సంకలనాలు
Telugu

ఇంటింటా వెలసిన బేకింగ్ పరిశ్రమలు

కస్టమైజేషన్.. ఇప్పుడు ఇదే సక్సెస్ మంత్ర.. అందరికీ వుండేది మనకొద్దు.. మనకోసం.. ప్రత్యేకమైనది.. మన అభిరుచులు అద్దం పట్టేది కావాలి.. అది కారైనా, బొమ్మయినా, బ్యాగ్ అయినా, షూ అయినా.. ఏ వస్తువైనా అందులో మన ముద్ర కనిపించాలి. మామూలుగా  రోజూవారీ వాడే వస్తువుల్లోనే ఇంత వ్యక్తిగత శ్రద్ధ వున్నప్పుడు ఏడాదికి ఒకసారి వచ్చే పుట్టిన రోజు, పెళ్ళరోజుల్లాంటి వాటిని ఇంకెంత మురిపెంగా జరుపుకుంటాం. అందుకే ఈ వేడుకల్లో కట్ చేసే కేకులు కూడా అంతే పర్సనలైజడ్ వుండాలని కోరుకుంటారు.

bharathi paluri
24th Apr 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఇండియాలో పర్సనలైజడ్ కేక్ కటింగ్ కొత్త కాకపోయినా.. గడిచిన పదేళ్ళలో ఈ బిజినెస్ కుటీర పరిశ్రమగా మారింది. అనేక మంది మహిళలు ఇంట్లోనే అందమైన కేకులను తీర్చిదిద్దుతున్నారు. ఇంటర్నెట్ పుణ్యమా అని ఏడాదిలో ఈ పరిశ్రమ ఉధృతంగా పెరిగింది. ఒకదానికి మించిన మరో కేకు ఇళ్లల్లోనే తయారవుతున్నాయి. కొత్తగా ఈరంగంలోకి వచ్చిన వారితో పాటు గత అనుభవం వున్న వారు కూడా ఒక గ్రూపుగా మారుతున్నారు. హోమ్ బేకర్స్ గిల్డ్ లాంటి ఫేస్ బుక్ గ్రూపులు ఈ కోవలోనే వస్తాయి.

ఇండియాలో ఈ హోమ్ బేకింగ్ పరిశ్రమ ఎలా విస్తరించిందో తెలుసుకోవడానికి వివిధ స్థాయిల్లో నైపుణ్యం వున్న కొందరు బేకర్స్‌ను అధ్యయనం చేసాం. కేక్స్ తినే పదార్ధాలు.. వీటి డిజైన్, వాటిలో వాడే పదార్ధాలు, తయారు చేసే నైపుణ్యాల్లో ఒకరితో మరొకరిని పోల్చలేం. అయితే, దేశంలో బేకర్స్‌కు ఎదురవుతున్న అనుభవాలు, వారు ఎదుర్కొటున్న సమస్యలు లాంటి అనేక విషయాలు మా అధ్యయనంలో వెలుగు చూసాయి.

image - shutterstock

image - shutterstock


ఆరంభం

ఏ వ్యాపారం మొదలు పెట్టాలన్నా ముందు పెట్టుబడి కావాలి. హోమ్ బేకర్‌గా మారడానికి పెట్టుబడి పెద్దగా అక్కర్లేదు కానీ, మంచి క్వాలిటీ కేకులు అందించాలంటే మంచి ఓవెన్ తదితర పరికరాలుండాలి. వీటికోసమే ఎంతో కొంత పెట్టుబడి అవసరమవుతుంది. వ్యాపారం పెరిగే కొద్దీ ఈ పరికరాల జాబితా కూడా పెరుగుతుంది.

ప్రతి హోమ్ బేకర్ బేకింగ్‌కి సంబంధించిన కొంత కనీస పరిజ్ఞానం ఉండాలి. అలాగే, డిజైన్లు, రంగులకు సంబంధించిన అవగాహన వుండాలి. బెంగళూరు లోని లావన్ (Lavonne) లాంటి బేకింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఈ అంశాలపై శిక్షణ నిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇటు ఇంటర్నెట్లో అనేక వీడియోలు కూడా అందుబాటులో వున్నాయి. ఇవి కాక అనేక దేశంలోని అనేక ప్రాంతాల్లో కేకుల తయారీ, వాటి అలంకరణకు సంబంధించి వారంరోజుల క్లాసులు నడుస్తున్నాయి.

image


ఏం కావాలి ?

ఏ బిజినెస్‌కి అయినా.. లాజిస్టిక్స్ చాలా ముఖ్యం. హోమ్ బేకర్స్‌కి కూడా అంతే. బిజినెస్‌కి కావలసిన మౌలిక వనరులు సమకూర్చుకోవడం, అకౌంట్స్ చూసుకోవడం, టైమ్‌కి డెలివరీ చేయడం.. హోమ్ బేకింగ్ లో ప్రధానంగా వుండే అంశాలు. మేం మాట్లాడిన చాలా మంది హోమ్ మేకర్స్... వన్ మేన్ ఆర్మీలే. కేకులు డిజైన్ చేయడం దగ్గర నుంచి, క్లీనర్, అకౌంటంట్, సేల్స్, మార్కెటింగ్, అన్నీ.. ఒకరే. మహా అయితే, కొంత మంది గంటకింత చొప్పున ఒకరో ఇద్దరో మనుషుల్ని పెట్టుకుంటారు. కొంత మందికి ఇంట్లో వాళ్ళే సహాయ పడితే, శిక్షణ ఇచ్చే వాళ్ళకి శిష్యులే పనిలో కూడా చేదోడుగా వుంటారు.

ఇక చెల్లింపుల విషయానికొస్తే, సగం మొత్తం అడ్వాన్సుగా తీసుకుని మిగతాది డెలివరీ టైమ్ లో తీసుకుంటూ వుంటారు. అడ్వాన్స్ ని అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. మేం మాట్లాడిన హోమ్ బేకర్స్‌లో ఎవరూ కూడా ఇంకా మొబైల్ పేమెంట్స్ జోలికి వెళ్ళలేదు.

ఈ హోమ్ బేకర్స్ ఎదుర్కొనే ప్రధాన సమస్య.. కేకులను డెలివర్ చేయడం. చాలా వరకు ఈ హోమ్ బేకర్సే క్లయింట్స్ ఇళ్లకు వెళ్ళి కేకులు డెలివర్ చేస్తారు. కొంత మంది క్లయింట్లే వచ్చి తీసుకెళ్తారు. కొంత మంది టాక్సీలను పెట్టుకోగా, మరికొంత మంది ఇంకొన్ని విధాలుగా కూడా ప్రయత్నించారు. ఏది ఏమైనా.. ఈ డెలివరీ అనేది మాత్రం చాలామంది బేకర్లకు కాస్త సమస్యగానే వుంది. ఎవరైనా కేకులను డెలివరీ చేసే బిజినెస్‌లోకి రావాలనుకుంటే మాత్రం అవకాశాలు బాగానే వున్నాయి.

Zoey’s Bakehouse

Zoey’s Bakehouse


మార్కెటింగ్..

ఇక్కడ బిజినెస్‌లో పైకి రావాలంటే రికమండేషన్లు, సిఫారసులు పని చేయవు. మీ పనే మీ గురించి చెప్తుంది. కేక్ రుచి, ప్రెజెంటేషన్ రెండూ చాలా ముఖ్యం. మీ కేకుతో ఒక కస్టమర్ తృప్తి చెందితే, అతను/ఆమే వంద మందిని మీ దగ్గరకు తెస్తారు. ఇంటర్నెట్ కంటే కూడా.. నోటి మాటకే ఈ బిజినెస్ లో విలువ ఎక్కువ. ఎంత మంది క్లయింట్స్ మీ కేకులతో సంతృప్తి చెందితే, మీ బిజినెస్ అన్ని రెట్లు పెరుగుతుంది. హోమ్ బేకర్స్ మార్కెటింగ్‌లో ఫేస్ బుక్ బాగా ఉపయోగపడుతోంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లది తరవాత స్థానాలు. కొద్ది మంది జొమాటో లో కూడా వున్నారు. ఇక డిజైన్లకు సంబంధించిన సమాచారం ఇచ్చి పుచ్చుకోవడానికి , క్లయింట్లను ఒప్పించడానికి వాట్సాప్, ఈమెయిల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి.

కొద్ది మంది హోమ్ బేకర్స్‌ మరో అడుగు ముందుకేసి , మరికొన్నిమార్గాల్లో మార్కెటింగ్ చేస్తున్నారు. తమ దగ్గరున్న క్లయింట లిస్టుకి మెయిల్స్ పంపే వారు కొందరైతే, స్కూళ్ళు, అపార్టమెంట్లు, లాంటి చోట్ల స్టాల్స్ పెట్టి ప్రమోట్ చేసే వాళ్లు మరి కొందరు. మొత్తం మీద ఈ రంగంలో మార్కెటింగ్ ఇంకా ప్రాథమిక దశలోనే వుంది. అయినా ఫలితాలు మాత్రం ఆశాజనకంగానే వున్నాయి.

కొద్దీ మంది మాత్రం సొంత వెబ్ సైట్లు పెట్టుకుని కొంత మెరుగైన మార్కెటింగ్ చేస్తున్నారు. ఐటి పరిజ్జ్ఞానం వున్నవాళ్ళు సొంతంగా వెబ్ సైట్లు నడుపుకుంటే, లేని వాళ్ళు నేర్చుకునో, కుటుంబ సభ్యుల సహకారంతోనో ఈ వెబ్ సైట్లు నిర్వహిస్తున్నారు. తాము తయారు చేసిన కేకుల డిజైన్లను తమ సోషల్ నెట్ వర్క్ సైట్లలో, ఫేస్ బుక్ పేజీల్లో పెట్టుకుంటారు.

Bakeman Begins

Bakeman Begins


ఇతర పరిశ్రమలకు లాభదాయకం

హోమ్ బేకర్స్ పరిశ్రమ పెరగడం వల్ల మరికొన్ని పరిశ్రమలకు కూడా మేలు జరుగుతోంది. హోమ్ బేకర్స్ పెరిగేకొద్దీ, కిచెన్ ఎయిడ్ (వంటింటి సామగ్రి) బిజినెస్ పెరుగుతూ వస్తోంది. అమెజాన్, ఈబే, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ లాంటి ఆన్ లైన్ సైట్లలో ఓవన్లు, మౌల్డ్స్, లాంటి పరికరాల వ్యాపారం బాగా పెరుగుతోంది. వీటిలో చాలా వరకు హోమ్ బేకర్ల ఆర్డర్లే కనిపిస్తున్నాయి.

ఇక కేకుల తయారీకి కావలసిన సరుకలకోసం ఎక్కువగా స్థానికంగా వుండే షాపుల మీదా.. ఆన్ లైన్ స్టోర్స్ మీదా ఎక్కువగా ఆధారపడుతుంటారు. బేకర్స్‌కి అవసరమైన సరుకులు, పరికరాలు అమ్మే ప్రత్యేక షాపులు ఇప్పుడు ప్రతి నగరంలోనూ వెలుస్తున్నాయి. బెంగళూరు లోని ఐబిసిఎ, లావన్, చెన్నై లోని పాషనేట్ బేకింగ్, ఢిల్లీ లోని సి సి డి ఎస్ వీటిలో కొన్ని. ఇంకా చెప్పాలంటే, చెన్నై లోఫుడ్ హాల్ స్టోర్స్, ఆర్ జె కాంప్లెక్స్, కర్రిమ్ బాయ్స్, ముంబై లోని ఆరిఫ్ ఎల్ మౌల్డ్, ఢిల్లీ లోని బట్లర్స్, విశాల్ ఎంటర్ ప్రైజెస్ లు కూడా ఈ కోవలోక వస్తాయి.

లాభాలెలా వున్నాయి..

నిజానికి బేకింగ్ పరిశ్రమ చాలా విస్తారమైనది. అందులో హోమ్ బేకర్స్ ఒక చిన్న భాగం మాత్రమే.. చాలా వరకు వీళ్లంతా అసంఘటితంగా వుంటారు. మేం మాట్లాడిన హోమ్ బేకర్స్‌లో ఎక్కువ మంది వారానికి 4 నుంచి 6 ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటామని చెప్పారు. నిజానికి ఆర్డర్ల కొరతేమీ లేకపోయినా.. మరీ ఎక్కువైతే తాము చేయలేం కనుక, వీలైనన్ని ఆర్డర్లను మాత్రమే వీరు తీసుకుంటున్నారు.

