సంకలనాలు
Telugu

భాగ్యనగరంలో 100మిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధపడుతున్న స్పార్క్ 10

ashok patnaik
22nd Dec 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

హైదరాబాద్ స్టార్టప్ లకు శుభవార్త. వేల కోట్ల ఇన్వెస్ట్ మెంట్ తో భారతీయ యూరోపియన్ స్టార్టప్ ముందుకొస్తోంది. గచిబౌలీలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో కొత్త క్యాంపస్ ను ఏర్పాటు చేసిన స్పార్క్ 10 మొదటి ఫేజ్ లో 20 స్టార్టప్ లను టార్గెట్ గా పెట్టుకుంది.

“స్టార్టప్ కంపెనీలతో కొత్త ఆలోచన,ఆవిష్కరణలకు మొదలవుతాయి. దానికి మేం సాయం అందిస్తాం.” అటల్ మాలవీయ

అటల్ స్పార్క్ 10 కు కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. నిధుల కొరతతో స్టార్టప్ కంపెనీ ఆలోచనలు ఆచరణకు రాకపోవడం లాంటి సమస్యకు తాము పరిష్కారం చూపిస్తామని అంటున్నారాయన.

image


హైదారబాద్ స్టార్టప్ డెస్టినీ

ఇటీవల రతన్ టాటా ప్రారంభించని టీ హబ్ , తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీలు చూస్తుంటే వచ్చే రెండేళ్లలో స్టార్టప్ కంపెనీలకు హైదరాబాద్ డెస్టినీగా మారుతుందని అటల్ చెప్పుకొచ్చారు. అయితే దీంతో పాటు మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్ మెంట్స్ ఇక్కడకు రానున్నాయని, గ్లోబల్ మార్కెట్ లో పెద్ద పెద్ద సంస్థలుగా ఎదిగే ఎన్నో కంపెనీలు ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

“హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో స్టార్టప్ లకు అనుకూల వాతావరణం ఉంది.” సుబ్బరాజు

సుబ్బరాజు స్పార్క్ 10కి మరో కో ఫౌండర్ గా ఉన్నారు. దీంతో పాటు స్పార్క్ 10 టీంలోని మెజార్టీ సభ్యులు హైదరాబాదీలే కావడం ఇక్కడీ సంస్థ నెలకొల్పడానికి కారణంగా తెలుస్తోంది.

image


ప్రస్తుతానికి టెక్ స్టార్టప్ లే

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తాము టెక్ స్టార్టప్ లను యాక్సిలరేట్ చేస్తామని.. మొదటి ఫేజ్ లో టెక్ రిలేటెడ్ స్టార్టప్ లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నమని అటల్ అన్నారు. బిజినెస్ స్టార్టప్ లకు కూడా స్థానం ఉంటుందని సంస్థ ఫౌండర్లు చెబుతున్నారు. బిటుబి, బిటుసి స్టార్టప్ ఏదైనా ఫర్వాలేదు కానీ టెక్నాలజీ కి సంబంధించినది అయితే అప్లై చేసుకోవచ్చని అటల్ అంటున్నారు.

“అగ్రి టెక్నాలజీకీ ప్రాధాన్యం అందిస్తున్నాం. స్టార్టప్ లు సిద్ధం కావాలి.” అటల్

జనవరి నెలాఖరు నుంచి అప్లికేషన్స్ అనుమతిస్తాం అంటున్నారు అటల్. దీనిలో అగ్రి స్టార్టప్ లకు కూడా ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

స్టార్టప్ లకు కావల్సిన క్వాలిఫికేషన్

స్పార్క్ 10కు అప్లై చేయడానికి ప్రధానంగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.

 1. స్టార్టప్ టీం, స్టార్టప్ వ్యవస్థాపకులు ఎవరు, వారి విజన్ ఎలాంటివి ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు. ఫౌండర్, కో ఫౌండర్ లు ఎంత కేపబుల్ అనే దాన్ని చూసి , ఆ స్టార్టప్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది చూస్తారు.
 2. స్టార్టప్ చూపించే సొల్యూషన్ కూడా ముఖ్యమైనదే అని అటల్ అంటున్నారు. టెక్నాలజీ తోపాటు అన్ని రకాలుగా ఆ స్టార్టప్ ఎలాంటి పరిష్కారం మార్గం చూపిస్తుందనే విషయాన్ని పరిగణలోనికి తీసుకుంటారు.
 3. స్టార్టప్ మార్కెట్ వాల్యూమ్ ని కూడా పరిగిణలోకి తీసుకోనున్నారు. సొల్యూషన్ చూపించినప్పటికీ, ఆ ప్రాడక్టుకు మార్కెట్ వేల్యూ లేనప్పుడు పరిగణలోకి తీసుకోక పోవచ్చు.
 4. మానిఫ్యాక్చర్, రొబోటిక్స్ లాంటి ప్రాడక్టులుంటే అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని స్పార్ట్ 10 టీం అంటోంది. టెక్నాలజీ రంగంలో పెట్టుబడులకు తమ మొదట ప్రాధాన్యం అని ముందే చెప్పారు కనుక, రోబోటిక్స్ లో ఏదైనా స్టార్టప్ మంచి మార్కుల సాధిస్తే ఎక్కువ ప్రియారిటీ ఇస్తామంటున్నారు.

స్పార్క్ 10 గురించి క్లుప్తంగా

స్పార్క్ 10కు , గాడ్ ఫాదర్ ఆఫ్ స్టార్టప్ గా పేరు పొందిన జాన్ బ్రాడ్ ఫోర్డ్ ఫండింగ్ ఎడ్వైజర్ సభ్యుడిగా ఉన్నారు. ఇగ్నైట్ 100 యాక్సలరేటర్ కంపెనీ వ్యవస్థాపకుడు ఉన్న బ్రాడ్ ఫోర్డ్ యూరప్ లో వేల స్టార్టప్ లకు ఫండింగ్ చేశారు. స్విస్ నాన్ ప్రాఫిట్ డైరెక్టర్ అయిన పాల్ స్మిత్ కూడా దీని ఎడ్వయిజరీ మెంబర్ గా ఉన్నారు. వీరితో పాటు అటల్ మాలవిమా, సుబ్బరాజు పేరిచర్ల, విజయ్ కేతన్ మిత్ర, ఎల్ ఎన్ పరిమి, సురేష్ కామిరెడ్డి, రాజేష్ గుమ్మడపు ఫౌండర్ మెంబర్స్ గా ఉన్నారు. యూరప్ తో పాటు గ్లోబల్ మెంటార్షిప్ లను హైదరాబాద్ కు తీసుకు రావడమే దీని ప్రధానం లక్ష్యం.

image


అధిగమించాల్సిన అంశాలు

సరైన స్టార్టప్ ను గుర్తించడం ఈ కంపెనీకి ప్రధాన లక్ష్యం. అయితే హైదరాబాద్ విషయానికొస్తే, ఐ ఎస్‌ బీ, ట్రిపుల్ ఐటి హెచ్ తోపాటు ప్రఖ్యాత కాలేజీలు ఉన్నాయి. వీటితో పాటు ఇటీవల టీ హబ్ పేరతో తెలంగాణ ప్రభుత్వం ఇంక్యుబేషన్ సెంటర్ ని ఏర్పాటు చేసింది. దీంతో చాలా స్టార్టప్ లు వీళ్లకు లభించే అవకాశం ఉంది. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ లో కాస్టాఫ్ లివింగ్ తక్కువ. దీంతో స్టార్టప్ కంపెనీలకు ఇక్కడ అనుకూల వాతావరణం ఉంది. మంచి ఆలోచనని ఆచరణలోకి తీసుకొచ్చే ఉత్సాహవంతులున్నారు. వీటన్నింటీని పరిగణలోకి తీసుకుంటే సరైన స్టార్టప్ ను గుర్తించడం పెద్ద లక్ష్యం కాదంటున్నారు సుబ్బరాజు.

image


భవిష్యత్ ప్రణాలికలు

ప్రస్తుతానికి 20లక్షల సీడ్ ఫండింగ్ ఇవ్వడానికి 10 స్టార్టప్ లను ఎంచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 13వారాల్లో వాటిని ఎక్సలరేట్ చేయడమే లక్ష్యం. వాటిని విజయవంతమైన సంస్థలుగా మార్చే ప్రక్రియను స్పార్ట్ 10 లక్ష్యంగా పెట్టుకుంది. ఎనర్జీ సెక్టార్ లో కొత్త స్టార్టప్ లను ప్రోత్సహించనున్నారు. జనవరి నెలాఖరు నుంచి అప్లికేషన్స్ ను అనుమతిస్తున్నారు. వచ్చే ఏడాది పూర్తయ్యేనాటికి కొన్ని గొప్ప ప్రాడక్టులు స్పార్క్ 10 నుంచి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చిన్న నగరాల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని స్పార్ట్ 10 టీం చెబుతోంది.

“ఏడాదికి 20స్టార్టప్ లలో పెట్టుబడులు పెడుతున్నాం. మా సంస్థ నుంచి గొప్ప బ్రాండ్ లు బయటకి వస్తే చాలు. ఈ ఈకో సిస్టమ్ లో తాము కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని అటల్ ముగించారు.”
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags