మహిళలను ముందుకు నడిపే ఉత్ప్రేరకం.. కేటలిస్ట్

మహిళలు మహరాణులయ్యే రోజులు రావాలంటున్న షాచీ ఇర్డేపెద్ద పెద్ద కంపెనీల్లోనూ మహిళలు, వారి జీతాల విషయంలో వివక్షేకార్పొరేట్ ఉద్యోగాలను వీడి.. పరిశోధనా సంస్థ స్థాపన అన్ని రంగాల్లో ఆడవారికి సమ ప్రాధాన్యతకోసం కృషిఛాన్స్ ఇస్తే.. సత్తా చాటుతాం- షాచీ ఇర్డే

మహిళలను ముందుకు నడిపే ఉత్ప్రేరకం.. కేటలిస్ట్

Wednesday July 22, 2015,

5 min Read

షాచీ ఇర్డే .. కేటలిస్ట్ ఇండియా డబ్ల్యూఆర్సీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ . మహిళలకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో విస్తరించిన ఓ పరిశోధనా సంస్థే కేటలిస్ట్ . ‘కేటలిస్ట్’ అంటే ‘ఉత్ర్పేరకం’ అని అర్థం. షాచీకి మైక్రోలాండ్, స్పైస్ మొబైల్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి పలు రకాల కంపెనీల్లో , వివిధ రంగాల్లో 17 ఏళ్లపాటు పనిచేసిన అనుభవముంది. ఇన్ఫోసిస్‌లో ఆమె Diversity and Inclusion శాఖలో ప్రధానాధికారిగా పనిచేశారు. టాలెంట్‌ను గుర్తించి పదునైన ఉద్యోగులను ఎంపిక చేయడమే D&I శాఖ లక్ష్యం. కానీ... షాచీ మహిళల కోసం పనిచేయాలనే సంకల్పంతో కార్పొరేట్ కెరీర్‌ను సైతం వదిలి అంతే వైవిధ్యమైన కేటలిస్ట్ సంస్థకు తన మిగిలిన వృత్తి జీవితాన్నంతా ధారపోశారు.

‘హర్ స్టోరీ’(HerStory) షాచీ ఇర్డేని కలిసి తన స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుంది. అవేంటో ఓసారి చూద్దాం.

(షాచీ ఇర్డే .. కేటలిస్ట్ ఇండియా డబ్ల్యూఆర్సీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ )

(షాచీ ఇర్డే .. కేటలిస్ట్ ఇండియా డబ్ల్యూఆర్సీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ )


HerStory- చిన్ననాటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి పాఠాలను మీరు నేర్చుకుంటూ వచ్చారు..?

షాచీ ఇర్డే: నేను పుట్టి పెరిగింది పారిశ్రామిక వాడలో. నా చిన్నతనం రకరకాల నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజల మధ్య గడిచింది. అది నాకు మంచి అనుభవంగా చెబుతాన్నేను. భిన్నత్వంలో ఏకత్వంలా...విభిన్నమైన భాషల్ని, వంటల్ని, మతాల్ని, ఆచారాలను అనుసరిస్తూ బతుకుతున్న వాళ్లను చూస్తే అభినందించకుండా వుండలేం. నా స్నేహితుల్లో చాలామంది దేశంలోని చాలా రకాల రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే. మాలో మాకు ఆ తేడాలేంటో బాగా తెలుసు. అయినాకూడా మేమంతా చాలా సులభంగా కలిసి .. ఒకరికి ఒకరమనేలా సంతోషాలను, బాధలను పంచుకునే వాళ్లం. పాఠశాల స్థాయిలోనే ఈ కలిసిపోవడమేనే బంధం బాగా పెనవేసుకుపోయింది. విద్య అనేది మా అందరికీ చాలా ముఖ్యమైంది. అందుకే మాలో మాకు కొన్ని వ్యత్యాసాలు వుండేవి. అందరికంటే గొప్పగా, బెస్ట్ గా వుండాలని స్కూళ్లో పోటీపడుతూ వుండేవాళ్లం.

నా కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, ఎంబీఏలో మార్కెటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ కంప్యూటర్‌లోనే రోజుకు పదిగంటల పాటు చిక్కుకుపోతానని నేను ఊహించలేదు. మా నాన్నగారి ప్రోత్సాహం నాకు నచ్చిన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛను అందించింది.

నా చిన్నతనంలో మరో ప్రధానాంశం... నేను ఎంతో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పెరగడం. ఎంతో సంతోషంగా ప్రకృతితో బంధాన్ని పెనవేసుకునేందుకు , కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆ స్వేచ్ఛే నాకు దోహదపడింది. ఇలాంటి వాతావరణ పరిస్థితులే నాకు ఇప్పుడు ఎన్నో సమస్యలను , సవాళ్లను ధైర్యంగా స్వీకరించేందుకు కొన్ని పాఠాలను నేర్పింది.

హర్ స్టోరీ : మీ ప్రయాణం ఎలా సాగిందో మాకు చెబుతారా..?

షాచీ ఇర్డే: 1994 లో మార్కెటింట్ మేనేజర్ గా మైక్రోల్యాండ్(Microland) కంపెనీలో నా మొదటి ఉద్యోగం . 1996 లో స్పైస్ టెలికామ్(Spice Telecom) లో మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా అడుగుపెట్టాను. స్పైస్ టెలికామ్ లో ఏడేళ్లు పనిచేశాను. ఆ సమయంలో.. సేల్స్ లో వున్న చాలా కొద్దిమంది మహిళల్లో నేను ఒకదాన్ని. అక్కడ ప్రతి క్షణం నేను వర్క్ ను ఎంజాయ్ చేశాను. క్లయింట్ మీటింగ్స్, విధాన నిర్ణయాలను తయారు చేయడం, నిర్వహించడం చివరగా... ఆర్డర్లు లేదా కాంట్రాక్ట్ లను సొంతం చేసుకోడం లాంటి విధుల్ని సమర్థవంతంగా నిర్వహించాను.

ఆ తర్వాత నేను విప్రో (Wipro ) కంపెనీలో మానవ వనరుల నిర్వహణాధికారి(HR manager)గా వెళ్లాను. అక్కడ మూడేళ్లపాటు పనిచేశాక ఇన్ఫోసిస్ (Infosys) లోకి మారాను.

నా ఉద్యోగ జీవిత మార్గంలో కంపెనీ నుంచి కంపెనీకి మారిన ప్రతి సారీ.. కొత్త పాత్రను పోషిస్తూ వచ్చాను. నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలనే జిజ్ఞాస, సంస్థలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించి సమర్థవంతంగా ఎదుర్కోగలగడం నాకు కొత్త అవకాశాలను అందుకునేలా చేశాయి. నా వృత్తి జీవితంలో ప్రత్యక్ష విక్రయాలు, రిటైల్ అమ్మకాలు, ప్రకటనలు, మార్కెటింగ్, వినియోగదారుల సేవలు, నమ్మకమైన కార్యక్రమాలు, వ్యాపార లో మానవ వనరుల భాగస్వామ్యం, ఉద్యోగులతో సత్సంబంధాలు, అంతర్గత సంభాషణలు, వైవిధ్యభరితమైన చేర్పులు... లాంటి ఎన్నో రకాల శాఖల్లో బాధ్యతలు నిర్వహించాను.

హర్ స్టోరీ: ఇన్ఫోసిస్ లో మీరు పనిచేస్తుండగా.. పెద్దగా ఆదాయం లేని రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు..?

షాచీ ఇర్డే: ఇన్ఫోసిస్ లో డీ అండ్ ఐ ( వైవిధ్యంగల వారిని చేర్చుకోవడం..D&I ) శాఖలో వున్నప్పుడే నా కళ్లు నిజంగా తెరుచుకున్నాయి. రకరకాల అంశాల్లోని సమస్యలను మహిళలు ఎలా ఎదుర్కుంటారో తెలిసింది. ఎన్ని సంస్థలు తమ కంపెనీలో తెలివైన, వైవిధ్యం గల ఉద్యోగులకు అవకాశమిస్తాయో చెప్పండి.

కేటలిస్ట్ లో నా బాధ్యతల్ని నేను తెలుసుకున్నాను. కేటలిస్ట్ అంటే ఉత్ప్రేరకం అని అర్థం. నేను కూడా ఈ సంస్థలా అలానే నడుచుకుంటున్నాను. నా ప్రస్తుత దృష్టంతా ఉద్యోగులు, ఉద్యోగినుల్లో అవగాహనను కలిగించడం, కలిసిమెలసి పనిచేసే సంస్కృతిని , వాటివల్ల కలిగే లాభాలను తెలియజేడానికి ప్రాధాన్యతను ఇస్తున్నాను. మహిళలకు అవకాశాలు కలిగేలా చేయడం, సత్సంబంధాలను నిర్మించడం కేటలిస్ట్ లక్ష్యం. వ్యాపారాల్లో మహిళలకు కూడా సమాన , విస్తృత అవకాశాలు కలిగేలా చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం.

నేను వెళ్లే దారిలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా.. సాధ్యమైనంత వరకు వాటిని ఎదుర్కొని పరిష్కరించుకుంటూ వెళ్తున్నా. 17 ఏళ్ల కార్పొరేట్ వృత్తి తర్వాత , కేటలిస్ట్ లో నా బాధ్యత వైవిధ్యభరితంగా, చాలా సంతృప్తికరంగా అనిపించింది. పైగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే ప్రాముఖ్యత, ఆవశ్యకత మా కంపెనీకి వుందనే భావన ఏర్పడింది.

హర్ స్టోరీ: కేటలిస్ట్ ఎలాంటి ఆసక్తికరమైన పరిశోధనలు చేస్తోంది..?

షాచీ ఇర్డే: ఎక్కువ సామర్థ్యం, నైపుణ్యం, ఎవరైతే మిగతావాళ్లకు కూడా మార్గదర్శకంగా నిలుస్తారో, శిక్షణనివ్వగలరో, వృత్తిలో అధునాతనంగా వెళ్లగలుగుతున్నారో, అలాంటి వాళ్లను సంస్థ వదులుకోకూడదు. జీతాలు సంతృప్తికరంగా ఇస్తు ప్రోత్సహిస్తే.. వాళ్లు భవిష్యత్ తరాలకు నాయకులుగా మారగలరు. మా కేటలిస్ట్ నివేదికల ప్రకారం, అధ్యయనాల్లో తేలిన ఆసక్తికర విషయమేంటంటే, మగవాళ్లకంటే కూడా ఆడవాళ్లు ఒకరినొకరు సహాయం చేసుకుంటూ పైకి ఎదుగుతారు అని.

దురదృష్టవశాత్తు, చాలా మంచి మంచి ఉద్యోగాల్లో మహిళల నాయకత్వం, స్థాయి తక్కువగానే వుందని చెప్పాలి. వారికి సరైన అవకాశాలు రావడం లేదు. ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. కేటలిస్ట్ అధ్యయన నివేదికల ప్రకారం, సంస్థల్లోని పై స్థాయి వ్యక్తుల్లోనే లింగ వివక్ష , అసంపూర్ణమైన నిర్వణ, మంచి ఉద్యోగాల్లో మహిళల్ని తీసుకోకపోవడం జరుగుతోంది. కేటలిస్ట్ 2013 లో చేసిన అధ్యయనం ప్రకారం... ప్రముఖ దిగ్గజాలైన 500 సంస్థల్లో మహిళలకు కేవలం 16.9 శాతం మాత్రమే కార్పొరేట్ బోర్డ్ లాంటి కీలక స్థానాల్లో అవకాశాలు కలిగాయి. 10 శాతం కంపెనీల్లో ఒక్క దాంట్లో కూడా మహిళలకు బోర్డ్ స్థాయిలో స్థానం లేకుండా పోయింది.

మా తాజా అధ్యయనం ప్రకారం ఐటీరంగంలో ఎక్కువ సామర్థ్యమున్న మహిళలు పనిచేస్తున్నా ఉద్యోగుల్లో మాత్రం పురుషులు, మహిళల మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతోంది. 12 ఏళ్లలో ఈ వ్యత్యాసం 6వేల అమెరికన్ డాలర్ల వరకు వుందని లెక్కలు తేల్చాయి.

హర్ స్టోరీ: మీ వ్యక్తిగత అనుభవాల ఆధారంగా చెప్పండి. మహిళలు తమ వృత్తి ఉద్యోగాల్లో ఇలాంటి సవాళ్లను ఎలా అధిగమించలరు..?

షాచీ ఇర్డే: ఉద్యోగులుగా మారిన మొదటి రోజు నుంచే మహిళలు తోటివారితో బలమైన స్నేహశీల సంబంధాలను ఏర్పరుచుకోవాలి. నేను ఎప్పుడైనా పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మిగతా వారి నుంచి మనకు సహకారం అందేలా చేసుకునేదాన్ని. సంస్థలో అలాంటి వాతావరణం రావాలంటే ముందు మనం ఉద్యోగులందరితో సత్సంబంధాలను ఏర్పరుచుకోవాలి. కాబట్టి నేను మహిళలకు ఇచ్చే సలహా ఏంటంటే... వృత్తి, ఉద్యోగాల్లో కచ్చితంగా ముందుకు సాగడానికి తోటి వారితో మంచి సంబంధాలను కలిగివుండాల్సిందే.

ప్రత్యేకంగా చెప్పే మాట.. మహిళలు నలుగురిలో మాట్లాడటం నేర్చుకోవాలి. మీకు ఎలాంటి విషయాలపైన సమస్యలున్నా సరే, వాటిపై ఎవరితో ఒకరితో చర్చించాలి. మీ అభిప్రాయాలను ఇతరులకు తెలిపేటప్పుడు వాళ్లు మీకు తగినవాళ్లై వుండాలి. ఎవరైతే మీకోసం సహాయం చెయ్యలగరో...అలాంటి సమస్థాయి వాళ్లు, మేనేజర్లు, మార్గదర్శకులు ఇతర స్నేహితుల్ని ఉద్యోగ ప్రయాణంలో అందుబాటులో వుంచుకోవాలి.

హర్ స్టోరీ: మిమ్మల్ని నడిపించే శక్తి ఏంటి..?

షాచీ ఇర్డే: నేను దేన్నీ తేలిగ్గా వదలను. ఎవరైనా ఏదైనా చేశారు అంటే.. అప్పుడు మనం కూడా ఎందుకు చేయకుడదు..? అని ప్రశ్నించుకుంటాను. ఆ ఉత్సాహమే నన్ను ముందుకు నడుపుతుంది. నేను ఎప్పుడూ కొత్తగా ఎలా ఆలోచించాలని ప్రయత్నిస్తుంటా. ఇంకా ఇతరుల నుంచి ఏం నేర్చుకోగలమో పరిశీలిస్తుంటా.

...............అంటూ తన కేటలిస్ట్ కంపెనీ విజయ ప్రస్థానాన్ని, మహిళలకు ఇవ్వాల్సిన సముచిత స్థానాన్ని స్పష్టంగా చెప్పుకొచ్చారు షాచీ ఇర్డే.