సంకలనాలు
Telugu

రోటీమేటిక్ ఇంట్లో ఉంటే చిటికెలో రోటీలు రెడీ

నిమిషానికో రోటీ, పిండి కూడా అదే కలుపుకునే మెషీన్నూనె కావాలా వద్దా, ఎంత రోస్ట్ ఉండాలి అన్నీసెట్ చేసుకోవచ్చుసింగపూర్‌లో ఉన్న భారతీయ సంతతి దంపతుల సృష్టి2016 వరకూ ఆర్డర్లు తీసుకునే స్థితిలో కూడా లేని కంపెనీ

Poornavathi T
20th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

జనాలు ఈ మధ్య రానురాను మరీ హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారు. విపరీతమైన పని ఒత్తిడి, కాలుష్యం కారణంగా అనారోగ్య బారిన పడ్తున్నట్టు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే వ్యాయామం చేసే తీరికలేని జనాలు మాత్రం ఎంతో కొంత ఫుడ్‌ను కంట్రోల్ చేసి బరువును తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఇందుకు కొంత మంది ఓట్స్, కార్న్ ఫ్లేక్స్ వంటివి లాగించేస్తుంటే అధిక శాతం జనాలు మాత్రం ఇప్పటికీ రోటీకే ఓటేస్తున్నారు. ఉత్తరాది ప్రాంతాల్లో డైట్‌తో సంబంధం లేకుండా నిత్యం రోటీలే తింటారు. ఇతర ప్రాంతాల్లోని వారు మాత్రం కష్టమైన రాత్రిపూట రోటీల కోసం తాపత్రయపడ్తుంటారు.

జింప్లిస్టిక్ సంస్థ రూపొందించిన రోటీమేటిక్

జింప్లిస్టిక్ సంస్థ రూపొందించిన రోటీమేటిక్


ఇంతవరకూ బాగానే ఉంది. ఆరోగ్యం సంగతి సరే.. అయితే రోటీలు చేయడమూ ఇప్పుడో పెద్ద బ్రహ్మవిద్యలా మారిపోయింది. కొంత మందికి చేయడానికి రాకపోతే, మరికొంత మందికి ఓపిక లేకో, టైం లేకో ఇబ్బందిపడ్తుంటారు. రాత్రిపూట రోటీలు చేయాలని భార్యపై ఒత్తిడి తెచ్చే బాపతు కూడా చాలామందే ఉన్నారు. అయితే అలవాటైన వాళ్లకు రోటీలు చేయడం చిటికెలో పనే కానీ.. పెద్దగా అవగాహన లేనివాళ్లు మాత్రం దీన్నో పెద్ద తంతులా ఫీలవుతూ ఉంటారు. పిండి కలుపుకోవడం, నానబెట్టుకోవడం, వాటిని సరిగ్గా కాల్చుకోవడాన్ని తెగ ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటారు. అందుకే ఇప్పుడు అలాంటి వాళ్లకోసమే ఓ సింగపూర్ సంస్థ అద్భుతమైన వరాన్ని ప్రసాదించింది. రోటీమ్యాటిక్ పేరుతో ఆటోమోటిక్ మేకర్‌ను సిద్ధం చేసింది.

రోటీమేటిక్ ఓ అద్భుత ఐడియా. ఇదో సింపుల్ మెషీన్. బటన్ నొక్కగానే చాలు వేడివేడి రోటీలు ప్లేట్లో సిద్ధమైపోతాయి. సింగపూర్‌‌లో ఉన్న భారతీయ సంతతి భార్యాభర్తలు రిషి ఇరానీ, ప్రనోతి నగార్కర్‌కు చెందిన జింప్లిస్టిక్ ఈ రోటీమేటిక్‌ను తయారు చేసింది.

దీన్ని చూడగానే ఎవరైనా.. వావ్ అంటూ నోరెళ్లబెట్టాల్సిందే ! ఈ మెషీన్లో పిండికి, నీళ్లకు ప్రత్యేక కంపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేశారు. అయితే పిండి, నీళ్ల లెక్కల టెన్షన్‌ కూడా మనకు ఉండదు. జస్ట్ పదార్థాలు అందులో వేస్తే చాలు.. అదే పిండి కలుపుకుని, మన టేస్టుకు తగ్గట్టు నిమిషానికో రొట్టెను రెడీ చేసి ఇస్తుంది.

image


నూనే ఎంత కావాలో సెట్ చేసుకోవచ్చు, అసలు వద్దన్నా కూడా సరే ఇందులో ఆప్షన్ ఉంది. ఎంత మందంతో రోటీ ఉండాలి, ఎంత రోస్ట్ కావాలి అనే దాన్ని కూడా సెట్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది.

ప్రనోతి నగార్కర్, రిషి ఇస్రానీ, జింప్లిస్టిక్ వ్యవస్థాపకులు

ప్రనోతి నగార్కర్, రిషి ఇస్రానీ, జింప్లిస్టిక్ వ్యవస్థాపకులు


సింగపూర్ స్ప్రింగ్‌ నుంచి 2013లో 6 మిలియన్ డాలర్ల ఫండింగ్‌ను గెలుచుకున్న పదిహేను స్టార్టప్స్‌లో జింప్లిస్టిక్‌ కూడా ఒకటి. ఈ సంస్థను రిషి ఇస్రానీ, ప్రనోతి నగార్కర్ ప్రారంభించారు. ఆరేళ్ల పాటు కృషి తర్వాత ఈ రోబో రోటోమేటిక్ బయటకు వచ్చినట్టు కంపెనీ చెబ్తోంది. ఇది లాంచ్ చేసిన సమయంలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. 2015లో తయారయ్యే ప్రొడక్ట్‌కు గతేడాది జూన్‌లోనే బుకింగ్స్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఎంత గిరాకీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రీ ఆర్డర్స్‌లో భాగంగా 5 మిలియన్ డాలర్లు వసూలైనట్టు డీల్ స్ట్రీట్ ఆసియా కథనం ప్రకారం అర్థమవుతోంది.


సింగపూర్, అమెరికాలో మాత్రం గతేడాది లాంచ్ అయిన ఈ రోటీమేటిక్ ధరను 599 డాలర్లుగా(దాదాపు రూ.38వేలు) నిర్ణయించారు. ఇంత అధిక ధర ఉన్నప్పటికీ ఆసియా ప్రాంత ప్రజలు, విదేశాల్లో ఉన్న భారతీయులే ఈ ప్రొడక్ట్ కొనేందుకు ఉత్సాహం చూపించారు.

ఇక ఫండింగ్ విషయానికి వస్తే.. ఇద్దరు ఇన్వెస్టర్ల నుంచి 3.5 మిలియన్ డాలర్ల ఫండింగ్ అందింది. వీర్ ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి మూడు మిలియన్ డాలర్లు, మిగిలిన 5 లక్షల డాలర్లు వివిధ వ్యక్తుల నుంచి అందినట్టు మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమచారం ప్రకారం అర్థమవుతోంది. అయితే కంపెనీ వెబ్ సైట్ ప్రకారం డిజిసి గ్రూప్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌ని కూడా ఇన్వెస్టర్ల జాబితాలో చేర్చారు.

తాజాగా కంపెనీ వెబ్ సైట్ ప్రకారం ఈ రోటీమేటిక్ ధరను సుమారు 999 డాలర్లుగా (రూ.62 వేలు) నిర్ణయించారు. ఇంత ధర వెచ్చించినా సరే 2016 వరకూ ప్రీ ఆర్డర్స్ అన్నీ అమ్ముడుపోయినట్టు కంపెనీ చెబ్తోంది. ప్రస్తుతం ఆర్డర్ చేసేందుకు కూడా అవకాశం లేదని వివరిస్తోంది. దీన్ని బట్టి చూస్తే కంపెనీకి అనూహ్యమైన స్పందనే వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags