల్ గా చూసినవారే చెప్పాలి. అంతెందుకు"బుక్ మై ఛోటు"నుంచి రిక్వెస్ట్ కన్ఫమ్ అందక.. వంద రూపాయల్లేక అప్పు చేసి రోజులు గడుపుతున్నా అని ఒక యవకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 

Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share
Report an issue
Authors

Related Tags