సంకలనాలు
Telugu

రండి.. సమయాన్ని సృష్టిద్దాం..!

SOWJANYA RAJ
5th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


డబ్బుని ఆదా చేయడమంటే సంపాదించడమేనంటారు తల పండిన ఆర్థిక నిపుణులు. ఆ కోణంలోనే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే అదనపు సమయాన్ని సృష్టించడమేనంటున్నారు నేటి మేనేజ్ మెంట్ గురూలు..!. అందులో ఎలాంటి సందేహం లేదు. రతన్ టాటాకైనా ... చిన్న సైజ్ స్టార్టప్ కంపెనీ ఫౌండర్ కైనా ఉండేది ఇరవై నాలుగు గంటలే. మన వ్యవహారాలకు తగ్గట్లుగా మేనేజ్ చేసుకుంటే సమయం లేదనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అయితే అలా మేనేజ్ చేసుకోవడం ఎలా..?

బెంజమిన్ ఫ్రాంక్లిన్ ... సైన్స్ చదువుకున్నవారికి శాస్త్రవేత్తగాను, పొలిటికల్ సైన్స్ చదువుకున్నవారికి రాజకీయవేత్తగాను, చరిత్ర చదువుకున్నవారికి అమెరికా నిర్మాతల్లో ఒకరిగాను.. సోషల్ సైన్స్ పై ఆసక్తి ఉన్నవారికి సామాజిక వేత్తగానూ.. తెలుసు. ఆయన బహుముఖ ప్రజ్ఞశాలి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం. ఈ మాట అస్సలు అతిశయోక్తి కాదు. శాస్త్రవేత్త, వ్యాపారవేత్త, దౌత్యవేత్త, రాజకీయవేత్త ఇలా చెప్పుకుంటే పోతే చాలారంగాల్లో ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఉన్నదీ ఇరవై నాలుగ్గంటలే. మరి ఆయన ఎలా వాటన్నింటిని సమన్వయం చేశారు...?. "ఒక చిన్న పట్టిక ద్వారా..." అవును.. బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన సమయాన్ని సమన్వయం చేసుకున్నారు. ఫ్రాంక్లిన్ ఇతర ఘనతల ముందు ఈ విషయం పెద్దగా ప్రచారం పొందనప్పటికీ... "ఫ్రాంక్లిన్ పట్టిక" పెద్ద పెద్ద మేనేజ్ మెంట్ సంస్థలకు, వాటిని నడిపేవారికి శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఓ దిక్సూచి.

బెంజిమిన్ ఫ్రాంక్లిన్<br>

బెంజిమిన్ ఫ్రాంక్లిన్


స్టార్టప్ పెట్టిన వారు... పెట్టబోయేవారు ఎన్నో అంశాలను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సమయం లేని కారణంగా కొన్ని పనులు జరగకుండా పోయే సందర్భాలు ఉంటాయి. అటు ఫ్యామిలీకి ఇటు స్టార్టప్ కి సమయం కేటాయించే విషయంలో సమన్వయం లోపిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇలాంటి వారికి బెంజమిన్ ఫ్రాంక్లిన్ స్టైల్ జర్నలింగ్ పర్ ఫెక్ట్ గా సరిపోతుంది. దీని ప్రకారం ఏ పనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో... ఎంత సమయం... ఎప్పుడు కేటాయించాలో సులువుగా నిర్ధారించుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే అందరూ డైరీని ఆ రోజులో ఏం జరిగిందో రాసుకుంటారో... కానీ చేయాలో రాసుకోవడమే ఫ్రాంక్లిన్ స్టైల్.

బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన డైరీని రెండు రకాలుగా విభజించుకున్నారు. ఎడమవైపు రోజంతా తానేం చేయాలి అనే ప్రశ్న వేసుకుంటారు. దాని కింద మళ్లీ సాయంత్రం తానేం చేశానో రాసుకుంటారు. కుడివైపు రెండు పూటలా తను సమయాన్ని ఏ ఏ పనులకు కేటాయించాలో గంటలవారీగా విభజించుకుంటారు. కుటుంబానికి, వ్యాపారానికి, పరిశోధనలకు, వినోదానికీ ఇలానే సమయం కేటాయించేవారు.

బెంజిమిన్ ఫ్రాంక్లిన్ డే ప్లానింగ్ డైరీ<br>

బెంజిమిన్ ఫ్రాంక్లిన్ డే ప్లానింగ్ డైరీ


ప్లానింగ్ లేకపోతే ఏ పనీ చేయకుండానే గంటలు గంటలు గడిచిపోతూంటాయి. క్షణం తీరిక ఉండదు...పైసా ఆదాయం ఉండదు తరహాలోనే ఉండిపోతాం. అయ్యో ఈ రోజంతా ఏమీ చేయలేదే... ? ఆ పని చేసినా బాగుండేదే అని అనుకోవాల్సిన పరిస్థితి రాదు. డైలీ ప్లానింగ్, మానిటరింగ్ చేసుకోవడానికి ఆన్ లైన్ టూల్ ని వాడుకోవచ్చు.. లేదా పుస్తకంలో రాసుకోవడం అయినా ప్రారంభించవచ్చు... కానీ కావాల్సిందల్లా రోజుని మరింత మెరుగ్గా సరిదిద్దుకోవాలనే ఆలోచన... మొదట్లో కొంచెం బోరింగ్ ఉంటుంది. కానీ రాను రాను దీని విలువ ఏంటో మీకే తెలుస్తుంది.

 

రండి..సమయాన్ని సృష్టిద్దాం... బెంజిమిన్ ఫ్రాంక్లిన్ స్టైల్లో..!

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags