సంకలనాలు
Telugu

ఎడారిలో ఇసుక రేణువంత ప్రయత్నం చేశాను !

సమాజంలో మార్పు రావాలని కోరుకోని వాళ్ళు ఎవరైనా వుంటారా.. ? ఎవరూ వుండరు. కానీ, ఆ మార్పును తేవడానికి స్వయంగా ప్రయత్నించే వాళ్ళు ఎంత మంది వుంటారు ? కొద్ది మందే. ఈ ప్రయత్నాన్ని మొదలు పెట్టిన తర్వాత ఎంత కష్టమైనా, రేయి పగలు సమానంగా కష్టపడి ఫలితాన్ని సాధించాలనే పట్టుదల ఎంత మందిలో వుంటుంది ? చాలా అరుదుగా వుంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఏంజీ ఒకరు.

bharathi paluri
15th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

‘‘ముంబైలోని విక్రోలీ లో పుట్టిపెరిగాను. ఇరవై ముప్పై అపార్ట్‌మెంట్లు వుండే ఒక చిన్న చావిడి అది. అతి సాధారణంగా పెరిగాను. మా ఇంట్లో ఆస్తిపాస్తులు కన్నా విలువలకే ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు. నాకూ అదే అలవాటైంది. నేనే విలువలతో పెరిగానో నా విద్యార్థులకు కూడా అవే నేర్పిస్తాను. ఇక్కడ నేర్చుకున్న విలువలు ప్రతిరోజూ వారి జీవితంలో ప్రతిబింబించాలనుకుంటాను. మంచి చెడుల మధ్య తేడా తెలుసుకునే విచక్షణ వారికి అలవాటవ్వాలి.’’ ఇదీ ఏంజలీన్ డియాస్ (ఏంజీ) కల.

ఏంజలీన్ డియాస్, ప్రోగ్రామ్ మేనేజర్ - టీచ్ ఫర్ ఇండియా

ఏంజలీన్ డియాస్, ప్రోగ్రామ్ మేనేజర్ - టీచ్ ఫర్ ఇండియా


బాగా తెలివితేటలుండి కూడా సరైన విద్యాభ్యాసం లేకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలేంటో ఏంజీకు బాగా తెలుసు. తెలివితేటలకు, చదువు సంధ్యలకూ మధ్య ఈ దూరన్ని చెరిపేయడానికి ఏదో ఒకటి చేయాలన్నదే ఆమె తాపత్రయం. అనుకోకుండా అలాంటి అవకాశమే తనకు పదో తరగతిలోనే వచ్చింది. ‘‘2009 లో టీ ఎఫ్ ఐ ముంబైలో అప్పుడే తన కార్యకలాపాలను మొదలు పెట్టింది. అప్పటికి నేను పదో తరగతి చదువుతున్నాను. కాలేజీలో చదువుతున్న మా అన్నయ్య పేపర్ లో వచ్చిన ఒక ప్రకటనని నాకు చూపించాడు. అది చూడగానే విద్యారంగానికి సంబంధించి ఏదైనా చెయ్యాలని నేను గట్టిగా అనుకున్నాను. అప్పటికప్పుడే ఫెలోషిప్ కోసం అప్లై చేసేయాలనిపించింది కానీ, నాకప్పుడు దానికి తగ్గ వయసు లేదు. తర్వాత సెయింట్ గ్జేవియర్ కాలేజీ (ముంబై) లో బి ఎ ఫైనల్ ఇయర్ చేస్తున్నప్పుడు మా స్నేహితులు కొంతమంది ఈ ఫెలోషిప్ గురించి చర్చించుకోవడం చూసాను. అప్పుడే నాకు నా భవిష్యత్తు కనిపించింది.

అక్కడ కట్ చేస్తే, ఇప్పుడు టీ ఎఫ్ ఐ (టీచ్ ఫర్ ఇండియా) లో ఏంజీ ఒక 22 ఏళ్ళ ప్రోగ్రామ్ మేనేజర్. ఫెలోషిప్ తర్వాత ఆమె ఈ సంస్థలోనే చేరి విద్యావ్యవస్థలో తనదైన మార్పు తేవడానికి ప్రయత్నిస్తున్నారు.

తన అనుభవాలని యువర్ స్టోరీతో పంచుకున్న ఏంజీ, అసలు ఫెలో షిప్ తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో వివరించారు. మొదట అయిదు వారాల శిక్షణా శిబిరంగా ఈ ఫెలో షిప్ మొదలైంది. ఈ శిబిరాన్నే అక్కడ ఇన్స్‌టిట్యూట్ అంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి తనకు కేటాయించిన నగరాలకు, స్కూళ్ళకు, క్లాస్ రూమ్ లకు వెళ్ళడం మొదలైంది. నిజానికి ఇన్స్టిట్యూట్ కు వెళ్ళిన కొద్ది రోజులకే నాకు తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత అని అర్థమైపోయింది. ముందనుకున్న అయిదువారాల శిక్షణ అయ్యాక కూడా రెండు వారాలకోకసారి ట్రెయింగ్ సెషన్స్ వుండేవి. అయినా కూడా క్లాస్ రూమ్‌ను ఫేస్ చేయడం నాకు ఓ సవాలుగా వుండేది.

నేను వెళ్ళే క్లాస్ రూమ్ పిల్లల మీద అంతకు ముందు వాళ్ళకు బోధించిన వ్యక్తుల ప్రభావం వుండేది. నేను వాళ్లతో కనెక్ట్ కాలేకపోయేదాన్ని. నేను చెప్పేవిషయాలపై వాళ్లు దృష్టి కేంద్రీకరించేలా చేయడానికి అష్టకష్టాలు పడేదాన్ని. దీంతో విసుగు, బాధ కలిగేవి. దాదాపు ప్రతిరోజూ క్లాస్ అయిన తర్వాత ఏడ్చేదాన్ని’’ అని తన ఫెలోషిప్ అనుభవాలను గుర్తు చేసుకున్నారు ఏంజీ. అయితే, ఒకసారి తన క్లాస్ ఫలితాలొచ్చాక ఏంజీ ఆనందానికి అవధుల్లేవు. ఏంజీ క్లాసులో విద్యాప్రమాణాలు బాగా పెరిగాయని హాఫ్ ఇయర్లీ పరీక్షల ఫలితాలు చూస్తే అర్థమయింది. అంటే, తాను పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నా, పిల్లలు మాత్రం బాగా కష్టపడుతున్నారని ఏంజీ గ్రహించారు. ‘‘ నేను అన్యమనస్కంగా వున్నప్పుడే ఈ స్థాయిలో ఫలితాలు సాధిస్తే, ఇక 120 శాతం కష్టపడితే, ఇంకెంత అద్భుత ఫలితాలొస్తాయో ’’ అని నాకు నేనే చెప్పుకున్నాను.

‘‘టీ ఎఫ్ ఐ మీద కూడా చాలా అపోహలున్నాయి. ఇదేదో డబ్బున్న వాళ్ళే చేరే సంస్థ అనీ, బాగా మేధావులే ఇందులో చేరగలరనీ నేను కూడా అనుకునే దాన్ని. ఇక బయటి ప్రపంచంలో అయితే, ఇదో వన్ మేన్ షో అనీ, దేశంలోని విద్యాపరమైన అసమానతలని తొలగించే బాద్యత అంతా టి ఎఫ్ ఐ మీదే వుందనుకుంటారు. అయితే, ఇవన్నీ అపోహలే’’ అంటారు ఏంజీ. ఇందులో చేరడానికి డబ్బు అసలు ఒక అంశం కానే కాదు. ఇక అక్కడి వాతావరణం అయితే, అచ్చం తాను ఊహించినట్టే వుందని చెప్తారు ఏంజీ. పూర్తి నిజాయితీగా, పారదర్శకంగా పనిచేస్తారు. నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలకు అవకాశముంటంది. ఎప్పటికప్పుడు తాము చేసే తప్పొప్పులను బేరీజు వేసుకుంటూ వుంటారు.

టీ ఎఫ్ ఐ ఫెలోషిప్ నుంచి అందులోనే ప్రోగ్రామ్ మేనేజర్ కావడంలో ఏంజీకి తన కుటుంబం సపోర్ట్ కూడా బాగా వుంది. ఇందుకు కూడా ఆమె చూపించిన ఫలితాలే కారణం. తన సొంత కమ్యూనిటీలోనే ఏంజీ పనిచేయడం, అక్కడి పిల్లల చదువులో ప్రవర్తనలో చెప్పుకోదగ్గ మంచి మార్పును తేవడం వారు చూసారు. ఉదాహరణగా ఇర్షాద్ గురించి చెప్పుకోవాలి. అదే ప్రాంతంలో వుండే ఇర్షాద్ ఏంజీ క్లాస్‌లోనే చదువుకుంటున్నాడు. ఏంజీ అక్కడికి రాకముందు వాడికి సున్నా మార్కులు వచ్చేవి. చదవకపోగా, పక్క విద్యార్థులనూ కొడుతూ వుంటాడనే కంప్లయింట్లు కూడా వుండేవి. అలాంటి వాడిని ఏంజీ పూర్తిగా మార్చేసింది. అదే ఇర్షాద్ ఇప్పుడు క్లాస్‌లో ఆరో ర్యాంకులో వున్నాడు. క్లాస్ అసైన్‌మెంట్స్ తయారు చేయడంలో ఏంజీకి సహాయ పడుతున్నాడు. ఇలాటి ఫలితాలు చూసే ఏంజీ కుటుంబ సభ్యలు, స్నేహితులు ఆమెకు పూర్తి అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఏంజీ ప్రోగ్రామ్ మేనేజర్. అంటే, ఆమె మరో 16 మందిని సూపర్ వైజ్ చేయాలి. అంటే మొత్తం టీమ్ కలిపి 640 మంది పిల్లలని చూసుకోవాలి. ఇదంతా కష్టమే అయినా, ఆ పిల్లల్లో వచ్చిన మార్పు చూసి, కష్టాన్ని మర్చిపోతారు.

ఏంజీ స్నేహితులంతా పెద్ద పెద్ద చదువులు చదవుకుని కలర్‌ఫుల్ కెరీర్స్‌లో సెటిల్ అయిపోయారు. కానీ, ఏంజీకి మాత్రం ఆ గ్లామర్ మీద పెద్దగా దృష్టి లేదు. అసలు ఆ గ్లామర్ ప్రపంచం రుచి కూడా తనకి తెలియదు. తెలుసుకోవాలని లేదు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఏంజీకి తన స్థాయికి తగ్గట్టు సాదా సీదాగా బతకడమే ఇష్టం. తన చుట్టూ వుండే జనాలు, తన కుటుంబం, తన దగ్గర చదువుకునే పిల్లలు,.. ఇదే ఏంజీ ప్రపంచం.

పిల్లలే ప్రపంచం

‘‘నా క్లాసులో పిల్లలందరూ నా ఫ్రెండ్సే. వాళ్ళకేమైనా సమస్యలుంటే నా దగ్గరకు వస్తారు. వాళ్ళు చెప్పేదంతా వింటాను. వాళ్ళకు ధైర్యాన్నిస్తాను. చాలా మంది పిల్లలు ఎప్పటికప్పుడు ఏవో కారణాల వల్ల చదువు వదిలేసి వెళ్ళి పోదామనుకుంటారు. అయితే, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళలో ఆత్మవిశ్వసాన్ని పెంచి చదువు కొనసాగించేలా చేస్తాను.. ’’ అంటారు ఏంజీ. కొద్ది మంది పిల్లల్లో మానసికంగా తాను తీసుకొచ్చిన మార్పును యువర్ స్టోరీకి వివరించారు ఏంజీ. నల్లగా వుండే అతుల్‌కి ఎవరైనా తన రంగును ఎగతాళి చేస్తే ఎక్కడ లేని కోపం వచ్చేసేది. అలా మాట్లడే వాళ్ళను ఎడా పెడా కొట్టేసేవాడు. అసలు ఎవరు చెప్పినా వినేవాడు కాదు. అలాంటి వాడితో ఓపికగా మాట్లాడి, క్లాస్ రూములో డిస్కషన్స్ పెట్టి, తన టెంపర్‌మెంట్‌ను కొంత తగ్గించింది. ఆ తర్వాత తన క్లాస్‌మేట్లతో మనసు విప్పి మాట్లాడేలా అతుల్‌ను ఒప్పించింది. తన మనసు గాయపడినప్పుడు ఎదుటి వారిని కొట్టడం కంటే, నవ్వేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం వుంటుందని అర్థమయ్యేలా చెప్పింది. ఇప్పుడు అతుల్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా తనపై తానే జోక్ వేసుకోగలడు. ఉద్రేకపడకుండా వుండగలడు. ఇక అమీర్ విషయానికొస్తే, అతను నోటికొచ్చిన బూతులు మాట్లాడే వాడు. ఇతని సమస్య ఏంటని తోటి విద్యార్ధులను అడిగి తెలుసుకుంది ఏంజీ. చివరికి అతను తోటి విద్యార్థులతో పోటీ పడలేక, నోటి కొచ్చినట్టు తిడుతూ ఆ వత్తిడి నుంచి బయట పడేవాడని తేలింది. ఆ తర్వాత ఒకరోజు అమీర్ ను కూర్చోపెట్టి ఏంజీ మాట్లాడారు. మిగిలిన విద్యార్థులతో నిన్ను పోల్చే ఉద్దేశం నాకు లేదని చెప్పారు. కోపంతో, తాను మాట్లాడే బూతుల అర్థమేంటో అతనికే విడమరిచి చెప్పరు. అంతే, ఆ తర్వాత అమీర్ ఎప్పుడూ బూతులు మాట్లాడలేదు.

అలాగే, ఆడ మగా సమానమే అనే స్పృహను కూడా ఈ క్లాస్ రూమ్ లలో కల్పిస్తారు. ఉదాహరణకు ఏంజీ క్లాస్ లో పద్దెనిమిది మంది ఆడపిల్లలు, పద్దెనిమిది మంది మగపిల్లలు వుంటారు. ‘‘లెక్కపెట్టి ఇలా వుండాలనుకోలేదు కానీ, అనుకోకుండా అలా కుదిరారు. దీంతో నా ప్రభావం ఆడపిల్లల మీదా, మగ పిల్లల మీదా ఒకేలా వుంటోందని మాత్రం అర్థమయింది. క్లాస్ రూమ్ డిస్కషన్ల ద్వారా , స్త్రీపురుష సమానత్వాన్ని వివరిస్తాం. ఇక ఫెలో షిప్ లో వున్న వాళ్ళు, ఆడపిల్లల విద్యపై ప్రత్యేకంగా కృషి చేస్తారు. అని ఏంజీ వివరించారు.

విద్యార్థుల తో ఏంజలీన్ డియాస్

విద్యార్థుల తో ఏంజలీన్ డియాస్సహనమే ఆయుధం

‘‘నాకు చాలా ఓపిక అని నాపై నాకో నమ్మకం వుండేది. కానీ ఈ పిల్లలతో పని చేయడం మొదలయ్యాక ఆ నమ్మకం పటా పంచలైపోయింది’’ అంటారు ఏంజీ. అవును.. పిల్లలను ఒప్పించడం, దారికి తీసుకురావడం అంత తేలిక కాదు. దీనికి ఏకైక మార్గం సహనం, ప్రేమ. అందుకే ఏంజీ కూడా ఈ దారినే నమ్ముకున్నారు. అంకితభావం, కష్టపడి పనిచేయడం, పిల్లలతో ప్రేమగా వుండడం, దీనికి మించి విజయానికి వేరే దారేది లేదని ఏంజీ గ్రహించారు. ప్రేమగా చెప్తే, పిల్లలు ఎలాంటి అద్భుతాన్నైనా సాధించగలరని ఆమె విశ్వాసం. అందుకు ఇంజముల్ ఒక ఉదాహరణ. ఇంజముల్ చదువులో మెరిట్ సాధించి, గ్రాడ్యుయేషన్ వరకు ప్రభుత్వ స్కాలర్ షిప్ పొందడం ఆమె కెరీర్ లో ఓ గొప్ప విజయం.

తల్లిదండ్రులు కూడా ముఖ్యమే..

మన విద్యావ్యవస్థ లోనే కొన్ని సమస్యలున్నాయంటారు ఏంజీ. ఫలితాల మీద దృష్టి పెట్టడం వల్ల పిల్లలు చదివినా చదవక పోయినా.. పాస్ చేసేస్తున్నారు. టీచర్లకు క్లరికల్ వర్క్ తలకు మించిన భారమైపోతోంది. దీని వల్ల వాళ్ళు పిల్లలను పట్టించుకోవడం లేదు. దీంతో వాళ్ళు తొమ్మిదో తరగతికి వచ్చేసరికి చదువు భరించలేని భారమైపోతోంది. స్కూల్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. దీంతో విద్యాహక్కు లక్ష్యం నెరవేరడం లేదు.

ఈ సమస్యకు పరిష్కారం విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర వుందని ఏంజీ నమ్మకం. తాను ఫెలోషిప్ చేసేటప్పుడు పిల్లల్ని స్కూల్ లో చేర్పించమని వాళ్ళ ఇళ్ళకు వెళ్ళేది ఏంజీ. అప్పుడు వాళ్ళకు ఒకటే సందేహం. ఓ ఇరవై ఏళ్ళ బి ఎ గ్రాడ్యుయేట్‌ని నమ్మి తమ పిల్లల్ని ఎలా పంపిస్తామని అనే వాళ్ళు. ఇందుకు వాళ్ళను ఒప్పించడం ఏంజీకి ఓ సవాలుగా మారింది. వీలైనప్పుడల్లా వాళ్ళతో కూర్చుని , మాట్లాడి .. చాయ్ తాగి.. కబుర్లు చెప్పడంతో చివరికి వాళ్ళతో స్నేహం కుదిరింది. మరో వైపు తన దగ్గర చదువుకునే పిల్లలు కూడా తమ స్నేహితులకు చదువు విలువ చెప్పడం మొదలు పెట్టారు. దీంతో తన మాటలకు విలువ పెరిగింది. ఒక సారి తల్లిదండ్రులను ఒప్పించగలిగితే, క్లాసులో అటెండెన్స్ దానంతట అదే పెరుగుతుంది.భవిష్యత్తు ప్రణాళికలు

నాకంటూ ఒక స్కూల్ వుండాలని మొదట్లో అనుకునే దాన్ని. అయితే, ఈ దేశంలో స్కూళ్ళకు కొదవలేదని తర్వాత అర్థమైంది.’ అని తన భవిష్యత్తు ప్రణాళికల గురించి చెప్పుకొచ్చారు.. ఏంజీ. ప్రస్తుతానికైతే ఆమె ద్రుష్టంతా టీ ఎఫ్ ఐ ప్రోగ్రామ్ మేనేజర్ గా తన బాధ్యతను సవ్యంగా నిర్వర్తించడం మీదే పెడుతున్నారు. భవిష్యత్తులో మరింత ఉత్తమమైన టీచింగ్ ప్రాక్టీసెస్ కోసం, టీచింగ్ ఫార్టనర్ షిప్ కోసం ప్రయత్నించాలనే ఆలోచన వుంది. అలాగే ఏంజీ స్వయంగా భోజనప్రియురాలు. అందుకే పిల్లలకి మరింత ఆరోగ్యకరమైన శాఖా హార, మాంసాహార భోజనాన్ని అందించడానికి మీల్ వేన్/కేఫ్ తరహా ఏర్పాటు చేయాలని కూడా ఏంజీ ఆలోచిస్తున్నరు. చివరిగా ఆమె చెప్పేదొకటే. విద్యాపరమైన తారతమ్యాలు లేకుండా చేయాలన్నదే ఏంజీ కల. ఇందుకోసం విద్యా వ్యవస్థలో నే మార్పులు తేవాలని అనుకుంటున్నారు. అవసరమైతే.‘‘ విద్యావిధానాలను అథ్యయనం చేయాలనుకుంటున్నాను. నేనేదో పెద్ద సంచలనాలు స్రుష్టించాలనుకోవడం లేదు. సముద్రంలో ఒక నీటి బొట్టులాగా అయినా.. నా వంతు మార్పు తేవాలనుకుంటున్నాను..’’ అన్నారు ఏంజీ.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags