సంకలనాలు
Telugu

దూరవిద్యా ఉద్యమం 'స్లైడ్ రూల్'

విద్యారంగం పెను మార్పుల దశలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు ఆన్ లైన్ ద్వారా వివిధ కోర్సుల్లో విద్యాబోధన చేస్తున్నాయి. సాధారణ కోర్సులు మొదలు, అనాటమీ, న్యూక్లియర్ ఫిజిక్స్ లాంటి అంశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని అభిలషించే వారికి ఎంతో అందుబాటులో ఉన్న దూరవిద్య ఉద్యమానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకొని తీరాలి. ఈ కోవకే చెందుతుంది స్లైడ్ రూల్. ఈ విధానాన్ని వార్టన్, యుసిఎల్ఏ లకు చెందిన ఐఐటీ పాత విద్యార్థులు రూపొందించారు. ఆన్ లైన్ కోర్సుల ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోవాలని భావించే వారికి ఉపకరిస్తూ.. విద్యారంగంలో పెనుమార్పులకు దోహదం చేస్తోంది స్లైడ్ రూల్ .

team ys telugu
30th Mar 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఈరోజుల్లో నేర్చుకోవాలనుకునే వారికి నిష్ణాతులు రూపొందించి ఇచ్చే సమాచారం ఎంతో అందుబాటులో ఉంది. అదే ఆన్ లైన్ లో అయితే.. అరకొర సమాచారమే లభ్యమవుతుంది. “ మేము కోర్సులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి, విద్యార్థికి అర్థమయ్యే పరిభాషలో తీర్చిదిద్దుతాము. విద్యార్థులు తన వద్దనున్న సమాచారంతో సరిపోల్చుకునే విధంగాను, సమీక్షలు చదివి తగు నిర్ణయాన్ని తీసుకునేలా వీటిని రూపొందిస్తాము. ముఖ్యంగా, విద్యార్థులు వెబ్ డెవలప్ మెంట్, డాటా విశ్లేషణలాంటి ఉద్యోగాలకు అర్హత సాధించేలా, ఆన్ లైన్ కోర్సులను ప్రణాళికాబద్ధంగా రూపొందిస్తున్నాము” అంటారు స్లైడ్ రూల్ సహ వ్యవస్థాపకులు పరుల్ గుప్తా. ముంబై ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, యూనివర్శిటి ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఎంజెల్స్ లో ఉన్నత విద్యను అభ్యసించాక పరుల్, ఐటియం సిస్టమ్స్, ఐబిఎం పరిశోధన సంస్థల్లో పనిచేశారు.

image


పరుల్, ఐబిఎం సంస్థలో పనిచేసేటప్పుడు కోర్సెరా, ఉడాసిటీల్లో కొన్ని ఆన్ లైన్ కోర్సులను తీసుకున్నారు. “ ఈ ఆలోచన ఎంత శక్తిమంతంగా ఉంటుందోనన్న భావన నాకు అప్పట్లో అద్భుతమైన ఉత్సుకతను కలిగించింది. ప్రపంచానికి నాణ్యమైన విద్యను అందిస్తోన్న విద్యారంగ విప్లవంలో నేనూ భాగస్వామిని కావాలని, ఈ రంగంలో కచ్చితంగా పనిచేయాలన్న ఆకాంక్ష బలపడుతూ వచ్చింది.

అదే సమయంలో గౌతమ్ టాంబే, అమెరికాలో, MOOC (మాసివ్ ఓపెన్ ఆన్ లైన్ కోర్సులు) ఉద్యమాన్ని అనుసరిస్తూ ఉండేవాడు. ఇద్దరికీ పరిచయమున్న మరో స్నేహితుడి కారణంగా, పరుల్, గౌతమ్ లు ఇద్దరూ కలుసుకున్నారు. ఆన్ లైన్ కోర్సులకు సంబంధించిన ఆలోచనలపై విస్తృతంగా చర్చలు సాగించేవారు. ఆన్ లైన్ లో విద్యను అభ్యసిస్తున్నవారిని కలుసుకుంటూ.. వారికి ఉన్న సౌలభ్యాలు, ఇబ్బందుల గురించి తరచూ ఆరా తీస్తూ ఉండేవారు. అసలు ఆన్ లైన్ విద్యార్థులకు ఎలాంటి అవసరాలున్నాయో తెలుసుకుంటూ.. వాటన్నింటినీ తీర్చగలిగేలా స్లైడ్ రూల్ కి రూపకల్పన చేశారు. “ నాతోపాటు గౌతమ్, మరికొందరు మిత్రులు కలిసి 2013 జులైలో మా నమూనాకు కార్యరూపమిచ్చాము. మేము విశ్వ విపణిని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన స్లైడ్ రూల్ అమెరికా విద్యార్థుల ఆదరణ పొందింది. దీనికి కారణమైన వారిలో అత్యధికులు భారతీయులే. “

ఆన్ లైన్ విద్యా విప్లవం ఘన విజయం సాధిస్తుందని, అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదన్నది పరుల్ అభిప్రాయం. కోర్సెరా.. తొలి నాలుగు మిలియన్ల వినియోగదారులను ఫేస్ బుక్ కన్నా తక్కువ సమయంలోనే సంపాదించుకుంది. ఇప్పటికీ రోజురోజుకీ ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈరంగంలోని అవకాశాలు ఎంతో ఉత్తేజాన్ని... రకరకాల కోర్సులను అందించే వారికి అవకాశాలనూ పెంచాయి. విద్యార్థులతో పాటు.. జీవితకాలం పాటు ఏదో ఒకటి నేర్చుకోవాలనో.. తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలనో.. తలపోసే వృద్ధులు కూడా వీటిని ఎక్కువగా చదువుతారు. “ మేము వెబ్ బిజినెస్ వినియోగదారులమైనందున... మా మార్కెట్ వ్యూహాలకు అనుగుణంగా.. సెర్చ్ ఇంజిన్ అనుకూలత లేకపోవడం, సోషల్ మీడియాలో మార్కెటింగ్ ద్వారా ఆన్ లైన్ లో నేర్చుకునే విద్యార్థులను చేరుకోవడం మాకు చాలా కష్టంగా ఉండేది” అని అంటారు పరుల్.

image


ఏదైనా సంస్థ.. ప్రారంభించిన రోజునే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన రీతిలో స్లైడ్ రూల్ ప్రారంభం రోజునే ఎంతోమందిని ఆకట్టుకుంది. వార్టన్ ప్రొఫెసర్ తన నలభై వేల మంది విద్యార్థులను.. మా సంస్థ ప్రారంభం రోజునే మాకు అప్పగించారు. అప్పటివరకూ వాళ్ళు ఎస్.ఈ.ఓ., ఎస్ఎంఎం ల ద్వారా క్రమాభివృద్ధిని సాధించేందుకు ఎంతో మొత్తాన్ని వెచ్చించారు. హ్యాకర్ న్యూస్, రెడ్డిట్ లపై కొన్ని విజయాలు పొందారు. ఇప్పుడు మేము వారి విజయాల వృద్ధి శాతం తగ్గకుండా... క్రమంగా పెంచుకుంటూ రావడం మాకో సవాలుగా మారింది” అంటారు పరుల్.

కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో.. స్లైడ్ రూల్ సంస్థ.. ఆర్థికంగా నిలదొక్కుకోగలిగింది. ప్రస్తుతం మేము.. కోర్సులను అందించే వివిధ సంస్థలు, వ్యక్తులతో అనుబంధం ఏర్పాటు చేసుకుంటున్నాము. వారి వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసే కోర్సులకు వారికి కమిషన్ వస్తుంది. నేర్చుకునేవారి కోసం డబ్బిచ్చి వినియోగించేందుకు వీలుగా కొన్ని కోర్సులను ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాము.

స్లైడ్ రూల్ సంస్థ ప్రతినిధులు ఎక్కువ మంది బెంగళూరులో ఉంటారు. అన్షు పురోహిత మాకు వెన్నెముక లాంటి వారు. రజిత్ దాస్ గుప్తా వినియోగదారులను ఆకర్షిస్తూ.. కీలక భూమిక పోషిస్తున్నారు. ఎంతో మంది ఫ్రీలాన్సర్స్, కన్సల్టెన్సీల సేవలను వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్నాము. అని పరుల్ తెలిపారు.

ఎన్నో ఇతర సంస్థలకు భిన్నంగా.. స్లైడ్ రూల్ కు అద్భుతమైన బృందం ఉంది. వినియోగదారుల మదిలోకి చొచ్చుకు వెళ్ళి.. వారు మా నుంచి ఎలాంటి సేవలు ఎదురు చూస్తున్నారో తెలుసుకొని, కోర్సులను అలా రూపొందించడం మాకు నిత్య సవాలే. ఆన్ లైన్ ద్వారా విద్యను పూర్తి చేసిన వారి విషయంలో.. వివిధ సంస్థల యాజమాన్యాల భావనను మార్చేందుకు కొంత సమయం పడుతుంది.. అని పరుల్ తెలిపారు.

ఆన్ లైన్ ద్వారా... అందరికీ అనువుగా ఉండేలా.. అందరూ ఉపయోగించేలా.. ప్రత్యామ్నాయ విద్యావిధానాన్ని రూపొందించాలన్నది వీరి కల. మేము ఆ దిశగా సాగుతున్నాము.

1. విషయ సేకరణ

2. పాఠ్యప్రణాళిక రూపకల్పన

3. బోధకులు, విశ్లేషణలు

4. ఉద్యోగులకు చేరువ కావడం

ఈ నాలుగు అంశాల ఆధారంగా.. లక్ష్యసాధన దిశగా సాగాలని యోచిస్తున్నాము. విద్యార్థులు అందించే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎప్పటికప్పుడు మా విధానాన్ని మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగుతాము. అని పరుల్ చెప్పారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags