సంకలనాలు
Telugu

'హే నైబర్' - ఇదోరకం కమ్యూనిటీ కనెక్టర్ !

Chanukya
26th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఒకసారి గౌరవ్‌ కొడుకుకు అర్థరాత్రి ఓ ఆరోగ్య సమస్య వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక వణికిపోయారు. చివరకు ఓ డాక్టర్‌కు ఫోన్ చేస్తే.. అప్పటికప్పుడు ఓ మెడిసిన్‌ ఇవ్వమని సూచించారు. తీరా వాళ్లున్న ఏరియాలో 24 గంటలపాటు తెరిచి ఉండే మెడికల్ షాపులు ఎక్కడుంటాయో అంతుచిక్కలేదు. ఆ టెన్షన్‌తో మైండ్ చేయని స్థితిలో ఇక చేసేదిలేక కొంత మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ సభ్యులకు ఫోన్ చేసి సాయం కోరాల్సి వచ్చింది.

గౌరవ్ ఎదుర్కొన్న ఈ సమస్యే ఓ యాప్ రూపకల్పనకు కారణమైంది. ఓ ఏరియాకు మాత్రమే పరిమితమయ్యే యాప్‌ను తయారు చేసేందుకు దోహదపడింది.

అప్పటికే స్క్రోల్ బ్యాక్ అనే సంస్థలో గౌరవ్ శ్రీవాస్తవ పనిచేస్తున్నారు. అతనితో పాటు కాశ్మీరా చావక్, అరవింద్ రవి, హరీష్, సత్యజిత్ సాహూ కూడా స్క్రోల్‌ బ్యాక్‌లో ఉన్నారు. వాళ్లందరితో జరిపిన చర్చల తర్వాతే ఈ 'హే నైబర్' అనే యాప్ తయారైంది.

image


సెప్టెంబర్ 2015లో లాంఛ్ అయిన ఈ యాప్ వెబ్, మొబైల్ యాప్‌లో పనిచేస్తుంది. స్థానికంగా ఉన్న యూజర్లు ఈ యాప్ ద్వారా అనుసంధానం కావొచ్చు. ఒకే కాలనీ.. లేదా ఒకే కమ్యూనిటీలో వాళ్లు ఒకరికి ఒకరు సాయం చేసుకునేందుకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.

''అర్థరాత్రి కాఫీ కోసం ఎదురుచూస్తున్నారా, వర్కవుట్ చేసేందుకు ఓ పార్ట్‌నర్ ఉండే బాగుండనిపిస్తోందా, ఓ కుక్ కావాలా.. ఇలా అవసరం ఏదైనా.. ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. యాక్టివిటీ పార్ట్‌నర్స్‌ నుంచి కార్ పూలింగ్‌ వరకూ.. లేకపోతే ఏదైనా ఆపద వచ్చినప్పుడు బ్లడ్ డోనర్స్ వంటి సాయం కోసం కూడా ఈ యాప్ ద్వారా అడిగేందుకు వీలుంటుంది. మా యూజర్స్‌కు ఉన్న ప్రత్యేకమైన అవసరాలను తీర్చేందుకు హే నైబర్ ఉపయోగపడ్తోంది'' అంటున్నారు కో ఫౌండర్ కశ్మీరా. ఈ సంస్థ స్థాపనకు ముందు ఆమె జర్నలిస్టుగా కొన్ని టీవీ ఛానళ్లలో, ఎంఎన్‌సి కంపెనీల్లో విధులు నిర్వహించారు.

మార్కెటింగ్, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ పైనే మొదటగా ఎక్కువగా దృష్టిసారించి, నిధులు ఖర్చుచేసినట్టు కశ్మీరా చెబ్తున్నారు. నాలుగు నెలల కాలంలోనే ఈ వేదికకు మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకూ దాదాపు 25,000 డౌన్ లోడ్స్‌ అయితే అందులో 40 శాతం మంది యాప్‌ను రోజూ వివిధ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం బెంగళూరు, ముంబై, పూణేలకే ఈ యాప్ పరిమితమైంది.

బిజినెస్ మోడల్

వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని తెచ్చుకునేందుకు టీం కష్టపడ్తోంది. హైపర్ లోకల్ మోడల్‌ ఉన్నందు వల్ల స్థానిక వ్యాపారుల నుంచి ఆసక్తి వస్తుందని భావిస్తున్నారు. ఈ వేదిక ద్వారా తమ బిజినెస్‌ను ప్రమోట్ చేసుకోవాలని అనుకునే వాళ్లకు పనికొస్తుందని కశ్మీరా చెబ్తున్నారు. కొంత మంది భాగస్వాములతో కలిసి పైలెట్ ప్రాజెక్టును హే నైబర్ టీమ్ వర్కవుట్ చేస్తోంది.

స్క్రోల్ బ్యాక్ అనే ప్రోడక్ట్ కంపెనీని వీళ్లంతా విజయవంతంగా నడుపుతున్నారు. ఇదో కమ్యూనిటీ చాట్ టూల్. అందుకే ఇప్పటికిప్పుడు దానిపై శ్రద్ధ తగ్గించి ఈ కొత్త ప్రాజెక్టులోకి దూకేందుకు వీళ్లంతా సిద్ధంగా లేరు. స్క్రోల్ బ్యాక్ వెబ్‌సైట్‌కు ఈ యాప్‌ను అనుబంధంగానే ఉంచారు. యూజర్ యాక్టివిటీని పూర్తిస్థాయిలో పరీక్షించి ఓ స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే తర్వాతి స్థాయికి ఎలా తీసుకువెళ్లాలనే విషయాన్ని ఆలోచిస్తామని టీం చెబ్తోంది.

ఇప్పుడున్న జోరును ఎక్కువ కాలం అలానే కొనసాగేలా చేయడమే తమ ముందున్న తక్షణ లక్ష్యమని కశ్మీరా చెబ్తున్నారు.

మార్కెట్, కాంపిటీషన్ ఎలా ఉంది

ఓ రఫ్ అంచనా ప్రకారం నైబర్‌హుడ్ కమ్యూనిటీ మోడల్ విలువ సుమార్ బిలియన్ డాలర్లు (రూ.6800 కోట్లు). అయితే ఇప్పటివరకూ భారత్‌లో ఈ సెగ్మెంట్‌పై దృష్టిసారించిన వాళ్లు తక్కువే. అందుకే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇది సరైన సమయమని హే నైబర్ ఆలోచిస్తోంది.

LurnQ (నాలెడ్జ్ షేరింగ్‌ కోసం రూపొందిన ఓపెన్ కమ్యూనిటీ), Touchtalent(క్రియేటివ్ జనాల సోషల్ నెట్వర్కింగ్ వేదిక), Imlee(కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం రూపొందిన సోషల్ నెట్వర్కింగ్ సైట్) సహా హ్యామర్ వంటి సామాజిక అనుసంధాన వేదికలు, యాప్స్ ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి.

స్టార్టప్స్‌ ఈ మధ్యే లోకల్ సోషల్ నెట్వర్క్‌పై దృష్టిపెట్టడంతో పోటీ కూడా తీవ్రంగానే ఉంది. ''కమ్యూనిటీ ఫస్ట్‌ ఆలోచనతో రూపొందిన వేదిక ఇది. హే నైబర్ ద్వారా రోజుకు 1000 డిస్కషన్స్ జరుగుతాయి. వీటిల్లో ఇతరులు అడుగుతున్న ప్రశ్నలకు, కమ్యూనిటీ సభ్యులు సమాధానాలు కూడా ఇస్తూ ఒకరికి ఒకరు సాయపడ్తున్నారు. కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు కొన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెటింగ్ వ్యూహాలపై దృష్టిపెడ్తున్నట్టు చెప్పి ముగించారు కశ్మీరా.

App

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags