సంకలనాలు
Telugu

విజయం సాధించాలనుందా…? అయితే ముందు హాయిగా నిద్రపోండి..!!

Pavani Reddy
3rd May 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share


చక్కని నిద్ర జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శరీరం పునరుత్తేజం పొందుతుంది. మనిషి ఎదుగుదలకు కష్టించి పనిచేయడం ఎంత ముఖ్యమో… నిద్రకూడా అంతే ముఖ్యం. అయితే రానురాను నిద్ర అనేది పెద్ద ఆరోగ్య సమస్యగా తయారవుతోంది. నిద్ర కొరవడితే ఏకాగ్రత దెబ్బతింటుంది. మానసిక ఒత్తిడి పెరిగి గుండెపోటు, కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. మధుమేహం, ఊబకాయం ఎటాక్ చేస్తాయి. సరిగా నిద్రపోలేదంటే దానికి కచ్చితంగా కారణాలను అణ్వేషించాల్సిందే. అసలు ఎందుకు నిద్రపోవాలి… నిద్రకోసం ఏం చేయాలి…? మీరే చదవండి.

అరియన్నా హఫింగ్టన్… ప్రపంచ ప్రఖ్యాత వెబ్ సైట్ ద హఫింగ్టన్ పోస్ట్ సహ వ్యవస్థాపకురాలు, ఎడిటర్ ఇన్ చీఫ్ తన జీవితంలో ఏది మిస్సవుతున్నారో గుర్తించారు. ఎంతోమంది డాక్టర్లను సంప్రదించారు. తర్వాత తన జీవితం ఎందుకు అలా తయారయ్యిందో తెలుసుకున్నారు. నిద్రలేమివల్లే తనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రహించారు. బిజినెస్ వరల్డ్ లో టైం అంటే డబ్బు. కానీ ఉత్పత్తిని పెంచే ఉత్ప్రేరకం నిద్ర అంటున్నారు హఫింగ్టన్.

“నిద్ర అనేది ఒక అద్భుతం. ఒకసారి పడుకుని లేచాక ఈ ప్రపంచాన్ని ఫ్రెష్ ఐస్ తో కొత్తగా చూడొచ్చు. నూతన ఉత్తేజం వస్తుంది. నిద్రలేమితో చాలాకాలం బాదభడ్డాను. వ్యాధులు చుట్టు ముట్టాయి. ఎన్ని పనులున్నా ఇప్పుడు సమయానికి నిద్రపోతున్నా. పసిపాపలా పడుకుంటున్నాను. 2016లో నిద్ర మంచి ఫలితాలు తేవాలని ఆశిస్తున్నా”-అరియన్నా హఫింగ్టన్

హఫింగ్టన్ నిద్రకు చాలా ప్రాధాన్యతనిస్తారు. “ద స్లీప్ రివల్యూషన్: ట్రాన్స్ ఫార్మింగ్ యువర్ లైఫ్, వన్ నైట్ ఎట్ ఎ టైమ్” అనే పేరుతో ఒక పుస్తకాన్నికూడా రాస్తున్నారు. నిద్రకు – ఉత్పత్తికి ఒక నాణేనికి బొమ్మా బొరుసుల్లాంటివి అంటారామె. నిద్రపోనివారు చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అందుకే చంటిపాపలా నిద్రపోవాలనేది ఆమె సలహా.

  హఫింగ్టన్  

  హఫింగ్టన్  


ఒక ఆన్ డిమాండ్ డ్రైవర్ సర్వీస్ వ్యవస్థాపకుడు రాకేశ్ మన్ననూరు- పని ఒత్తిడివల్లే రోజుకు మూడు నాలుగు గంటలే నిద్రపోయేవారు. తన సంస్థ స్థాపించకముందు చాలా టెన్షన్ పడేవారు. 40 రోజులపాటు ఇలాగే కష్టపడ్డారు. అయితే మనిషి దేన్నైనా త్యాగం చేయొచ్చుగానీ… నిద్ర విషయంలో మాత్రం కాదంటున్నారు. నిద్రను ప్రతి వ్యక్తి అత్యంత ప్రాధాన్యతా అంశాల జాబితాలో చేర్చాల్సిందే. తను చేసే టైమింగ్స్ అలాంటివికావడంతో… ప్రతి నాలుగు గంటలకు ఒకసారి 20 నిమిషాలపాటు కునుకు తీయడం అలవాటు చేసుకున్నారు. 

ప్రతివ్యక్తి తన జీవితంలో మూడో వంతు నిద్రకే కేటాయిస్తుంటారు. సరిగా నిద్రపోకపోతే మన మైండ్ అండ్ బాడీ సరిగా పనిచేయవు. చికాకు కలుగుతుంది, తలనొప్పి వస్తుంది. కొన్ని నెలలపాటు ఇలాగే జరిగితే బరువు పెరుగుతుంది, కంటి చూపు తగ్గుతుంది, గుండె జబ్బులు వస్తాయి, వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. కేన్సర్ కూడా వచ్చే ప్రమాదముంది. 

హాయిగా నిద్రపోవడం ఎలా?

1. నిద్రపోవడానికి రెండు, మూడు గంటల ముందు కాఫీ తాగడం మానేయాలి. నిద్రపోవడానికి ముందు స్మార్ట్ ఫోన్ చూడకూడదు. అందులోనుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల… బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి నిద్రకు దూరమయ్యే అవకాశముంది. ఐఫోన్ ఉపయోగించేవారు… నైట్ షిప్ట్ మోడ్ లో పెట్టుకుని నిద్రపోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్ నైట్ షిప్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని… రాత్రిపూట దాన్ని యాక్టివేట్ చేయాలి.

2. నిద్రపోయే గది చాలా చీకటిగా ఉండేలా చూసుకోవాలి. నైట్ కిటికీలకు బ్లాక్ కర్టైన్స్ ఏర్పాటుచేసుకోవాలి. శ్రావ్యమైన శబ్దాలు వచ్చే యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటే అవి నిద్రపుచ్చేలా చేస్తాయి. యాప్ స్టోర్ లో వైట్ నాయిస్ అని కొట్టి యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడమే. వర్షం, అలల చప్పుడు ఆ యాప్స్ నుంచి వస్తాయి. TMSoft app ను ఒకసారి ప్రయత్నించి చూడండి.

• 3.ఆహార నియమాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. జిహ్వచాపల్యాన్ని పక్కనపెట్టి… ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. నిద్రపోయే ముందు లైట్ గా ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్, కబాబ్స్ టేస్టీగానే ఉంటాయి… కానీ తక్కువగా తీసుకోవాలి.

• 4. వీకెండ్స్ లో నిద్రపోదాంలే అంటూ నిద్రను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. రోజుకు ఎనిమిది గంటల వరకు నిద్రపోవాల్సిందే. నిద్ర నుంచి లేవడానికి మాత్రమే కాదు… ఎప్పుడు నిద్రపోవాలో కూడా ఒక అలారం పెట్టుకోవాలి.

• 5. స్టార్టప్స్ ప్రారంభించేవారు ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఒకేసారి పది విషయాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అయితే నిద్రపోయే ముందు మెదడును ఒత్తిడికి గురిచేయరాదు.

• 6. ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడు నిద్రపోయి మెదడును కంట్రోల్ చేయాలి. ఎన్ని పనులున్నా… ఇట్స్ టైం ఫర్ స్లీప్ అంటూ బెడ్ మీదకు వెళ్లిపోవాలి. లేకపోతే కూర్చున్న కుర్చీలోనే కాసేపు కునుకుతీయాలి.

• 7. సరిగా నిద్రపట్టాలంటే పగటిపూట కొంచెంసేపు వ్యాయామం చేయాలి. అనవసర విషయాలపై దృష్టిపెట్టరాదు.

 ఈ చిట్కాలు పాటిస్తే హాయిగా నిద్రపోతూ జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు.

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags