సంకలనాలు
Telugu

ఒకప్పుడు కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్.. ఇప్పుడు సెలబ్రిటీల స్టయిలిస్ట్

హెయిర్ స్టైలింగ్‌పై బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ... రజనీకాంత్ నుంచి జాన్ అబ్రహం దాకా సెలబ్రిటీలందరితో పనిచేసిన అనుభవం..

ashok patnaik
24th Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


సినిమా హీరోలు అంత అందంగా ఎలా కనిపిస్తారు ? వారి మేకప్ దగ్గరి నుంచి హెయిర్ స్టైల్ దాకా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కాబట్టే అలా వెండితెరపై వెలిగిపోతూ ఉంటారు. వాళ్లు అంత బాగా కనిపించారంటే.. దాని కోసం పనిచేసిన వారు ఇంకెంత కష్టపడి ఉండాలి ? అది తెలుసుకోవాలంటే చందు కథ చదవాల్సిందే. హైదరాబాద్ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన చందు ఓ సాధారణ విద్యార్థిలానే బీకాం పూర్తిచేశారు. ఆ తర్వాత ఓ కాల్ సెంటర్‌లో ఎగ్జిక్యూటివ్‌గా జాయిన్ అయిపోయారు. జీవితం కూడా అలా సాగిపోయేది. కానీ ఏదో తెలియని వెలితి. బహుశా తనకీ జాబ్ సెట్ కాదేమో అని అనుకున్నారు. అప్పుడనుకున్నదే ఇప్పుడు నిజమైంది. ఆ తర్వాతి ప్రయాణం చందు మాటల్లోనే..

“ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నప్పుడు ధైర్యం చేయకపోయి ఉంటే.. ఇప్పుడిక్కడ ఉండే వాడిని కాను. ఇంతమంది సెలబ్రిటీలను అందంగా తీర్చి దిద్దే అవకాశం వచ్చి ఉండేదీ కాదు -” చందు.
స్టైలిస్ట్ చందు

స్టైలిస్ట్ చందు


బ్యాంకాక్ ప్రయాణం

" బ్యాంకాక్ ప్రయాణం నా జీవితంలో మరిచిపోలేనిది. బీకాం డిగ్రీ చేతిలో ఉంది. హైదరాబాద్ హిందీ, తెలుగు తప్పితే నాకు ఇంకో భాష తెలియవు. ఇంగ్లీష్ అంతంత మాత్రమే. కానీ చేసే ఉద్యోగం మాత్రం అసలు నచ్చడం లేదు. కెరీర్ మార్చుకుందాం అనిపించింది. అప్పుడు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నప్పుడు మనసుకు ఓ ఆలోచన తట్టింది. అదే స్టైలింగ్. ఎందుకో అది నాకు సెట్ అవుతుందని అనిపించింది. ముంబైలో కొన్ని సంస్థలు స్టైలింగ్‌పై అప్పటికే ట్రెయినింగ్ ఇస్తున్నాయి. కానీ బ్యాంకాక్‌లో సీకే ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్‌లో నేర్చుకుంటే కెరీర్‌కు తిరుగుండదని చదివా. అంతే.. ఏదో సాధించాలనే మొండి ధైర్యంతో బ్యాంకాక్ పయనమయ్యాను.

షూటింగ్ సమయంలో రజనీకాంత్ తో

షూటింగ్ సమయంలో రజనీకాంత్ తో


అప్పట్లో స్టైలింగ్‌ను కెరియర్‌గా తీసుకుంటానంటే ఇంట్లో కూడా పెద్దగా ఇష్టపడలేదు. సెలూన్‌లో ఉద్యోగం చేస్తానంటే ససేమిరా అన్నారు. బికాం చదివి ఇదేం వృత్తి అంటూ.. తీవ్రస్థాయిలో నిరసించారు. అయితే అప్పుడు వద్దన్న వారే ఇప్పుడు శభాష్ అంటుంటే నా బ్యాంకాక్ ప్రయాణం నా జీవితంలో ఎంత ముఖ్యమైనదో గుర్తొస్తుంది. కాల్ సెంటర్ ఉద్యోగం చేసుకుంటూ దాచుకున్న డబ్బులతో టికెట్స్ తీసుకున్నా. కోర్స్ చేస్తున్న సమయంలోనే పార్ట్ టైం ఉద్యోగం చేశా. అలా నా జీవితాన్ని మలుపు తిప్పింది బ్యాంకాక్ ప్రయాణం.

సెలబ్రిటీ స్టైలిస్ట్

బ్యాంకాక్ నుంచి నేరుగా ముంబై చేరుకున్నా. టోనీ అండ్ గై స్టుడియోలో స్టైలిస్ట్‌గా జాయిన్ అయ్యా. అప్పుడే బాలీవుడ్ సెలబ్రిటీలతో పనిచేసే అవకాశం వచ్చింది. అప్పట్లో జాన్ అబ్రహం క్రాఫ్ అంటే యూత్ లో యమక్రేజ్. ఆయనతో మొదటి సినిమా నుంచి నేను పనిచేశా. అందో అద్భుతమైన అనుభవం. అనంతరం సూపర్ స్టార్ రజనీ కాంత్ తో పనిచేయడం మర్చిపోలేని మరో మధురానుభూతి. రజనీ అందంగా కనిపిస్తున్నారని , సినిమా రిలీజైన తర్వాత మీడియాలో వచ్చిన వార్తలు చూసినప్పుడు నేను పడిన కష్టం మర్చిపోయా. ప్రతి ఒక్కరికీ ఒక స్టైల్ నప్పుతుంది. వారికి ఆ క్రాఫ్ ఉంటేనే అందంగాకనిపిస్తారు. దాన్ని గుర్తించగలిగితే ఇక తిరుగేలేదు. స్టైలిస్ట్‌గా రాణించాలంటే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆ తర్వాత తెలుగు,తమిళ,హిందీ ఇంస్ట్రీల్లో చాలా మందితో పనిచేశా. ఇప్పటి వరకూ 40కి పైగా సినిమాలకు పనిచేసిన అనుభవం ఉంది. 

మొదటి సారి పవర్ కళ్యాణ్ కు స్టైలింగ్ చేయడానికి వెళ్లినప్పుడు కొన్ని సెకెన్ల పాటు ఏమీ చేయకుండా అలానే ఉండిపోయా. పవర్ స్టార్‌తో పనిచేస్తున్నానా అని నన్ను నేనే శభాష్ అనుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకూ చాలా సార్లు నేను చేసిన క్రాఫింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. మోహన్ బాబు, కార్తీక్ ఇలా చాలా మంది స్టార్లతో పనిచేశాను. దీంతో నన్ను అంతా సెలబ్రిటీ స్టైలిస్ట్ అనడం మొదలు పెట్టారు.

“నా వరకూ అయితే నా పనే నా సెలబ్రిటీ. అది సెలబ్రిటీ అయినా మరెవరైనా నేను నూటికి నూరు పాళ్లు న్యాయం చేయాలనే అనుకుంటా.” చందు

అకాడమి పెట్టాలనుంది

స్టైలింగ్ విషయంలో ప్రొఫెషనల్స్ తయారు చేయాలనుంది. ఇంతమంది సెటబ్రిటీస్‌తో పనిచేసిన అనుభవంతో ఓ అకాడమి పెట్టాలని అనుకుంటున్నా. నా దగ్గర అసిస్టెంట్‌లుగా పనిచేసిన వారెందరో అమెరికా, కెనడా తోపాటు జపాన్, బ్యాంకాక్ లాంటి దేశాల్లో మంచి పొజిషన్లలో ఉన్నారు. అది నాకెంతో సంతోషాన్నిస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా స్టైలింగ్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నా. స్టైలింగ్ కెరియర్ ఎంచుకోవాలనే వారికి ప్రాపర్ ట్రెయినింగ్ ఇవ్వాలని అనుకుంటున్నా. ఈ ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులతో ఇదే ఇండస్ట్రీకి సేవల చేయాలనుకుంటున్నా. ఓ ఫౌండేషన్ మొదలు పెట్టాను. కాలేజీ డ్రాపవుట్ అయిన పేదలను ట్రెయినింగ్ ఇచ్చి స్టైలింగ్ ప్రొఫెషనల్స్ గా మార్చాలనుకుంటున్నా. అకాడమీ తోనే ఇది సాధ్యపడుతుందని అనుకుంటున్నా. తొందరలోనే అకాడమీ అనౌన్స్ మెంట్ వస్తుంది.

సలహాలు, సూచనలు

స్టైలింగ్ కెరియర్ అనేది కనపడిన అంత స్టైల్‌గా ఉండదు. ఈ కెరీర్‌లోకి రావాలనుకునే వారు దీని గురించి తెలుసుకొనిరావాలి. స్టాండర్ట్స్ నేర్చుకోవాలి. మీకు ఎంత స్కిల్ ఉన్నప్పటికీ హార్డ్ వర్క్ చేయకపోతే ఎవరూ గుర్తించరు. ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉందనే ఒక్క విషయం మిమ్మల్ని నిలబెడ్తుందని అనుకోవద్దు ".

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags