సంకలనాలు
Telugu

మహిళలూ ముందుకు రండి.. మీకోసం పార్ట్ టైం జాబ్ రెడీగా ఉంది !!

1000 కి పైగా కంపెనీలకు సేవలు3 లక్షలకు పైబడి సభ్యుల చేరికలు

Malavika P
26th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మహిళలు సాధికారత వైపు ఎంతవేగంగా అడుగులు వేస్తున్నా- మగవారితో పోల్చుకుంటే ఉద్యోగం చేసే మగువల సంఖ్య తక్కువే. ఒకవేళ రిటైర్ అయ్యేదాకా చేద్దామని అనుకున్నా –కొన్ని కొన్ని సందర్భాలు వారితో ఉద్యోగం మానేలా చేస్తాయి. ముఖ్యంగా మిడిల్ ఏజ్ వచ్చేసరికి -ఉద్యోగం కంటే ముఖ్యమైన అంశాలు ఎన్నో ఎదురవుతాయి. ఎదుగుతున్న పిల్లలు, వారి చదువు సంధ్యలు, ఆర్ధిక వ్యవహారాలు- ఇవన్నీ ప్రియారిటీ లిస్టులో చేరిపోతాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం చేయడమనేది వారికి చివరి ఆప్షన్ గా మారిపోతుంది. అయినా కొంతమంది పార్ట్ టైమ్ జాబ్స్ వైపు, ఇంటినుంచే చేసే ఉద్యోగాలవైపు మొగ్గు చూపుతుంటారు. కానీ అందరికీ అలాంటి నౌకరీ దొరకచ్చు- దొరకకపోవచ్చు. ఒకవేళ అవకాశం వచ్చినా చేయగలిగే కెపాసిటీ ఉంటుందో ఉండదో? వీటన్నిటికీ సమాధానం మేమిస్తాం అంటున్నారు సైరీ చాహల్.

అందరికీ ఒక ప్లాట్‌ ఫాం

2014లో మొదలైంది షీరోస్ డాట్ ఇన్. ఈ వెబ్ సైట్ లక్ష్యం ఒకటే. ఇంటి దగ్గరే ఉంటూ ఉద్యోగాలు చేయాలనునే మహిళలకు ఆర్ధికంగా వెసులుబాటు కల్పించడం. ఎవరికి ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకుని- దానికి సంబంధించిన ఉద్యోగం వెతికిపెట్టడం. వారు పనిచేసే సమయంలో ఏమైనా సందేహాలుంటే క్లారిఫై చేయడం. అందుకోసం ఓ టీం కూడా ఉంది.

image


“పర్సనల్ లైఫ్‌ను, వృత్తిపరమైన జీవితాన్ని సరైన రీతిలో తీర్చిదిద్దుకోగలను అనే నమ్మకం ఉన్న మహిళలందరికీ మా షీరోస్ డాట్ ఇన్ మంచి ప్లాట్ ఫాం” అంటారు సైరీ చాహల్.

మరిచిపోయినా నేర్పిస్తాం..

అయితే ఇక్కడ సమస్య ఏంటంటే- ఒకసారి ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత చాలామంది మహిళలు మళ్లీ మొదటికి వస్తున్నారు. అంతకుముందున్న స్కిల్స్ వారిలో కనిపించడం లేదు. నేర్చుకున్న విషయాలను కూడా మరిచిపోతున్నారు. ఇదే పెద్ద సమస్యగా మారిందంటారు సైరీ. అయితే, ఈ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించేందుకు షీరోస్ సమ్మిట్ పేరుతో దేశంలోని వివిధ నగరాల్లో సదస్సులు నిర్వహించారు.

3లక్షల మందికి ఉపాధి

ఇప్పటి వరకు దాదాపు 1,100 ప్రాంతాల్లో షీరోస్ విభాగాలున్నాయి. ఈ కమ్యూనిటీలో మహిళలు పార్ట్ టైంగానే ఎన్నో పెద్ద కంపెనీల ప్రాజెక్టుల్ని చేసిపెట్టారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పటివరకూ 10, 000 మందికి పైగా మహిళలు కమ్యూనిటీలో ఫుల్ టైమ్ సభ్యులుగా చేరారు. అందులో ఇంటినుంచే పనిచేసే ఫ్రీలాన్సర్స్ ఉన్నారు. ఎంట్రప్రెన్యూర్లు కనిపిస్తారు. ఎక్స్ పర్ట్స్ ఉన్నారు. కేవలం ఉద్యగోం ఒక్కటే కాదు- సభ్యులతో సమావేశాలు, జాబ్ మేళా, ప్రత్యేక శిక్షణ తరగతులు -వంటి కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ సుమారు 3 లక్షల మంది మహిళలకు షీరోస్ ద్వారా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు. 

ఎందుకిలా?

షీరోస్ కమ్యూనిటీలో చేరేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలోనూ, ఆనోటా ఈనోటా- ప్రచారం పుష్కలంగా లభిస్తోంది. అవకాశాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. షీరోస్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం... ప్రస్తుతం భారత్ లో 17 శాతం మహిళలు మాత్రమే ఉద్యోగం చేయడానికి ముందుకు వస్తున్నారు. వారిలో కేవలం 5 శాతం మాత్రమే పై స్థాయికి చేరగలుగుతున్నారు. ఈ విషయంలో మనదేశం ప్రపంచంలో 113వ స్థానంలో ఉంది. దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు- శక్తిసామర్ధ్యాలు ఉన్నప్పటికీ ఉన్నత పదవులకు వారు ఎంతదూరంగా ఉంటున్నారో! దాదాపు 48 శాతం మంది మహిళా ఉద్యోగులు ప్రమోషన్ అందుకోకుండా జాబ్ వదిలేస్తున్నారు. కనీసం మధ్యస్థాయి పదోన్నతి కూడా పొందకుండా ఉద్యోగానికి గుడ్‌బై కొడుతున్నారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడానికి ఇదికూడా ముఖ్య కారణం.

అదే మా విజయ రహస్యం

ఈరోజు సుమారు 1000 కి పైగా కంపెనీలు షీరోస్ ద్వారా సేవలు పొందేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు క్లియర్ టాక్స్ అనే వెబ్ సైట్ తమ కస్టమర్లకు అవసరమైన సాయం అందించడానికి- సీఏ చదివిన మహిళలతో ఒప్పందం చేసుకుంటోంది. ఇదే దారిలో హనీవెల్ వంటి ఎన్నో కంపెనీలున్నాయి. షీరోస్ బృందంలో మెజారిటీ భాగం మహిళలే అయినప్పటికీ -మగవారు కూడా ఉంటారు. వారంతా ఎక్కడెక్కడో ఉన్నా - ఒక టీంగా పనిచేస్తారు. అదే మా విజయ రహస్యం అని చెప్తారు సైరీ చాహల్.

ప్రతీ ప్రతికూల అంశాన్ని సవాల్ గా తీసుకుని ముందుకు పోవడం- అంతే కసితో సక్సెస్ కావడం- ఇంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది అంటారు సైరీ చాహల్.
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags