సంకలనాలు
Telugu

17 ఏళ్లకే యాప్స్‌ రంగంలో పెనుసంచలనం రాఘ‌వ్‌సూద్‌

చిన్న‌వ‌య‌సులోనే సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న రాఘ‌వ్ సూద్‌17 ఏళ్ల‌కే అపోలిక్స్ సంస్థ‌ను ప్రారంభించిన చిచ్చ‌ర‌పిడుగుఇప్ప‌టికే ఎన్నో ఆండ్రాయిడ్ యాప్స్‌ను రూపొందించిన బాల‌మేధావి15 ఏళ్ల‌కే ప్రో ఆండ్రాయిడ్ అగుమెంటెడ్ రియాలిటీ పుస్త‌కాన్ని రాసిన రాఘ‌వ్‌

GOPAL
22nd Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

టెక్నాల‌జీ ప్ర‌పంచం ఓ స‌ముద్రం. అందులో సాఫ్ట్‌వేర్‌, ఆండ్రాయిడ్ డెవ‌ల‌పింగ్ రంగానికున్న ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. అందులో ప‌నిచేయాలంటే మ‌హామ‌హా ఇంజినీర్లే త‌ల‌లు ప‌ట్టుకుంటారు. ఓ యువ‌కుడు 17 ఏళ్ల‌కే అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం నుంచే యాప్స్‌ను రూపొందించ‌డం ప్రారంభించాడు. అత‌నే రాఘ‌వ్ సూద్‌.

గుర్గావ్‌లో #GHFHacks ఈవెంట్ జ‌రుగుతోంది. మ‌రో 99 మందితో క‌లిసి ఓ యువ‌కుడు కోడింగ్ చేస్తున్నాడు. 30 గంట‌ల సుదీర్ఘ హాక‌థాన్‌లో కేవ‌లం మూడు గంట‌ల్లోనే ఓ కోడింగ్‌ను సృష్టించాడు రాఘ‌వ్‌. కాప్ష‌న‌ర్ అనే టూల్‌ను రూపొందించారు. ఈ టూల్ ఉంటే మ‌నం మాట్లాడుతుంటే ఆటోమేటిక్‌గా అది మొబైల్‌లో టెక్స్ట్‌ రూపంలో రికార్డ‌యిపోతుంది.

క‌ర్ణాట‌క ఐటీ సెక్ర‌ట‌రీ శ్రీవ‌త్స‌వ కృష్ణ‌న్‌తో రాఘ‌వ్ (ఎడ‌మ‌వైపు కూర్చున్న వ్య‌క్తి)

క‌ర్ణాట‌క ఐటీ సెక్ర‌ట‌రీ శ్రీవ‌త్స‌వ కృష్ణ‌న్‌తో రాఘ‌వ్ (ఎడ‌మ‌వైపు కూర్చున్న వ్య‌క్తి)


"మొబైల్స్‌లో వివిధ లాంగ్వేజీల్లో ప‌నిచేసే వారి కోసం ఓ యాప్‌ను రూపొందించాను. ఇదో కాప్ష‌నింగ్ టూల్‌. మ‌నం మాట్లాడుతుంటే ఆటోమేటిక్‌గా మ‌న మాట‌ల‌ను రికార్డు చేసి టెక్ట్ రూపంలోకి మార్చేస్తుంది ఈ కాప్ష‌న‌ర్‌" అని రాఘ‌వ్ వివ‌రించారు. హాక‌థాన్ ప్రారంభ‌మైన మూడు గంట‌ల్లోనే ఆ బాల‌మేధావి తాను రూపొందించిన కోడ్ చెప్ప‌డంతో ఆ హాల్ చ‌ప్ప‌ట్ల‌తో మారిమోగిపోయింది. ఈ కాప్ష‌న‌ర్ టూల్ అద్భుతంగా ప‌నిచేస్తోంద‌న్న ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అలాగే 2014 #GHFHacksలో విజ‌యం కూడా ఆ అబ్బాయినే వ‌రించింది.

బాల మేధావి..

కోడింగ్ చేయ‌డం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌కే క‌ష్టం. అలాంటిది ప‌దేళ్ల వ‌య‌సు నుంచే రాఘ‌వ్ కోడింగ్ చేయ‌డం ప్రారంభించారు. "కంప్యూట‌ర్ల‌తో ఆడుకోవ‌డం చిన్న‌ప్ప‌టి నుంచి చాలా ఇష్టం. మొద‌ట్లో సీ, జావా వంటి ప్రోగ్రామ్స్‌ను నేర్చుకున్నాను. ఐతే ఆండ్రాయిడ్‌లో ప‌నిచేయ‌డమంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ‌ర్ల కోసం ప‌నిచేసే క్వ‌శ్చ‌న్ అండ్ ఆన్స‌ర్ వెబ్‌సైట్ స్టాక్ ఓవ‌ర్‌ఫ్లోలో యాక్టివ్ మెంబ‌ర్‌ను. థ్రెడ్స్ వంటి ప్రోగ్రామ్స్ చేయ‌డంలో స‌హ‌క‌రించాను. అలాగే వివిధ పోర్ట‌ల్స్‌లో ప‌నిచేశాను" అని రాఘ‌వ్ వివ‌రించారు. రాఘ‌వ్ టాలెంట్‌ను చూసి అప్రెస్ అనే ప్రింటింగ్‌ సంస్థ ఆయ‌న‌ను సంప్ర‌దించింది. "ప్రో ఆండ్రాయిడ్ అగుమెంటెడ్ రియాలిటీ" అనే పుస్త‌కాన్ని రాయాల్సిందిగా కోరింది. రియాలిటీ అప్లికేష‌న్స్‌లో ఫౌండేష‌న్స్ ఎలా ఉండాల‌న్న‌ది ఈ బుక్‌లో వివ‌రించారు. "యాక్సెలెరోమీట‌ర్‌, మాగ్నెటోమీట‌ర్ (కంపాస్‌) వంటి వివిధ సాఫ్ట్‌వేర్లు, ఆండ్రాయిడ్ హార్డ్‌వేర్ సెన్సార్ల‌తో లోకేష‌న్ బేస్డ్ యాప్స్ కోసం బిల్డింగ్ బ్లాక్స్‌ను రూపొందించొచ్చు" అని రాఘ‌వ్ చెప్పారు. రాఘ‌వ్ రాసిన పుస్త‌కం ఆమెజాన్ గేమ్ ప్రోగ్రామింగ్‌, మొబైల్ డివైజెస్ కేట‌గిరిలో టాప్‌-100 బుక్స్‌లో లిస్ట్ అయింది. ఈ బుక్‌ను ప్ర‌చురించిన రెండు వారాల్లోనే మొత్తం అమ్ముడ‌య్యాయి. ప్ర‌పంచంలోనే ఏకైక యువ ఆండ్రాయిడ్ ర‌చ‌యిత రాఘ‌వ్‌.

17 ఏళ్ల‌కే యాపోలిక్స్

2011లో రాఘ‌వ్ తొలి ఆండ్రాయిడ్ డివైజ్‌ను రూపొందించారు. ప్రోయో ఆధారంగా ప‌నిచేసే ఎల్జీ ఆప్టిమ‌స్ కోసం దీన్ని రూపొందించారు. అప్ప‌టి నుంచి ఆండ్రాయిడ్ యాప్స్‌ను రూపొందించ‌డంలో వెనుదిరిగి చూసుకోలేదు. ఆ త‌ర్వాత తానే స్వ‌యంగా ఓ సంస్థ‌ను ప్రారంభించారు. యాపోలిక్స్ సంస్థ ద్వారా రాఘ‌వ్ ఇప్ప‌టికే ప‌ది యాప్స్‌ను త‌యారుచేశారు. ఇందులో చాలా యాప్స్ ఆండ్రాయిడ్ లూప్‌హోల్స్‌కు సంబంధించిన‌వి. రాఘ‌వ్ రూపొందించిన ప‌ర్మిష‌న్‌మేనేజ‌ర్ యాప్‌ను ల‌క్ష‌మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. "ఆగ్‌మెంటెడ్ రియాలిటీ యాప్స్‌ను నా పేరుతో రూపొందించ‌న‌ప్ప‌టికీ, కాంట్రాక్ట్‌తో కొన్ని ప్రాజెక్ట్‌ల‌కు ప‌నిచేశాను" అని రాఘ‌వ్ వివ‌రించారు.

గూగుల్ గ్రూప్‌ ఆండ్రాయిడ్ డెవ‌ల‌ప‌ర్స్‌తో రాఘ‌వ్ త‌ర‌చుగా ఇంటెరాక్ట్ అవుతారు. ఎవ‌రికి ఏ అవ‌స‌రం వ‌చ్చినా సాయం చేస్తారు. తాను సొంతంగా యాప్స్‌ను, ప్రొగ్రామ్‌ను డెవ‌ల‌ప్ చేయ‌డ‌మే కాకుండా, ఇత‌ర డెవ‌ల‌ప‌ర్స్ ఉప‌యోగం కోసం లైబ్ర‌రీని కూడా రూపొందించారు.

మంచి మార్గం ముందుంది

ఇప్ప‌టికే ప‌లు యాప్స్‌ను రూపొందించిన రాఘ‌వ్ ఇటీవ‌లే లెవ‌న్త్ గ్రేడ్ పూర్తిచేశారు. "స్కూలింగ్ పూర్త‌య్యేందుకు ఇంకా ఏడాది టైమ ఉంది. త‌ప్ప‌నిస‌రిగా స్కూల్ విద్య‌ను పూర్తిచేస్తాను". అని రాఘ‌వ్ చెప్పారు. అలాగే స్టాన్‌ఫోర్డ్‌లో ఆర్టిఫిష‌ల్ ఇంటిలిజెన్స్‌లో స్పెష‌లైజేష‌న్ చేయాల‌న్న‌ది రాఘ‌వ్ క‌ల‌. ఆ స్వ‌ప్నం సాకార‌మై మ‌రిన్ని యాప్స్‌ను రాఘ‌వ్ రూపొందించాల‌ని కోరుకుందాం. ఇలాంటి బాల మేధావులుంటే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంద‌ని కొంద‌రంటుంటారు. అది ముమ్మాటికి నిజం అని రాఘ‌వ్ నిరూపిస్తున్నారు.

Website: Appaholics

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags