సంకలనాలు
Telugu

3డి ప్రింటింగ్‌లో విప్లవం ఈ నలుగురు

bharathi paluri
27th Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

న‌లుగురూ న‌డిచే దారిలోఎవ‌రైనా వెళ్తారు. సొంత‌దారిని నిర్మించుకోవ‌డ‌మే అస‌లైన స‌వాలు. ఈ స‌వాలును స్వీక‌రించారు న‌లుగురు MIT గ్రాడ్యుయేట్లు. దేశీయ 3డి ప్రింటింగ్ టెక్నాల‌జీలో త‌మ‌దైన ముద్ర వేస్తున్నారు. మార్కెట్కు త‌గ్గ ప్రోడ‌క్ట్ ఇవ్వ‌గ‌లిగితే స‌క్సెస్ దానంత‌ట అదే వ‌స్తుందంటున్న ఆ న‌లుగురు మిత్రుల‌దే ఈ స్టోరీ .

3డి ప్రింటింగ్ సెక్టార్ లో ఒక స్టార్ట‌ప్‌గా మొద‌లైన గ్లోబ‌ల్ 3డి లాబ్స్ ఇప్పుడు 3డి ప్రింటర్స్ తయారీ, సేల్స్, స‌ర్వీస్‌లలో విస్త‌రించింది. సంస్థ‌ల‌ను, హాబీ కోసం వాడేవాళ్ళ‌ని టార్గెట్‌గా చేసుకుని ప్ర‌మాణ్, ప్ర‌మాణ్ మినీ పేరుతో రెండు ప్రోడ‌క్ట్‌ల‌ని గ్లోబ‌ల్ 3డి లాబ్స్ మార్కెట్‌లోకి తెచ్చింది. వీటితో పాటు ప‌రిశ్ర‌మ కోరుకునే విధంగా క‌స్ట‌మ్ 3డి ప్రింట‌ర్స్ కూడా రూపొందిస్తారు. బేకింగ్ ప‌రిశ్ర‌మ‌కు ఉద్దేశించిన చాకోబోట్ అలాంటిదే.

మెడిక‌ల్ త‌దిత‌ర మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ల‌కి అవ‌స‌ర‌మైన ఇత‌ర టెక్నాల‌జీల‌ను కూడా గ్లోబ‌ల్ 3డి లాబ్స్ ప్ర‌స్తుతం డెవ‌ల‌ప్ చేస్తోంది. “మాది పరిశోధన ప్ర‌ధానంగా న‌డిచే సంస్థ‌. వివిధ ప‌రిశ్ర‌మ‌ల‌కు అడిటివ్ మాన్యుఫాక్చ‌రింగ్‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా టెక్నాల‌జీస్‌ని డెవ‌ల‌ప్ చేస్తున్నాం ” అన్నారు సంస్థ వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌రైన గోపాల్ కృష్ణ‌.

అలా మొద‌లైంది

మ‌ణిపాల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో చ‌దివిన న‌లుగు గ్రాడ్యుయేట్స్ ఈ స్టార్ట‌ప్‌ను మొద‌లుపెట్టారు. వీరిలో గోపాల్ కృష్ణ‌, అవిరాల్ కేడియా మ‌ణిపాల్‌లో... శ్రేయాస్ కుడ్వా, మ‌నీష్ అమిన్‌లు మంగ‌ళూరు MITలో చ‌దివారు. అంత‌కు ముందు గోపాల్, అవిరాల్‌లు ఇద్ద‌రూ బ‌యోమెడిక‌ల్ రీసెర్చ్ రంగానికి చెందిన ఎక్స్‌పిస్క‌ర్ టెక్నాల‌జీస్ ను న‌డుపుతున్నారు. మ‌నీష్, శ్రేయాస్‌లు ఓ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్మెంట్ కంపెనీలో భాగ‌స్వాములుగా వున్నారు. ప‌నిలో సారూప్య‌త వున్న ఈ న‌లుగురూ క‌లిసి దేశమంత‌టా ప్రోటోటైప్ ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు బాగా వున్నాయ‌ని గ్ర‌హించి .. క‌లిసి స్టార్ట‌ప్ పెట్టాల‌నుకున్నారు.

ఇండ‌స్ట్రీకి ప్ర‌స్తుతం వున్న అవ‌స‌రాల‌కు, స‌రిప‌డా టెక్నాల‌జీ లేద‌ని ఈ న‌లుగురి బృందం గ్ర‌హించింది. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే టూల్స్‌ను తామే ఎందుకు డెవ‌ల‌ప్ చేయ‌కూడ‌ద‌నుకుని గ్లోబ‌ల్ 3డి ల్యాబ్స్ మొద‌లుపెట్టారు. ప్ర‌స్తుతం ఎనిమిది మంది టీమ్‌గా వున్న ఈసంస్థ వ‌చ్చే రెండేళ్ళ‌లో మ‌రికొంత మందిని చేర్చుకోవాల‌నుకుంటోంది.

image


ఉత్ప‌త్తులు

గ్లోబ‌ల్ 3డి ల్యాబ్స్ ఉత్ప‌త్తుల్లో ప్ర‌ధాన‌మైన‌ది “ ప్ర‌మాణ్2.0 ”. ఫ్యూజ‌డ్ ఫిల‌మెంట్ ఫాబ్రికేష‌న్ (FFF) 3డి ప్రింట‌ర్గా రూపొందించిన ఈ మెషిన్ 30 x 30 x 30 క్యూబిక్ సెంటీమీట‌ర్స్ వాల్యూమ్‌తో ప‌దిర‌కాల ప్లాస్టిక్ మెటిరియ‌ల్స్‌లో ప్రింట్ చేయ‌గ‌ల‌దు. ఈ ప్రింట‌ర్‌లో విఢిభాగాల‌న్నీ స్థానికంగా దొరికేవే కాగా, ఇండియాలోనే దీన్ని పూర్తిగా త‌యారు చేసి, అసెంబ‌ుల్ చేసారు.

ఇక హై ఎండ్ 3డి ప్రింటింగ్ కొనుగోలు చేయ‌లేని చిన్న స్థాయి ప‌రిశ్ర‌మ‌ల‌కు, హాబీయిస్టుల‌కు, ఇత‌ర ఔత్సాహికుల‌కోసం 'ప్ర‌మాణ్ మిని' ని త‌యారు చేసారు. ఇది 18X18X18 క్యూబిక్ సెంటీ మీట‌ర్ల వాల్యూమ్‌తో సింగిల్ ప్రింట్ తీసే విధంగా రూపొందించారు. రెండు ప్రింట‌ర్ల‌కూ LCD వుంటుంది. SD కార్డ్ క‌నెక్టివిటీ కూడా వుండ‌డంతో ఇవి స్వ‌తంత్ర సిస్ట‌మ్స్‌గా ప‌నిచేస్తాయి.

దేశంలో చాకొలేట్ త‌యారీ కోసం అందుబాటులోకి వ‌చ్చిన తొలి క‌మ‌ర్షియ‌ల్ 3డి ప్రింట‌ర్ తాము రూపొందించిన చాకోబోటేన‌ని గ్లోబ‌ల్ 3డి ల్యాబ్స్ గ‌ర్వంగా చెప్పుకుంటుంది. చాకొలెట్ రూపు రేఖ‌ల కోసం పాలీకార్బొనేట్ మౌల్డ్స్‌ను త్వ‌రితగ‌తిన త‌యారు చేసేందుకు ఈ చాకొబోట్ ప్రింట‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. వైట్ చాకొలేట్స్, డార్క్ చాకొలేట్స్ , మిల్క్ చాకొలేట్స్‌ను చాకొబోట్‌తో నేరుగా త‌యారు చేయ‌వ‌చ్చు. ఈ మ‌ధ్య క్ల‌యింట్స్ నుంచి వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ ప్ర‌కారం ఈ ప్రింట‌ర్ ను మ‌రింత మెరుగుప‌రుస్తున్నారు. చాకొబోట్‌ను త‌మ అఫిషియ‌ల్ చాకొలేట్ 3డి ప్రింట్ పార్ట‌న‌ర్‌గా UAE ఎంపిక చేసుకుంది.

సవాళ్ల‌తో స‌హ‌జీవ‌నం

అస‌లు 3డి ప్రింటింగ్ అవ‌స‌రాన్ని , వాటి ఉప‌యోగాల‌ని కార్పొరేట్ క్ల‌యింట్ల‌కు వివ‌రించ‌డం, వారిని ఒప్పించ‌డ‌మే ఈ స్టార్టప్ ఎదుర్కొన్న మొద‌టి స‌వాలు. ఇన్ని నెల‌ల త‌ర్వాత ఇప్ప‌టికీ ప‌బ్లిక్‌లోనూ, కార్పొరేట్ సెక్టార క్ల‌యింట్ల‌లోనూ 3డి ప్రింట‌ర్ల‌కు ఉప‌యోగానికి సంబంధించిన అవ‌గాహ‌న వ‌చ్చింది. ఈ ఏడాది జూన్‌లో ఆటోమేటివ్ ప‌రిక‌రాల సెక్టార్ నుంచి కూడా సంస్థ‌కు ఎంక్వ‌యిరీలు వ‌స్తున్నాయి.

మొద‌ట్లో ఒక్కో ప్రింట‌ర్ త‌యారీకి 28 రోజులు ప‌ట్టేది. ఇప్పుడు దాన్ని 14 రోజుల‌కు త‌గ్గించారు. దీన్ని మరింత త‌గ్గించాల‌నుకుంటున్నారు. ఫీడ్ బ్యాక్, రీసెర్చిల‌ను ఆధారంగా చేసుకుని చాలా వ‌ర‌కు టెక్నాల‌జీ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించారు. ప్రింట‌ర్‌కు హైక్వాలిటీ నాజిల్‌ను అమ‌ర్చ‌డం లాంటి కొన్ని మార్పుల‌ను కూడా చేసారు.

ఇక ఈ సంస్థ ఎదుర్కొంటున్న మ‌రో ప్ర‌ధాన స‌మ‌స్య‌... రిమోట్ స‌ర్వీసింగ్. ఫోన్ ద్వారా చాలా వ‌ర‌కూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్న‌ప్ప‌టికీ, క్ల‌యింట్లు వుండే ప్రాంతాల‌కు వెళ్లాల్సి వస్తోంది. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికి జియొగ్రాఫిక‌ల్ సేల్స్ చానెల్స్ ఏర్పాటు చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు గోపాల్ చెప్పారు. దీంతో పాటు బెంగ‌ళూరు 3డి ప్రింటింగ్ గ్రూప్ ఆధ్వ‌ర్యంలో కొన్ని మీట్ అప్స్ కూడా నిర్వ‌హిస్తూ, ఈ క‌మ్యూనిటీకి ఎప్ప‌టిక‌ప్పుడు శిక్ష‌ణ ఇస్తున్నారు. ఇక కంపెనీ త‌ర‌ఫున తాము కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అప్ టు డేట్‌గా వుండేందుకు ట్రేడ్ షోస్‌కు అటెండ్ అవుతూ వుంటారు.

‘‘ మేం క‌ష్టాన్ని నమ్ముకుని పైకొచ్చాం. మా క‌స్ట‌మ‌ర్లే మాకు అతి పెద్ద మార్కెట్. వాళ్ళే మ‌రికొంద‌రికి మా గురించి చెప్పి, మా మార్కెట్‌ను పెంచుతున్నారు. మా ఉత్ప‌త్తుల‌కు అవ‌స‌ర‌మైన క‌మ్యూనిటీలను నిర్మించుకోవ‌డానికి ట్రెయినింగ్ కోర్స్ లు, నాలెడ్జి బ్లాగ్స్ లాంటి ఆన్‌లైన్ మార్గాల‌ను కూడా డెవ‌ల‌ప్ చేస్తున్నాం.’’ అంటారు గోపాల్.
image


బిజినెస్ మోడ‌ల్

3 డి ప్రింట‌ర్స్, వాటి అనుబంధ ప‌రిక‌రాలే గ్లోబ‌ల్ 3డి ల్యాబ్స్ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు. దేశ‌వ్యాప్తంగా వున్న క్ల‌యింట్ల‌కు వాళ్ళు ప్రింట‌ర్స్ ను స‌ప్లయి చేసారు. ఇండియ‌న్ రైల్వేస్, నేష‌న‌ల్ కెమిక‌ల్ ల్యాబొరేట‌రీ, CMTI బెంగ‌ళూర‌g, బ్రెమ‌ర్ ఇంజ‌నీరింగ్ ఇండియా, ఇన్నొవేష‌న్ నాలెడ్జి పార్క్... లాంటి భారీ సంస్థ‌లు కూడా గ్లోబ‌ల్ 3డి ల్యాబ్స్‌కు క్ల‌యింట్లుగా వున్నాయి. డిజిట‌ల్ ల్యాబ్స్ సెటఅప్ చేయ‌డం, ప్ర‌భుత్వం స్పాన్స‌ర్ చేసే ట్రెయినింగ్ క్యాంపులు , కార్పొరేట్ ట్రెయినింగ్ క్యాంపులు నిర్వ‌హించ‌డం లో కూడా ఈ సంస్థ ముందుంటుంది. స్నాప్ డీల్, అమ‌ెజాన్ లాంటి ఈ కామ‌ర్స్ సైట్ల ద్వారా ఫిల‌మింట్ల లాంటి కొన్ని యాక్స‌స‌రీస్ ను అమ్ముతున్నారు.

ఈ మ‌ధ్య య‌స్ ఇండ‌స్ట్రీస్ 500X500X500 క్యూబిక్ మిల్లీ మీట‌ర్ల వాల్యూమ్ వుండే 3డి ప్రింట‌ర్ కోసం ఆర్డ‌రిచ్చింది. హిండ్ టెక్ సి ఎన్ సి కూడా మ‌రో క‌స్ట‌మ్ ప్రింట‌ర్ కావాలంది. ఇలా ప‌రిశ్ర‌మ కోరుకునే క‌స్ట‌మైజ‌డ్ 3డి ప్రింట‌ర్ల‌ను కూడా గ్లోబ‌ల్ 3డి ప్రింట‌ర్ ల్యాబ్స్ అందిస్తోంది.

భ‌విష్య‌త్తులో బ‌యోమెడిక‌ల్ 3డి ప్రింటింగ్ స‌ర్వీసస్ సెక్టార్ లో కూడా ప్ర‌వేశించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం విరిగిన ఎముక‌ల‌కు ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్ తో క‌ట్లు వేస్తున్నారు. వీటి స్థానంలో 3డి ప్రింటెడ్ క‌ట్లు త‌యారు చేయాల‌ని ఈ సంస్థ ప్ర‌య‌త్నం. ప్ర‌స్తుతం వీరికి బ‌య‌టి నుంచి ఫండింగ్ ఏమీ లేదు. అయితే, త్వ‌ర‌లోనే తొలి ఫండింగ్ ఒప్పందం చేసుకోబోతున్నారు.

‘‘త్వ‌ర‌లోనే ఈ ఒప్పందం ఒక కొలిక్కి వ‌స్తుంది. మాన్యుఫాక్చురింగ్ బ్యాక్ గ్రౌండ్ వున్న ఇన్వెస్ట‌ర్లు రావ‌డం చాలా సంతోషంగా వుంది. వారి అనుభ‌వం మాకు కూడా ఉప‌యోగ‌మే. ’’

అంత‌ర్జాతీయంగా 3డి ప్రింటింగ్ రంగంలో మేక‌ర్ బోట్, స్ట్రాటాసిస్, ఫ్యాబ్ స్ట‌ర్, 3డి సిస్ట‌మ్స్, లీప్ ఫ్రాగ్, ఫ్లాష్ ఫోర్జ్, ఆప్టోమెక్ లాంటి సంస్థలు లీడింగ్ లో వున్నాయి. ఇక దేశీయంగా కూడా ఆల్టెమ్ టెక్నాల‌జీస్, ఇమేజినేరియమ్, బ్ర‌హ్మ‌3, జె గ్రూప్ రోబోటిక్స్, రియ‌లిజ్ 3డి, లాంటి స్టార్ట‌ప్స్ వున్నాయి. ఈ మ‌ధ్యే మ‌ణిపాల్ గ్రాడ్యుయేట్స్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న మ‌రో సంస్థ ఫ్రాక్టాల్ వ‌ర్క్స్ 30లక్ష‌ల డాల‌ర్ల ఫండింగ్ పొందింది.

భవిష్య‌త్ ప్ర‌ణాళిక‌లు

ఓ ఏడ‌ది క‌ల్లా ప్ర‌మాణ్ ప్రింట‌ర్‌ను క‌స్ట‌మ‌ర్లు ఆర్డ‌ర్ ఇచ్చాక వేచి వుండాల్సిన అవ‌స‌రం లేకుండా, అడిగిన వెంటనే అందించేలా వుండాల‌ని గ్లోబ‌ల్ 3డి ల్యాబ్స్ ల‌క్ష్యం. అలాగే వ‌చ్చే రెండేళ్ళ‌లో అంత‌ర్జాతీయంగా కూడా విస్త‌రించాల‌నుకుంటున్నారు. ఆసియా లోని ఇత‌ర దేశాలతోపాటు, ప‌శ్చిమాసియా మార్కెట్‌లోకి కూడా ప్ర‌వేశించాల‌నుకుంటున్నారు. వ‌చ్చే ఏడాదిక‌ల్లా వెయ్యి 3డి ప్రింటర్ల‌ను అమ్మాల‌నేది ఒక ల‌క్ష్యం.

ఎఫ్ ఎఫ్ ఎఫ్ , స్టీరియో లితోగ్ర‌ఫీ... శ్రేణుల్లో మ‌రింత కాంపాక్ట్ ప్రింట‌ర్‌ను రూపొందించాల‌ని అనుకుంటున్నారు. వీటితో పాటు, 3డి స్కానింగ్, సిరామిక్ 3డి ప్రింటింగ్, మెడిక‌ల్ గ్రేడ్ 3డిప్రింటింగ్ టెక్నాల‌జీల్లో కూడా ఈ సంస్థ కృషి చేస్తోంది. వీటిల్లో కూడా క‌మ‌ర్షియ‌ల్ మోడ‌ల్స్ తీసుకురావాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags