సంకలనాలు
Telugu

చీలుచంద్రన్ కష్టాల ముందు మనమెంత ?

రెండు పెళ్లిళ్లు.. ఓ ప్రేమ వ్యవహారం..మరిచిపోలేని శారీరక, మానసిక వేధింపులు..కష్టాలతో కాపురం.. కన్నీళ్లతో సహవాసం..ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. దక్కని సుఖం..జీవితంలో విఫలమైన ప్రతీసారి నిలదొక్కుకున్న వైనం..ఒక దశలో కష్టాలను తట్టుకోలేక మద్యానికి బానిస..జీవితం విలువ తెలుసుకుని ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు..తనలా కుంగిపోయిన వాళ్లలో ఆత్మస్థైర్యం నింపడం ఇప్పుడు ఆమె కర్తవ్యం..

ashok patnaik
1st May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కష్టసుఖాలు కలగలిస్తే జీవితం. కానీ కష్టాలు మాత్రమే జీవితంలో ఉంటే దాన్నేమనాలి. కష్టాలతో సాహవాసం చేయడం అలవాటు చేసుకుంటే..ఇంకేమనాలి. వైఫల్యాలే వెంటాడి వేటాడుతుంటే..దాన్ని నిర్వచించాల్సి వస్తే కచ్చితంగా దాని పేరుని చీలుచంద్రన్ అనడంలో అతిశయోక్తి కాదేమో. చీలుచంద్రన్ కథ తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ మాటతో ఏకీభవిస్తారు. కష్టాలతో ప్రారంభమైన ఆమె కథ... జీవితం నేర్పిన పాఠాలను దాటుకొని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఏదైనా కొత్తగా ప్రారంభించాలని సంకల్పం ఉంటే.... దానికి ఎటువంటి వయస్సు, నిర్దిష్ట సమయం అడ్డురాదంటారు డీ బాక్స్ వ్యవస్థాపకురాలు... చీలుచంద్రన్. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం ఉంటే, జీవితంలో ఏదైనా అధిగమించడానికి అవకాశం ఉంటుందని చెబుతారామె. 

" నన్ను నేను ఎప్పుడు సరిగ్గా అద్దంలో చూసుకోలేదు.. నేను దేనికీ పనికి రాని వ్యక్తిని అయితే.. ఏదీ చేయడం చేతకాకపోతే... భూమికి భారమని అనుకుంటాను. ఎలాంటి చెడు జరిగినా... దానికి నన్ను నేనే నిందించుకుంటాను. మంచి విషయాలైతే ఎవరిదో ఘనత అనో.. పూర్తిగా అదృష్ట గా భావిస్తానంటారు" చీలు
చీలుచంద్రన్, డీ బాక్స్ వ్యవస్థాపకురాలు

చీలుచంద్రన్, డీ బాక్స్ వ్యవస్థాపకురాలు


సగటు మధ్య తరగతి తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1963 డిసెంబర్‌లో ఆమె జన్మించారు. " నా తండ్రి ఎంతో ఆర్ద్రతతో సంతానం కోసం మధుర మీనాక్షి ఆలయంలో ప్రార్ధిస్తే నేను పుట్టాను. నేను పుట్టిన మూడున్నర సంవత్సరాల తర్వాత తమ్ముడు జన్మించాడు. ఖర్చులు పెరగడంతో గృహిణిగా ఉన్న మా అమ్మ వైద్య రంగంలో పనిచేశారు. నాన్నకు ఉద్యోగంలో తరుచుగా బదిలీలు కొనసాగడంతో... చదువంతా బెంగళూర్‌, చెన్నైల్లో కొనసాగింది. చివరకు 1985 లో నేను ముంబైలో స్థిరపడ్డారు ''.

చీలుకు తన గ్రాడ్యుయేషన్ తర్వాత వివాహమైంది. అయితే ఆమె వైవాహిక జీవితమంతా కష్టాలే. ఆమె మొదటి వివాహం విషయంలో గొడవలు జరుగుతూ ఉండగానే.. రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భర్త లైంగికంగా, మానసికంగా వేధిస్తే.... రెండో భర్త మానసికంగా, శారీరకంగా వేధిస్తూ... చిత్రమైన టార్చర్‌కు గురిచేసేవాడు. చివరకు శరీరంపై దాడులకు కూడా దిగేవాడు. దీంతో ఒంటిపై శాశ్వతమైన మచ్చలు ఏర్పడిపోయాయి. అప్పటి నుంచి వివాహ వ్యవస్థపైనే ఆమెకు నమ్మకం పోయింది. తర్వాత ఆమె భర్త ప్రవర్తనతో నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితం అంతా అష్టకష్టాలతోనే సాగింది. మొదటి సారి పుట్టిన పాప గంటల వ్యవధిలో పురిట్లోనే కన్నుమూసింది. రెండో సారి గర్భవతి అయినప్పుడు అబార్షన్ చేయించుకోకపోతే... చంపేస్తానని భర్త బెదిరించాడు. చివరకు ఒక రోజు రాత్రి, ఆమె ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఏడాది తర్వాత విడాకులూ మంజూరయ్యాయి. 

ఆ సమయంలో తన స్నేహితుడు ద్వారా మరొక వ్యక్తి చీలూకు పరిచయమయ్యాడు. తను మళ్లీ ప్రేమలో పడింది. రెండు పెళ్లిళ్ల తర్వాత కూడా ప్రేమించిన వ్యక్తి మీద నమ్మకంతో... వివాహానికి అంగీకరించానని చెబుతుంటారు.

image


ప్రపంచం తన గురించి ఏమి అనుకుంటుందోనని ఆలోచించకుండా భర్తే జీవితంగా అడుగులు వేసింది. ఏం తిన్నా, ఏం చేసినా భర్త చెప్పినట్లే వినేది. చివరకు వస్త్రధారణ విషయంలోనూ చెప్పలేనన్ని ఆంక్షలను ఎదుర్కొంది. ఇతర మగాళ్లను ఆకర్షించకుండా ఉండేందుకు పిచ్చిబట్టలు వేసుకోవాలన్నా కూడా భరించింది. అలా పదేళ్ల పాటు అన్నీ మౌనంగానే భరించింది. భర్త ప్రవర్తనతో విసుగు చెందిన చీలు.. పిల్లల క్షేమం కోసం తన కాళ్ల మీద నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఆమె గర్భంతో ప్రమాదం జరిగి... ఒక డిస్క్ పడిపోయింది. నడుము నుండి కింద చలనాన్ని కోల్పోయింది. పూర్తి రికవరీ అవకాశాలు లేవని.. ఆపరేషన్ అనివార్యమని డాక్టర్లు తెగేసి చెప్పారు. రిస్క్ తీసుకుని అపరేషన్ చేయడం, ఆ తర్వాత ఆమె తంటాలు పడడంతో గండం గట్టెక్కి.. శిశువు బయటపడింది.

చీలూ పేరుతో కూడా ఇబ్బందేనా ?

చిన్నప్పటి నుంచి ఆమె పేరుపై కూడా ఎన్నో కామెంట్స్ వినిపించేవి. ఓ సారి " పాఠశాలలో టీచర్ నీ పేరు ఏంటి ఇలా ఉందని.. పిల్లల అందరి ముందు అడిగారు. నా తల్లిదండ్రుల మనస్సుకు ఇష్టమైన పేరు కావడంతో.. నేను ఏమి చెప్పలేని పరిస్థితి. అటు బంధువులూ కూడా చీలు పేరును అపహాస్యం చేయడంతో జీర్ణించుకోలేక పోయాను. మొదటి పెళ్లప్పుడు.. చీలు పేరు నచ్చక రాజ్యలక్ష్మిగా.. పేరు మార్చి చివరకు లక్ష్మిగా పిలవడం మొదలెట్టారు. విడాకుల తర్వాత మళ్ళీ ఆమె పేరు చీలుగా మారిపోయింది. రెండో పెళ్లప్పుడు.. నార్త్ ఇండియన్ సంప్రదాయం ప్రకారం, శాలినిగా పేరు మారింది. ఇప్పుడు మాత్రం మళ్లీ పాత పేరే కంటిన్యూ అవుతోంది. చివరకు నా పేరుకు ఉన్న ప్రత్యేకతను గుర్తించాను. గర్వంగా ఫీలవుతాను ''.


ఈ తతంగమంతా అవుతున్న సమయంలో చీలుకు నోరు, మెడ దగ్గర పక్షవాతం వచ్చింది. దాని నుంచి కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది ఆమె చురుకుగా ఉన్నప్పటికి వెన్నెముక బలహీనంగా ఉండి తరచుగా రెస్ట్ తీసుకోవడం తప్పనిసరైంది. అయితే శరీర గాయాలకంటే మనసుపై పడిన గాయాలే బలమైనవి కావడంతో ఆమె అన్నీ ఓర్చుకున్నారు. నెమ్మదిగా వ్యాయామం చేయడం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలలో, ఆమె వివిధ నృత్య రూపాలు నేర్చుకున్నారు. ఓ ప్రదర్శనలో ఎనిమిది విభిన్న నృత్యాలూ ప్రదర్శించారు. తర్వాత చీలు రన్నింగ్ మారథాన్‌ గ్రూపులో చేరారు. ముంబైలో నిర్వహించిన ఫస్ట్ మారధాన్‌లో పాల్గొన్నారు. అకస్మాత్తుగా 2013 లో ఆమె కుడివైపు పక్షవాతం వచ్చింది. దీంతో కుడి వైపు ఉన్న మెదడు పై ప్రభావం పడింది. కుడి భాగంగా పనిచేయకపోగా.. మాట కూడా పూర్తిగా పడిపోయింది.

మరోసారి రాయటం నేర్చుకున్నప్పటి నోట్సు

మరోసారి రాయటం నేర్చుకున్నప్పటి నోట్సు


మళ్లీ కొత్త జీవితం

వరుసగా ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి చిన్న పిల్లలా జీవితం పునఃప్రారంభించారు. పరిపూర్ణ కృషితో మార్పు సాధ్యమవుతుందని పూర్తిగా నమ్మారు. మనం మారాలి అనే ధృడ సంకల్పం ఉంటే.. ప్రపంచం దాన్ని ఆహ్వానిస్తుందని బలంగా నమ్ముతారు. రెండో పెళ్లి కష్టాల నుంచి బయటకు వచ్చిన తర్వాత చీలు చేతిలో పెద్దగా డబ్బు కూడా లేదు. కుటుంబం నుండి కూడా ఎలాంటి సహకారం అందలేదు. ఈ రోజు తిండి గడిస్తే చాలనే రోజులే ఎక్కువ. ఆ బాధలను మరిచిపోవడానికి చివరకు సిగరెట్, మందు తాగడం ప్రారంభించారు. ఒకానొక దశలో ఆమె ఉంటున్న 19 వ అంతస్థు నుంచి.. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్టుగా పిల్లలను బోర్డింగ్ పాఠశాలకూ పంపారు. 

" పై నుంచి కిందకు దూకాలన్న ఆలోచనలో నేను టెర్రేస్‌పైకి ఎక్కారు. ఇక దూకబోతున్న సమయంలో ఒక బలమైన శక్తి ఏదో వెనక్కి తోసింది. హఠాత్తుగా మేల్కొని నేను ఇలాంటి పిరికి పనిని ఎందుకు చేశానని సిగ్గుపడ్డాను. ఇక నా జీవితాన్ని నేను మార్చుకోవాలని అప్పుడే నిశ్చయించుకున్నాను. నా పిల్లలకు ఉత్తమ భవిష్యత్ ఇచ్చి బంగారు బాట వేయాలని అనుకున్నాను '' అంటారు చీలు.

తర్వాత పుస్తకాలు చదివి పరిశోధించారు. ఆధ్యాత్మిక సమావేశాలకు వెళ్ళడంతో మైండ్ సెట్‌లో మార్పులు వచ్చాయి. తనపై తనకు అపారమైన నమ్మకం కుదిరింది. జీవితంలో కాస్త నిలదొక్కుకున్నారు. గత కష్టాలను గుర్తు చేసుకోకుండా.. భవిష్యత్తును బాగుచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తనలా కష్టాలు పడిన వాళ్లకు మార్గదర్శిగా నిలిచి... వాళ్ల జీవితాలనూ బాగు చేయాలని బలంగా నిశ్చయించుకున్నారు.

image


'' నేను చెడ్డ వ్యక్తి కాదు, జీవితంలో మంచి విషయాలకూ ఆస్కారం ఉంటుంది. పాత జ్ఞాపకాలను మరిచిపోవడానికి మద్యంలో మునిగిపోయాను. ఆ తర్వాత ఆ తప్పును గ్రహించి మారాలని అనుకున్నాను. నా మాదిరి చాలా మంది కష్టాలు పడి ఉండొచ్చు. వాళ్లకూ మారాలని ఉన్నా... సరైన దారిలేక ఇబ్బందులు పడ్తూ ఉండొచ్చు. అలాంటి వాళ్ల కోసమే.. DeBox ఏర్పాటు చేశాను. ఒక మిషన్‌తో ప్రారంభమైన సంస్థ ఇది. సలహాలు, వర్క్ షాప్, శిక్షణ కార్యక్రమాలు, ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు ఇలా ఎన్నో అంశాలను వాళ్లకు వివరిస్తూ.. జీవితాన్ని కొత్తకోణంలో చూపి.. ఆశ పెంచాలని నా కోరిక ''

image


DeBox ఆ పేరు ఎలా వచ్చింది ?

చీలు తన మిత్రులతో కలిసి ఓ సమావేశంలో చర్చ జరుగుతున్నప్పుడు మదిలో వచ్చిన పేరే డీ-బాక్స్ . ముఖ్యంగా మూడు రకాల సేవలను వీళ్లు అందిస్తున్నారు. సమస్యలను అధిగమించలేకపోయిన వారికి దారి చూపిస్తుంది. అనేక విషయాలను చర్చించి వాళ్లలో మంచి లక్షణాలను పెంపొందించేందుకు దోహదపడుతుంది. విజయం సాధించిన వ్యక్తుల గాధలు చెబ్తూ.. వారిలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన ఉత్పత్తులు అందిస్తూ సహాయపడుతుంది.

ఇప్పుడు డి బాక్స్ ద్వారా ఎంతో మంది సేవలు పొందుతున్నారు. కష్టనష్టాలతో కుమిలిపోయి.. ఇక జీవితం అయిపోయిందని అనుకున్నవాళ్లలో ఆమెకు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు. మానసిక ధైర్యాన్ని పెంపొందించి.. ధృడంగా చేస్తున్నారు.

image


నిజంగా చీలు చంద్రన్ కష్టాల ముందు మనమెంత ? మూడు పెళ్లిళ్ల మధ్య నలిగిపోయిన ఆమె.. ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంత కష్టాల్లోనూ తన పిల్లల చదువుకు ఇబ్బంది రాకుండా జాగ్రత్తపడ్డారు. జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా.. వాటన్నింటినీ తట్టుకుంటూ.. విధిగా వ్యతిరేకంగా పోరాడారు. కష్టమొచ్చిన ప్రతీ సారి.. మరింత బలం పుంజుకుంటూ ముందుకు దూకారు. ఇరవై ఏళ్ల పాటు ఆమెపడిన మానసిక, శారీరక క్షోభ ముందు... మన కష్టాలెంత.. ? ఆలోచించండి.. !

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags