సంకలనాలు
Telugu

మీ షూస్‌కు మీరే డిజైనర్లు అంటున్న AWL& SUNDRY

కామన్ మ్యాన్ ముందుకు లగ్జరీ ఫ్యాషన్స్ ఆన్ లైన్‌లో ఆల్ అండ్ సండ్రి కొత్త పుంతలు విభిన్నంగా షూ తయారు చేయాలనే ఆలోచనతో మొదలైన సంస్థ25 నుంచి 50 మధ్య వయస్కులే టార్గెట్

ashok patnaik
18th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

నలుగురికీ నచ్చినది నాకు అస్సలే నచ్చదులే... అన్న పాటను నిజం చేసుకోవాలను కుంటున్నారా... ? అయితే మీ కోసం గేట్లు బారా తెరిచింది అమెరికాకు చెందిన ఆల్ అండ్ సండ్రి. మీ బూట్లు మీరే డిజైనింగ్ చేసుకుంటురా.. ? ఏ మోడల్ కావాలో మీరే నిర్ణయించుకుంటారా..? అయితే ఒక్కసారి ఆల్ అండ్ సండ్రీని క్లిక్ అయితే చాలు కోరుకున్న మోడల్ మీ సొంతం అవుతుంది. ఆల్ అండ్ సండ్రి ఇప్పడు వినియోగదారులకు వారికి తగ్గట్లు బూట్లు అందించే ఓ నమ్మకమైన బ్రాండ్. సరైన సైజుల్లో మంచి మెటిరీయల్, స్టిచ్చింగ్, వినియోగదారుల అభిరుచికి సరిపడే బ్రాండ్. కంపెనీ పేరు ఇంగ్లీషులో ఆల్ అండ్ సండ్రి అంటే చాలా అర్ధం ఉంది. ''AWL''అనేది షూను కుట్టడానికి ఉపయోగించే టూల్. ఇది షూకు పై భాగంలో వాడే నిర్మాణ ప్రక్రియ. లగ్జరీ ష్యాషన్ ఐటెమ్స్‌ను అన్ని వర్గాల వారికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం.

ఆల్ అండ్ సండ్రి ప్రాడక్ట్

ఆల్ అండ్ సండ్రి ప్రాడక్ట్


ఏంటి స్పెషాలిటీ ?

మేము మార్కెట్లోకి వచ్చేటప్పటికే ఎన్నో బ్రాండ్లు ఉన్నాయి. షూలను సృజనాత్మకంగా చూపుతూ.. మిగిలిన వారికి ప్రేరణ కల్గించే విధంగా షూ తయారు చేశామంటారు సంస్థ నిర్వాహకులు. నైపుణ్యం పెంచుతూనే అధిక స్థాయిలో లగ్జరీ బ్రాండ్స్ బూట్లను రూపొందించారు. అంతే కాదు సంప్రదాయ నైపుణ్యానికి పెద్ద పీట వేస్తూ.. ఎక్కువ కాలం మన్నేలా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. కంపెనీ ఉత్పత్తులు అన్ని వయస్సుల పురుషుల కాళ్లకు అందాన్ని ఇవ్వడంతో పాటు అధిక ఉత్పత్తి వల్ల ధరలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున చేసే ఉత్పత్తితో బూట్లు ధరలు అన్ని వర్గాల వారికి అందుబాటులోకి రానున్నాయి. సాధారణంగా కొత్త మోడల్స్‌ను కంపెనీలు అనుకరించడం సహజమే కానీ దానికి తగ్గట్టుగా నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వరు. వాటికి చెక్ పెడుతూ అందరికీ తక్కువ ధరలతో నాణ్యమైన పాదరక్షలు ఇస్తామని చెబ్తోందీ సంస్థ.

image


రూ.45 వేల కోట్ల మార్కెట్ !

''ఆల్ అండ్ సండ్రీ నాణ్యత పై ఎక్కడా రాజీ లేకుండా బూట్లు సరసమైన ధరలకు అందించడానికి చర్యలు తీసుకుంటోంది. అయితే షూ వేసుకోవడం మోజు కాదు. కానీ ఒకసారి కంపెనీ బూట్లు వేసుకున్న తర్వాత వారికి ఎంతో ఆశ్చర్యం కలిగేలా తయారు చేశాము. ఎందుకంటే ఎవరికి కావాలంటే వారికి తగ్గట్టుగా కొలతలు తీసుకుని తయారు చేసి ఇవ్వడం మా ప్రత్యేకత''గా చెప్పుకొస్తారు కంపెనీ అధినేతలు. కంపెనీ బ్రాండ్ Eldrigde / ఆక్స్ఫర్డ్ షూలు షిప్పింగ్‌తో కలిసి $ 350 (రూ. 22 వేలు సుమారు) ఖర్చవుతుంది. ఆన్ లైన్ కొనుగోలుదారుల కోసమే ఈ రేటుతో విక్రయిస్తున్నారు. కానీ ఇలాంటి కస్టమైజ్డ్ షూ జత తయారు చేయడానికి కనీసం 1500 డాలర్ల వరకూ ఖర్చవుతుందని కంపెనీ చెబ్తోంది. సాధారణంగా మా సంస్థ వినియోగదారుల వయస్సు 25-50 సంవత్సరాల మధ్య లో ఉంటుంది. దాదాపుగా ప్రతి ఏటా పురుషుల దుస్తులు, బూట్ల మార్కెట్ $ 7 బిలియన్లుగా ( సుమారు రూ.45 వేల కోట్లు) ఉంది. మార్కెట్ లో వీలైనంత వాటా దక్కించుకోవాలని కంపెనీ ప్లాన్ చేసుకుంటోంది.

Awl & Sundry వెనుక ఎవరు

నికుంజ్ మర్వానియా కంపెనీకి ఫౌండర్, సిఈఓగా వ్యవహరిస్తున్నారు. చాలా ఏళ్ల పాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో పనిచేసిన అనుభవం నికుంజ్‌ది. అయితే కొత్త వ్యాపారంలో అడుగు పెడదామనుకున్న ఆయనకు వచ్చిన ఆలోచనే Awl & Sundry. ఓ నలుగురి సభ్యులతో ప్రారంభమైన కంపెనీ అమెరికా కేంద్రంగా పనిచేస్తోంది. అంతే కాదు ఆస్ట్రేలియా, యూకే, కెనడా దేశాలకు షిప్స్ ను కూడా నిర్వహిస్తోంది.

బూట్లు ఎలా తయారు చేస్తారు ?

సాధారణంగా కస్టమర్ నుంచి మాకు ఆర్డర్ వచ్చిందంటే, వెంటనే ఆ వివరాలన్ని చైనాలో ఉన్న కంపెనీ షో రూమ్‌కు పంపుతారు. కంపెనీ ఉద్యోగి కొలతల ఆధారంగా కస్టమర్ కోరినట్లు దానిని తయారు చేస్తారు. బూట్లు కొలతలకు తగ్గట్టుగా తయారైన వెంటనే దాన్ని కస్టమర్ కు నేరుగా రవాణా చేస్తారు. "మొత్తం ఈ ప్రక్రియ 4-5 వారాల పడుతుంది. షూస్ అన్ని చైనా ఇండస్ట్రీలోనే కస్టమర్ కోరుకున్న విధంగా కుట్టి సరఫరా చేస్తామని వివరిస్తున్నారు నికుంజ్.

సవాళ్లు అధిగమించి

ఆన్ లైన్ ప్రీమియం బూట్లు అమ్మకం అంత ఈజీ కాలేదని.. అనేక సవాళ్లను అధిగమించి నిలబడ్డామని చెబుతారు నికుంజ్ . షూ ఫిట్ అండ్ కంఫర్ట్‌గా ఉండాలి. ప్రజలు ఆన్ లైన్ లో సౌకర్యవంతమైన బూట్లు కొనుగోళ్లు ఇప్పటి వరకు చేయలేదు. ఇది వారికి కొత్త అనుభవంగా మిగులుతుంది. అంతే కాదు Awl & Sundry పూర్తిగా ఫిట్ అయ్యే విధంగా రూపొందిస్తున్నాము. కస్టమర్ ఎదుర్కొనే సమస్యలను అధిగమించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామంటారు నికుంజ్.

ఫౌండర్  నికంజ్ మర్వానియా

ఫౌండర్ నికంజ్ మర్వానియా


1. ఎవరికైనా ఇబ్బంది ఉంటే 30 రోజుల్లో మార్పు చేసుకొనే అవకాశం కల్పిస్తున్నాము.

2. మేము NYC వంటి బ్రాండ్లతో ఆఫ్‌లైన్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నాం. దీని వల్ల మా ప్రొడక్ట్‌ నాణ్యతను కస్టమర్ స్వయంగా కళ్లారా చూసి అనుభూతి పొందొచ్చు.

౩. ఇంకా ఎవరికి వారు వాళ్లకు కావాల్సిన రీతిలో బూట్లు రూపకల్పన చేసుకొనే అవకాశం ఉంటుంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags