సంకలనాలు
Telugu

బ్యాంకులు అప్పులు ఇవ్వట్లేదా..? అయితే వీరిని అడగండి

కాఫీ తాగుతుంటే కత్తిలాంటి బిజినెస్ ఐడియా  

11th Mar 2016
Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share


బ్యాంకులు లోన్లు ఇస్తామంటూ వెంటపడతాయి… ఫోన్లు మీద ఫోన్లు చేస్తాయి… డాక్యుమెంట్లన్నీ తీసుకుంటాయి… చివరకు సారీ మీకు లోన్ ఇవ్వలేమంటూ సింపుల్ గా చెప్పేస్తాయి. చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి? గతంలో లోన్ తీసుకుని… లిస్టెడ్ కంపెనీల్లో పని చేస్తుంటే ఫర్వాలేదు… లేకపోతేనా.. ఎంత గింజుకున్నా పైసా అప్పు పుట్టదు. లిస్టెడ్ కంపెనీ, లిమిటెడ్ కంపెనీ ఉద్యోగుల సంగతి సరే.. మరి విద్యార్థులు, యంగ్ ప్రొఫెషనల్స్ పరిస్థితి ఏమిటి? వాళ్లకు అప్పు దొరికే మార్గం ఏది? ఈ సమస్యకు పరిష్కారం చూపుతోంది ఫినామినా.

హోమ్ లోన్ కు అప్లై చేసినప్పుడు 2014లో అభిషేక్ గార్గ్ కు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. నీకసలు హోమ్ లోన్ కు అర్హతే లేదంటూ బ్యాంక్ అధికారులు అప్లికేషన్ ను అవతలకు విసిరేశారు. సిబిల్ క్రెడిట్ స్కోర్ లేదని… లోన్ కుదరదని బ్యాంకులు మొహం మీదే చెప్పేశాయి. ఎగవేతదారులను తగ్గించడానికి పెట్టిన ఈ సిబిల్ స్కోర్ వల్ల చాలా మంది యంగ్ ప్రొఫెషనల్స్ లోన్లకు దూరమవుతున్నారు. తీర్చే సత్తా ఉన్నా… ఎన్నికష్టాల్లో ఉన్నా పట్టించుకోరు. అలాంటివారికోసమే ఫినామినా స్థాపించానంటున్నారు అభిషేక్ గార్గ్.

డాటా కలెక్షన్

ఒక వ్యక్తికి బ్యాంకులు, ఇతర సంస్థలు అప్పులు ఇవ్వొచ్చా లేదా అన్న అంశాన్ని తేలుస్తుంది ఫినోమినా. ఇదో ఫిన్ టెక్ ఫ్లాట్ ఫాం. అందుకే ప్రతి వ్యక్తి డాటాను సేకరిస్తోందీ కంపెనీ. అన్నీ బాగుంటే లోన్లు ఇవ్వాలంటూ సిఫారసు చేస్తుంది. ఆన్ లైన్లో జస్ట్ మూడు నిమిషాలు స్పెండ్ చేసి… అప్లికేషన్ పూర్తి చేస్తే చాలు… లోన్ వస్తుందా రాదా చెప్పేస్తుంది ఫినామినా. నాన్చడు వ్యవహారం ఉండదు. 24 గంటల్లో ఏదో విషయం తేల్చేస్తుంది. రీ పేమెంట్ పీరియడ్ , ఈఎంఐలు కూడా కస్టమర్లే సెలెక్ట్ చేసుకునే వీలుంటుంది.

కాఫీ తాగుతుంటే కత్తిలాంటి ఐడియా వచ్చింది

సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి కాఫీ తాగుతూ మాట్లాడుకుంటుండగా రిథి, అభిషేక్ కు కత్తిలాంటి ఆలోచన వచ్చింది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న రిధి.. ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో పనిచేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ ప్రాజెక్టుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అభిషేక్ … ఐఐటీ ఢిల్లీలో ఇంజనీరింగ్ చేశారు. బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్, బయిన్ క్యాపిటల్ లో పనిచేశారు.

ఫైనాన్స్ మార్కెట్లో ఉన్న గ్యాప్, లోన్ల విషయాన్ని అభిషేక్… చెబుతుండగా విన్నాను. అతని మాటలు నచ్చాయి… నేను కూడా నా అనుభవాలను పంచుకున్నాను. ఇద్దరం కలిపి స్టార్టప్ ఎందుకు పెట్టకూడదు అనుకున్నాం. ఆ ఆలోచనా ఫలితమే ఫినామినా- రిధి

చాలా అధ్యయనమే చేశారు..

కంపెనీ పెట్టడానికి ముందు అభిషేక్, రిధి కలిసి చాలా రీసెర్చ్ చేశారు. కొత్త ఉద్యోగులు, ఫ్రీలాన్సర్స్, స్వయంఉపాధి పొందుతున్నవారికి బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కార్పొరేషన్లు అప్పులు ఇవ్వడం లేదని తెలుసుకున్నారు. ఎవరికి అప్పులివ్వాలి… ఎవరికి ఇవ్వకూడదన్న సెగ్మెంట్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు పెద్దగా అవగాహన లేదని భావించారు. నో యువర్ కస్టమర్ (కేవైసీ) వల్ల పెద్ద ఉపయోగం లేదనే నిర్ణయానికొచ్చారు.

వ్యక్తుల ఆదాయంపై గానీ, వారి అప్పులపై గానీ సరైన సమాచారం బ్యాంకుల దగ్గర, ఆర్థిక సంస్థల దగ్గర లేదు. ఒక ల్యాప్ టాప్ కొనుక్కుంటాను లోన్ ఇవ్వండి అని ఓ విద్యార్థి బ్యాంకుకు వెళ్లి అడిగితే.. ఎల్లోల్లవో అంటారు. అదే పేరెంట్స్ వెళ్తే దానిదేముందండీ అని షేక్ హాండ్ ఇస్తారు. దేశంలో 50 శాతం జనాభా పాతికేళ్ల లోపువారే. వారి సమస్యలను బ్యాంకులు తీర్చలేక పోతున్నాయంటారు అభిషేక్. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంప్రదాయ విధానాల ప్రకారం లోన్లు ఇవ్వడంలో అర్థం లేదంటున్నారు రిధి. ఇండియా ఒక మొబైల్ వరల్డ్ లా మారింది..దాన్ని ఆన్ లైన్లోనే సెట్ చేయాలన్నది వారిద్దరి లక్ష్యం.

డిఫరెంట్ స్కోర్

డిజిటల్ ఫుట్ ఫ్రింట్, ఇప్పటికే ఉన్న డాటాను కలగలిపి రుణ గ్రహీతలను అంచనా వేస్తోంది ఫినామినా. వారి వ్యక్తిగత వివరాలను కూడా తీసుకుంటుంది. వ్యక్తిని పూర్తిస్థాయిలో అంచనా వేశాక ఫినామినా స్కోర్ తయారు చేస్తోంది. వీటిని ఎన్బీఎఫ్సీలకు పంపిస్తుంది. నిజమైన లబ్ధిదారులకు రుణాలు అందాలన్నదే లక్ష్యం. ఫినామినా పంపిన స్కోర్ ను చాలా ఎన్బీఎఫ్సీలు ఆమోదిస్తున్నాయి. రిస్క్ ను సైతం చక్కగా అంచనా వేస్తోంది ఫినామినా. అంతా టెక్నాలజీ ఆధారంగానే జరుగుతోంది.

”పూర్తి స్థాయిలో అంచనావేశాక… డాటాను ఎన్బీఎఫ్సీలకు పంపిస్తున్నాం. ఇందుకోసం కొంత ఛార్జ్ చేస్తున్నాం. మేమిచ్చిన రిపోర్ట్ ప్రకారం… లోన్ ఇవ్వాలా వద్దా అన్నది ఫైనాన్స్ కంపెనీలే నిర్ణయిస్తాయి.” అభిషేక్

2016 మార్చి మొదటి వారంలోనే ఫినామినా యాప్ ప్రారంభించారు. దేశంలోని ప్రధాన నగరాల్లో విస్తరించాలనేది వీరి టార్గెట్. ఈ నెలాఖరులోగా ప్రధాన కాలేజీల యువత టాడా మొత్తం సేకరించనున్నారు. పలు కంపెనీలతోనూ టైఅప్ అవుతున్నారు. ఫోన్లు, ల్యాప్ టాప్స్ ఉద్యోగులకు అందివ్వాలనుకునే కంపెనీలను ఫినామినా టీం సంప్రదిస్తోంది. ఆధార్ కార్డులు ఈ విషయంలో బాగా ఉపయోగపడతాయని అంటున్నారు రిధి. ప్రపంచంలోనే ఏ ఇతర దేశంలోనూ ఇలాంటి ప్రోగ్రాంలేదని… వాటి ఆధారంగా డాటా హాయిగా సేకరించవచ్చని అభిప్రాయపపడ్డారు.

మ్యాట్రిక్స్ పార్ట్ నర్స్, అవెండస్ క్యాపిటల్ కుషాల్ అగర్వాల్, మాగ్మా ఫిన్ కార్ప్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హర్షా ఛార్మియాతో పాటు చాలామంది ఫినామినాలో పెట్టుబడులు పెట్టారు. వ్యక్తిగత అనుభవం, తెలివితేటలున్నవారు స్టార్టప్స్ పెడితే బిజినెస్ బాగా చేయగలరని.. అందుకే ఇందులో పెట్టుబడులు పెట్టానని చెప్పారు మాట్రిక్స్ భాగస్వామి రాజత్ అగర్వాల్.

ఫిన్ టెక్ ఎటుపోతోంది?

దేశ ఆర్థిక వ్యవస్థలో అందర్నీ సమ్మిళితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే జన్ ధన్ యోజన, ఆధార్, బ్యాంక్ లైసెన్స్ లు, ఫిన్ టెక్ స్టార్టప్స్ ను ప్రోత్సహిస్తోంది. టెక్నాలజీని సరిగా ఉపయోగించుకుంటే ఇది సాధ్యమే. టెక్సి రిపోర్ట్ ప్రకారం.. ఇండియాలో 2020 నాటికి వ్యాలెట్ మార్కెట్ విలువ 44 వేల కోట్ల రూపాయలు. స్మార్ట ఫోన్ల వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో 50 శాతం మంది 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్నవారే. అందుకే ఫిన్ టెక్ లాంటి కంపెనీలకు భవిష్యత్ బంగారమేనంటున్నారు నిపుణులు. ఉబర్ కూడా త్వరలో ఫైనాన్సియల్ సెక్టర్ లోకి ప్రవేశించనుంది. 

Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share
Report an issue
Authors

Related Tags