సంకలనాలు
Telugu

లో దుస్తులే కదా అని లైట్ తీసుకోకండి..

Amuktha Malyada
12th Nov 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

"లో దుస్తులు కంఫర్ట్ గా, క్యూట్ గా ఉండాలి. మంచి ఫిట్టింగ్ తో ఆత్మ విశ్వాసాన్నిపెంచేలా ఉండాలి తప్ప.. ఏదో ఒకటని వేసుకునేలా ఉండకూడదు. కాన్ఫిడెన్స్ అవసరం కాబట్టి, లో దుస్తులను అంత ఆషామాషీగ తీసుకోవద్దు" అంటున్న నేహ కంత్, అదే తన సక్సెస్ మంత్ర అని కూడా చెప్తుంది.

image


యువర్ స్టోరీ - నేహా కంత్

లో దుస్తుల కోసం నేహా కంత్, క్లోవియ అనే ఈ-టెయిలర్ వెంచర్ ను ప్రారంభించింది. నేహ విదేశీ పర్యటనలు చేస్తున్నపుడు, లో దుస్తుల ఎంపికలో భారత్ కు, విదేశాలకు ఉన్న తేడా ను కనిపెట్టింది. అందుకే భారతీయ మహిళల కోసం, క్వాలిటీకి క్వాలిటీ ఫ్యాషన్ కి ఫ్యాషన్.. ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేలా లో దుస్తుల్ని రూపొందించాలని భావించింది. అదే స్టార్టప్ లా మొదలైంది.

"స్టోర్స్ కు వెళ్లి, అక్కడి సేల్స్ మెన్ చూపించే లో దుస్తుల్ని కొనడం చాలా మంది మహిళలకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సేల్స్ మెన్ ఏదో ఒకటి అంటకడతాడే తప్ప ఏది కొనాలో చెప్పి సహకరించరు" అంటుంది నేహ. అందుకే లో దుస్తుల డిజైన్, స్టైల్ సెలెక్షన్ చేసుకోలేక పోతుంటారని నేహ చెప్తోంది.

స్టార్టింగ్ అప్

ఢిల్లీ లో పుట్టిన నేహ హరిద్వార్ లో పెరిగింది. తండ్రి BHEL లో పనిచేసేవాడు. అక్కడంతా ఇంజినీయర్లే ఉండడంతో, వారి పిల్లలు కూడా అదే రంగంలో రాణించాలని వారు కోరుకునేవారు. "కష్టపడి పనిచేయడం విజయానికి టికెట్ లాంటిది. అదే తనను ఏదో ఒకటి చేయాలన్న తపనను, కాంపిటీటివ్ స్పిరిట్ ను పెంచింది." అంటుంది నేహ.

స్కూల్ డెస్ లొ సైన్స్ ను సబ్జెక్ట్ గా తీసుకున్నప్పటికీ, ఇంజినీరింగ్ మాత్రం చదవలేదు నేహ. ఢిల్లీ యూనివర్సిటి లోని మిరండా హౌస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి MBA చేసింది . కార్పొరేట్ ఇండియాలో దశాబ్ద కాలం పాటు పనిచేసింది . ఆ తర్వాత లో దుస్తుల మార్కెట్ లోకి ప్రవేశించింది. ఇందుకు తన భర్త సహకారంతో పాటుగా, టెక్ ఫౌండర్, లింగరీ ఎక్స్ పర్ట్ తో కలిసి క్లోవియ ను ప్రారంభించింది.

image


క్లోవియ

ఇన్-హౌస్ టీం, దాంతో పాటుగా సోర్సింగ్ టీం కూడా ఉంది నేహకు. విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న ఫాబిర్, లేసులు, సాటిన్ క్లాత్ తో క్లోవియ లో దుస్తుల్ని తయారు చేస్తుంది. మానుఫాక్చరింగ్ ను ఔట్ సోర్సింగ్ చేసినా, మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ ను బలంగా నమ్మే నేహ ప్రోడక్ట్స్ ను మాత్రం భారత్ లోనే తయారు చేయిస్తుంది.

"మా ప్రొడక్షన్ యూనిట్ నుంచి తయారయ్యే లింగరీ పర్ఫెక్ట్ కట్స్, ఫిట్స్, షేప్స్, డిజైన్స్ తో ఉండేలా జాగ్రత్త పడ్తాం" అంటుంది నేహ. ఒక లింగరీ స్పెషలిస్ట్ టీం లో ఉండడం తమకు ఎంతగానో లాభించిందని నేహ అంటుంది.

మార్కెట్లో అందరికంటే పైన ఉండడం

విభిన్న స్టైల్స్ లో కస్టమర్లను ఆకట్టుకోవడమే తమ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటుంది నేహ. ప్రతీ నెల 200 కు పైగా స్టైల్స్ ను రుపొందిస్తుంది క్లోవియ. అలా తయారుచేసిన వాటిల్లో 75% ఉత్పత్తులు 30 రోజుల్లోపే అమ్ముడవుతుంటాయి.

"లింగరీ ఇండస్ట్రీలో వేలాది యూనిట్స్ ఉన్నాయి. ఒక్కో బ్రాండ్ సంవత్సరంలో 100 స్టైల్స్ కు మించి రూపొందించలేరు. అందుకే మేము ప్రతీ నెలా 100 కు పైగా స్టైల్స్ ను లాంఛ్ చేస్తుంటాం. మా ప్రొడక్షన్ పార్ట్ నర్లను కూడ మేము ఆ దిశగా పనిచేయమని, కొత్త స్టైల్స్ ను రూపొందించమని చెప్తుంటాం" అంటుంది నేహ.

స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల తమ పని సులువయిందని అంటుంది నేహ. సేల్స్ ట్రెండ్స్ ను అర్ధం చేసుకుంటూ, సరికొత్త పాటర్న్స్ ను వెబ్ సైట్ లో చూస్తూ, తక్కువ ఖర్చుతో కొత్త ఆవిష్కరణలు ఎలా చేయవచ్చో చూసి తెలుసుకుంటాం అంటుంది నేహ. ఆదిత్య హెడ్ గా ఉన్న డెడికేటెడ్ టీం తమకుందని చెప్తుంది. కంపెనీ లోని వివిధ సెక్షన్లలో కలిపి ఇప్పుడు 100 కు పైగా టీం మెంబర్లున్నారు.

సవాళ్లు

"డు, ఆర్ డు నాట్, దేర్ ఈజ్ నో ట్రై" అనే జెడి మాస్టర్ యోధ మాటల్ని తన జీవిత మోటో గా మార్చుకుంది నేహ. కొత్త ఇన్వెస్టర్లు, కన్స్యూమర్ల దగ్గరకు వెళ్లడం, ప్రొడక్షన్ యూనిట్లను ఏర్పాటు చేయడం వంటివాటిలో ఎదురయ్యే సవాళ్లనుంచి తప్పించుకుని పారిపోకుండా, తనకున్న స్ట్రాంగ్ టీం తో వాటిని ఎదుర్కుంటుంది .

ఒక తల్లిగా, ఆంట్రప్రెన్యూర్ గా పనిచేయాలంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ తో పాటుగా, మేనేజ్ మేంట్ కూడా అవసరం అంటుంది. ఒక పక్క కుటుంబాన్ని చూసుకోవడం, మరో పక్క బిజినెస్ వ్యవహారాలు రెండింటినీ మానేజ్ చేయడానికి చాలా కృషి, పట్టుదల అవసరమని నేహ అభిప్రాయపడ్తుంది.

భవిష్యత్ ప్రణాళికలు

వ్యాపారాని వృద్ధి చేయడం, విస్తరించడం అనే అంశాలు నేహను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటాయి. అంతర్జాతీయ బ్రాండ్ తో కలిసి, లిమిటెడ్ ఎడిషన్ తో లింగరీ కలెక్షన్ ప్రారంభించాలని నేహ భావిస్తోంది. ఓవర్ సీస్ మార్కెట్ మీద కన్నేసిన నేహ అదే తమ తరువాతి అడుగుగా చెప్తోంది. దీంతోపాటే క్లోవియ, ఆఫ్ లైన్ స్టోర్స్ లోను త్వరలోనే అందుబాటులోకి వస్తుందని అంటుంది నేహ.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags