ఒకప్పుడు రూం రెంటుకే డబ్బల్లేవు..! ఇప్పుడు మూడున్నర కోట్ల వ్యాపారం..!!

రాజీవ్ ధావన్ విజయగాధ

ఒకప్పుడు రూం రెంటుకే డబ్బల్లేవు..! ఇప్పుడు మూడున్నర కోట్ల వ్యాపారం..!!

Thursday December 24, 2015,

4 min Read

ఎయిత్ స్టాండర్డ్ లో మూడు సబ్జక్టులు ఫెయిల్ అయిన రాజీవ్ దావన్ ఇప్పుడొక సీరియల్ ఆంత్రప్రెన్యూర్ అయ్యారు. స్టార్టప్ కంపెనీల వ్యాపారంపై ఓ పుస్తకాన్ని రిలీజ్ చేశారు.

బేకరీ తయారీ వస్తువుల సప్లై

image


రాజీవ్ ధావన్ మొదటి వ్యాపారం ఇదే. సికింద్రాబాద్ నుంచి అన్ని చోట్లకు ఈ ప్రాడక్టులను తీసుకెళ్లి బ్యాకరీ వస్తువులను సప్లై చేసేవారు.

“నేను బేకరీలకు వెళ్లి వస్తువులు సప్లై చేస్తానంటే ఎవరూ నమ్మేవారు కాదు,” రాజీవ్

రాజీవ్ కజిక్ కి బేకరీ తయారీ వస్తువుల వ్యాపారం ఉండేది. ఆ సప్లైని రాజీవ్ చూసే వారు. అప్పట్లో తను చేస్తానంటే ఎవరూ నమ్మేవారు కాదట. బేకరీలో సాండ్విచ్ తీనే కుర్రాడు వాటి తయారీ సామన్లు సప్లై చేస్తానంటే నమ్మడం కష్టమే కదా అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు రాజీవ్. అప్పట్లోనే కస్టమర్ల పేర్లు, వారికి సప్లై చేసిన వస్తువుల లాంటివాటి వివరాలతో డెయిరీ మెయింటెన్ చేసేవారట. అలా అది ఓ ఆరునెలలు కొనసాగింది. స్టేట్ బోర్డు స్కూళ్లో తిరిగి అడ్మిషన్ లభించింది. తర్వాత ఎడ్యుకేషన్ కొనసాగించారు. స్కూల్ చదువుతున్నప్పుడు సాయంకాలం ఈవెంట్స్ లో హెల్పర్ గా పనిచేశారు.

మొదటి ఉద్యోగం

ఇంటర్మీడియేట్ పూర్తయ్యాక అబిడ్స్ లోని జోడియాక్ స్టోర్ లో ఉద్యోగం చేశారు. నెలకు సాలరీ 1200 రూపాయలు. అలా 2002 లో తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత సెయింట్ మేరీ కాలేజీలో చదువుతుండగా జీఈ మనీలో నైట్ కాల్ సెంటర్ లో ఆఫర్ వచ్చింది. తర్వాత హైటెక్ సిటీలోని హెచ్ ఎస్‌ బీసీ లో జాయిన్ అయ్యారు. వాయిస్ కాల్ లేకుండా అకౌంట్స్ వ్యవహారాలు చూసే ఉద్యోగం అది. అప్పుడే డిగ్రీ పూర్తి కావడం, మూడున్నరేళ్లు ఉద్యోగం కొనసాగడం అలా జరిగిపోయాయి. అనంతరం బ్రిగేడ్ లో ఉద్యోగం వచ్చింది. బ్రిగేడ్ లో చేరిత తర్వాత లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. వాయిస్ అకౌంటెట్ ట్రెయినర్ గా ప్రమోట్ అయ్యారు. ఏడాదిలోనే నెలకు 50వేల శాలరీకి చేరుకున్నారు. అప్పుడే జర్నలిజం మాస్ కమ్యునికేషన్ పూర్తి చేశారు. ఎందుకో ఉద్యోగం బోర్ కొట్టేసి వదిలేయాలని నిర్ణయించుకున్నారు.

“దాదాపు 8 నెలలు ఉద్యోగం తోపాటు ఇంటిని కూడా వదిలేసి స్నేహితుడి రూంలో ఉన్నా,” రాజీవ్

ఆ ఎనిమిది నెలలు ఏం చేయాలో తెలయలేదు. కంటిన్యూస్ గా పనిచేసిన నా బాడీ, మైండ్ వేరే ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నదేమో నాకైతే అర్థం కాలేదు. కానీ ఏమీ చేయకుండా గడిపానని చెప్పుకొచ్చారు.

image


అడ్వర్టయిజింగ్ ప్రస్థానం

ఓ ఇంగ్లీష్ డెయిలీకి సబ్ ఎడిటర్ కావాలంటూ వచ్చిన పేపర్ యాడ్ చూసి అప్లై చేశారు. 2008లో ట్రెయినీ సబ్ ఎడిటర్ గా ఉద్యోగంలో చేరారు. న్యూస్ ఏజెన్సీ నుంచి వచ్చిన దాన్ని ఎడిటింగ్ చేసి పేపర్ లో రాయడమే పని. ఇందులో క్రియేటివిటీ ఏమీ లేదని అనిపించింది. బ్యూరో చీఫ్ ని కలసి తాను సొంతంగా రాసిన ఆర్టికల్ చూపించారు. అదిబాగుండటంతో డేట్ లైన్ తో ఆర్టికల్స్ రాసే అవకాశం వచ్చింది.

“నా పని పూర్తి చేసి, వేరే ఏదైనా డేట్ లైన్ స్టోరీ రాయడానికి అవకాశం వచ్చింది,” రాజీవ్

తన పని పూర్తయిన తర్వాత మరో గంట సేపు తన స్టోరీకి కేటాయించే వారట. 16నెలలు కొనసాగిన ఉద్యోగం వదిలిపెట్టి అడ్వర్ టైజింగ్ ఏజెన్సీలో కాపీ ఎడిటర్ గా జాయిన్ అయ్యారు. మూడు నెలలు పనిచేసిన ఆ ఏజెన్సీలో శాలరీ ఇవ్వలేదు. తానే కాదు అక్కడున్న ఉద్యోగులందరిదీ ఇదే రకమైన సమస్య. సంస్థలో ఉద్యోగులకు జీతాలు పెండింగ్ పెట్టింది. దాంతో ఆ జాబ్ వదిలేసి సొంతంగా ఓ యాడ్ ఏజెన్సీ మొదటు పెట్టాలని నిర్ణయించుకున్నారు. రాజీవ్ ధావన్ తన అడ్వర్ టైజింగ్ ఏజెన్సీ ప్రారంభించడానికి ఇదే ప్రధాన కారణమైంది.

ప్రయాసలతో ప్రారంభమైన స్టార్టప్

కంపెనీ పెట్టాలనుకున్నాం. కానీ దానికి ఇనీషియల్ ఇన్వెస్ట్ మెంట్ ఎలా? తన క్లాస్ మేట్ అయిన హరిణి తో కలసి సంస్థను ప్రారంభిచాలనుకున్నారు. ఇద్దరిదీ ఒకే పరిస్థితి. ఇద్దరి పాస్ పోర్టులు తనఖా పెట్టి 40 వేలు అప్పు తీసుకొచ్చారు. ఓ సంస్థ ప్రారంభించాలంటే కనీసం 3 నుంచి4 లక్షల అవసరం ఉంది. కానీ దొరికింది 40వేలే. స్నేహితుడికి మూడు నెలలు తర్వాత రెంట్ ఇస్తామని ఓ రూం అడిగారు. అలా అడిగిన వెంటనే ఒప్పుకున్నాడు. ఇక ఆఫీస్ సెటప్ చేసుకోవడమే తరువాయి.

“రూం ఇస్తామనుకన్న స్నేహితుడు హ్యాండిచ్చాడు. ముందుగా అడ్వాన్స్ ఇచ్చి రూం తీసుకోవాలని కండిషన్ పెట్టాడు,” రాజీవ్

ఉన్న నలభైవేల్లో మూడు నెలల రెంట్ అంటే ఉన్నదంతా పోయి మిగిలింది పదహారు వేలు. కానీ మరో స్నేహితుడి క్రెడిట్ కార్డుతో ఓ కంప్యూటర్ కొన్నారు. పాత సంస్థ నుంచి ఓ ఉద్యోగిని కూడా హైర్ చేసుకున్నారు. అలా ప్రారంభమైన సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు మూడున్నర కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది.

image


వాట్స్ ఇన్ ఏ నేమ్

రాజీవ్ ధావన్ అప్పుడు ప్రారంభించిన కంపెనీ పేరు వాట్స్ ఇన్ ఏ నేమ్ క్రియేటివ్స్. దీనికి స్థానికంగా ఉన్న ఒక రెస్టారెంట్ చెయిన్ మొదటి క్లయింట్. అనంతరం అమెరికా నుంచి కూడా మంచి ఆఫర్లొచ్చాయి. అంచెలంచెలుగా ఎదిగింది. నేమ్ షేక్ ప్రొడక్షన్ పేరుతో వీడియో యాడ్స్ చేసే ఓ ప్రొడక్షన్ కంపెనీ 2012 లో ప్రారంభించారు. జస్ట్ ఫ్లా పేరుతో ఓ సెలూన్ ని కూడా లాంచ్ చేశారు. యాడ్ ఏజెన్సీకి 20 మంది ఉద్యోగులున్నారు. మరో 8 మంది ఆన్ రోల్ ఉద్యోగులున్నారు. సెలూన్ లో 35 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల స్టార్ట్ ఎఫ్ ది అప్ పేరుతో రాజీవ్ రాసిన పుస్తకం స్టార్టప్ సర్కిల్ లో చాలా ప్రాచుర్యం పొందింది. ఆంత్రప్రెన్యూర్ సాధకబాధకాలతో పాటు వారిని మద్దతిచ్చే బుక్ ఇది.

“ఆంత్రప్రెన్యువర్షిప్ అనేది ఓ లైఫ్ టైం కమిట్మెంట్,” రాజీవ్

తమ సంస్థ నుంచి ఏ ప్రాడక్ట్ వచ్చినా, ఆంత్రప్రెన్యువర్షిప్ అనేది తనకొక లైఫ్ టైం కమిట్మెంట్ అని అంటున్నారాయన.

భవిష్యత్ ప్రణాలికలు

బిటుబి, బిటుసి వ్యాపారంలో ఉన్న వాట్ ఇన్ ఏనేమ్ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకుంటున్నారు. బెంగళూరు తర్వాతి టార్గెట్ గా ఉంది. మరో యాడ్ ఏజెన్సీని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. మరో సెలూన్ ని సిటీలో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఫ్రాంచైజీ లు ఏర్పాటు చేసి సెలూన్ చెయిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

image


“జీవితంలో నీకు నువ్వు తప్పితే ఎవరూ సాయపడలేరు అని ముగించారు రాజీవ్”