సంకలనాలు
Telugu

ఐస్ క్రీమ్ వ్యాపారంలో అదరగొడుతున్న ముంబై యువతి!

RAKESH
9th Mar 2016
Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share


సాధించాల‌న్న త‌ప‌న‌, పేరెంట్స్ ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధ్య‌మే అన‌డానికి ఆమె బెస్ట్ ఎగ్జాంపుల్! కంప్యూట‌ర్ సైన్సో, రాకెట్ సైన్సో కాకుండా త‌న హాబీనే బిజినెస్ గా మార్చుకున్నారు! ముంబైలో ఆమె త‌యారు చేసిన ఫ్రెంచి డిజ‌ర్ట్ కి జ‌నం ఫిదా అయిపోతుంటారు! ఇంత‌కీ ఎవ‌రామె? ఏమిటా ఫ్రెంచి డిజ‌ర్ట్ క‌థ‌?

ష‌ర్మీన్ ఇండోర్ వాలా! ఊరు ముంబై. తండ్రి బిజినెస్ మేన్. త‌ల్లి ఫేమస్ ఫ్యాష‌న్ డిజైన‌ర్. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ! త‌ల్లిదండ్రుల‌కు ష‌ర్మీన్ గారాల‌ప‌ట్టి. కంప్లీట్ గా బాంబే స్టేట్ ఆఫ్ మైండ్ తో పెరిగిన అమ్మాయి. ఒక్క‌గానొక్క కూతురు కావ‌డంతో ఇంట్లో ఫుల్ ఫ్రీడ‌మ్ ఇచ్చే వాళ్లు. ముఖ్యంగా తండ్రి బాగా ఎంక‌రేజ్ చేసేవాడు. త‌ల్లి కెరీర్ లో బిజీగా ఉండ‌టంతో ష‌ర్మీన్ అప్పుడ‌ప్పుడూ వంటింట్లో ప్ర‌యోగాలు చేస్తుండేది. 18 ఏళ్ల వ‌య‌సులోనే ర‌క‌ర‌కాల డిష్ లు చేసి అద‌ర‌గొట్టేది. ఇంట్లో ఏ మాత్రం ఖాళీ దొరికినా ఆమె కాళ్లు కిచెన్ వైపే ప‌రిగెత్తేవి!

బిజినెస్ గా మారిన హాబీ..!!

నిజానికి ష‌ర్మీన్ ఫినాన్స్ స్టూడెంట్. కొన్నాళ్లు అదే ఫీల్డ్ లో జాబ్ కూడా చేసింది. కానీ కుకింగ్ మీద ప్రేమ‌తో కిచెన్ వైపు అడుగులు ప‌డ్డాయి. మొద‌ట్లో కుకింగ్ త‌న హాబీ అనుకుంది. కానీ త‌ను పుట్టిందే కుకింగ్ కోస‌మ‌ని ఆ త‌ర్వాత అర్థ‌మైంది. ఇంకేం ఆలోచించ‌కుండా దాన్నే కెరీర్ గా మ‌లుచుకుంది ష‌ర్మీన్. ముంబైలో ఇంట‌ర్నేష‌న‌ల్ చెఫ్ డిప్ల‌మా చేసింది. 2008లో జాబ్ లో చేరింది. సొంతంగా కప్ కేక్స్, కుకీస్ అవీ త‌యారు చేస్తుండేది. ఆ త‌ర్వాత యూర‌ప్ లో బేకింగ్ కోర్సు చేసి, చేయితిరిగిన చెఫ్ గా ఇండియా తిరిగొచ్చారు. త‌ర్వాత ముంబైలోని ఒక రెస్టారెంట్ లో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. ఆ త‌ర్వాత సొంతంగా వ్యాపారం ప్రారంభించాల‌ని డిసైడయ్యారు.

తను తయారు చేసిన పార్ ఫెయిట్స్ తో షర్మీన్

తను తయారు చేసిన పార్ ఫెయిట్స్ తో షర్మీన్


బిజినెస్ స్టార్ట్ చేయ‌డానిక‌న్నా ముందు ష‌ర్మీన్ ఫుడ్ మార్కెట్ పై కొంత రీసెర్చ్ చేశారు. ఇండియ‌న్ల‌కు అంత‌గా ప‌రిచ‌యం లేని ఫ్రెంచ్ స్వీట్స్, పార్ ఫెయిట్స్ ( ఫ్రెంచ్ ఐస్ క్రీమ్స్) త‌యారు చేయాల‌నుకున్నారు. ముందుగా ఇంట్లో ప్ర‌యోగాలు ప్రారంభించారు. ఆమె త‌యారు చేసిన డిజ‌ర్ట్స్ ఇంట్లో వాళ్ల‌కు తెగ న‌చ్చేయ‌డంతో.. ష‌ర్మీన్ ఇక త‌న‌కు తిరుగ‌లేద‌నుకున్నారు. మ‌రేం ఆలోచించ‌కుండా పార్ ఫెయిట్ బిజినెస్ మొద‌లు పెట్టారు. ముంబైలో ది పార్ ఫెయిట్ కంపెనీ ఇప్పుడు చాలా ఫేమ‌స్. ఉద‌యం ప‌ది నుంచి రాత్రి ఎనిమిది గంట‌ల వ‌ర‌కు ఆర్డ‌ర్స్ వ‌స్తూనే ఉంటాయి. ష‌ర్మీన్ కు ఊపిరిస‌ల‌ప‌నంత ప‌ని! భ‌ర్త కూడా ఆమెకు బిజినెస్ లో సాయ‌ప‌డుతుంటాడు.

ఇండియాలో ఫ్రెంచ్ డిజ‌ర్ట్స్ పెద్ద‌గా పాపుల‌ర్ కాదు. దానికి ద‌గ్గ‌ర‌గా ఉండే ఐస్ క్రీమ్ ను మ‌న‌వాళ్లు ఇష్ట‌ప‌డ‌తారు. కానీ ఇక్క‌డ ప్యూర్ అండ్ రిచ్ ఐస్ క్రీమ్స్ దొర‌క‌డం లేదు. ఎగ్స్, క్రీమ్, చాకొలేట్, ఫ్రూట్స్ క‌ల‌గ‌లిపి త‌యారు చేసే పార్ ఫెయిట్ ను ఇక్క‌డికి వాళ్ల‌కు రుచి చూపించాల‌నుకున్నా. ల‌క్కీగా అవి జ‌నానికి బాగా న‌చ్చాయి - ష‌ర్మీన్

పార్ ఫెయిట్ (ఫ్రెంచ్ ఐస్ క్రీమ్) ప్యాక్ చేసి అమ్మే ఐటం కాదు. అప్పటిక‌ప్పుడు త‌యారు చేసే ఫ్రెష్ గా స‌ర్వ్ చేయాలి. ఇందులో కెమిక‌ల్స్ ఉండ‌వు. కొలెస్ట్రాల్ ప్రాబ్ల‌మ్ లేదు. కాక‌పోతే రేటే కొంచెం ఎక్కువ‌. కానీ దాని రుచికే జ‌నం ప‌డిపోయారంటారు ష‌ర్మీన్. కాక‌పోతే ఇక్క‌డే ఆమెకు ఒక స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. నాణ్య‌మైన పార్ ఫెయిట్స్ త‌యారు చేయాలంటే అదే స్థాయి క్వాలిటీ ఇంగ్రీడియెంట్స్ కావాలి. అందుకోసం ఆమె చాలానే క‌ష్ట‌ప‌డ్డారు. ఫ్రెంచ్ డిజ‌ర్ట్స్ ను త‌యారు చేసే చెఫ్ ల‌ను ప‌ట్టుకోవ‌డానికి కూడా బాగానే శ్ర‌మించారు.

ది పార్ ఫెయిట్ కంపెనీ ఉత్పత్తులు

ది పార్ ఫెయిట్ కంపెనీ ఉత్పత్తులు


ఫ్రెంచ్ డిజ‌ర్ట్ లో పార్ ఫెయిట్ అద్భుత‌మ‌ని చెప్పాలి. ఆ టేస్టును ఎంత వ‌ర్ణించినా త‌క్కువే! చూడ్డానికి ఐస్ క్రీమ్ క‌న్నా క్రీమీగా, మృదువుగా, రిచ్ గా ఉంటుంది. దాన్ని రుచిక‌రంగా ప్రిపేర్ చేయ‌డానికి అందులో పెద్ద‌గా ఏమీ క‌ల‌పాల్సిన ప‌నిలేదు. దానిక‌లాగే తినేయొచ్చు. ఈవెంట్స్, స్టాల్స్ ద్వారా బిజినెస్ డెవ‌ల‌ప్ అవుతోంది. మా డిజ‌ర్ట్స్ ని క‌స్ట‌మ‌ర్స్ ఇష్ట‌ప‌డితే అదే ప‌దివేలు- ష‌ర్మీన్

బిజినెస్ ప్రారంభ‌మైన‌ తొలి ఏడాది ష‌ర్మీన్ 2 వేల పార్ ఫెయిట్ ట‌బ్స్ అమ్మారు. స్కూటీ, మింగో, బిగ్ బాస్కెట్ వంటి ఆన్ లైన్ స్టోర్ల‌తో పాటు నేచ‌ర్ బాస్కెట్ త‌ర‌హా ఔట్ లెట్ల‌లోనూ త‌మ ఉత్ప‌త్తుల‌ను విక్రయిస్తున్నారు. ప్ర‌స్తుతం నెల‌కు 300 టబ్స్ దాకా అమ్ముడ‌వుతున్నాయి. కంపెనీ ఏడాదికి 20 శాతం వృద్ధి రేటు న‌మోదు చేస్తోంది. బాంబే సెంట్ర‌ల్ లో ఫ్యాక్ట‌రీని కూడా విస్త‌రించాల‌ని షర్మీన్ ప్లాన్ చేస్తున్నారు.

మ‌హిళా ఆంట్ర‌ప్రెన్యూర్ల‌కు పెరుగుతున్న గౌర‌వం

విమెన్ ఆంట్ర‌ప్రెన్యూర్ గా ఉండ‌టం ఒక సవాలే. ఇప్ప‌టికీ కొన్ని చోట్ల వాళ్ల వేష భాష‌లు చూసి ఎగ‌తాళి చేసే వాళ్లు ఉన్నారు. ఈ ఆడ‌వాళ్ల పెత్త‌న‌మేంటి అనుకునే మనుషులూ అక్క‌డ‌క్క‌డా తార‌స‌ప‌డుతున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ మ‌ధ్య ఆ ధోర‌ణి మారుతోంది. ముఖ్యంగా ముంబై తరహా న‌గ‌రాల్లో ష‌ర్మీన్ లాంటి విమెన్ ఆంట్ర‌ప్రెన్యూర్ల‌కు గౌర‌వం పెరుగుతోంది.

ఎప్పుడూ మిమ్మ‌ల్ని మీరు త‌క్కువ‌గా అంచ‌నా వేసుకోవ‌ద్దు. ప‌ది మంది ఆంట్ర‌ప్రెన్యూర్లు ఫెయిల్ కావొచ్చు గానీ ఆ ప‌ది మందీ ప్ర‌య‌త్నించార‌న్న‌దే ఇక్క‌డ పాయింట్! అదే త‌న విజ‌య ర‌హ‌స్య‌మంటారు ష‌ర్మీన్ ఇండోర్ వాలా!!

Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share
Report an issue
Authors

Related Tags