ముందే చెప్పినట్టు ఇది అసంఘటిత రంగం కనుక, పెద్దగా లాభసాటి రేట్లు పెట్టలేరు. హోమ్ బేకర్లు తాము వాడిన పదార్ధాలను బట్టీ, డిజైన్ ని బట్టీ రేట్లను నిర్ణయించుకుంటారు. మొత్తమ్మీద దాదాపు 3 నుంచి 5 కేజీల కేకు తయారీకి 6 నుంచి 12 గంటలు టైమ్ పడుతుంది. ఇదంతా ఒకే రోజు చేయలేరు. రోజూ కొంత టైమ్ కేటాయిస్తూ రెండు మూడు రోజుల్లోచేస్తారు. కొత్తగా ఈ రంగంలోకి వచ్చిన వారి కంటే, అనుభవం, నైపుణ్యం వున్న వాళ్ళు కొంత తక్కువ టైమ్‌లోనే చేస్తారు. ఎంతైనా ఒక్క రోజులో కాదు. ముందు డిజైన్ అనుకోవాలి. దాన్ని క్లయింట్లతో చర్చంచాలి. చివరికి ఒక డిజైన్ ఖరారు చేసుకోవాలి. ఖరారైన డిజైన్‌లో కేకును తయారు చేయాలి. చివరికి క్లయింట్ కు డెలివర్ చేయాలి. దీనంతటికి ఎంతో శ్రమ పడాలి. మనసు లగ్నం చేయాలి. డిజైన్ ఎంత సంక్లిష్టంగా వుంటే, ధర అంత ఎక్కువుంటుంది. ఈ డిజైన్లు చేయడానికి ఇప్పడు కేక్ ఆర్టిస్టులు కూడా పుట్టుకొచ్చారు. బెంగళూరు లోని లావన్ లో పని చేస్తున్న జూనీ టాన్ ఇలాంటి కేక్ ఆర్టిస్టుల్లో ఒకరు.

పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా అని అడిగితే, రకరకాల సమాధానాలొచ్చాయి. ఎంత రాబడి వస్తుందనే విషయంలో కొందరు హోమ్ బేకర్లు వివరాలు చెప్పడానికి నిరాకరించారు. కొందరు మాత్రం ఓవెన్లు, పరికరాల మీద మొదట్లో పెట్టిన పెట్టుబడి పోను.. ఇప్పుడు లాభాలు వస్తున్నాయని చెప్పారు. కొంత మందికి పెట్టిన పెట్టుబడి వస్తుంటే, మరి కొంత మందికి బొటాబొటీగా లాభాలు వస్తున్నాయి.

synful bakes

synful bakes


పరిశ్రమ

ఒక పక్క ఇంట్లోనే కేకులు తయారు చేసే తల్లులు, మరో పక్క మెజారిటీ మార్కెట్‌ను ఆక్రమిస్తున్న లోకల్ బేకరీలు.. హోమ్ బేకర్స్‌కు పెద్దపోటీ అని చెప్పుకోవాలి. ఈ పోటీలో నెగ్గాలంటే కస్టమైజేషన్ ఒక్కటే హోమ్ బేకర్స్‌కు ఆధారం. కేవలం కేకులే కాకుండా, కప్ కేకులు, కుకీలను కూడా కస్టమర్ల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా తీర్చి దిద్దుతున్నారు. నిజానికి దీపావళి లాంటి పండగలకు ఇది వరకు స్వీట్లను ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు ఇప్పుడు కస్టమైజ్డ్ కప్ కేకులను ఇస్తున్నారు. ఇంత పోటీ వున్న ఈ పరిశ్రమలో ముందు వచ్చిన వాళ్ళకి లాభాలు ఎక్కువుంటాయి. అయితే, తక్కువ పెట్టుబడి, పరిమిత ఆర్డర్లతో మొదలు పెట్టాలనుకునే వాళ్లకి ఇంకా మంచి అవకాశాలున్నాయి.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags