సంకలనాలు
Telugu

స్మాల్ బిజినెస్‌ల సక్సెస్ సీక్రెట్ !

12th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. స్టార్టప్స్‌కైతే ప్రతీదీ కొత్త పాఠమే. ప్రతీ చిన్న వ్యాపారం నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఒక వ్యాపారం సక్సెస్ అయింది అంటే.. దాని వెనుక ఎంతో కృషి ఉంటేనే అది సాధ్యమనే విషయం మనకు తెలుసు. ఒక చిన్న టీ స్టాల్‌ బయట జనాలు గుమిగూడి ఉండడమో, లేక ఎక్కడి నుంచో వచ్చి మరీ అక్కడ టీ తాగి వెళ్తున్నారు అంటే.. దాని అర్థం ఏంటి.. ? అంటే ఏదో ఒక స్పెషాలిటీ తప్పక ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఓ చిన్న టిఫిన్ సెంటర్లో తయారయ్యే ఇడ్లీల కోసం రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా అర్రులు చాస్తారంటే అది ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకోవాలి. ఇలా ప్రతీ ఫుడ్ స్టార్టప్ సక్సెస్ వెనుక ఏదో ఒక రహస్యం ఉంటుంది. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బెంగళూరులో ఉన్న ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ ఇప్పుడు చూద్దాం.

1. వెరై'టీ' చూపితే జనం ఆదరిస్తారు

డానియల్ డిసౌజా. బెంగళూరులోని షారోన్ టీ స్టాల్ ఓనర్. మామూలు టీ కొట్టు మాదిరి తన షాపును నడపడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదు. విభిన్నమైన, రుచికరమైన రకరకాల టీ లు కేవలం పెద్ద పెద్ద షాపులకు మాత్రమే ఎందుకు పరిమితం కావాలనే ఆలోచన డానియల్‌ను నిద్రపోనివ్వలేదు. ఇందిరా నగర్‌లో ఉన్న ఈ టీ స్టాల్‌ చూసేందుకు చిన్నదే కానీ.. ఇక్కడ ఎన్నో డిఫరెంట్ వెరైటీల రుచులు లభిస్తాయి. రాజకీయ నాయకుల్లో ఎంతో మంది ఇక్కడికి వచ్చి మరీ ఆ వేడి వేడి టీని తాగి మైండ్ ఫ్రెష్ చేసుకుని వెళ్తారు. వాళ్లతో దిగిన ఫోటోలన్నీ మనం ఆ షాపు దగ్గరికి వెళ్లగానే కనిపిస్తాయి.

సక్సెస్ అవుతామో లేదో అనే భయం ఉన్నా సరే ఏదైనా కొత్తగా ఏదైనా ట్రై చేయండి.

image


2. ఎవరూ ఊహించనది చేస్తే.. మీరు ఊహించనంత చూస్తారు

ఒక్కో సారి చిన్న చిన్న ఆలోచనలే అనూహ్యమైన మలుపును తిప్పుతాయి. ఏ ప్రొడక్ట్‌‌కైనా ఓ చిన్న మార్పు చేస్తే.. అది సూపర్ సక్సెస్ కావొచ్చు. మోమోలను తయారు చేసే ఓ వీధి చివరి స్ట్రీట్ వెండర్.. అద్భుతమైన ఆలోచనను చేశారు. మోమోలంటే ఎప్పుడూ తెల్లగానే ఎందుకు ఉండాలి అని అనుకున్నారో ఏమో.. సహజమైన రంగులతో కలర్‌ఫుల్ మోమోలను తయారు చేసి జనాలను ఆకట్టుకున్నారు. బీట్రూట్, కేరట్, పాలకూరల నుంచి రంగులు వెలికితీసి వీటిని రూపొందించారు.

image


3. సింపుల్ ప్రొడక్ట్

ఈ మధ్యే బెంగళూరు గాంధీ నగర్‌లో బాగా పాపులర్ అయిన ఓ బజ్జీ, పకోడా షాపు గురించి నాకు ఎవరో చెబితే వెళ్లాను. క్యాప్సికమ్, ఆలు, అరటికాయ బజ్జీలు మాత్రమే అతను అమ్ముతాడు. మార్కెట్ రేట్ కంటే ఆ షాపులో 50 శాతం వరకూ రేటు ఎక్కువగా ఉంటుంది. అయినా సరే జనాలు మాత్రం ఆత్రంగా వెళ్లి అక్కడే తింటారు. ఇంతకీ ఏంటా సక్సెస్ సీక్రెట్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఓనర్ ప్రవీణ్‌ను కలిశా. తాజా కూరగాయలను మాత్రమే వాడతానని, తాను తయారు చేసే బజ్జీలన్నీ ఒకే సైజులో నిండుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ రేటు వసూలు చేస్తానని ధీమాగా చెప్పాడు. ప్రవీణ్ ఒక్కడే కాదు.. అలాంటి వాళ్లు చాలా మందే ఉంటారు. నాణ్యతను పాటించే అలాంటి వాళ్ల దగ్గరికే కస్టమర్లు ఏళ్ల తరబడి వస్తూనే ఉంటారు.

4. ఆత్మీయ పలకరింపే ఆకర్షణ

బానశంకరి బిడిఏ కాంప్లెక్స్ దగ్గరుండే రవి గోబీ వ్యాన్ కూడా ఎంతో పాపులర్. అక్కడికి వెళ్లి నిరుత్సాహంతో వెనక్కి తిరిగి వచ్చే వాళ్లే ఎక్కువ. ఎందుకంటే.. అంత రష్ ఉంటుంది. ఒక్కోసారి వెయింట్ చాలా చిరాకుగా అనిపించినా.. ఆ టేస్ట్ రుచి చూసిన తర్వాత అంతా మరిచిపోతాం. అయితే ఈ స్టాల్ సక్సెస్ వెనుక ఎవరున్నారబ్బా అని ఆరా తీస్తే మాత్రం రవి, అతని చిరునవ్వే కనిపిస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ, వచ్చిన కస్టమర్లను పలకరిస్తూ.. వాళ్లు లేట్ అయిందని కోప్పడినా ఓపికగా సమాధానం చెబ్తూ ఉండడమే స్పెషల్ ఎట్రాక్షన్. ఫుడ్ సంగతి ఎలా ఉన్నా.. రవి స్మైల్.. అతని సర్వీస్.. జనాలను కట్టిపడేస్తోంది.

image


5. చిన్న వ్యాపారమే కదా అనుకోవద్దు

రేవతి అనే న్యూట్రిషన్ విద్యార్థికి ఓ అద్భుతమైన ఆలోచన తట్టింది. అయితే ఇది రోజుకు వేల రూపాయలు డబ్బులు కురిపించే ఐడియా కాకపోవచ్చు. కానీ ఇంతవరకూ ఎవరూ అలాంటి కాన్సెప్ట్‌లతో ఫుడ్ బిజినెస్‌లోకి రాలేదు. సాధారణంగా డయాబెటిస్ వచ్చినవాళ్లు ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉంటారు. వాళ్లకు ఆప్షన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని గమనించిన రేవతి.. స్ప్రౌట్స్ (మొలకెత్తిన గింజలు) పెసలు, కాకరకాయలతో రెసీపీలు తయారు చేస్తోంది. మల్లేశ్వరంలో ఉన్న ఓ చిన్న షాపులో తాను చేస్తున్న ఈ వ్యాపారం ఇప్పుడు ఎంతో మందిని ఆకర్షిస్తోంది.

image


6. కస్టమర్లకు ఏం కావాలో అది చేయండి.. రిలాక్స్ అయిపోండి

సాధారణంగా గోవాలో ఇలాంటి మోడల్ చూస్తుంటాం. జీవితమంటే కేవలం ఉద్యోగం చేయడం ఒక్కటే కాదు.. రిలాక్స్ అయిపోవాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సరదాగా గడపాలి అనేది వాళ్ల కాన్సెప్ట్. ఫుడ్ బిజినెస్‌లో ఉన్న వాళ్లూ ఇదే ఆచరించవచ్చు. మొదట కస్టమర్లకు ఏం కావాలో తెలుసుకోవాలి. అది అందించాలి. నాణ్యతను నిలబెట్టుకుండా నమ్మకాన్ని చూరగొనాలి. ఆ తర్వాత అంతా సాఫీగా సాగిపోతోంది. ఇక పనిగంటలు, విస్తరణ అనేది మన ఇష్టం. అందుకే మొదట్లోనే భారీ స్థాయిలో ప్లాన్ చేయకుండా.. మొదట ఓ మోడల్ అనుకుని.. దాన్ని సక్సెస్ చేస్తే.. ఇక పని దానంతట అదే జరుగుతుంది.

రచయిత గురించి -

మహిమా కపూర్ టాకింగ్ స్ట్రీట్ అనే స్టార్టప్ ఫౌండర్, సీఈఓ. వివిధ నగరాల్లో బెస్ట్ రోడ్ సైడ్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో ఈ స్టార్టప్ చెప్పేస్తుంది. ఐఐఎం బెంగళూరులో చదివిన మహిమా, ఈ సంస్థ ఏర్పాటుకు యూనిలివర్, టాటా సంస్థల్లో పనిచేశారు.


అనువాదం - చాణుక్య

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags